రాఖీ పండుగకు అక్క చెల్లెళ్ళకు ఎలాంటి బహుమానం ఇస్తే సంతోషిస్తారు.

Publish Date:Aug 24, 2026

Advertisement

రాఖీ పౌర్ణమి వచ్చిందంటే చాలు అన్నా చెల్లెల్లు, అక్కాతమ్ముళ్ల  అనురాగానికి హద్దులు ఉండవు. తన ప్రేమను, రక్షణను కోరుతూ సోదరుడి మణికట్టుపై రాఖీ కట్టే అక్కచెల్లెళ్లకు ఎలాంటి గిఫ్ట్ ఇవ్వాలా అని ప్రతి తమ్ముడు, అన్న ఆలోచిస్తుంటారు. బహుమతి ఖరీదైనదే కావాల్సిన అవసరం లేదు, అందులో  ప్రేమాభిమానాలు ఉంటే చాలు. తక్కువ బడ్జెట్‌లో అక్క చెల్లెళ్లను సంతోషపరిచే కొన్ని అద్భుతమైన గిఫ్ట్ ఐడియాలు ఇవే!

పర్సనలైజ్డ్ గిఫ్ట్స్ (Personalized Gifts)..

చిన్నప్పటి ఫోటోతో ఉన్న కస్టమైజ్డ్ ఫోటో ఫ్రేమ్, వారి పేరు లేదా బొమ్మతో ఉన్న కాఫీ మగ్, లేదా ఒక కీచైన్ ఇవ్వవచ్చు. ఇవి ఖర్చు తక్కువే అయినా, ఎంతో గొప్ప జ్ఞాపకంగా నిలిచిపోతాయి.

బుక్స్ లేదా డైరీ..

అక్క లేదా చెల్లెలికి పుస్తకాలు చదవడం లేదా అలవాట్లను డైరీలో రాసుకోవడం ఇష్టమైతే, మంచి నవల లేదా ఒక అందమైన పర్సనల్ డైరీ, పెన్ సెట్ బహుమతిగా ఇవ్వవచ్చు. ఇది వారి రోజువారీ జీవితంలో ఎంతగానో ఉపయోగపడుతుంది.

ఇయర్ రింగ్స్ మరియు యాక్సెసరీస్..

ప్రస్తుతం ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ, ట్రెండీ ఇయర్ రింగ్స్ లేదా హెయిర్ యాక్సెసరీస్ తక్కువ ధరలోనే లభిస్తున్నాయి. వారికి నచ్చే డిజైన్ ఎంచుకుని ఇస్తే వారు కచ్చితంగా ఆనందిస్తారు.

ఇండోర్ ప్లాంట్స్ (Indoor Plants)..

మొక్కలను అమితంగా ఇష్టపడే అక్కాచెల్లెళ్ల కోసం చిన్న సైజు మనీ ప్లాంట్, సుక్యులెంట్స్ లేదా జేడ్ ప్లాంట్ వంటి ఇండోర్ ప్లాంట్స్ ఇవ్వడం మంచి ఐడియా. ఇవి ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ  ని నింపడమే కాకుండా అనుబంధానికి ప్రతీకగా ఎదుగుతాయి.

స్కిన్ కేర్ / సెల్ఫ్ కేర్ కాంబో.. 

ఇష్టమైన బ్రాండ్ లలో ఫేస్ మాస్క్స్, లిప్ బామ్స్, లేదా ఫ్రాగ్రెన్స్ బాడీ మిస్ట్ వంటి వాటితో చిన్న స్కిన్ కేర్ కిట్  ఇవ్వవచ్చు. ఇవి తక్కువ బడ్జెట్‌లో లభించడమే కాకుండా వారి పట్ల ఉన్న  శ్రద్ధను తెలియజేస్తాయి.

హాండ్ మేడ్ గిఫ్ట్స్ & చాక్లెట్స్..

 సొంతంగా  చేసిన గ్రీటింగ్ కార్డ్, వారితో ఉన్న అనుబంధాన్ని తెలుపుతూ రాసిన ఒక చిన్న లెటర్ తో పాటు ఒక చాక్లెట్ బాక్స్ ఇస్తే వచ్చే సంతోషం ముందు ఏ ఖరీదైన వస్తువైనా సరిపోదు.

ముఖ్యంగా అందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. నిజమైన ప్రేమ అభిమానం ఉన్నప్పుడు.. వస్తువు ధర కంటే దాన్ని ఇచ్చే విధానంలోనే అసలైన ప్రేమ ఉంటుంది. కాబట్టి ఈ రాఖీకి బడ్జెట్‌కు తగినట్టుగా పై వాటిలో ఒక మంచి గిఫ్ట్ ఎంచుకుని అక్కచెల్లెళ్లకు సర్ ప్రైజ్ ఇచ్చేయండి మరి..

                                                                                                                                      *రూపశ్రీ. 

