Publish Date:Sep 29, 2025
రాష్ట్ర వ్యాప్తంగా సద్దుల బతుకమ్మ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. తెలంగాణ ఆత్మీయతను ప్రతిబింబించే ఈ పండుగ చివరి రోజు మహిళలు పెద్ద ఎత్తున సమీకరించి సాంప్రదాయ ఉత్సాహంతో సంబరాలు చేసుకుంటున్నారు. రంగురంగుల పూలతో భక్తిశ్రద్ధలతో బతుకమ్మలు పేర్చి పాటలు పాడుతూ నృత్యాలు చేస్తున్నారు.హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్, సరూర్‌నగర్ పరిసరాలు వెలుగులతో కళకళలాడుతున్నాయి. ప్రత్యేకంగా సరూర్‌నగర్ మైదానంలో నిర్వహించిన బతుకమ్మ ఉత్సవం విశేష ఆకర్షణగా నిలిచింది. 63 అడుగుల ఎత్తయిన భారీ బతుకమ్మను నిర్మించి గిన్నిస్ రికార్డు సాధన లక్ష్యంగా ఈ వేడుకను నిర్వహించారు.
ఒకేసారి 1,354 మంది మహిళలు బతుకమ్మ ఆడుతూ కొత్త రికార్డును సృష్టించారు.ఈ కార్యక్రమంలో మంత్రులు సీతక్క, జూపల్లి కృష్ణారావు, హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా మంత్రి సీతక్క బతుకమ్మ పాట పాడి వేడుక వాతావరణాన్ని మరింత ఉత్సాహభరితంగా మార్చారు.హనుమకొండ, నిజామాబాద్, ఖమ్మం, కరీంనగర్, వరంగల్ సహా పలు జిల్లాల్లోనూ మహిళలు సంప్రదాయ దుస్తులు ధరించి బతుకమ్మను ఆడుతూ సాంస్కృతిక వైభవాన్ని ప్రతిబింబించారు. మరోవైపు సరూర్‌నగర్ మైదానంలో నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో రెండు గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సృష్టించాయి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/bathukamma-36-207119.html
తెలంగాణ పోలీస్ కంప్యూటర్ సర్వీసెస్ (PCS), హైదరాబాద్‌లో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ)గా విధులు
సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు
ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు.
టీచర్లకూ మధ్యాహ్న భోజనం.. తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం.!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో సరికొత్త పర్యాటక విధానాన్ని ప్రవేశపెట్టేందుకు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తోంది.
తెలంగాణ పోలీస్ శాఖ భద్రతా ఏర్పాట్లలో కీలక మార్పులు చేపట్టింది.
పోస్టాఫీసు నుంచి స్పీడ్ పోస్ట్‌లో వచ్చే పార్శిల్‌లో మందులు ఉంటాయని భావిస్తారు.
మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకం వీబీ జీ రామ్ జీ ఏపీ నుంచి ప్రారంభమై దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చింది.
కర్ణాటక రాజధాని బెంగళూరు నగర శివార్లలో గురువారం తెల్లవారుజామున ఒక ఊహించని ఘోర విషాదం చోటుచేసుకుంది.
కంచన్ భాగ్ పోలీస్ స్టేషన్‌లో మాజీ మంత్రి, బీఆర్ఎస్ శాసనసభ పక్ష ఉపనేత హరీశ్ రావుతో పాటు ఇతర నేతలను మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పరామర్శించారు
హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో మాజీ ఐపీఎస్ అధికారి ఏ.కే. ఖాన్ కుమారుడు మొహ్సిన్ ఖాన్‌తో పాటు తబ్రేజ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.
పుణేకు చెందిన ప్రముఖ రియల్టర్ కేతన్ అగర్వాల్ దారుణ హత్య కేసు ప్రస్తుతం దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తోంది.