స్నేక్ ప్లాంట్ మొక్క పెంచుతుంటారా? ఈ నిజాలు తెలుసా?

Publish Date:Jan 1, 2024

Advertisement

సొంతిల్లు అయినా, అద్దె ఇల్లు అయినా మొక్కలు పెంచుకోవడం చాలా మంది చేసే పని. కళ్లెదురుగా  మొక్కలు ఎదుగుతూ పువ్వులు, కాయలు కాస్తుంటే అదొక చెప్పలేని ప్రశాంతత మనసును హాయిగా ఉంచుతుంది. చాలామంది ఇంటిముందు జాగా లేకపోయినా కుండీలలో పెరిగే అవకాశం ఉన్న చాలా మొక్కలను పెంచుతుంటారు. వీటిలో కలబంద, మనీ ప్లాంట్, స్నేక్ ప్లాంట్, గులాబీ, పీస్ లిల్లీ మొదలైనవి పెంచుతుంటారు. అయితే చాలా ఇళ్ళలో కనిపించే స్నేక్ ప్లాంట్ గురించి చాలామందికి తెలియదు. ఈ స్నేక్ ప్లాంట్ మొక్క ఇంట్లో ఉంటే పాములు రావనే మాట తప్పితే దీని గురించి నిజానిజాలు తెలిసినవాళ్లు తక్కువ. ఈ మొక్క గురించి నిజాలేంటంటే..

స్నేక్ ప్లాంట్ గురించి చైనా వాస్తుశాస్త్రం చాలా గొప్పగా చెప్పింది. ఈ మొక్కను ఇంట్లో సరైన దిశలో ఉంచితే ఇంట్లో సానుకూల శక్తి పెరిగి అదృష్టం కలసివస్తుందని పేర్కొంది. అందుకే స్నేక్ ప్లాంట్ ను అదృష్టం తెచ్చి పెట్టే మొక్కగా చైనీయులు భావిస్తారు.

సైన్స్ ప్రకారంగా చూస్తే స్నేక్ ప్లాంట్ వల్ల చాలా లాభాలు ఉన్నాయి...

స్నేక్ ప్లాంట్ ఇంట్లో ఉంటే ఆ ఇంటి ప్రాంతంలో ఉండే గాలిని స్వచ్చంగా ఉంచుతుంది.  గాలి శుద్ది చేయడంలో ఈ మొక్క ప్రభావవంతంగా ఉంటుంది.

స్నేక్ ప్లాంట్ ఆక్సిజన్ ఉత్పత్తిని పెంచే మొక్క. చాలా మొక్కలు పగటి సమయంలో ఆక్సిజన్ గ్రహించి కార్భన్ డయాక్సైడ్ ను విడుదల చేస్తుంటాయి. కానీ స్నేక్ ప్లాంట్ మాత్రం పగటి సమయంలో కార్బన్ డయాక్సైడ్ ను గ్రహించి ఆక్సిజన్ ను విడుదల చేస్తుంది.

వాతావరణంలోని మలినాలను, బ్యాక్టీరియాను నిర్మూలిస్తుంది. ఇది అలెర్జీలను, అలెర్జీకి కారణమయ్యే వాతావరణాన్ని క్లియర్ చేస్తుంది. ముఖ్యంగా శ్వాస సంబంధ సమస్యలున్నవారు, ఆస్తమాతో ఇబ్బంది పడేవారు స్నేక్ ప్లాంట్ పెంచుకుంటే ఆరోగ్యం బాగుంటుంది.

స్నేక్ ప్లాంట్ పెంపకంలో  అంత ఇబ్బందులేమీ ఉండవు. ఈ ఇండోర్ మొక్కకు నీరు ప్రతిరోజూ పెట్టాల్సిన అవసరం ఉండదు. తక్కువ గాలి, తక్కవ నీరు, తక్కువ వెలుతురులో చాలా ఆరోగ్యంగా పెరుగుతాయివి.

స్నేక్ ప్లాంట్ మొక్క  ఇంట్లో తేమను నియంత్రించడంలో ముందుంటాయి. ఇవి పెరిగే కొద్దీ తేమను విడుదల చేస్తాయి. దీని వల్ల ఇంటిలోపల వాతావరణం చలిగానూ లేకుండా, వేడిగానూ లేకుండా  సమతుల్యంగా ఉంటుంది.

ఇకపోతే స్నేక్ ప్లాంట్ ఆకులతో కూడిన మొక్క. దీని ఆకులు నిటారుగా, పొడవుగా పెరుగుతాయి. ఈ మొక్క చూడ్డానికి చాలా ఆకర్షణగా ఉంటుంది. పైపెచ్చు ఈ ఆకులు ఆకుపచ్చ రంగులో కళ్లకు ఆహ్లాదకరంగా ఉంటాయి.

