బైకర్ రితీష్ రెడ్డి మృతిపై కేసు నమోదు

Publish Date:Feb 16, 2026

Advertisement

 

నల్గొండ జిల్లా చిట్యాల పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో అంతర్జాతీయ బైకర్ రితీష్ రెడ్డి మృతి చెందిన విషయం తెలిసిందే. బైకర్ రితీష్ రెడ్డి మృతి చెందడంతో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. బైకర్ రితీష్ రెడ్డి బైక్ పై వస్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో అతను ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై రితీష్ సోదరుడు రోహిత్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు చిట్యాల పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.

ప్రమాదంలో రితీష్ రెడ్డి తలకు తీవ్ర గాయమైందని, అదే మృతికి కారణమై ఉండొచ్చని పోలీసులు ప్రాథమికంగా భావిస్తు న్నారు. ఈ క్రమంలోనే పోలీసులు ప్రమాదానికి గురైన అతని బీఎండబ్ల్యూ బైక్‌కు అమర్చిన ఫ్రంట్, బ్యాక్ కెమెరాల ఫుటేజ్‌ను స్వాధీనం చేసుకుని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ప్రమాద సమయంలో ముందూ, వెనుకుగా ప్రయాణించిన వాహనాల వివరాలను సేకరించే పనిలో ఉన్నారు. ఢీకొట్టి పారిపోయిన వాహనం గుర్తించేందుకు ఆయా ప్రాంతాల్లో ఉన్న సీసీటీవీ కెమెరాల ఫుటేజ్‌ను కూడా పరిశీలిస్తున్నారు. 

అయితే  బైకర్ రితీష్ రెడ్డి బాపట్లలో హార్లే డేవిడ్‌సన్ మోటార్స్ నిర్వహించిన ఈవెంట్‌కు హాజరై హైదరాబాద్‌కు తిరిగి వస్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. పోలీసులు పోస్టుమార్టం అనంతరం రితీష్ రెడ్డి మృతదేహాన్ని కుటుంబసభ్యులు బంజారాహిల్స్‌లోని ఆయన నివాసానికి తీసుకువచ్చారు. ప్రముఖ బైకర్ మృతితో బైకింగ్ వర్గాల్లో తీవ్ర విషాదం నెలకొంది. ఈ ఘటనకు కారణమైన వాహనం, డ్రైవర్‌ను గుర్తించేందుకు అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నామని చిట్యాల పోలీసులు తెలిపారు. రితీష్ రెడ్డి మృతి చెందడంతో ఆ కుటుంబంలో చీకట్లు కమ్ముకున్నాయి

By
en-us Political News

  
అయితే ఇప్పుడు వేదిక మారింది. అవే తేదీలలో పార్టీ పండుగ మహానాడును నెల్లూరు జిల్లాలో జరపాలని పార్టీ హైకమాండ్ నిర్ణయించింది. ఇందుకు రాజకీయకారణాలే కాకుండా.. జూన్ నెలలో ప్రధాని నరేంద్ర మోడీ ఉత్తరాంధ్ర పర్యటన ఉండటం కూడా ఒక కారణంగా చెబుతున్నారు.
పోలీస్-ప్రజల మధ్య దూరం తగ్గించేందుకు కృషి చేయాలన్న ఉద్దేశంతో ఫ్రెండ్లీ పోలీస్ విధానం తీసుకువచ్చామన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో పోలీసులపై వచ్చిన అభిప్రాయాల మార్పు కోసం చర్యలు తీసుకున్నామన్నారు.
న్యాయపరంగా ఈ కేసులో ఊరట పొందేందుకు పూడి శ్రీహరి ప్రయత్నించినప్పటికీ, న్యాయస్థానాల్లో ఆయనకు చుక్కెదురైంది. తన అరెస్టును ఆపాలంటూ ఆయన దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్లను న్యాయస్థానాలు తిరస్కరించాయి. మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు, లేదా స్టే ఇచ్చేందుకు సుప్రీం కోర్టు కూడా నిరాకరించడంతో.. పోలీసులకు ఆయనను అరెస్ట్ చేసేందుకు మార్గం సుగమమైంది.
అంతర్జాతీయ వైద్య పర్యాటక కేంద్రంగా హైదరాబాద్‌కు ఖ్యాతి పెరుగుతోందన్నారు. చికిత్స కోసం వచ్చే రోగులకు మద్దతుగా బలమైన ప్రపంచ అనుసంధానం అవసరమన్నారు భారత ఆరోగ్య సంరక్షణలో ఉన్నత ప్రమాణాలను నెలకొల్పినందుకు ముఖ్యమంత్రి అపోలో ఆసుపత్రులను అభినందించారు.
983లో రీజెన్సీ సెరామిక్స్‌ను స్థాపించిన జి.ఎన్. నాయుడు, దేశ సెరామిక్స్ రంగంలో తనదైన ముద్ర వేసుకున్నారు. చిన్న స్థాయి నుంచి ప్రారంభమైన సంస్థను దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన బ్రాండ్‌గా తీర్చిదిద్దడంలో ఆయన కీలక పాత్ర పోషించారు.
అతివేగంగా దూసుకొచ్చిన ఒక పికప్ వ్యాన్ ఎదురుగా వస్తున్న కారును బలంగా ఢీకొట్టడంతో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మరణించిన వారిలో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారు. మరో 30 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు.
రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులలో మౌలిక సదుపాయాల కల్పనతో పాటు, మందుల కొరత లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. కొత్తగా తీసుకురాబోయే ఆరోగ్య పథకం ద్వారా పేద, మధ్యతరగతి ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందుబాటులోకి వస్తుంది.
ముంబై ఇండియన్స్‌ను వారి సొంత గడ్డపైనే చిత్తు చేస్తూ ఆరెంజ్ ఆర్మీ సత్తా చాటింది.  కీలకమైన ఈ పోరులో సన్‌రైజర్స్ బ్యాటర్లు విరుచుకుపడి భారీ లక్ష్యాన్ని ఛేదించారు.
బెంగళూరు నగరాన్ని బుధవారం సాయంత్రం భారీ వర్షం, ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వాన అతలాకుతలం చేసింది.
ప్రభుత్వ శాఖలు అందిస్తున్న అన్ని సేవలు ఈ ఏడాది డిసెంబర్ నాటికల్లా ఆన్‌లైన్‌లో అందించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు.
హైదరాబాద్ నగర రవాణా వ్యవస్థలో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది.
చిత్రవిచిత్రమైన కేసులు, క్లయింట్ల మొండి వైఖరితో న్యాయమూర్తులు ఎంతవరకు విసుగుచెందుతారో చూపించే ఆసక్తికర సంఘటన ఇది.
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి వేడి పెంచేందుకు భారతీయ జనతా పార్టీ సమాయత్తమవుతోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.