ఒక్కటొక్కటిగా సబ్సిడీలు ఎత్తివేస్తూ కేంద్రం మధ్య తరగతి నడ్డి విరుస్తోంది. ప్రజా సంక్షేమం మాట గాలికి వదిలేసి మార్కెట్ మాయాజాలంలో జనాలు గిలగిలా కొట్టుకునేలా చేస్తోంది. ప్రజల కష్టాలను పట్టించుకోకుండా, ధరల పెరుగుదల నియంత్రణ విషయాన్ని గాలికొదిలేసి.. కేంద్రం చోద్యం చూస్తోంది.
తాజాగా వంట గ్యాస్ పై సబ్సిడీని ఎత్తివేయడంతో మధ్య తరగతి నెత్తిన బండ పడింది. కేంద్ర ప్రభుత్వం గృహ వినియోగదారులకు ఇంత వరకూ గ్యాస్ సిలెండర్ పై ఇస్తున్న సబ్సిడీని ఎత్తివేసింది. కేవలం ఉజ్వల పథకం కింద గ్యాస్ సిలెండర్ కనెక్షన్ పొందిన వారికి మాత్రమే సబ్సిడీ వర్తిస్తుందంటూ ప్రకటించింది. ఉజ్వల పథకం కింద గ్యాస్ కనెక్షన్ పొందిన 9 కోట్ల మంది పేద మహిళలకు మాత్రమే సబ్సిడీ వర్తిస్తుంది.
కేంద్రం నిర్ణయంతో 21 కోట్ల మంది గ్యాస్ వినియోగదారులు సబ్సిడీకి ఇక అనర్హులు. వారంతా మార్కెట్ ధర చెల్లించి గ్యాస్ సిలెండర్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఉజ్వల యోజన పథకం కింద గ్యాస్ కనెక్షన్ పొందిన వినియోగదారులకు ఏడాదికి 12 సిలిండర్లపై, రూ.200 చొప్పున సబ్సిడీ అందుతుంది. ఈ సబ్సిడీ లబ్ధిదారులకు బ్యాంకు ఖాతాలో సబ్సిడీ సొమ్ము జమ అవుతుంది.
మిగతా వినియోగదారులు ఎప్పటికప్పుడు మార్కెట్ ధరకు అనుగుణంగా డబ్బులు చెల్లించి గ్యాస్ సిలెండర్ కొనుగోలు చేయాలి. చమురుపై సబ్సిడీ ఎత్తివేస్తూ కేంద్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవడం గతంలోనూ జరిగింది. 2010లో పెట్రోల్‌పై కేంద్రం సబ్సిడీని ఎత్తివేయగా, 2014లో డీజిల్‌పై సబ్సిడీని ఎత్తివేసింది. తాజాగా ఎల్పీజీ వంట గ్యాస్‌పై సబ్సిడీ ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది మోదీ సర్కారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/center-cancil-subsidy-on-lpg-cylender-25-136929.html
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది. సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
రాజకీయ నాయకులపై ప్రజలకు ఉండే అభిమానం ఒక్కోసారి అసాధారణ రీతిలో వ్యక్తమవుతుంది.
టాలీవుడ్ సినీ పరిశ్రమలో వరుస వెడ్డింగ్ బెల్స్ మోగుతున్నాయి. ఇప్పటికే పలువురు యంగ్ హీరోలు వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతుండగా
దీపావళి పండగ అనగానే ప్రతి ఇంటా సంబరాలు, బాణసంచా చప్పుళ్లు సర్వసాధారణం.
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
చెన్నై వేదికగా ఇటీవల వైఎస్ అనిల్ కుమార్ రెడ్డి కుమార్తె వివాహం ఎంతో వైభవంగా జరిగింది.
అప్పుడప్పుడే లోకాన్ని చూడటం మొదలుపెట్టింది. అమ్మా నాన్నల ఒడిలో గోరుముద్దలు తింటూ.. బుడిబుడి అడుగులు వేస్తూ ఆడుకోవాల్సిన వయసు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది. 25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు.
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు.
ప్రతిరోజూ ఉదయం మనం ఎంతో ఆరోగ్యకరమని భావించి తాగే పాలు అసలు సిసలైనవేనా? లేక ప్రాణాల మీదకు తెచ్చే విషపూరిత కల్తీ పాలా? అనే ప్రశ్న ఇప్పుడు హైదరాబాద్ ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది
హైదరాబాద్ నగరంలో నిత్యం రాకపోకలు సాగించే లక్షలాది మంది ప్రయాణికులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది.