ప్రపంచంపై జ్ఞానాన్ని పూయించే బుద్దపూర్ణిమ!

Publish Date:May 13, 2022

Advertisement

దుఃఖం మనిషి జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. అయితే దుఃఖం కలగడానికి కారణాలు ఏమిటి అంటే కోర్కెలు పుట్టడం. కోర్కెలు మనిషి జీవితాన్ని దుఃఖంలోకి నెట్టుతాయి. కోర్కెలను జయించడం మనిషికి ఎంతో కష్టం. కానీ అసాధ్యం మాత్రం కాదు. ప్రపంచాన్ని దుఃఖం నుండి బయటపడమని పిలుపునిచ్చిన వారిలో బుద్ధ భగవానుడు ఒకరు. ఈయన భోధనలు దాదాపు భగవద్గీతను సారానికి దగ్గరగా ఉంటాయి. 

బుద్ధుడి జననం, బుద్ధుడికి జ్ఞానోదయం కలగడం, బుద్ధుడు నిర్యాణం చెందడం ఇలా ఎంతో ముఖ్య ఘట్టాలు అయిన మూడు వైశాఖ మాసంలో వచ్చే పూర్ణిమ రోజే జరిగాయని చెబుతారు. అందుకే బుద్ధ పూర్ణిమ ఎంతో ప్రాశస్త్యం పొందింది.

సిద్ధార్థుడి నుండి బుద్ధుడు!!

పుట్టినప్పుడు ఈయనకు పెట్టిన పేరు సిద్ధార్థుడు. అయితే ఈయన తన పదహారు సంవత్సరాలు తరువాత యశోధరను పెళ్లి చేసుకున్నాడు  రాహులుడు అనే కొడుకు కూడా పుట్టాడు. సుఖాలు అనుభవించడమే జీవితానికి పరమార్థం అని నమ్మి ఎప్పుడూ సుఖసంతోషాలు గడిపేవాడు. అయితే తన ఇరవై తొమ్మిదవ సంవత్సరంలో కపిలవస్తు నగరంలో విహారానికి వెళ్తున్నప్పుడు కనిపించిన నాలుగు సంఘటనలు అతడిని ఎంతగానో కలచివేశాయి. రోగాలను, మరణాన్ని, ముసలితనాన్ని జయించాలనే సంకల్పంతో సన్యాస జీవితాన్ని గడపాలని నిర్ణయించుకుని, ఎవరికీ చెప్పకుండా ఇంట్లో నుండి వెళ్ళిపోయాడు.

ఎన్నో సంవత్సరాలు ఎన్నో మార్గాలు అనుసరించి చివరకు గయలో ఒక భోది వృక్షం కింద ఆత్మజ్ఞానం పొందాడు. అప్పటినుండి జీవితంలో ఎన్నో విషయాలను తన భోధనలుగా చెబుతూ ప్రపంచమంతా తిరుగుతూ ప్రపంచానికి బౌద్ధాన్ని పరిచయం చేసినవాడు గౌతమ బుద్ధుడు.

మానవుని అజ్ఞానానికి, కష్టాలకు కారణాలను, వాటి నుండి విముక్తి పొందడానికి మార్గాలను తెలుసుకోగలిగాడు. వీటిని 4 పరమ సత్యాలుగా విభజించాడు. దీనినే బౌద్ధ మతంలో నిర్వాణం అని అంటారు. బుద్ధం, ధర్మం, సంఘం అనే మూడు సూత్రాలతో  మొదటి బౌద్ధ మత సంఘం ఏర్పడింది. తరువాత ఈ సంఘంలో చేరిన వారి సంఖ్య క్రమంగా పెరుగుతూ బుద్ధుని బోధనలను ప్రపంచ వ్యాప్తంగా ప్రచారం చేయడంలో ముందుకు కదిలింది.

వర్షాకాలంలో వచ్చే వరదలవల్ల అన్ని మతాలకు చెందినసన్యాసులు ఆ కాలంలో తమ ప్రయాణాలను తాత్కాలికంగా నిలిపివేశేవారు. ఈ సమయంలో బౌద్ధ మత సంఘం ఒక ఆశ్రమాన్నిఏర్పాటు చేసుకుని అక్కడ నివసించేది. చుట్టుపక్కల ప్రాంతాలనుండి ప్రజలంతా ఆ సమయంలో ఆశ్రమానికి వచ్చేవారు. దీనినే వస్సాన అని అంటారు. బుద్ధుడు ఐదవ వస్సనలో వైశాలికి దగ్గరలో ఉన్న మహావాసనలో బస చేశాడు. అప్పుడు బుద్ధుని తండ్రి శుద్ధోధనుడు మరణశయ్యపైఉండడంతో, బుద్ధుడు అతని దగ్గరికి వెళ్లి ధర్మాన్ని బోధించడంతో, శుద్ధోధనుడు మరణానికి ముందు బౌద్ధ సన్యాసిగా మారాడు.

బుద్ధుని నిర్యాణం!!

బుద్ధుడు తన ఎనభై సంవత్సరాల వయసులో తన దేహాన్ని విడిచిపెట్టాడు. ఆయన నిర్యాణం చెందడానికి ముందు తన శిష్యులను పిలిచి వారికి ఏమైనా సందేహాలు ఉంటే అడగమన్నాడు. చివరకు వారు ఎలాంటి సందేహాలు అడగకపోయేసరికి తన జీవితానికి ముగింపు ఇచ్చాడు. 

ఈయన నేపాల్ ప్రాంతానికి చెందినవాడు కావడం వల్ల ఆ ప్రాంత వాసులు బుద్ధుడిని తమ దైవంగా భావిస్తారు. 

బుద్ధుడు తన జీవితంలో ముఖ్యంగా యోగ, ధ్యానం, సన్యాసం మొదలైన విషయాలను ఎంతో ప్రాముఖ్యమైన వాటిగా భావించాడు. మనిషి అత్యాశతో బ్రతకడం వృథా అని భావించాడు. ఎప్పుడూ నిర్మలమైన ద్యానముద్రలో ఉండే బుద్ధభాగవానుడు ఎంతో గొప్ప శాంతియుత జీవనాన్ని ప్రపంచానికి పరిచయం చేయాలని అనుకున్నారు. దానిఫలితమే నేడు మానవ జీవితాల్లో  కనిపించే ఒకానొక మౌన ప్రవాహపు తరంగాల జ్ఞాన పరిమళం.

ప్రపంచ శాంతి కోసం ఆరాటపడిన వాళ్లలో బుద్ధుడు కూడా ఒకరు. కేవలం ఆ బుద్ధుడి ధ్యాన స్వరూపాన్ని చూస్తూ పరిగెత్తే మనసును ఒకచోట నిలబెట్టచ్చు.

◆వెంకటేష్ పువ్వాడ.

By
en-us Political News

  
భార్యాభర్తల బంధం ఈ ప్రపంచంలో చాలా అపురూపమైనది.  భార్యాభర్తలు ఒకరికొకరు ప్రేమగా ఉంటూ,  ఒకరితో ఒకరు ఎంతో అన్యోన్యంగా ఉంటూ, ఒకరినొకరు అర్థం చేసుకుంటే ఆ బంధం బాగుటుంది.  అయితే ఈ బంధంలో చాలామంది..
Why Indian Tulsi Is in Huge Demand Across Muslim Countries, Indian Tulsi Becomes a Hot Commodity in Muslim Countries, Indian Tulsi Demand Explodes in Muslim Nations, Why Muslim Countries Are Crazy About Indian Holy Basi
ప్రతి వ్యక్తి తన జీవితకాలంలో తప్పులు చేస్తాడు. కానీ అంతమాత్రాన వారు తప్పు చేస్తున్నారని, వారు తప్పు వ్యక్తులని కాదు. సాధారణంగా ఒక వ్యక్తి ఏదైనా ముఖ్యమైన విషయం నిర్ణయం తీసుకున్నప్పుడు,  తరచుగా పొరపాట్లు చేస్తారు...
భారతదేశంలో వివాహానికి ముందు జాతకాల పొంతనను చూస్తారు. మరీ ముఖ్యంగా పెద్దలు కుదుర్చే పెళ్లిలో జాతకాల ప్రాముఖ్యత చాలా ఎక్కువగా ఉంటుంది.  జాతకాలు సరిపోతే..  గ్రహాలు , నక్షత్రాల అనుకూలంగా ఉంటే వైవాహిక బంధం ఎంతో బలంగా..
భార్యాభర్తల బంధం ఈ ప్రపంచంలో చాలా విభిన్నమైనది,  ఎంతో విశిష్టమైనది. భార్యాభర్తల బంధం నేటికాలంలో చాలా సున్నితంగా మారిపోయింది. ఏ విషయానికి ఎప్పుడు ఎలా గొడవలు వచ్చి, బంధం విచ్చిన్నమవుతుందో చెప్పలేం..
పెళ్లి ఈ ప్రపంచంలో ఎంతో గొప్ప వేడుక. భారతీయులకు అయితే పెళ్లి అనేది జీవితంలో అతిపెద్ద పండుగ అని చెప్పవచ్చు.  కానీ నేటికాలంలో ఆ వైవాహిక బంధం మసకబారింది. కొత్తగా పెళ్లైనవాళ్లు ఏడాది కూడా గడపకుండానే...
ప్రతి తల్లిదండ్రులు తమ కూతురు జీవితంలో విజయవంతంగా, బలంగా, ఆత్మవిశ్వాసంతో ఉండాలని కోరుకుంటారు. దీనికి మంచి విద్య, మంచి విలువలు చాలా అవసరం. ఇవన్నీ ఉన్నా సరే.. కొంతమంది అమ్మాయిలు తమ జీవితంలో చాలా ఇబ్బందులు ఎదుర్కుంటారు...
వేసవి కాలం రాగానే, చెమట నీళ్ళు కుమ్మరించినట్టు కారిపోతూ ఉంటుంది.  ఎంతమంచి బట్టలు వేసుకున్నా చెమట కారణంగా పాడైపోతూ ఉంటాయి.పైగా చెమట కారణంగా దుర్వాసన కూడా వస్తుంది. చెమట వాసన చాలా..
పుదీనా ఎంతో సువాసనగా, ఆహ్లాదాన్ని ఇచ్చే మొక్క.  ఎన్నో రకాల కూరల నుండి పచ్చళ్ల తయారీ  వరకు పుదీనాను  ఉపయోగిస్తారు.   ఇక వేసవి కాలంలో అయితే షర్బత్ నుండి నిమ్మరసం, ఆమ్ పన్నా, మసాలా మజ్జిగ ఇలా..
భారతదేశంలో ధనికుల కంటే పేదవారే ఎక్కువ.  పేదవారిలో కూడా చాలా పేదవారు,  ఒక మోస్తరు పేదవారు అని కూడా ఉంటారు. అయితే కాలం ఎంత గడిచినా జీవితాలలో ఏ మాత్రం మార్పు లేకుండా పేదవారిగానే ఉండిపోయే...
పిల్లలు జీవితంలోని ప్రతి దశలో  ఆత్మవిశ్వాసంతో, బాధ్యతాయుతంగా నిలబడాలని ప్రతి తల్లిదండ్రులు కలలు కంటారు. నేటికాలంలో మంచి పేరెంటింగ్ అంటే కేవలం మంచి విద్యను అందించడం లేదా..
వేసవికాలం అనగానే మండే ఎండలు గుర్తుకు వస్తాయి.  ప్రతి ఏడాది ఈ ఎండల ప్రభావం పెరుగుతూనే ఉంటోంది. ఈ కారణంగానే చాలామంది ఇళ్లలో ఏసీలు పెట్టించుకుంటారు.  అయితే ఏసీ పెట్టించుకునే అంత స్తోమత లేనివారు కనీసం కూలర్ అయినా...
వివాహం అనేది కేవలం ఇద్దరు వ్యక్తుల కలయిక మాత్రమే కాదు, రెండు కుటుంబాలు , రెండు విభిన్న మనస్తత్వాల కలయిక కూడా.  పెళ్లి తర్వాత ప్రతి జంట తమ సంబంధాన్ని మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నిస్తుంది..
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.