నల్ల ధనం.... మల్ల యుద్ధం!

Publish Date:Oct 14, 2016

Advertisement

తేలుకుట్టిన దొంగలు అంటారు... తెలుసు కదా! అలాగే వుంటుంది మన రాజకీయ నేతల వ్యవహారం. మిగతా అన్ని విషయాల్లో ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసకున్నా నల్లధనం వద్దకొచ్చే సరికి అంతా ఏకమైపోతారు. దొంగతనానికి వచ్చిన ఇద్దరు దొంగలు తేలుకుట్టినా కూడా కిక్కురుమనకుండా వున్నట్టు అందరూ ఒకరి గురించి ఒకరికి తెలిసినా సైలెంట్ గా వుంటారు. అవసరం, అనర్థం అలాంటిది! 
బ్లాక్ మనీ విషయంలో పాలక పక్షం, ప్రతి పక్షం మధ్య క్విడ్ ప్రోకో వుంటుందని మనకు తెలసిందే. కాని, ఆంద్రప్రదేశ్ లో మాత్రం డిఫరెంట్ రాజకీయం నడుస్తోంది. నల్లధనం విషయంలో కూడా టీడీపీ, వైసీపీ పరస్పరం టార్గెట్ చేసుకుంటున్నాయి. తేలుకుట్టిన దొంగల ఫార్ములా ఇక్కడ వర్కవుట్ కావటంలేదు. పైగా గుమ్మడికాయల దొంగ సామెత చక్కగా పని చేస్తోంది!
కొన్నాళ్ల కిందట కేంద్ర ప్రభుత్వం బ్లాక్ మనీ వివరాలు చెప్పేయండంటూ బంపరాఫర్ ఇచ్చింది. అందులో భాగంగా దేశ వ్యాప్తంగా వేలాది కోట్లు ఇనప పెట్టెల్లోంచి బయటకు వచ్చాయి. కాని, మన హైద్రాబాద్ నుంచి ఒకాయన తన నల్లధనం పది వేల కోట్లంటూ గవర్నమెంట్ కి చెప్పేశాడట. ఆయన పేరు, వివరాలు సెంట్రల్ గవర్నమెంట్ ఎట్టి పరిస్థితుల్లో చెప్పదు. ఆ గ్యారెంటీ వుంది కాబట్టే సదరు పెద్దమనిషి తన నల్ల కష్టార్జితం అంతా బయటపెట్టేశాడు. కాని, అనధికారికంగా ఆ సంగతి, ఆయన పేరు టీడీపీ వారికి తెలియటమే ఇప్పుడు రచ్చకి కారణమవుతోంది... 
చంద్రబాబు మీడియా ముందుకొచ్చి మరీ హైద్రాబాద్ లో ఒకరు పది వేల కోట్లు నల్లధనం ప్రకటించారని చెప్పటం... ఆ వెంటనే ఇతర టీడీపీ నేతలు నేరుగా జగన్ పేరు కూడా ప్రస్తావించటం... కలకలం రేపింది. బాబు మోదీకి ఒక లేఖ రాస్తే జగన్ కూడా ఓ లెటర్ రాసేశారు. సీక్రెట్ గా వుంచాల్సిన పేర్లు టీడీపికి ఎలా తెలుస్తున్నాయని ఆయన ప్రశ్నించారు. కాని, ఇక్కడ అసలు సమస్య టీడీపీ వారు ఆరోపించగానే జగన్ ఎందుకు ఉలిక్కిపడుతున్నారని! చంద్రబాబు అండ్ టీమ్ జగన్ని టార్గెట్ చేయటం సహజమైన విషయమే. కాని, వైసీపీ బాస్ టీడీపీ విమర్శల్ని తిప్పి కొట్టకుండా ఢిల్లీకి లేఖ రాయటం ఆయనలోని టెన్షన్ కు సంకేతంలా మారిపోయింది. సీక్రెట్ గా వుండాల్సిన పేర్లు బయటకు ఎందుకు వచ్చాయనటం జగన్ ఉద్విగ్నతకు అద్ధం పడుతుంది. ఎందుకంటే, హైద్రాబాద్ లో పది వేల కోట్లు వున్నది బాబు బినామీలకే అంటూ ఓ వైపు ఆరోపిస్తూ... వారి పేర్లు బయటెలా పెడతారని జైట్లీని ప్రశ్నించటం... లాజిక్ కు అందని విషయం! జగన్ చెప్పినట్టు నిజంగా పది వేల కోట్ల ఆసాములు చంద్రబాబు బినామీలైతే ... వాళ్ల పేర్లు బయటకి వస్తే... జగన్ సంతోషించాలి! అలా జరిగనట్టు కనిపించటం లేదు... 
ఆ మధ్య ఓటుకు నోటు అంటూ రెండు రాష్ట్రాల్ని కొన్నాళ్ల పాటూ వార్తల వెల్లువ కుదిపేసింది. ఈ నల్లధనం కూడా అంతే. ఇంకా సూటిగా మాట్లాడుకుంటే ఓటుకు నోటు వ్యవహారం అంత హాట్ కూడా కాదు! జస్ట్ పొలిటికల్ ఆరోపణలు, ప్రత్యారోపణల పర్వం. అంతే. కాని, ఈ మాత్రం దానికే జగన్ అవసరానికి మించి అలర్ట్ అవ్వటం... కాస్త ఆశ్చర్యకరం!    
 

