పాతిక వేల వోల్టుల రైల్వే లైవ్ వైర్ల చోరీ.. పర్యవశానం ఏంటో తెలుసా?
Publish Date:Jul 10, 2026
Advertisement
బీహార్ రాష్ట్రంలో గతంలో ఎన్నడూ కనీవినీ ఎరుగని చోరీ జరిగింది. గతంలో రైల్వే ఇంజన్లు, ఇనుప వంతెనలనే మాయం చేసిన చోరులు.. ఇప్పుడు అంతకు మించి అన్నట్లుగా ఏకంగా హైవోల్టేజ్ రైల్వే లైవ్ వైర్లను చోరీ చేశారు. 25,000 వోల్టుల హైవోల్టేజ్ విద్యుత్ ఓవర్ హెడ్ ఎలక్ట్రిక్ వైర్లనే కట్ చేసి ఎత్తుకెళ్లిపోయారు. ఈ అసాధారణ ఘటన తూర్పు మధ్య రైల్వే పరిధిలోని జెహానాబాద్ జిల్లాలో జరిగింది. ఈ చోరీ కారణంగా అత్యంత కీలకమైన పట్నా-గయా రైల్వే సెక్షన్లో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. దాదాపు మూడు గంటల పాటు.. ఈ మార్గంలో రైళ్ల రాకపోకలు స్తంభించిపోయాయి. వివరాలిలా ఉన్నాయి.. తెహతా - జెహానాబాద్ రైల్వే స్టేషన్ల మధ్య ఉంతా-మదర్పూర్ ప్రాంతంలో దొంగలు.. డౌన్ లైన్లో ఉన్న ప్రమాదకరమైన ఓవర్ హెడ్ హైవోల్టేజ్ వైర్లను కట్ చేసి కరెంట్ సప్లై నిలిపేశారు. ఆ తరువాత వైర్లను కట్ చేసి ఎత్తుకెళ్లిపోయారు. దీంతో రైల్వే కంట్రోల్ రూమ్లో సాంకేతిక లోపం ఉన్నట్లు అలర్ట్ వచ్చింది. అప్రమత్తమైన రైల్వే అధికారులు ఏదో పెద్ద ప్రమాదం జరిగిందని భావించి వెంటనే ఆ రూట్లో వస్తున్న రైళ్లను ఎక్కడికక్కడ ఆపేశారు. ఈ సంఘటన జరిగిన ప్రాంతానికి అతి సమీపంలోనే ఆర్పీఎఫ్ పోస్ట్, గవర్నమెంట్ రైల్వే పోలీస్ స్టేషన్ ఉన్నాయి. 24 గంటలూ భద్రతా సిబ్బంది పహారా కాసే పోలీస్ స్టేషన్లకు కూతవేటు దూరంలోనే ఈ చోరీ జరిగింది. bihar railway wire theft, patna gaya railway delay, 25000 volt wire stolen, jehanabad train track incident, east central railway news, train service interrupted bihar
http://www.teluguone.com/news/content/bihar-railway-wire-theft-36-225683.html





