కల్తీ మద్యానికి సురక్షా యాప్ తో చెక్.. చంద్రబాబు
Publish Date:Oct 13, 2025
Advertisement
ఏపీలో పెను దుమారం రేపిన కల్తీ మద్యం వ్యవహారం రాజకీయంగా కూడా సంచలనం సృష్టించింది. అన్నమయ్య జిల్లా ములకలచెరువులో కల్తీ మద్యం తయారీ కేంద్రం బయటపడం.. ఆ తరువాత తీగలాగితే డొంక కదిలిన చందంగా దీని వెనుక ఉన్న రాజకీయ లింకులు వెలుగులోకి వచ్చాయి. అలానే నిందితులు కూడా ఒకరి వెంట ఒకరు అఅన్నట్లుగా బయటపడ్డారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు అద్దేపల్లి జనార్దనరావును కూడా పోలీసులు అరెస్టు చేశారు. ఈ వ్యవహారం ఇలా ఉండగా.. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో భారీ ఎత్తున నకిలీ మద్యం బయటపడింది. విషయమేంటంటే.. ములకలచెరువు కల్తీ మద్యం వ్యవహారానికీ ఇబ్రహీంపట్నంలో బయటపడిన కల్తీ మద్యం బాటిళ్లకూ లింకు ఉండటంతో.. రాష్ట్రంలో అసలు నాణ్యమైన మద్యం దొరుకుతోందా.. తాము తాగేదంతా కల్తీ మద్యమేనా అన్న భయం మందుబాబుల్లో కలిగింది. మొత్తంగా ఆంధ్రప్రదేశ్ లో సంచలనం సృష్టించిన కల్తీ మద్యం గుట్టురట్టు చేసేందుకు ఎక్సైజ్ శాఖ రంగంలోకి దిగింది. అదే సమయంలో మొత్తంగా కల్తీ మద్యానికి చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒక యాప్ ను తీసుకువచ్చింది. ఈ యాప్ ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆదివారం (అక్టోబర్ 12)న ఉండవల్లిలో మీడియా సమావేశంలో ప్రారంభించారు. ఈ యాప్ సాయంతో నకిలీ మద్యం బాటిళ్లను గుర్తించవచ్చని చెప్పిన చంద్రబాబు వైసీపీ హయాం నుంచి తమ ప్రభుత్వానికి కల్తీ మద్యం వారసత్వంగా వచ్చిందన్నారు. కల్తీ మద్యం మద్యంపై విచారణకు సిట్ ఏర్పాటు చేసినట్లు వెల్లడించిన చంద్రబాబు న కల్తీ మద్యం కేసులో రాజీ ప్రశక్తే లేదని స్పష్టం చేశారు. మొత్తం ప్రక్షాళన చేస్తామన్నారు. బెల్ట్ షాపుల బెల్ట్ తీస్తామన్నారు. ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్ ద్వారా నకిలీ మద్యాన్ని పూర్తిగా అరికడతామన్నారు. ఈ యాప్ ద్వారా బాటిళ్ల ట్రాకింగ్ ఈజీ అవుతుందన్నారు. కల్తీ మద్యం కేసు విషయంలో తమకు తనపర బేధం లేదన్న చంద్రబాబు.. దీనిలో ఎవరున్నా వదిలే ప్రశక్తే లేదని చెప్పారు. 2019 నుంచి 2024 వరకు రాష్ట్రంలో నకిలీ మద్యం ఏరులై పారిందని అన్నారు. గత పాలకులు అన్ని వాళ్ల సొంత బ్రాండ్లనే లీగల్ చేశారు, ట్రాన్స్‌పోర్ట్ కూడా సొంత వాళ్లకు ఇచ్చారు, ఇల్లీగల్ నేర సామ్రాజ్యం ఏర్పాటు చేశారని అన్నారు. ఇప్పుడు దానిని పూర్తిగా కంట్రోల్లో పెట్టామని, రాష్ట్రంలో బెస్ట్ మద్యం పాలసీ తెచ్చామని సీఎం చెప్పారు. ఇకపై రాష్ట్రంలో నకిలీ మద్యానికి పూర్తిగా చెక్ పెడతామని చెప్పారు.
http://www.teluguone.com/news/content/cbn-launches-suraksha-app-39-207818.html