By
en-us Political News

  
ది ఉద్యోగాల కోసం వంద‌లాది మంది ఫీజులు క‌ట్టి మ‌రీ రాస్తుంటే ఆ వ‌చ్చే ప‌ది ఉద్యోగాలు పొందిన వారినుంచి ఫీజు వ‌సూళ్ల‌ వ‌ర‌కూ ఓకే.. మిగిలిన అంద‌రి ఫీజులు వాప‌స్ ఎందుకివ్వ‌ర‌ని ప్రశ్నించారు. అంతే కాదు సామాన్యుడి త‌రఫున కూడా విలక్షణ శైలిలో తన గళమెత్తుతున్నారు. టికెట్ కొని కూడా రైల్లో ఒక సాధార‌ణ ప్ర‌యాణికుడు నిల‌బ‌డి ప్ర‌యాణించాల్సి పరిస్థితి ఏంటి? వంటి ప్ర‌శ్న‌లతో రాఘవ్ చద్దా సోషల్ మీడియాలో తెగ ట్రెండింగ్ అయ్యారు.
గుజరాత్ రాజధాని కోసం లక్షల కోట్లు ఖర్చు చేసిన కేంద్రం, ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో 12 ఏళ్లు ఎందుకు తాత్సారం చేసిందంటూ కేంద్రాన్ని నిలదీశారు. అమరావతి బిల్లు ఆమోదం పొందడం అనేది.. ప్రభుత్వ విజయం కాదు, ఐదేళ్ల పాటు రోడ్లపై పోరాడిన అమరావతి రైతులు, మహిళలు సాధించిన విజయంగా అభివర్ణించారు రేణుకా చౌదరి. సభలో అడ్డంకులు కలిగించిన ఇతర ఎంపీలపై తనదైన శైలిలో పంచ్ డైలాగులు విసురుతూ, తెలుగు వారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ వీధుల్లో తాకట్టు పెట్టకండి అని గర్జించారు.
జగన్ రెడ్డి హేతురహిత రాజధాని ప్రతిపాదనపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అమరావతికి పార్లమెంట్ చట్టబద్ధత కల్పిస్తూ నిర్ణయాలు తీసుకుంటున్న వేళ.. జగన్ రాష్ట్ర అసెంబ్లీలో ఆ చట్టాన్ని సవరించవచ్చంటూ కొత్త రాగం అందుకోవడాన్ని ఆయన అవగాహనా రాహిత్యానికి నిలువెత్తు నిదర్శనంగా పరిశీలకులు అభివర్ణిస్తున్నారు.
అమరావతి విషయంలో సిఎం చంద్రబాబు నాయుడు చాలా తప్పులు చేశారనీ, అవినీతికి పాల్పడుతున్నాననీ గత రెండు రోజులుగా వైసీపీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలకు జగన్ ఈ ప్రెస్ మీట్ లో వంత పాడారు. ఓ పక్క అమరావతికి వ్యతిరేకం కాదంటూనే వైసీపీ నేతలతో శ్రీకాకుళంలో సభ ఏర్పాటు చేయించారు.
2026 బడ్జెట్ ప్రతిపాదనల ప్రకారం, కొత్త పన్ను విధానంలో రూ.7 లక్షల వరకు ఆదాయం ఉన్నవారికి ఎలాంటి పన్ను ఉండదు. సెక్షన్ 87A కింద రిబేట్ కలిపి.. వీరికి వెస‌లుబాటు ఉంటుంది. స్టాండ‌ర్డ్ డిడ‌క్ష‌న్ విష‌యానికి వ‌స్తే.. జీత‌భ‌త్యాలు పొందేవారికి ఇచ్చే స్టాండ‌ర్డ్ డిడ‌క్ష‌న్ ప్ర‌యోజ‌నాలు ఈ కొత్త విధానంలో కూడా కొన‌సాగుతాయి.
సుమారు వెయ్యి కోట్ల సామ్రాజ్యాన్ని ఆయ‌న త‌న కుమారుడు గౌత‌మ్ సింఘానియాకు రాసిచ్చాక‌.. ప‌డ్డ పాట్లు వ‌ర్ణ‌నాతీతంగా వ‌ర్ణించారు ముఖ్య‌మంత్రి.
