కొడాలి నాని అడ్డాలోనూ బీఆర్ఎస్ ఫ్లెక్సీ!

Publish Date:Oct 15, 2022

Advertisement

తెలంగాణ సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ ను జాతీయ పార్టీ  బీఆర్ఎస్ గా ప్రకటించిన వెంటనే విజయవాడలో.. తర్వాత కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలో.. తాజాగా ఇప్పుడు బూతుల మంత్రిగా పేరు తెచ్చుకున్న కొడాలి నాని అడ్డా గుడివాడ పట్టణం నడిబొడ్డున బీఆర్ఎస్ పార్టీ ఫ్లెక్సీలు వెలిశాయి. ఉమ్మడి ఏపీ నుంచి తెలంగాణను అడ్డగోలుగా విడగొట్టుకున్న కేసీఆర్ అంటే.. టీఆర్ఎస్ పార్టీ నేతలంటే ప్రతి ఆంధ్రుడిలోనూ ఇప్పటికింకా ఆగ్రహం తగ్గని పరిస్థితి ఉంది. ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు సహా   ప్రతి ఒక్కరూ ఆంధ్రులను ఇష్టం వచ్చినట్లు తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టేసిన వైనం ప్రతి ఆంధ్రుడూ గాయం మీద కారం పూసిన చందంగానే ఫీలవుతున్నారు. అయినప్పటికీ ఇలా ఆంధ్రప్రదేశ్ లో కేసీఆర్ పార్టీ ఫ్లెక్సీలు వరుసగా వెలుస్తుండడంపై సర్వత్రా చర్చ జరుగుతోంది.  ప్రజలలో విస్మయం వ్యక్తమౌతోంది. 

కేసీఆర్ జాతీయ పార్టీ బీఆర్ఎస్ పార్టీకి శుభాకాంక్షలు తెలుపుతూ విజయవాడలోని వారధి ప్రాంతంలో హోర్డింగ్ ఏర్పాటైనప్పుడు కలకలం రేగింది. బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి బండి రమేష్ పేరిట ఈ భారీ హోర్డింగ్ కనిపించింది. ‘జయహో కేసీఆర్.. నిరంతర పోరాట యోధుడు.. అనితర సాధ్యుడు.. నవ తెలంగాణ నిర్మాత.. శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు జాతీయ పార్టీ ప్రకటిస్తున్న సందర్భంగా వారికి ఇవే మా.. శుభాకాంక్షలు’ అంటూ బండి రమేష్ పేరిట ఈ భారీ ఫ్లెక్సీ దర్శనం ఇచ్చిన విషయం తెలిసిందే.

ఆ తర్వాత మరి కొద్ది రోజులకు బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలో బీఆర్ఎస్ పార్టీ తరఫున మరో ఫ్లెక్సీ వెలిసి కలకలం రేపింది. కేసీఆర్ జాతీయ పార్టీని ప్రకటించిన రెండు రోజుల్లోనే బీఆర్ఎస్ ఫ్లెక్సీలు అమలాపురంలో కనిపించడం చర్చనీయాంశంగా మారింది. ‘జై బోలో.. జై కేసీఆర్.. బీఆర్ఎస్ అమలాపురం పార్లమెంటరీ నియోజకవర్గం ఎంపీ అభ్యర్థి రేవు బాలాజీరావు’ అంటూ బీఆర్ఎస్ ఫ్లెక్సీలు వెలిశాయి. కైకలూరు నియోజకవర్గంలో కూడా బీఆర్ఎస్ పార్టీని స్వాగతిస్తూ పలుచోట్ల ఫ్లెక్లీలు ఏర్పాటయ్యాయి. అల్లూరుకి చెందిన రెడ్డి సతీశ్ అరోరా పేరుతో గుడివాడ, సింగరాయపాలెం, అల్లురు సెంటర్, కోరుకొల్లు, కొత్తపాల్గొని రోడ్డు, కొండేటి రోడ్డు, భీమవరం, రోడ్డువాక ప్రాంతాల్లో బీఆర్ఎస్ ఛీప్ కేసీఆర్, మంత్రి కేటీఆర్, కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఫొటోలతో భారీ ఫ్లెక్సీలు దర్శనమిచ్చాయి.

ఇప్పుడు కొడాలి నాని అడ్డాలో కూడా బీఆర్ఎస్ ఫ్లెక్సీ ఏర్పాటవడం కలకలం రేపుతోంది. ‘టీఆర్ఎస్ టూ బీఆర్ఎస్.. శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ గారికి ఇవే మా శుభాకాంక్షలు’ అంటూ కేటీఆర్ యూత్ పేరిట రవి స్వీట్స్ అండ్ బేకరి.. గుడివాడ పేరుతో ఈ ఫ్లెక్సీ వెలిసింది.

