జగన్ మేనత్తకు బుడమేరుకు లింక్ ఏంటి?

Publish Date:Sep 9, 2024

Advertisement

వెల్‌కమ్ టు తెలుగువన్.  విజయవాడలో జలప్రళయం కారణంగా ఎంతోమంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. తమ సర్వస్వం కోల్పోయారు. ఏంటీ బుడమేరు చరిత్ర? పాలకుల పాపాలు ప్రజల పాలిట శాపాలు అని బుడమేరు ఘటనను మనం పేర్కొనవచ్చు. అధికార మదంతో దారుణ పాపాలు పాలకులు చేస్తూ పోతూ బుడమేరును ‘‘బెజవాడ దుఃఖదాయని’’ అని పేర్కొనడం ఎంతవరకు సమంజసం? ‘బుడమేరు’ చిన్నది కాబట్టి ఈ ఏరుకు బుడమేరు అనే పేరు స్థిరపడింది. పరిమాణం చిన్నది అనుకున్నప్పుడు మనం బుడంకాయ, బుడం దోసకాయ, బుడ్డది, బుడ్డాడు అంటాం కదా... అలాగే బుడమేరు అంటే బుడ్డ ఏరు లేదా చిన్న ఏరు అని అర్థంతో దీనికి ఆ పేరు వచ్చింది. బుడం గడ్డి పెరిగే ప్రాంతం కాబట్టి బుడమేరు అనే పేరు స్థిరపడిందనే వాదన కూడా వుంది. మన ‘జపాన్’ సెలవిచ్చినట్టు బుడమేరు ‘నది’ కాదు అని మీకు ఇప్పటికే అర్థమైంది. 

కొండ వాగు, పాల వాగు, పంగిడి వాగు, కోతుల వాగు, రామచెరువు వాగు, చవట వాగు, పుల్లమ్మ వాగు, ముగ్గు వాగు, ఎలుగుబోడు వాగు, బందల వాగు, పులి వాగు, లోయ వాగు, గుల్లంతల వాగు, తొమ్మర్ల వాగు, పాముల కాల్వ, తీగల వాగు, పెద్ద వాగు, వన్నేరు, కుంఫిణీ వాగు, పెద్దవర్రి వాగు, గొల్లని వాగు, గుప్త వాగు, చీమల వాగు, తాడి వాగు, నక్కల గండి వాగు... ఇన్ని వాగులు కలిసే ఏరు పేరే బుడమేరు. 

కృష్ణాజిల్లాలోని ఎ.కొండూరు మండలంలో విస్తరించిన కొండల శ్రేణిలో జమ్మల వాయుదుర్గం కొండ చాలా ఎత్తయిన కొండ. ఆ కొండ సముద్ర మట్టం నుంచి 1840 అడుగుల ఎత్తులో వుంటుంది. బుడమేరు ఈ కొండలో ఓ చిన్న కొండ వాగుగా పుడుతుంది. ఈ కొండలో పడిన వర్షపు నీరు ఒక వాగుగా ఏర్పడి గంపలగూడెం మండలంలోని నారికంపాడు గ్రామం మీదుగా ఖమ్మం జిల్లాలోకి ప్రవేశించి, తిరిగి మైలవరం మండలం మెరుసుమిల్లి గ్రామం దగ్గర తిరిగి కృష్ణాజిల్లాలోకి అడుగుపెడుతుంది. ఈ వాగును కొండవాగు అంటారు. పుల్లూరు గ్రామం వద్ద ఈ కొండ వాగులో పాల వాగు అనే వాగు వచ్చి కలుస్తుంది. అక్కడ్నుంచి మైలవరం చేరుకుంటుంది. మైలవరంలో అనంతవరం - పొందుగుల కొండల నుంచి వచ్చే నీరు మైలవరం వాగుగా వచ్చి కలుస్తుంది. ఈ వాగు జి.కొండూరు మండలం కుంటముక్కల గ్రామం తూర్పు పొలిమేర వద్దకు చేరుతుంది. సరిగ్గా అక్కడకు వెల్వడం వాగు వచ్చి చేరుతుంది. ఈ రెండు వాగులు కలిసిన ప్రాంతం నుంచి తనపేరును ‘బుడమేరు’గా పెట్టుకుని, తన గమ్యస్థానం కొల్లేరు సరస్సును చేరుకుని సేదతీరుతుంది. ఎ.కొండూరు మండలం గంపలగూడెం, మైలవరం, జి.కొండూరు,  విజయవాడ రూరల్, గన్నవరం మండలం, కంకిపాడు, ఉంగులూరు మండలాలు, బాపులపాడు, గుడివాడ, నందివాడ మండలాల మీదుగా 160 కిలోమీటర్లు ప్రవహించి ఇలపర్రు గ్రామం దగ్గర కొల్లేరులో కలసిపోతుంది. సుమారు 6 వందల  అడుగుల వెడల్పుతో మొదలయ్యే బుడమేరు ప్రస్థానం విజయవాడ నగరంలోకి వచ్చేటప్పటికి 20 అడుగుల చిన్న మురికికాలువ చేశారు. ఈ పాపం ఎవరిది? బుడమేరులో లేఔట్లకు పర్మిషన్లు ఇచ్చింది ఎవరు? అక్రమ కట్టడాలు క్రమబద్ధీకరించింది ఎవరు? పాలకులు కాదా? పాలకుల పాపాలు నేడు బెజవాడకు శాపాలు. 