నారా లోకేశ్ రేపోమాపో పూర్తిస్థాయిలో చంద్రబాబునాయుడి రోల్ పోషించే పరిస్థితి లేకపోయినా, యువనేత భవిష్యత్తుపై నిర్ణయం తీసుకోవడానికి గ్రౌండ్ ప్రిపేర్ అయినట్లు తెలుస్తోంది. లోకేశ్ రాజకీయ భవిష్యత్తుపై నిర్ణయించడానికి నారా, నందమూరి కుటుంబాలతో చంద్రబాబు అతిత్వరలో సమావేశం కానున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.
స్మ‌గ్ల‌ర్ వీర‌ప్ప‌న్ కూతురు విద్యారాణి తండ్రి అంత సంపాదిస్తే చందాలేసుకుని మ‌రీ చ‌ట్ట‌స‌భ‌ల‌కు వెళ్లాల్సిన దుస్థితి ఏంటి?
అమరావతికి, అక్కడి ప్రజలకు వైసీపీ ఎన్నడూ వ్యతిరేకం కాదంటూ మాట్లాడారు. గతంలో తాము వ్యతిరేకించినది చంద్రబాబు నాయుడు చూపించిన గ్రాఫిక్స్ రాజధానే అంటూ సన్నాయినొక్కులు నొక్కారు. అప్పట్లో చంద్రబాబు చేసిన ఊహాజనిత సృష్టినే తాము వ్యతిరేకించామనీ, గ్రాఫిక్స్ అమరావతిపైనే అప్పటి తమ అభ్యంతరాలనీ చెప్పుకొచ్చారు.
మడమ తిప్పను, మాట తప్పను, విశ్వసనీయతకు నిలువెత్తు రూపం అంటూ గతంలో పదేపదే చెప్పుకున్న జగన్ ఇప్పుడు.. నిత్యం అసత్యాలను వల్లెవేస్తూ.. విశ్వసనీయతను పూర్తిగా కోల్పోయారంటున్నారు.
గ‌త ఎన్నిక‌ల్లో అప్పటి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌వితను అరెస్టు చేయ‌కుంటే ఈ రెండు పార్టీల మ‌ధ్య లోపాయికారీ ఒప్పందం ఉన్న‌ట్టేనని జ‌నం అనుకుంటారని అన్నారు బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వ‌ర‌రెడ్డి. ఈ కామెంట్ ఎంత‌గా ప‌ని చేసిందంటే రేసులో సెకండ్ ప్లేస్ లో ఉన్న‌.. బీజేపీని థ‌ర్డ్ ప్లేస్ లో ప‌డేసింది. చావుతప్పి క‌న్ను లొట్ట‌బోయిన‌ట్టు.. బొటాబొటిగా 8 మంది ఎమ్మెల్యేల‌తో స‌రిపెట్టుకుంది బీజేపీ.
పెరిగిన జనాభాకు అనుగుణంగా అసెంబ్లీ, లోక్ సభ స్థానాలను పెంచాలన్న డిమాండ్, ప్రతిపాదనా చాలా కాలంగా ఉంది. అంతే కాకుండా నియోజ‌క‌వ‌ర్గం ఎంత చిన్న‌గా ఉంటే.. ప్ర‌జా ప్ర‌తినిధులు ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను అంత వేగంగా ప‌రిష్క‌రించ‌గ‌లుగుతారు. ఇక ప్రస్తత నియోజకవర్గాల పెంపు ప్రతిపాదన దాదాపు 30శాతం ఉంది. ఇది భారీ మార్పు అనే చెప్పాలి. అలాగే ఇందు కోసం రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుంది. ఆ రాజ్యాంగ సవరణ బిల్లు ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లోనే ప్రవేశపెట్టాలని కేంద్రం నిర్ణయించింది.
ప్రధాన ప్రతిపక్షం అయ్యుండీ ఎన్నికల సన్నాహాల విషయంలో ఇంత నిర్లప్తంగా, నిరాసక్తంగా వ్యవహరించడంతో పార్టీ క్యాడర్ లో అయోమయం నెలకొంది. ఎన్నికలంటేనే స్టార్ క్యాంపెయినర్ల పర్యటనలు, అగ్రనేతల ప్రసంగాలతో నానా హడావుడీ చేసే కాంగ్రెస్ లో ప్రస్తుతం నమ్మశక్యంకాని నిశ్శబ్ధం తాండవిస్తోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.