వైసీపీ సర్వ నియమాలు, ఆనవాయితీలు, నిబంధనలకూ తిలోదకాలిచ్చేసింది. ప్రభుత్వం ప్రతిష్థత్మకంగా భావించి చేపట్టిన గడప గడపకూ, సామాజిక న్యాయ భేరి బస్సు యాత్రలు తుస్సు మనడంతో.. జనంలో వ్యతిరేకత బట్టబయలై ఫ్రస్ట్రేషన్ లో మునిగిపోయింది. అందుకే ఆనవాయితీ ప్రకారం ఏకగ్రీవం కావలసిన ఆత్మకూరు ఉప ఎన్నికలో పోటీకి దిగాలంటూ విపక్షాన్ని సవాల్ చేస్తోంది. బీజేపీ ఇప్పటికే పోటీకి సై అంటూ వైసీపీ నెత్తన పాలు పోసే లాంటి నిర్ణయం తీసుకుంది.
బయటకు విమర్శలు, అంతర్గతంగా ఆ పార్టీకి మేలు చేయడానికి తహతహలా బీజేపీ తీరు ఉందన్న విమర్శలను కూడా ఆ పార్టీ పట్టించుకోవడం లేదు. వైసీపీ అయితే ఆత్మకూరులో పోటీ జరగాలి. తమ అభ్యర్థికి రికార్డు మెజారిటీ రావాలి, తద్వారా జనంలో తమ ప్రభుత్వ పరపతి ఇసుమంతైనా తగ్గలేదని చాటుకోవాలి అన్న ఉద్దేశంతో ఉన్నట్లు కనిపిస్తున్నది. అందుకే దమ్ముంటే ఆత్మకూరులో పోటీ చేయాలంటూ తెలుగుదేశం పార్టీకి సవాల్ విసురుతోంది.
వైసీపీ సవాల్ ను తెలుగుదేశం అధినేత వైసీపీ నీచత్వానికి పరాకాష్టగా అభివర్ణిస్తూ తీవ్ర స్థాయిలో మండి పడ్డారు. ఆత్మకూరులో తెలుగుదేశం పోటీ చేయడం లేదు అని స్పష్టం చేశారు. మరణించిన నేత కుటుంబీకుల ఎన్నికకు తెలుగుదేశం కట్టుబడి ఉందన్నారు.
గతంలో బద్వేలులో కూడా ఆ కారణంగానే తెలుగుదేశం పోటీ చేయలేదని గుర్తు చేశారు. ఇప్పుడు ఆత్మకూరులోనూ అదే విధానాన్ని పాటిస్తున్నట్లు చెప్పారు. ఈ సాంప్రదాయాన్ని తెలుగుదేశం గౌరవిస్తుందని, ఆచరిస్తుందని స్పష్టం చేసిన చంద్రబాబు.. ఆత్మకూరులో పోటీ అంటూ వైసీపీ చేస్తున్న సవాళ్లు నీచమని విమర్శించారు. పదవిలో ఉన్న నేత చనిపోయిన కారణంగా జరిగే ఎన్నికల్లో మృతుడి కుటుంబ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకోవాలన్న సంప్రదాయాన్ని టీడీపీ పాటిస్తోందని ఆయన చెప్పారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/telugudesham-wount-contest-in-atmakur-25-136931.html
రాజకీయ నాయకులపై ప్రజలకు ఉండే అభిమానం ఒక్కోసారి అసాధారణ రీతిలో వ్యక్తమవుతుంది.
టాలీవుడ్ సినీ పరిశ్రమలో వరుస వెడ్డింగ్ బెల్స్ మోగుతున్నాయి. ఇప్పటికే పలువురు యంగ్ హీరోలు వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతుండగా
దీపావళి పండగ అనగానే ప్రతి ఇంటా సంబరాలు, బాణసంచా చప్పుళ్లు సర్వసాధారణం.
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
చెన్నై వేదికగా ఇటీవల వైఎస్ అనిల్ కుమార్ రెడ్డి కుమార్తె వివాహం ఎంతో వైభవంగా జరిగింది.
అప్పుడప్పుడే లోకాన్ని చూడటం మొదలుపెట్టింది. అమ్మా నాన్నల ఒడిలో గోరుముద్దలు తింటూ.. బుడిబుడి అడుగులు వేస్తూ ఆడుకోవాల్సిన వయసు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది. 25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు.
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు.
ప్రతిరోజూ ఉదయం మనం ఎంతో ఆరోగ్యకరమని భావించి తాగే పాలు అసలు సిసలైనవేనా? లేక ప్రాణాల మీదకు తెచ్చే విషపూరిత కల్తీ పాలా? అనే ప్రశ్న ఇప్పుడు హైదరాబాద్ ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది
హైదరాబాద్ నగరంలో నిత్యం రాకపోకలు సాగించే లక్షలాది మంది ప్రయాణికులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది.
ఈ వేడుకలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేటీఆర్, విజయ్ ఒకే దగ్గర చేరి సరదాగా ముచ్చటించుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.