బుడమేరు చరిత్ర గురించి, వర్తమానం గురించి ‘తెలుగువన్’ ఇన్‌పుట్ ఎడిటర్  శుభకర్ మేడసాని ఎంతో ప్రయాసకోర్చి అందించిన గ్రౌండ్ రిపోర్టు చూడండి.. ఎన్నో వివరాలు, విశేషాలు, బుడమేరు పాలిట జరిగిన ద్రోహమేంటి, బుడమేరుకు జగన్ మేనత్తకు వున్న లింక్ ఏమిటీ? వీటికి సంబంధించిన ప్రత్యేక గ్రౌండ్ రిపోర్ట్ ఈ క్రింది వీడియో లింక్ ద్వారా చూడండి.

 

By
en-us Political News

  
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పరిపాలనా నగరంగానే కాకుండా.. ప్రపంచస్థాయి పెట్టుబడులకు, అత్యాధునిక సాంకేతికతకు కేంద్రబిందువుగా మార్చేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు సాగుతున్నారు. గతంలో హైదరాబాద్ మహానగరాన్ని గ్లోబల్ ఐటీ హబ్‌గా తీర్చిదిద్దిన ఆయన ఇప్పుడు అమరావతిని అంతకు మించి.. అన్నట్లుగా ముందుకు తీసుకువెడుతున్నారు.
దేశంలో లోక్‌సభ సెగ్మెంట్ల డిలిమిటేషన్‌పై పీఎం ఆర్థిక సలహా మండలి కీలకమైన ప్రతిపాదనలు చేసింది.
2024 ఎన్నికలలో ఆయన వైసీపీ పార్టీ కేవలం 11 స్థానాలకే పరిమితమైనప్పటికీ.. ఆయన శైలిలో ఇసుమంతైనా మార్పు రాలేదు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం విజయవంతంగా రెండేళ్ల పరిపాలనను పూర్తి చేసుకున్న తరుణంలో.. జగన్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించేందుకు ఎంచుకున్న అంశాలు.. ఆయనను నవ్వుల పాలు చేసేవిగా ఉన్నాయని పరిశీలకులు సైతం విశ్లేషణలు చేస్తున్నారు.
జగన్ ను రానున్న రోజులలో న్యాయపరమైన చిక్కులు చుట్టుముట్టే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయని అంటున్నారు. ఆ చిక్కుల కారణంగా ఆయన రాజకీయంగా కూడా ఇబ్బందులు ఎదుర్కొనక తప్పదని అంటున్నారు. జగన్ హయాంలో జరిగిన కొన్ని కీలక అంశాలు ఇప్పుడు ఆయనకు అవరోధాలుగా మారే అవకాశాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయని చెబుతున్నారు. మరీ ముఖ్యంగా వైసీపీ హయాంలో జరిగినట్లుగా చెబుతున్న ఏపీ మద్యం కుంభకోణం కేసు ఆయన మెడకు చుట్టుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయంటున్నారు.
చంద్రబాబు నాయుడు నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ బాధ్యతల కాంచర్ల శ్రీకాంత్‌ను తొలగిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్దిరోజులకే కుప్పంలోని ద్వితీయ శ్రేణి నాయకులు, క్షేత్రస్థాయి కార్యకర్తల్లో శ్రీకాంత్ పనితీరుపై తీవ్ర అసంతృప్తి మొదలైంది. నియోజకవర్గంలోని సీనియర్ నేతలు పి.ఎస్. మునిరత్నం, డాక్టర్ సురేష్ బాబు, కాంచర్ల శ్రీకాంత్ ల మధ్య సమన్వయ లోపం ప్రస్ఫుటంగా బహిర్గతమైంది.
టీఎమ్ సీ తిరుగుబాటు పర్వం ఇప్పుడు జాతీయ స్థాయిలోనూ చోటు చేసుకుంది. ఒకవైపు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమిని ఎలా ఎదుర్కోవాలనే వ్యూహాలపై చర్చించేందుకు మమతా బెనర్జీ ఢిల్లీలో ఇండియా కూటమి సమావేశానికి హాజరయ్యారు. సరిగ్గా అదే సమయంలో ఆమె సొంత పార్టీకి చెందిన దాదాపు 20 మంది లోక్‌సభ ఎంపీలు తిరుగుబాటుకు రెడీ అవ్వడం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు అణ్ణామలైది. ఐపీఎస్ ఉద్యోగాన్ని వదిలిపెట్టి, ఆవేశంతో, ఆశయంతో రాజకీయాల్లోకి అడుగుపెట్టి రాష్ట్రంలో బీజేపీని ముందుకు నడిపించడంలో కీలక పాత్ర పోషించారు. కానీ పార్టీలో ఎదురైన అంతర్గత పరిణామాలు, మారుతున్న రాజకీయ సమీకరణాలతో ఆయన విసుగుచెందారు.
పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించిన కేవీపీ వైఎస్ ప్రతిష్ట మసకబార్చేలా మాట్లాడటం సరికాదనీ, పవన్ కళ్యాణ్ తాను చేసిన ఆరోపణలు నిజమని నిరూపిస్తే, ముఖ్యమంత్రి సహాయనిధికి తన సొంత సొమ్ము నుంచి 10 కోట్ల రూపాయలు విరాళంగా ఇస్తాననీ, నిరూపించలేకపోతే.. పవన్ కళ్యాణ్ ముక్కు నేలకు రాసి వైఎస్ కుటుంబానికి, ఆయన అభిమానులకు బహిరంగం క్షమాపణ చెప్పాలని సవాల్ విసిరారు చేశారు.
ఈ భేటీలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గతంలో తాను ప్రతిపాదించిన మూడు రాజధానుల కాన్సెప్ట్‌ను సమర్థిస్తూ, వచ్చే 2029 ఎన్నికల్లో తాము మళ్లీ అధికారంలోకి వస్తే రైతుల భూములను తిరిగి ఇచ్చేస్తామని ప్రకటించారు. అంటే.. 2029 తరువాత కూడా ఏపీ రాజధానిని మార్చే ఆలోచనలోనే జగన్ ఉన్నారని, ఉంటారని జగన్ తేటతెల్లం చేశారన్న మాట.
ఆంధ్రప్రదేశ్ లో అతి పెద్ద సామాజిక వర్గంగా ఉన్న పవన్ సామాజిక వర్గం, ఆయన్ను పెద్దగా ఆదరించింది లేదు. డైరెక్టు ఎలక్షన్లలో పోటీ చేసిన తొలి ఎన్నికల్లో రెండు చోట్ల ఘోరంగా ఓడిపోయారాయన. నిజంగా తనకు కులం బంలం ఉండి ఉంటే, రెండు చోట్ల గెలిచేవాడిని కదా? అని ప్రశ్నిస్తారు పవన్.
బీజేపీ అక్కడ ఎంత పటిష్టంగా వేళ్లూనుకుందో చెప్పడానికి ఈ ఘటన ఒక ఉదాహరణగా మారింది. ఈ పరిణామాలతో టీఎంసీ మనుగడకే పెను ముప్పు పొంచి ఉందనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
సాధ్యం కాలేదు. అనేక రోజులు ఢిల్లీలో బుజ్జగింపులు, సంప్రదింపులు జరిగాయి.కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ.. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున కార్గే, ప్రియాంక గాధీ వంటి వూరు రంగంలోకి దిగి బుజ్జగింపులు, సంప్రదింపులు జరిపారు.
ఈ రాజకీయ పరిణామాల్లో భాగంగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో మంగళవారం ( మే 25) అత్యంత కీలకమైన సమావేశం ఏర్పాటైంది. ఈ ఉన్నత స్థాయి చర్చల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా పాల్గొననుండటం గమనార్హం. గత కొంతకాలంగా కర్ణాటక కాంగ్రెస్ శ్రేణుల్లోను, నాయకత్వ స్థాయిలోనూ అంతర్గతంగా సాగుతున్న అసంతృప్తులు, మార్పుల గుసగుసలకు ఈ భేటీతో ఒక స్పష్టమైన ముగింపు పలకాలని అధిష్ఠానం భావిస్తోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.