అదే జరిగితే ఇరాన్‌ను ముక్కలు ముక్కలు చేయండి.!

Publish Date:Jul 10, 2026

Advertisement

అగ్రరాజ్యాధినేత  డొనాల్డ్ ట్రంప్ మరోసారి తన వాచాలత ప్రదర్శించారు. ఇరాన్ ముక్కలు చేయండి అంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేసి ఉద్రిక్తతలను పెంచేశారు.  ఇరాన్ తనను ఖతం చేయడానికి వ్యూహాలు రచించిందంటూ వస్తున్న కథనాలపై స్పందిస్తూ.. ఒక వేళ ఇరాన్ తనను చంపితే..  ఆ తర్వాత జరిగే పరిణామాలు ఊహాతీతంగా, తీవ్రాతి తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.  తనకేదైనా హాని తలపెడితే ఇరాన్‌పై ఎలాంటి భీకరమైన చర్యలు తీసుకోవాలో..  ఆ దేశాన్ని ఏ విధంగా సర్వనాశనం చేయాలో అమెరికా రక్షణ అధికారులకు తాను ఇప్పటికే రాతపూర్వకంగా అత్యంత స్పష్టమైన ఆదేశాలు జారీ చేశానని ట్రంప్  వెల్లడించి సంచలనం సృష్టించారు.  

న్యూయార్క్ పోస్ట్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన డొనాల్డ్ ట్రంప్..  తన హత్యకు ఇరాన్ కుట్ర పన్నుతోందంటూ వస్తున్న తాజా లీకులపై మాట్లాడారు.   ది వాల్ స్ట్రీట్ జర్నల్,  సీఎన్‌ఎన్ వంటి   వార్తా సంస్థలు  ట్రంప్‌ను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ ఒక సరికొత్త వ్యూహాన్ని రచిస్తోందని, ఈ అత్యంత కీలకమైన ఇంటెలిజెన్స్ నిఘా సమాచారాన్ని ఇజ్రాయెల్ అధికారులు నేరుగా వాషింగ్టన్‌తో పంచుకున్నారని ఇటీవల  కథనాలు ప్రచురించిన సంగతి తెలిసిందే.  

ఆ కథనాలపై   వైట్ హౌస్ నుంచి ఎటువంటి అధికారిక ప్రకటనా వెలువడలేదు. ట్రంప్ స్వయంగా..  ఆ కథనాలను న్యూయార్క్ పోస్ట్ ఇంటర్వ్యూలో ఖండించారు. ఇజ్రాయెల్ నుంచి తమకు నేరుగా ఎలాంటి సమాచారం రాలేదని స్పష్టం చేశారు. అయితే తాను   ఇరాన్ హిట్ లిస్ట్‌లో నంబర్ వన్' స్థానంలో ఉన్నాననీ,  ఆ దేశం నుంచి తనకు ముప్పు ఉందనీ చెప్పారు. ఈ నేపథ్యంలోనే తాను , ఇరాన్ వల్ల తనకు హాని జరిగితే.. ఆ దేశాన్ని ముక్కల ముక్కలు చేయాలని అమెరికా సైన్యానికి ఇప్పటికే రాతపూర్వక ఆదేశాలు ఇచ్చేశాననీ,  ఇచ్చేశాననీ చెప్పారు. 

తనకు ఏదైనా జరిగితే..   చరిత్రలో ఎన్నడూ చూడని విధంగా, మానవజాతి ఊహించని స్థాయిలో  ఇరాన్ పై బాంబుల వర్షం కురిపించాలని ఆదేశించినట్లు వెల్లడించారు.  ఈ వ్యాఖ్యలతో అమెరికా, ఇరాన్ దేశాల మధ్య ఎ  దౌత్యపరమైన, సైనికపరమైన విభేదాలు మున్నెన్నడూ లేనంత తీవ్ర స్థాయికి చేరినట్లైంది.  టర్కీ రాజధాని అంకారాలో ఇటీవల జరిగిన నాటో సదస్సులో ఇరాన్‌తో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం ముగిసిపోయిందని ప్రకటించిన ట్రంప్..  ఇప్పుడు ఇరాన్ పై భీకర దాడులకు ఆదేశాలిచ్చానంటూ చేసిన ప్రకటన, అదే సమయంలోఆ దేశంతో దౌత్య  చర్చలు కొనసాగిస్తామనడం.. ఆయన ద్వంద్వ ప్రవృత్తిని, ద్వంద్వ వైఖరినీ వెల్డిస్తున్నాయి. మొత్తం మీద ట్రంప్ ప్రకటనతో  ప్రపంచవ్యాప్తంగా ఆందోళన వ్యక్తం అవుతోంది. 

Donald Trump Iran threat, Trump assassination plot, US Iran relations, Israel intelligence warning, New York Post Trump interview

By
en-us Political News

  
జీవితంలో ఒత్తిడిని దూరం చేసుకోవడానికి, ప్రకృతి ఒడిలో కాస్త ప్రశాంతతను వెతుక్కోవడానికి ప్లాన్ చేసిన ఆ ట్రిప్.. చివరకు ఒక కుటుంబంలో తీరని విషాదాన్ని మిగిల్చింది.
 మహిళకు ప్రైవేట్ పార్ట్ చూపించి అసభ్య ప్రవర్తన..
ముంబయిలో పవన్ కళ్యాణ్‌ను పరామర్శించిన సీఎం చంద్రబాబు..
రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో మరోసారి తీవ్ర కలకలం రేగింది.
మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు.
టీడీపీ సోషల్ మీడియాలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిని అనుకరిస్తూ వీడియోలు చేసి గుర్తింపు పొందిన ఆర్టిస్ట్ సునీల్ తాజాగా క్షమాపణలు చెప్పారు.
ఉత్తరప్రదేశ్‌లో అత్యంత ఘోరమైన, కలకలం రేపే ఘటన వెలుగుచూసింది. ఓ మహిళ దాహం వేసి నీళ్ల బాటిల్ అనుకుని యాసిడ్ తాగడంతో తీవ్ర అనారోగ్యానికి గురైంది.
భారతీయ సినీ సంగీత ప్రపంచంలో తన మధుర గానంతో కోట్లాది మంది హృదయాలను గెలుచుకున్న గానకోకిల ఎస్. జానకి
వియత్నాంలో జరిగిన పడవ ప్రమాదంలో చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన బాధితులకు అందుతున్న సహాయ చర్యలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులతో సమీక్ష
రంగారెడ్డి జిల్లా షాబాద్‌లో సంచలనం సృష్టించిన ఆరు హత్యల కేసు దర్యాప్తులో కీలక పరిణామం చోటుచేసుకున్నట్లు సమాచారం.
భారతీయ సినీ సంగీత ప్రపంచంలో గానకోకిలగా, నైటింగేల్ ఆఫ్ సౌత్ ఇండియాగా చిరస్థాయిగా నిలిచిపోయిన ప్రముఖ గాయని ఎస్. జానకి. ఆమె తన మధురమైన గానంతో కోట్లాది మంది అభిమానుల హృదయాలను గెలుచుకున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలో ఆదివారం ఉదయం ఒక ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో తమిళ సినీ నటుడు ఆర్యపై చీటింగ్ కేసు నమోదైంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.