యూనిఫామ్ సివిల్ కోడ్ తేనె తుట్టె కదులుతోందా?

Publish Date:Oct 14, 2016

Advertisement

బీజేపికి ఒకప్పుడు రెండు సీట్లు వుండేవి పార్లమెంట్లో. ఇప్పుడు రెండు వందల ఎనభై రెండు సీట్లున్నాయి. ఇన్ని రెట్లు ఎంపీలు పెరిగినా కాషాయ దళం ఎజెండాలో మారకుండా వున్న ఒకట్రెండు అంశాలు మాత్రం ఎప్పుడూ వివాదాస్పదమే. అయోధ్యలో రామ మందిరం అలాంటిదే! కాశ్మీర్లో ఆర్టికల్ 370 మరొకటి! ఇక దేశ వ్యాప్తంగా ప్రతీసారి తీవ్ర చర్చకు కారణమయ్యేది... యూనిఫామ్ సివిల్ కోడ్! ఈ మాట వినగానే మైనార్టీలు, సెక్యులర్ పార్టీలమని చెప్పుకునే వారు అందరూ అమాంతం ఉలిక్కిపడుతుంటారు. అంతటి పొలిటికల్ ఎఫెక్ట్ దీని స్వంతం... 

సుప్రీమ్ కోర్టులో ప్రస్తుతం ట్రిపుల్ తలాక్ పై కేసు నడుస్తోంది. భారతీయ ముస్లిమ్ లలో మూడు సార్లు తలాక్ చెప్పి భర్త భార్యను వదిలేయటం పదే పదే వివాదాస్పదం అవుతూనే వుంది. అదేమంత దారుణం కాదని ముస్లిమ్ పర్సనల్ లా బోర్డ్ వాదిస్తున్నా ఆధునిక వాదులు దాన్ని అంగీకరించటం లేదు. షరియా చట్టం ప్రకారం మూడు సార్లు తలాక్ అనేసి... అదీ కాక ఎస్ఎంఎస్, స్కైప్ లాంటి వాటి సాయంతో కూడా విడాకులు ఇచ్చేయటం.... కలకలం రేపుతోంది. మొత్తంగా ట్రిపుల్ తలాక్ వ్యవహారమే వుండవద్దని అభిప్రాయాలు వెల్లడవుతున్నాయి. కోర్టులో కూడా అదే కోరుతు పిటీషన్స్ వేశారు. ప్రస్తుతం అత్యున్నత న్యాయస్థానం ఈ మూడు సార్లు తలాక్ అనేసే షరియా చట్టాన్ని తీవ్రంగా పరిశీలిస్తోంది. త్వరలో తలాక్ పై తీర్పు కూడా రానుంది... 

పరిస్థితి చూస్తుంటే సుప్రీమ్ దాదాపూ ట్రిపుల్ తలాక్ రద్దు చేసే సూచనలే కనిపిస్తున్నాయి. ఎందుకంటే, ముస్లిమ్ స్త్రీల భద్రతని, గౌరవాన్నిదారుణంగా దెబ్బతీసే ట్రిపుల్ తలాక్ పాకిస్తాన్ లాంటి దేశంలో కూడా లేదు. షరియా చట్టం పుట్టిన సౌదీ అరేబియాలో కూడా లేదు. కాని, మన దేశంలో మాత్రం ముస్లిమ్ పర్సనల్ లా పేరుతో చెలామణి అవుతోంది. దీని కారణంగా ఎంతో మంది పేద ముస్లిమ్ అమ్మాయిలు, ఆడవాళ్లు జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. భర్త తన ఇష్టానుసారం వదిలేస్తే రోడ్డున పడుతున్నారు. సుప్రీమ్ కోర్టును ఆశ్రయించింది కూడా బాధిత ముస్లిమ్ స్త్రీలే... 