By
en-us Political News

  
రక్తసంబంధాలన్నింటిలోనూ అత్యంత విలక్షణమైనది, మధురమైనది అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల అనుబంధం.
పెళ్లి.. ఆడపిల్ల జీవితాన్ని, పుట్టింటితో గల బంధాన్ని కూడా చాలా వరకు మార్పులకు లోను చేస్తుంది. పెళ్లయ్యాక సొంత తోబుట్టువుల సంబంధ బాంధవ్యాల్లో కొన్ని మార్పులు రావడం సహజం.  పెళ్ళయ్యాక ఆడపిల్ల జీవితంలోకి ఒక కొత్త వ్యక్తి వస్తాడు.. 
మహిళల్లో రక్తహీనత, తీవ్రమైన అలసటను తగ్గించి హిమోగ్లోబిన్ స్థాయిలను వేగంగా పెంచే ఐరన్ రిచ్ సూపర్ ఫుడ్ లడ్డూ తయారీ విధానం మరియు దాని వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇక్కడ తెలుసుకోండి.
డయాబెటిస్ రోగులకు ఇన్సులిన్ ఇంజెక్షన్లు, మాత్రల బాధ తప్పించేందుకు చైనా శాస్త్రవేత్తలు జన్యుపరంగా మార్పు చేసిన గిఫ్ట్ స్మార్ట్ ప్రోబయోటిక్‌ను ఆవిష్కరించారు. కప్పు పెరుగు రూపంలో తీసుకునే ఈ మందు రెండేళ్లలో అందుబాటులోకి రానుంది. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
లాయిడ్స్ బ్యాంక్ సాంకేతిక లోపం మరియు నిర్లక్ష్యం కారణంగా ఒక గ్రామీణ చర్చికి చెందిన £5,500 అత్యవసర నిధులు 4 నెలల పాటు నిలిచిపోయాయి. విద్యుత్ బిల్లులు, మరమ్మతుల కోసం అప్పులు చేయాల్సి వచ్చిన చర్చి కథనం మరియు బ్యాంక్ పరిహారం గురించిన పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
పాము కుట్టిన వెంటనే కళ్లు మూయకూడదని మరియు నిద్రపోకూడదని ఎందుకు చెబుతారు? నాడీ వ్యవస్థపై విష ప్రభావం మరియు WHO గణాంకాలతో కూడిన పూర్తి నిజాలు ఇక్కడ చదవండి.
మోకాళ్లలో కటకట శబ్దాలు (Crepitus) ఎందుకు వస్తాయి? నొప్పి లేకుండా శబ్దాలు వస్తే భయపడాలా? కీళ్ల ఆరోగ్యం కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తల సమగ్ర విశ్లేషణ ఇక్కడ చదవండి.
4 ఏళ్ల లోపు పిల్లలకు డాక్టర్ సలహా లేకుండా దగ్గు సిరప్‌లు వేయడం ప్రమాదకరమని కేంద్ర ఆరోగ్య శాఖ హెచ్చరించింది. సైడ్ ఎఫెక్ట్స్ మరియు సురక్షితమైన చైల్డ్ కేర్ టిప్స్ ఇక్కడ చదవండి!
ఫిట్‌నెస్ ప్రపంచంలో ట్రెండింగ్‌గా మారిన క్రియేటిన్ సప్లిమెంట్ వెనుక ఉన్న శాస్త్రీయ నిజాలు, ప్రయోజనాలు మరియు మోతాదు గురించిన పూర్తి విశ్లేషణ ద గార్డియన్ పాడ్‌కాస్ట్ ఆధారంగా ఇక్కడ చదవండి.
లండన్‌లోని వి అండ్ ఏ మ్యూజియంలో క్వీన్ బ్యాండ్ లెజెండ్ ఫెడ్డీ మెర్క్యురీ 80వ జయంతి సందర్భంగా ఆయన అరుదైన 8 కాస్ట్యూమ్స్‌తో ఉచిత ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తున్నారు. మేరీ ఆస్టిన్ భాగస్వామ్యంతో జరుగుతున్న ఈ ప్రదర్శన వివరాలు ఇవే!
బాగా పండిన, నల్లటి మచ్చలు ఉన్న అరటిపండ్లను పారేయకుండా బ్రెడ్, కేకులు, నేచురల్ ఐస్‌క్రీమ్, హెల్దీ స్మూతీస్ మరియు పాన్‌కేక్‌లుగా ఎలా మార్చుకోవాలో ఈ కథనంలో వివరంగా తెలుసుకోండి.
ఉదయాన్నే బ్రేక్‌ఫాస్ట్‌లో ఒక కప్పు ఓట్స్ తినడం వల్ల బరువు తగ్గడం, గుండె ఆరోగ్యం మెరుగవ్వడం, షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవ్వడం వంటి 7 అద్భుత ప్రయోజనాలు పొందవచ్చు. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి!
కొబ్బరి నీళ్ల నుంచి కొబ్బరి నూనె వరకు అన్ని రూపాల్లో లభించే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు, బరువు తగ్గించే చిట్కాలు మరియు పోషకాల గురించి సమగ్రంగా తెలుసుకోండి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.