పదో తరగతి ఫలితాలు విడుదలయ్యాక ఏ విద్యాసంస్థలూ మాకు ఇన్ని ర్యాంకులు వచ్చాయి. టెన్ ఆఫ్ టెన్ ఇంత మందికి వచ్చింది, అంత మందికి వచ్చింది అంటూ ప్రకటనలు ఇవ్వడం, ఫలితాలపై ప్రచారం చేసుకోవడం, నిషిద్ధమని, ఏపీ పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి. రాజశేఖర్ ఉత్తర్వులు జారీ చేశారు. విద్యార్థుల తల్లిదండ్రులు, వివిధ వర్గాల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుందని చెప్పారు. టెన్త్ పరీక్షల ఫలితాల విడుదలలో గతంలో గ్రేడింగ్ విధానం ఉండేదని, 2020 మార్చి నుంచి మార్కులు ప్రకటించే విధానాన్ని పున:ప్రారంభించామని తెలిపారు.
ఈ నేపథ్యంలో విద్యార్థులకు అత్యధిక మార్కులు రావడానికి తమ విద్యాసంస్థలే కారణమని విద్యా సంస్థలు, ట్యుటోరియల్ ఇన్స్టిట్యూషన్స్ ప్రచారం చేసుకోవడానికి అనుమతి లేదన్నారు.అలాంటి ప్రచారం వల్ల విద్యార్థులపై విపరీతమైన ఒత్తిడి పడుతోందనీ, దాన్ని నివారించేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందన్నారు
. ఫలితాలను తమకనుకూలంగా ప్రచారం చేసుకోవడానికి ప్రభుత్వ పరీక్షల చట్టం 7ఏ ప్రకారం వీలు లేదన్నారు. ఎవరైనా ఉల్లంఘించి ప్రచారం చేసుకున్న, ప్రకటనలు విడుదల చేసినా లక్ష జరిమానా, ఏడేళ్ల వరకు జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని హెచ్చరించారు. కాగా నారాయణ విద్యాసంస్థలను దృష్టిలో ఉంచుకునే ఈ నిషేధం ఉత్తర్వులు జారీ చేశారని పరిశీలకలు అంటున్నారు. మాజీ మంత్రి నారాయణపై ఇటీవలి కేసులు, అరెస్టులతో చెలరేగిపోయిన సర్కార్ కు కోర్టులో ఎదురు దెబ్బ తగిలిన నేపథ్యలో ఇప్పుడిలా విద్యాసంస్థల ప్రకటనలపై నిషేధం విధించిందని పేర్కొంటున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/ban-on-advertisements-on-10th-results-25-136927.html
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది. సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
రాజకీయ నాయకులపై ప్రజలకు ఉండే అభిమానం ఒక్కోసారి అసాధారణ రీతిలో వ్యక్తమవుతుంది.
టాలీవుడ్ సినీ పరిశ్రమలో వరుస వెడ్డింగ్ బెల్స్ మోగుతున్నాయి. ఇప్పటికే పలువురు యంగ్ హీరోలు వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతుండగా
దీపావళి పండగ అనగానే ప్రతి ఇంటా సంబరాలు, బాణసంచా చప్పుళ్లు సర్వసాధారణం.
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
చెన్నై వేదికగా ఇటీవల వైఎస్ అనిల్ కుమార్ రెడ్డి కుమార్తె వివాహం ఎంతో వైభవంగా జరిగింది.
అప్పుడప్పుడే లోకాన్ని చూడటం మొదలుపెట్టింది. అమ్మా నాన్నల ఒడిలో గోరుముద్దలు తింటూ.. బుడిబుడి అడుగులు వేస్తూ ఆడుకోవాల్సిన వయసు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది. 25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు.
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు.
ప్రతిరోజూ ఉదయం మనం ఎంతో ఆరోగ్యకరమని భావించి తాగే పాలు అసలు సిసలైనవేనా? లేక ప్రాణాల మీదకు తెచ్చే విషపూరిత కల్తీ పాలా? అనే ప్రశ్న ఇప్పుడు హైదరాబాద్ ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది
హైదరాబాద్ నగరంలో నిత్యం రాకపోకలు సాగించే లక్షలాది మంది ప్రయాణికులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది.