భావన కిడ్నాప్ కేసులో... ఆ హీరోనే విలనట!

Publish Date:Feb 20, 2017

Advertisement

 

తెలుగులో ఒకట్రెండు సినిమాలు చేసిన మలయాళీ హీరోయిన్ భావన చాలా మందికి తెలియకపోవచ్చు. కాని, రీసెంట్ గా జరిగిన కిడ్నాప్ వ్యవహారంతో ఆమె ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది. కేరళ, తమిళనాడు, కర్ణాటకలో అయితే ఆమె మంచి ఫాలోయింగ్ వున్న స్టార్. కాబట్టి అక్కడ భావన గురించి అందరూ ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. అయితే, ఆమెను కరుడుగట్టన నేరస్థులు కిడ్నాప్ చేసే ప్రయత్నం చేయటం, కార్ లో లైంగిక దాడి చేయటం, ఫోటోలు, వీడియోలు తీసుకోవటం అత్యంత దుర్మార్గమైన చర్య. వారికి కఠిన శిక్షలు పడాల్సిందే. కాని, భావన పై దాడి వెనుక చాలా స్క్రీన్ ప్లే వుంది. మొత్తం కేరళ సినిమా ఇండస్ట్రీ ఎంతగా నేరమయం అయిపోయిందో విప్పి చెప్పే నేపథ్యం వుంది...

 

మనకు తమిళ ఇండస్ట్రీ గురించి తెలిసినంత కూడా మల్లూవుడ్ గురించి తెలియదు. కాని, మంచి కథాంశాలతో జాతీయ అవార్డులు పొందే చిత్రాలు వాళ్లు చేస్తుంటారు. కాని, పైకి కనిపించే కళాత్మక విలువలు ఇండస్ట్రీ లోపల వుండవని చాలా మంది చెబుతుంటారు. అసలు మలయాళీ సినిమా రంగంలోని ఒక వర్గమే తమ చుట్టూ అల్లుకుపోయిన నేరమయ పరిస్థితుల గురించి ఆందోళనగా, ఆవేదనగా చెబుతుంటుంది. ఇండస్ట్రీ ఇన్ సైడర్స్ చెప్పే దాని ప్రకారం భావన కిడ్నాప్ ఆమె మాజీ డ్రైవర్ చేసిన ఒక ఆకతాయి పని మాత్రమే కాదు. అందులో ఒక టాప్ హీరో ఇన్వాల్స్ అయి వుండొచ్చని అంటున్నారు! అతనే దిలీప్!

 

దిలీప్ కేరళ సినిమా రంగంలో మంచి పేరున్న అగ్ర నటుడు. అయితే, ఆయనకు... భావనకు మధ్య గొడవలున్నాయి. అందుక్కారణం భావన అతడి వివాహేతర సంబంధాన్ని భార్య ముందు బట్టబయలు చేయటమేనట! దిలీప్ మాజీ భార్య మలయాళీ హీరోయిన్ మంజు వారియర్. అయితే దిలీప్ మంజుతో విడాకులు తీసుకోక ముందే మరో హీరోయిన్ కావ్య మాధవన్ తో రిలేషన్ షిప్ పెట్టుకున్నాడు. ఈ విషయం గ్రహించిన భావన స్నేహితురాలు మంజు వారియర్ కి చెప్పిందట. దాంతో దిలీప్, మంజు విడిపోవాల్సి వచ్చింది. అప్పట్నుంచీ కక్ష పెంచుకున్న దిలీప్ తన పరపతి ఉపయోగించి భావనకు మలయాళ సినిమా ఆఫర్లు రాకుండా చేస్తున్నాడంటారు. ఆమె చేసేది లేక కన్నడ, తమిళ సినిమాలపై దృష్టి పెట్టింది.

 

దిలీప్ తన శక్తితో భావన మల్లూవుడ్ లో లేకుండా చేసినా కూడా ఈ మధ్యే ఆమె ఓ సినిమా సైన్ చేసింది. దాంతో రీఎంట్రీ ఇచ్చే ప్రయత్నంలో వుంది. ఇది నచ్చకే దిలీప్ తనకు దగ్గరి సంబంధాలు వున్న సునీల్ అనే క్రిమినల్ తో కలిసి భావన పరువు తీసే ప్రయత్నం చేశాడని అంటున్నారు కేరళ సినిమా వాళ్లు. సునీల్ గతంలో భావన వద్ద డ్రైవర్ గా పని చేశాడు. అయితే, అతను పైకి కనిపించినట్టుగా డ్రైవర్ మాత్రమే కాదట. దిలీప్ లాంటి సినిమా రంగపు పెద్ద పెద్ద వారితో దగ్గరి సంబంధాలున్న క్రిమినల్. గతంలో ఎన్నో కేసులు అతడిపై వున్నాయి కూడా. అయిదేళ్ల కింద ఇలాగే ఓ హీరోయిన్ తనని సునీల్ కిడ్నాప్ చేశాడని ఆరోపించింది కూడా. కాని, పోలీసులు కూడా పెద్దగా పట్టించుకోలేదు. అంత పలుకుబడి వున్న నేరగాడు సునీల్.

 

సునీల్ సంగతి అర్థమైన భావన అతడ్ని తొలగించింది. కాని, పోలీసుల కథనం ప్రకారం ఆమె తాజాగా నియమించుకున్న డ్రైవర్ మార్టిన్ కూడా సునీల్ మనిషేనట! సినిమా స్టైల్లో సాగిన ఈ వ్యవహారం సునీల్ గ్యాంగ్ మొత్తం కలిసి భావనపై దాడికి తెగబడేలా చేసింది. ఆమెను కార్ లో రెండు గంటలు హింసించిన ఉన్మాదులు అదృష్టం కొద్దీ వదిలేసి పారిపోయారు.

 

నిజంగా దిలీప్ అనే హీరోనే భావన కేసులో విలనా? ఇది ఖచ్చితంగా ఎవ్వరూ చెప్పలేరు. భావన కూడా పోలీసుల్ని ఆ కోణంలో కూడా దర్యాప్తు చేయమని కోరిందట. కాకపోతే, త్వరలో తాను కన్నడ ప్రొడ్యూసర్ ఒకాయన్ని పెళ్లాడబోతున్నాని భావన చెప్పిన వెంటనే ఈ దాడి జరగటం అనే సందేహాలకు తావిస్తోంది. కేవలం ఒక డ్రైవర్ స్థాయి వ్యక్తి ఎంతో పేరున్న టాప్ హీరోయిన్ పై స్వంత ధైర్యంతో దాడి చేస్తాడా? ఖచ్చితంగా వెనుక ఇండస్ట్రీ పెద్దలు వుండే వుంటారు. కాని, అది తేల్చాల్సింది కేరళ పోలీసులు. ఈ మధ్య అధికారంలోకి వచ్చిన కమ్యూనిస్టు ప్రభుత్వం పాలనలో దాడులు మరీ ఎక్కువైపోయాయని కూడా అంటున్నారు కేరళలో. మహిళల పట్ల అయితే దారుణంగా దాడులు జరుగుతున్నాయట. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఓ పెద్ద హీరో విషయంలో నిజం నిగ్గుతేలుతుందని ఆశించటం... కాస్త విపరీత 'భావనే'!

 

By
en-us Political News

  
గతంలో 1976లో ఇందిరా గాంధీ హయాంలో.. ఆ తర్వాత 2001లో వాజ్‌పేయి ప్రభుత్వ సమయంలో ఈ ప్రక్రియను వాయిదా వేస్తూ వచ్చారు. అయితే, 2026 గడువు సమీపిస్తుండటంతో ఈసారి డీలిమిటేషన్ జరగడం ఖాయంగా కనిపిస్తోంది. దీనిని కేవలం ఉత్తరాది రాష్ట్రాల ప్రయోజనాల కోసమే చేస్తున్న కుట్రగా చూడలేమనీ, ఇది దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న రాజ్యాంగ డెడ్ లైన్ అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
చదువుల కల్పవల్లి ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి.
గత ఎన్నికల ఫలితాలు, జిల్లా వారీగా జనాభా గణాంకాలు, ఓటర్ల జాబితాను నిశితంగా పరిశీలిస్తే, ఈ ముస్లిం వీటో అనే వాదనలో అతిశయోక్తి ఎక్కువగా ఉందనే విషయం విస్పష్టంగా తెలుస్తుంది.
కార్య‌క‌ర్త‌లను, వారి అవ‌స్థ‌ల‌ను ద‌గ్గ‌రి నుంచి ప‌రిశీలించిన లోకేష్.. వారికంటూ ఒక జీతం ఉండాలని మొద‌ట‌ కోరుకున్నారు. అది త‌ర్వాతి రోజుల్లో జ‌న్మ‌భూమి క‌మిటీల‌కు ప్రేర‌ణ‌గా మారింది. అంతే కాదు.. వాలంటీర్ వ్య‌వ‌స్థ‌కూ ఇదే స్ఫూర్తి. క‌నీసం వారికి బీమా సౌక‌ర్యం ఉండాల‌ని కోరుకున్నారాయ‌న‌. దీన్ని వ‌ర్క‌వుట్ చేయ‌గ‌లిగారు. పార్టీ కేడ‌ర్ కి లైఫ్ ఇన్ స్యూరెన్స్ చేసిన తొలి పార్టీ తెలుగుదేశం అయితే, అందుకు కార‌కుడు లోకేష్.
దేశంలో ఎన్నికల ప్రక్రియ అనగానే కేవలం ఓటింగ్, ఫలితాలే గుర్తొస్తాయి.
పార్టీ కార్యకర్తలపై నమోదైన కేసుల విషయంలో ఆయన నేరుగా రంగంలోకి దిగి వారికి భరోసా కల్పించారు. కార్యకర్తల సంక్షేమం కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయడం ద్వారా, పార్టీ అంటే కేవలం ఎన్నికల యంత్రాంగం మాత్రమే కాదు, ఒక కుటుంబం అనే భావనను ఆయన పాదుకొల్పారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు ఇవ్వడం సరైన నిర్ణయమని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
అమెరికా-ఇరాన్ మధ్య ఒక చారిత్రాత్మక ఒప్పందం కుదిరేందుకు కేవలం అంగుళాల దూరం మాత్రమే మిగిలి ఉన్న పరిస్థితుల్లో, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు రంగంలోకి దిగడంతో పరిస్థితులు తలకిందులయ్యాయి. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌తో నెతన్యాహు జరిపిన టెలిఫోన్ సంభాషణ తర్వాత చర్చల గమనం పూర్తిగా మారిపోయింది.
బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన కవిత.. సొంత రాజకీయ పార్టీ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్న వేళ, ఆమె ప్రారంభించబోయే పార్టీ పేరుపై గత కొంత కాలంగా రాజకీయవర్గాలలో పెద్ద ఎత్తున చర్చ సాగింది. కల్వకుంట్ల కవితకు తెలంగాణ సమాజంలో ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చిన తెలంగాణ జాగృతి పేరునే ఆమె తన కొత్త పార్టీకి పెట్టబోతున్నట్లు మొదట్లో వార్తలు వినవచ్చినా.. కవిత తాజా వ్యాఖ్యలతో ఆమె టీఆర్ఎస్ పేరుతోనే కొత్త పార్టీ ఏర్పాటు చేయనున్నారన్న వాదనకు బలం చేకూరింది.
ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో పలు రాష్ట్రాల అధ్యక్షులతో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ భేటీకి ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావుతో పాటు ఇరు రాష్ట్రాల ఇన్‌చార్జ్ కార్యదర్శులు హాజరయ్యారు. పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టడాని ముందు ఉన్న గడువులో అన్ని రాష్ట్రాలలో మహిళా మోర్చా ఆధ్వర్యంలో కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు.
ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో భారీ ఎత్తున అక్రమాలు జరిగినట్లు ప్రాథమిక విచారణలో స్పష్టమైంది. సుమారు 125 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన ఆడుదాం ఆంధ్రలో 40 నుండి 60 కోట్ల రూపాయల మేర అక్రమాలు జరిగాయని అంటున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న సీ షోర్ హైవే ప్రాజెక్టుతో పాటు, రాజధాని అమరావతిని అనుసంధానిస్తూ కేంద్ర ప్రభుత్వం చేపట్టిన హై-స్పీడ్ రైల్ కారిడార్లు రాష్ట్ర ప్రగతికి కొత్త వేగాన్ని తీసుకువచ్చాయి. తీర ప్రాంత అభివృద్ధిని, రాజధాని రవాణా సౌకర్యాలను ఏకకాలంలో మెరుగుపరచడమే లక్ష్యంగా ఈ భారీ ప్రాజెక్టులు రూపుదిద్దుకుంటున్నాయి.
పొంగులేటి ప్ర‌స్తుతం మంత్రిగా నిర్వహిస్తున్న మైనింగ్ శాఖ‌, గ‌తంలో కేటీఆర్ నిర్వ‌హించ‌గా.. ఆ స‌మ‌యంలో ఎన్ని అక్ర‌మాలు జ‌రిగాయో.. ఎన్నేసి అరాచ‌కాలు న‌డిచాయో.. గ‌త అసెంబ్లీ స‌మావేశాల్లో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి చ‌దివి వినిపించిన సంగ‌తి తెలిసిందే. వీటిపై సీబీసీఐడీ ఎంక్వ‌యిరీ కూడా వేస్తామ‌ని సీఎం ప్ర‌క‌టించిన సంగ‌తీ విదిత‌మే. ఈ అక్ర‌మాల్లో త‌న సోద‌రుడి ప్ర‌మేయం కూడా ఉండ‌టంతో.. ఉలిక్కి ప‌డ్డ హ‌రీష్ రావు, ఈ శాఖామాత్యుడైన‌ పొంగులేటిని త‌న టార్గెట్ గా ఫిక్స్ చేసిన‌ట్టు స‌మాచారం.
ది ఉద్యోగాల కోసం వంద‌లాది మంది ఫీజులు క‌ట్టి మ‌రీ రాస్తుంటే ఆ వ‌చ్చే ప‌ది ఉద్యోగాలు పొందిన వారినుంచి ఫీజు వ‌సూళ్ల‌ వ‌ర‌కూ ఓకే.. మిగిలిన అంద‌రి ఫీజులు వాప‌స్ ఎందుకివ్వ‌ర‌ని ప్రశ్నించారు. అంతే కాదు సామాన్యుడి త‌రఫున కూడా విలక్షణ శైలిలో తన గళమెత్తుతున్నారు. టికెట్ కొని కూడా రైల్లో ఒక సాధార‌ణ ప్ర‌యాణికుడు నిల‌బ‌డి ప్ర‌యాణించాల్సి పరిస్థితి ఏంటి? వంటి ప్ర‌శ్న‌లతో రాఘవ్ చద్దా సోషల్ మీడియాలో తెగ ట్రెండింగ్ అయ్యారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.