ఏపీ ప్రజలంటే పచ్చి మిరపకాయ కొరికిన చందంగా కారాలు మిరియాలు నూరిన కేసీఆర్ అండ్ కోను ఆహ్వానిస్తూ.. శుభాకాంక్షలు చెబుతూ ఏపీలోని నలు దిశలా ఫ్లెక్సీలు ఏర్పాటు అవడం వెనుక అధికార వైసీపీ నేతల హస్తం ఉండి ఉండొచ్చనే ఊహాగానాలు సర్వత్రా వస్తున్నాయి. కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ ప్రకటించిన సందర్భంగా.. మంత్రి బొత్స మాట్లాడుతూ.. ఏపీలో ఉన్న అనేక పార్టీలతో పాటు బీఆర్ఎస్ కేవలం మరో పార్టీ అవుతుందని అనడం గమనార్హం. బీఆర్ఎస్ వల్ల ఏపీలోని వైసీపీపై ఎలాంటి ప్రభావమూ పడబోదనడం విశేషం. కాగా.. వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి బీఆర్ఎస్ పార్టీని ఆహ్వానించడం విశేషం. ప్రజాస్వామ్యంలో కొత్త పార్టీలు రావడం ఆహ్వానించదగ్గ అంశమని అన్నారు. కొత్త కొత్త పార్టీలు వస్తే రాజకీయ పార్టీల పనితీరు మరింత మెరుగవుతుందని ఆయన విశ్లేషించారు. సీనియర్ రాజకీయవేత్త, రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అయితే.. వచ్చే ఎన్నికల్లో ఏపీలో బీఆర్ఎస్ పార్టీకి తాను ఓటు వేయొచ్చని చెప్పడం గమనించదగ్గ అంశం.

అయితే.. ఆంధ్రులను అంతలా తిట్టిపోసిన కేసీఆర్ కు ఏపీ సీఎం జగన్ కు సన్నిహిత సంబంధాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయని పొలిటికల్ వర్గాల్లో పలు సందర్భాల్లో చర్చ జరుగుతుండడం విశేషం. ఏపీలో ఈ మూడున్నరేళ్లలో తన విధానాలు, పరిపాలనలో అనుభవ రాహిత్యంతో తీసుకున్న అనేక అసందర్భ నిర్ణయాలు, రాష్ట్ర ఆర్థిక స్థితిని అట్టడుగుకు నెట్టేసిన తీరు, సామాన్యుడు భరించలేనంతగా రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేసిన వైనంతో ఇప్పటికే వైసీపీ అంటే జనం చీదరించుకునే స్థితి ఉంది. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో జనం తమకు మరోసారి ఓటు వేసి గెలిపిస్తారనే ఆశలు జగన్ లో రోజు రోజుకూ సన్నగిల్లిపోతున్నాయంటున్నారు. ఒక పక్కన ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ.. టీడీపీ పలు కార్యక్రమాలతో జనంలోకి దూసుకుపోతోంది. జగన్ బండారాన్ని  బట్టబయలు చేస్తోంది. టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు సైతం నడుం బిగించి మరీ ఏపీ వ్యాప్తంగా పలు జిల్లాల్లో తిరుగుతున్నారు. పార్టీ శ్రేణులను ఉత్సాహ పరుస్తున్నారు. జనంలోకి టీడీపీని మరింతగా తీసుకెళ్లే కార్యక్రమాలను రూపొందించి, తమ పార్టీ నేతలు, శ్రేణులు నిరంతరం ప్రజల మధ్యే ఉండేలా చేస్తున్నారు.

ఈ పరిణామాల నేపథ్యంలో జగన్ స్వయంగా చేయించుకుంటున్న సర్వేలు, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ బృందం కూడా వైసీపీలోని ఎక్కువ మంది సిటింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీలకు వ్యతిరేకంగా నివేదికలు ఇస్తోంది. ఇన్ని వ్యతిరేకతల మధ్య తనకు మరోసారి అధికారం అందని ద్రాక్ష అవుతుందేమో అనే ఆందోళన జగన్ లో పెరిగిపోతోందంటున్నారు. ఇలాంటి సమయంలో తన మిత్రుడు, తెలంగాణ సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తే.. తన వ్యతిరేక ఓటు కొంతైనా చీలుతుందని, తద్వారా తనకు ప్రయోజనం కలుగుతుందనే యోచనలో జగన్ ఉన్నారంటున్నారు. అందుకే ఆ పార్టీ నేతలు బీఆర్ఎస్ పార్టీని ఏపీలోకి ఆహ్వానిస్తున్నారంటున్నారు. అయితే.. కేసీఆర్ తిట్లు మరిచిపోయారా? సిగ్గు, శెరం లేని కొంతమంది వల్లే ఏపీ ఇంతటి దురవస్థకు చేరుకుందని నెటిజన్లు దుమ్మెత్తి పోస్తుండడం కొసమెరుపు.