అత్యున్నత న్యాయస్థానం ఎలాంటి తీర్పు ఇస్తుందో ప్రస్తుతానికి సస్పెన్సే కాని ట్రిపుల్ తలాక్ వ్యవహారం రాజకీయ వేడి కూడా రాజేస్తోంది. కాంగ్రెస్ అధికారంలో వున్నంత కాలం ముస్లిమ్ లను హర్ట్ చేయకుండా బండి లాక్కొచ్చింది. కాని, మోదీ సర్కార్ సుప్రీమ్ కు స్పష్టంగా తన అభిప్రాయం చెప్పేసింది. ట్రిపుల్ తలాక్ ఖచ్చితంగా తప్పేనని అభిప్రాయపడింది. దీంతో ఆలిండియా ముస్లిమ్ పర్సనల్ లా బోర్ట్ అగ్గి మీద గుగ్గిలం అయిపోయింది. బీజేపి పుట్టినప్పటి నుంచీ ఎజెండాలో వున్న యూనిఫాం సివిల్ కోడ్ ఈ విధంగా అమలు చేసే కుట్ర జరుగుతోందని పర్సనల్ లా బోర్ట్ ఆరోపిస్తోంది. వాళ్ల మాటల్లో నిజాలు లేకపోలేదు. ఎందుకంటే, ఒక్కసారి సుప్రీమ్ ట్రిపుల్ తలాక్  రద్దు చేస్తే షరియా చట్టం మొత్తం అదే కోవలో అగ్ని పరీక్ష ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇస్లాం మత విశ్వాసాల ప్రకారం మద్య యుగాల నాటి దారుణమైన శిక్షలు అందులో వుంటాయి. అంతే కాదు బహు భార్యత్వం లాంటివి కూడా అనుమతింపబడతాయి. ఇవేవీ యూనిఫామ్ సివిల్ కోడ్ వస్తే కుదిరేవి కావు. అంటే... ట్రిపుల్ తలాక్ తో మొదలు పెట్టి సుప్రీమ్ మొత్తానికి మొత్తంగా ముస్లిమ్ పర్సనల్ లా అనేదే లేకుండా చేయవచ్చు. దీనికి పూర్తి మెజార్టీతో అధికారంలో వున్న హిందూత్వ పార్టీ బీజేపి ఎలాగూ కృషి చేసే అవకాశాలే ఎక్కువగా వున్నాయి... 

యూనిఫామ్ సివిల్ కోడ్ తాము ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించమని ఇప్పటికే కాంగ్రెస్ ప్రకటించింది. అలాగే, ముస్లిమ్ ల ఓట్లతో నెట్టుకొచ్చే ఎంఐఎం, సమాజ్ వాది లాంటి ఇంకా బోలెడు సో కాల్డ్ సెక్యులర్ పార్టీలు కూడా అంగీకరించే అవకాశమే లేదు. అయినా కూడా పాలిటిక్స్ కు అతీతంగా చూసినప్పుడు యూనిఫామ్ సివిల్ కోడ్ ఆహ్వానించదగ్గదే. బీజేపి అభిమానులో, ఆరెస్సెస్ వాదులో దీన్ని మైనార్టీల మీద రుద్దుతున్నట్టు పైకి కనిపించినప్పటికీ ఆధునిక సమాజంలో అందరికీ ఒకే చట్టం వుండటం సమంజసం. న్యాయబద్ధం కూడా. ఎందుకంటే, మతం ఆధారంగా ఎవరి చట్టం వారికి వుంటే ఆయా మతాల్లోని బలహీన వర్గాలు అన్యాయమైపోయే అవకాశమే ఎక్కువ. ట్రిపుల్ తలాక్, బహుభార్యత్వం వల్ల ఇస్లామ్ లోని స్త్రీలకు అదే జరుగుతోందని చాలా మంది వాదిస్తున్నారు. ఇక దీనిపై అంతిమ నిర్ణయం తీసుకోవాల్సింది సుప్రీమ్ కోర్టే!
 

