మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న సమయంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్‌కు తృటిలో పెను ప్రమాదం తప్పింది. మంచిర్యాల బస్టాండ్ సమీపంలో ప్రచారం కొనసాగుతుండగా, ఎమ్మెల్యే కాన్వాయ్‌పైకి ఆర్టీసీ బస్సు దూసుకు రావడంతో స్థానికంగా కలకలం రేపింది. అయితే, కాన్వాయ్‌లోని వాహనాల డ్రైవర్లు వెంటనే అప్రమత్తంగా స్పందించడంతో ప్రమాదం తీవ్రత తగ్గింది. అకస్మాత్తుగా బ్రేకులు వేయడంతో బస్సు అదుపు తప్పి, కాన్వాయ్‌లోని కొన్ని వాహనాలు డీకొట్టుకోవడం తో స్వల్పంగా నష్టం వాటిల్లింది.
ఈ ఘటనలో ఎవరికీ ప్రాణాపాయం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ఆర్టీసీ బస్సు డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్లు ప్రాథమిక పరీక్షల్లో గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. దీంతో డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఎన్నికల ప్రచారం జరుగుతున్న సమయంలో ఇలాంటి ఘటన జరగడం ఆందోళన కలిగించిందని స్థానికులు పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/cantonment-mla-sriganesh-narrowly-escapes-an-accident-36-213772.html
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాలనా వ్యవస్థను ప్రపంచస్థాయి ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నడుం బిగించారు.
తమిళనాడు రాజకీయాలు మరోసారి హీటెక్కాయి.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు మరో కీలక లంచం కేసును బయటపెట్టారు.
ఉప్పల్ స్టేడియంలో లేడీ బౌన్సర్ హంగామా సృష్టించింది.
మెుహాలీలోని ఖరార్ ప్రాంతంలో ఈడీ దాడులు చేస్తుండగా సోదాలు జరుగుతున్న ప్రాంగణంలో నోట్ల కట్టలతో నిండిన బ్యాగులు దొరకడం హాట్ టాపిక్‌గా మారింది.
అదృష్టాన్ని నమ్ముకున్న ఆ అమెరికా దంపతులు దీర్ఘకాలంగా లాటరీ టికెట్లు కొంటూనే ఉన్నారు.
ప్రభుత్వ ఏర్పాటు విషయంలో టీవీకే అధినేత విజయ్‌కు ఎందుకు ఆలస్యం చేస్తున్నారంటూ సినీ నటుడు విశాల్ ప్రశ్నించారు.
కరీంనగర్ పీఎంజే జ్యువలరీ షాప్ లో దోపిడీ చేసిన కేసులో మరో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది.
కరీంనగర్ జిల్లాలో రాజకీయ ఉద్రిక్తతలు తారస్థాయికి చేరుకున్నాయి.
చిత్తూరు జిల్లా పలమనేరు పరిధిలోని కౌండిన్య ఎలిఫెంట్ శాంక్చువరీలో ఉన్న కుంకీ ఏనుగులకు.. ఈ ప్రత్యేక గుర్తింపు కార్డులు జారీ చేయాలని నిర్ణయించింది. మనుషులకు ఉండే ఆధార్ తరహాలోనే ఈ కార్డులను రూపొందించనుంది
మోదీ తన ఎక్స్ ఖాతా డీపీగా ఆపరేషన్ సిందూర్ ఫోటోను పెట్టుకొని సైన్యానికి గౌరవం ప్రకటించారు. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం ఈ మెరుపు దాడిని చేపట్టిన సంగతి తెలిసిందే.
చెన్నూరుకు చెందిన యోగేంద్ర కుమార్ వర్మ, హేమశ్రీ చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. కాలక్రమేణా ఆ స్నేహం ప్రేమగా మారింది. వారి మధ్య ఉన్న అనుబంధం ఎంతో బలమైనది. అయితే.. గత కొద్దిరోజులుగా వీరిద్దరి మధ్య చిన్నపాటి వివాదాలు తలెత్తినట్లు సమాచారం.