By
en-us Political News

  
అరవ శ్రీధర్‌పై ఓ మహిళా ప్రభుత్వ ఉద్యోగి లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన నేపథ్యంలో జనసేన నాయకత్వం దీనిపై త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.
పోలీసులు జనసేన సభకు నో చెప్పారు. వేలాది మంది అభిమానులు, వందలాది మంది ముఖ్య నాయకులు హాజరయ్యే ఇటువంటి కీలక సభకు చివరి నిమిషంలో పర్మిషన్ నిరాకరించడంపై జనసేన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోంది.
అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాజయం నుంచి కోలుకోకముందే.. పార్టీ అధినేత్రి మమతా బెనర్జీకి సొంత పార్టీ ఎమ్మెల్యేలు భారీ షాక్ ఇచ్చారు. ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన తర్వాత.. భవిష్యత్తు కార్యాచరణను చర్చించేందుకు ఏర్పాటు చేసిన కీలక సమావేశానికి పార్టీకి ఉన్న 80 మంది ఎమ్మెల్యేలలో ఏకంగా 60 మంది ఎమ్మెల్యేలు గైర్హాజరు అయ్యారు.
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఎదుర్కొంటున్న ఈ రాజకీయ ఒత్తిడి, ప్రత్యర్థుల వ్యూహాలపై సీనియర్ రాజకీయ విశ్లేషకుడు భరద్వాజ తో తెలుగువ్ న్యూస్ చానల్ ప్రత్యేక ఇంటర్వూలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. పవన్ కళ్యాణ్‌ను మానసికంగా, రాజకీయంగా దెబ్బతీసి కూటమి స్పిరిట్‌ను దెబ్బతీయడమే లక్ష్యంగా ఈ వ్యూహాత్మక దాడులు జరుగుతున్నాయని ఆయన అన్నారు.
తెలుగువన్ వేదికగా జరిగిన ప్రత్యేక విశ్లేషణా కార్యక్రమంలో రవిశంకర్ కంఠంనేని, డోలేంద్ర ప్రసాద్.. ప్రజాస్వామ్య దేశంలో రాజ్యాంగ రక్షకుడిగా ఉండాల్సిన స్థానంలో కూర్చున్న ఒక న్యాయమూర్తి, పౌరులను ముఖ్యంగా దేశ యువతను పారసైట్లు, కాక్రోచ్‌లు అనడం అత్యంత దురదృష్టకరమని అభిప్రాయపడ్డారు.
మొదట్లో చంద్రబాబు నాయుడు కాంగ్రెస్‌లో ఉండటంతో టిడిపిలో లేరని, ఆ తర్వాత పార్టీలోకి వచ్చిన చంద్రబాబుకు ఎన్టీఆర్ జనరల్ సెక్రెటరీ పదవి ఇచ్చి పార్టీ పగ్గాలు అప్పగించారని తెలిపారు. చంద్రబాబు వచ్చిన కొత్తలో హైదరాబాద్ పరిధిలోని చదువుకున్న యువ నాయకుల వివరాలు సేకరించగా తన పేరు తెరపైకి వచ్చిందన్నారు.
సీనియర్ నాయకులను బుజ్జగించడానికి ఉప ముఖ్యమంత్రి పదవులను పంచుతుంటారు. గతంలో ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏకంగా ఐదుగురు డిప్యూటీ సీఎంలను నియమించి రికార్డు సృష్టించారు. ప్రస్తుత చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అత్యంత కీలకమైన, శక్తిమంతమైన డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వహిస్తూ డైనమిక్ రోల్ పోషిస్తున్నారు.
దేశవ్యాప్తంగా తిరుగులేని ఆధిక్యంతో దూసుకుపోతున్న బీజేపీ.. చారిత్రాత్మకంగా దక్షిణాది రాష్ట్రాల్లో ముఖ్యంగా తమిళనాడులో పాగా వేయడానికి ఎప్పటి నుంచో తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అయితే ఇక్కడి ద్రవిడ రాజకీయాల ప్రభావం బలంగా ఉండటంతో కమలం ఆశించిన స్థాయిలో విస్తరించలేకపోయింది. ఈ క్రమంలోనే ఐపీఎస్ ఉద్యోగాన్ని వదిలి రాజకీయాల్లోకి వచ్చిన అణ్ణామలై రూపంలో బీజేపీకి ఒక బలమైన ఆశాకిరణం లభించింది.
గతంలో వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ముందే.. ఇచ్చిన హామీని కాంగ్రెస్ హైకమాండ్ ఇప్పుడు గా నిలబెట్టుకుంది. అయితే, ఈ కొత్త పదవి, అదనపు బాధ్యతలు వైఎస్ షర్మిలకు ఒక వైపు సంతోషాన్ని కలిగిస్తున్నప్పటికీ, మరోవైపు ఆమె ముందు అనేక సవాళ్లను ఉంచబోతున్నాయి.
సుపు రంగు అనేది భూమి పుట్టినప్పటి నుండి ఉనికిలో ఉందనీ.. ఆ రంగు కేవలం తెలుగుదేశం పార్టీకి మాత్రమే సొంతం కాదని తేల్చి చెప్పారు.
తెలుగుజాతి మనుగడ ఉన్నంతకాలం తెలుగుప్రజల హృదయాల్లో అన్న ఎన్టీఆర్ చిరస్థాయిగా నిలచిపోతారని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు.
గాంధీభవన్‌లో జరిగిన ప్రత్యేక సమగ్ర ఓటర్ల సవరణ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
కర్ణాటక రాజకీయాల్లో అత్యంత ప్రభావవంతమైన నాయకుడిగా గుర్తింపు పొందారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.