By
en-us Political News

  
ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో భారీ ఎత్తున అక్రమాలు జరిగినట్లు ప్రాథమిక విచారణలో స్పష్టమైంది. సుమారు 125 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన ఆడుదాం ఆంధ్రలో 40 నుండి 60 కోట్ల రూపాయల మేర అక్రమాలు జరిగాయని అంటున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న సీ షోర్ హైవే ప్రాజెక్టుతో పాటు, రాజధాని అమరావతిని అనుసంధానిస్తూ కేంద్ర ప్రభుత్వం చేపట్టిన హై-స్పీడ్ రైల్ కారిడార్లు రాష్ట్ర ప్రగతికి కొత్త వేగాన్ని తీసుకువచ్చాయి. తీర ప్రాంత అభివృద్ధిని, రాజధాని రవాణా సౌకర్యాలను ఏకకాలంలో మెరుగుపరచడమే లక్ష్యంగా ఈ భారీ ప్రాజెక్టులు రూపుదిద్దుకుంటున్నాయి.
పొంగులేటి ప్ర‌స్తుతం మంత్రిగా నిర్వహిస్తున్న మైనింగ్ శాఖ‌, గ‌తంలో కేటీఆర్ నిర్వ‌హించ‌గా.. ఆ స‌మ‌యంలో ఎన్ని అక్ర‌మాలు జ‌రిగాయో.. ఎన్నేసి అరాచ‌కాలు న‌డిచాయో.. గ‌త అసెంబ్లీ స‌మావేశాల్లో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి చ‌దివి వినిపించిన సంగ‌తి తెలిసిందే. వీటిపై సీబీసీఐడీ ఎంక్వ‌యిరీ కూడా వేస్తామ‌ని సీఎం ప్ర‌క‌టించిన సంగ‌తీ విదిత‌మే. ఈ అక్ర‌మాల్లో త‌న సోద‌రుడి ప్ర‌మేయం కూడా ఉండ‌టంతో.. ఉలిక్కి ప‌డ్డ హ‌రీష్ రావు, ఈ శాఖామాత్యుడైన‌ పొంగులేటిని త‌న టార్గెట్ గా ఫిక్స్ చేసిన‌ట్టు స‌మాచారం.
ది ఉద్యోగాల కోసం వంద‌లాది మంది ఫీజులు క‌ట్టి మ‌రీ రాస్తుంటే ఆ వ‌చ్చే ప‌ది ఉద్యోగాలు పొందిన వారినుంచి ఫీజు వ‌సూళ్ల‌ వ‌ర‌కూ ఓకే.. మిగిలిన అంద‌రి ఫీజులు వాప‌స్ ఎందుకివ్వ‌ర‌ని ప్రశ్నించారు. అంతే కాదు సామాన్యుడి త‌రఫున కూడా విలక్షణ శైలిలో తన గళమెత్తుతున్నారు. టికెట్ కొని కూడా రైల్లో ఒక సాధార‌ణ ప్ర‌యాణికుడు నిల‌బ‌డి ప్ర‌యాణించాల్సి పరిస్థితి ఏంటి? వంటి ప్ర‌శ్న‌లతో రాఘవ్ చద్దా సోషల్ మీడియాలో తెగ ట్రెండింగ్ అయ్యారు.
గుజరాత్ రాజధాని కోసం లక్షల కోట్లు ఖర్చు చేసిన కేంద్రం, ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో 12 ఏళ్లు ఎందుకు తాత్సారం చేసిందంటూ కేంద్రాన్ని నిలదీశారు. అమరావతి బిల్లు ఆమోదం పొందడం అనేది.. ప్రభుత్వ విజయం కాదు, ఐదేళ్ల పాటు రోడ్లపై పోరాడిన అమరావతి రైతులు, మహిళలు సాధించిన విజయంగా అభివర్ణించారు రేణుకా చౌదరి. సభలో అడ్డంకులు కలిగించిన ఇతర ఎంపీలపై తనదైన శైలిలో పంచ్ డైలాగులు విసురుతూ, తెలుగు వారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ వీధుల్లో తాకట్టు పెట్టకండి అని గర్జించారు.