                                          *నిశ్శబ్ద.

By
en-us Political News

  
ఒంటికి చలువ చేసి తక్షణ శక్తిని అందించే సగ్గుబియ్యం జావను ఇంట్లోనే సులభంగా ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోండి. అనారోగ్యం, నీరసం తగ్గించే ఈ హెల్దీ డ్రింక్ రెసిపీ మరియు ఆరోగ్య లాభాల పూర్తి వివరాలు.
30 రోజుల పాటు ఉదయాన్నే ఖాళీ కడుపుతో కరివేపాకు జ్యూస్ తాగడం వల్ల కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు, బరువు తగ్గడం, షుగర్ మరియు జుట్టు సమస్యలకు చెక్ పెట్టే సులభమైన చిట్కాలు ఇక్కడ తెలుసుకోండి.
ప్రతిరోజూ ఒక అరటిపండు చొప్పున 45 రోజులు తింటే శరీరంలో ఎలాంటి అద్భుత మార్పులు జరుగుతాయి? గుండె ఆరోగ్యం, జీర్ణక్రియ, బీపీ నియంత్రణ మరియు తక్షణ శక్తి వంటి ఆశ్చర్యకరమైన ఆరోగ్య ప్రయోజనాల పూర్తి వివరాలు తెలుసుకోండి.
శరీరంలో విటమిన్ డి లోపం వల్ల కలిగే అనారోగ్య సమస్యలు, ప్రధాన లక్షణాలు మరియు దీనిని అధిగమించడానికి తీసుకోవాల్సిన ఉత్తమ ఆహార పదార్థాల గురించి పూర్తి సమాచారం.
తీవ్రమైన మానసిక ఆందోళన మరియు ఒత్తిడితో బాధపడుతున్న యూజర్లలో దాదాపు 47 శాతం మంది భావోద్వేగ మద్దతు కోసం ఏఐ చాట్‌బాట్లను ఆశ్రయిస్తున్నట్లు తాజా అధ్యయనం వెల్లడించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
వృద్ధులలో విపరీతమైన మందుల వాడకం (పాలీఫార్మసీ) మరియు సంక్లిష్టమైన రెజిమెన్స్ వల్ల వైద్యులపై పడుతున్న భారం గురించి తాజా అధ్యయన విశేషాలను తెలుసుకోండి.
అల్గారిథమ్‌ల గందరగోళం మరియు ఆటోప్లే పాటలతో విసిగిపోయిన మ్యూజిక్ ప్రియులు మళ్లీ సీడీల (CDs) వైపు ఎందుకు మొగ్గు చూపుతున్నారు? సీడీల పునరాగమనం వెనుక ఉన్న ఆసక్తికరమైన కారణాలపై ప్రత్యేక కథనం.
ఆంధ్ర స్టైల్ శెనగపప్పు మటన్ కూరను సులభంగా ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోండి. రుచికరమైన మరియు ప్రోటీన్ నిండిన ఈ ట్రెడిషనల్ రెసిపీ తయారీ విధానం పూర్తి వివరాలతో.
ఏ ఇంటికైనా ఆ ఇంట్లోని పిల్లల ప్రవర్తనే వారి పరువు ప్రతిష్టలను నిర్ణయిస్తుంది. ముఖ్యంగా కొడుకు మంచివాడైతే ఆ తల్లిదండ్రుల సంతోషానికి అవధులు ఉండవు.
ప్రస్తుత డిజిటల్ కాలంలో చిన్నారులను స్మార్ట్‌ఫోన్‌లు, టీవి,  వీడియో గేమ్స్ నుండి దూరం చేయడం  తల్లిదండ్రులకూ ఒక పెద్ద ఛాలెంజ్ గా  మారింది.
మన సమాజంలో చాలామంది ఎదుర్కొనే అతిపెద్ద సమస్యల్లో మొహమాటం ఒకటి. ఎదుటివారు ఏది అడిగినా,
తక్కువ నీటితో లేదా నీరు లేకుండా మాత్రలు మింగుతున్నారా? దీనివల్ల ఆహార నాళంలో పుండ్లు, మంట వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. మాత్రలు వేసుకునేటప్పుడు పాటించాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలు తెలుసుకోండి.
క్యాన్సర్‌కు సర్జరీ మాత్రమే కాకుండా రేడియేషన్ థెరపీ, రేడియోసర్జరీ ద్వారా ఎలాంటి కోతలు లేకుండా ఎలా చికిత్స అందించవచ్చో తెలుసుకోండి. IMRT, IGRT మరియు అడాప్టివ్ రేడియోథెరపీ ప్రత్యేకతల పూర్తి సమాచారం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.