జగన్ రెడ్డి హేతురహిత రాజధాని ప్రతిపాదనపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అమరావతికి పార్లమెంట్ చట్టబద్ధత కల్పిస్తూ నిర్ణయాలు తీసుకుంటున్న వేళ.. జగన్ రాష్ట్ర అసెంబ్లీలో ఆ చట్టాన్ని సవరించవచ్చంటూ కొత్త రాగం అందుకోవడాన్ని ఆయన అవగాహనా రాహిత్యానికి నిలువెత్తు నిదర్శనంగా పరిశీలకులు అభివర్ణిస్తున్నారు.
అమరావతి విషయంలో సిఎం చంద్రబాబు నాయుడు చాలా తప్పులు చేశారనీ, అవినీతికి పాల్పడుతున్నాననీ గత రెండు రోజులుగా వైసీపీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలకు జగన్ ఈ ప్రెస్ మీట్ లో వంత పాడారు. ఓ పక్క అమరావతికి వ్యతిరేకం కాదంటూనే వైసీపీ నేతలతో శ్రీకాకుళంలో సభ ఏర్పాటు చేయించారు.
2026 బడ్జెట్ ప్రతిపాదనల ప్రకారం, కొత్త పన్ను విధానంలో రూ.7 లక్షల వరకు ఆదాయం ఉన్నవారికి ఎలాంటి పన్ను ఉండదు. సెక్షన్ 87A కింద రిబేట్ కలిపి.. వీరికి వెస‌లుబాటు ఉంటుంది. స్టాండ‌ర్డ్ డిడ‌క్ష‌న్ విష‌యానికి వ‌స్తే.. జీత‌భ‌త్యాలు పొందేవారికి ఇచ్చే స్టాండ‌ర్డ్ డిడ‌క్ష‌న్ ప్ర‌యోజ‌నాలు ఈ కొత్త విధానంలో కూడా కొన‌సాగుతాయి.
సుమారు వెయ్యి కోట్ల సామ్రాజ్యాన్ని ఆయ‌న త‌న కుమారుడు గౌత‌మ్ సింఘానియాకు రాసిచ్చాక‌.. ప‌డ్డ పాట్లు వ‌ర్ణ‌నాతీతంగా వ‌ర్ణించారు ముఖ్య‌మంత్రి.
నారా లోకేశ్ రేపోమాపో పూర్తిస్థాయిలో చంద్రబాబునాయుడి రోల్ పోషించే పరిస్థితి లేకపోయినా, యువనేత భవిష్యత్తుపై నిర్ణయం తీసుకోవడానికి గ్రౌండ్ ప్రిపేర్ అయినట్లు తెలుస్తోంది. లోకేశ్ రాజకీయ భవిష్యత్తుపై నిర్ణయించడానికి నారా, నందమూరి కుటుంబాలతో చంద్రబాబు అతిత్వరలో సమావేశం కానున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.
స్మ‌గ్ల‌ర్ వీర‌ప్ప‌న్ కూతురు విద్యారాణి తండ్రి అంత సంపాదిస్తే చందాలేసుకుని మ‌రీ చ‌ట్ట‌స‌భ‌ల‌కు వెళ్లాల్సిన దుస్థితి ఏంటి?
అమరావతికి, అక్కడి ప్రజలకు వైసీపీ ఎన్నడూ వ్యతిరేకం కాదంటూ మాట్లాడారు. గతంలో తాము వ్యతిరేకించినది చంద్రబాబు నాయుడు చూపించిన గ్రాఫిక్స్ రాజధానే అంటూ సన్నాయినొక్కులు నొక్కారు. అప్పట్లో చంద్రబాబు చేసిన ఊహాజనిత సృష్టినే తాము వ్యతిరేకించామనీ, గ్రాఫిక్స్ అమరావతిపైనే అప్పటి తమ అభ్యంతరాలనీ చెప్పుకొచ్చారు.
మడమ తిప్పను, మాట తప్పను, విశ్వసనీయతకు నిలువెత్తు రూపం అంటూ గతంలో పదేపదే చెప్పుకున్న జగన్ ఇప్పుడు.. నిత్యం అసత్యాలను వల్లెవేస్తూ.. విశ్వసనీయతను పూర్తిగా కోల్పోయారంటున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.