విశ్రాంత ఐపీఎస్ ఏ.కే. ఖాన్ కుమారుడుపై కేసు
Publish Date:Jul 2, 2026
Advertisement
హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో మాజీ ఐపీఎస్ అధికారి ఏ.కే. ఖాన్ కుమారుడు మొహ్సిన్ ఖాన్‌తో పాటు తబ్రేజ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. సినీ నిర్మాత వెంకట అనీష్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు బీఎన్‌ఎస్‌లోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. తాను నిర్మిస్తున్న 'మహారాగ్ని' సినిమాకు పెట్టుబడిదారు లను పరిచయం చేస్తామని మొహ్సిన్ ఖాన్, తబ్రేజ్ హామీ ఇచ్చారని బాధితుడు సినీ నిర్మాత పేర్కొన్నారు. ఈ క్రమంలో పెట్టుబడిదారులతో సమావేశాలు ఏర్పాటు చేస్తామని, సినిమా కోసం భారీ పెట్టుబడులు సమకూ రుస్తామని నమ్మబలికి తన నుంచి మొత్తం రూ.50 లక్షలు తీసుకున్నారని ఆరోపించారు. ఇందులో మొహ్సిన్ ఖాన్‌కు రూ.25 లక్షలు, తబ్రేజ్‌కు మరో రూ.25 లక్షలు మూడు విడతల్లో నగదు రూపంలో అందజేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.అయితే డబ్బులు తీసుకున్న తర్వాత పెట్టుబడిదారులను పరిచయం చేయకపోవడం తో పాటు, ప్రతి సారి ఏదో ఒక కారణం చెబుతూ కాలయాపన చేశారని బాధితుడు ఆరోపించాడు. దీంతో అనుమానం వచ్చి డబ్బులు తిరిగి ఇవ్వాలని కోరగా, కార్యాలయానికి రావాలని చెప్పి అక్కడ బెదిరింపులకు పాల్పడ్డారని ఫిర్యాదులో వివరించారు. తనను బౌన్సర్లతో చుట్టుముట్టించి, ఆయుధాలు చూపిస్తూ భయభ్రాంతులకు గురి చేశారని, డబ్బులు అడుగుతావా... నీకు ఏం జరుగుతుందో చూద్దాం అంటూ మొహ్సిన్ ఖాన్ బెదిరించాడని బాధితుడు ఆరోపించాడు. అంతేకాకుండా తనపై దాడి కూడా జరిగిందని, తబ్రేజ్ ఫోన్ ద్వారా పలుమార్లు బెదిరింపులకు పాల్పడ్డాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. మొహ్సిన్ ఖాన్, తబ్రేజ్‌ల నుంచి తనకు ప్రాణహాని ఉందని పేర్కొంటూ బాధితుడు జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించాడు. ఫిర్యాదును పరిశీలించిన పోలీసులు బీఎన్‌ఎస్ సెక్షన్లు 126(2), 115(2), 352, 351(2), 3(5) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఆరోపణల్లో వాస్తవాలు ఏ మేరకు ఉన్నాయనే దానిపై ఆధారాలు సేకరిస్తూ అన్ని కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నారు.
http://www.teluguone.com/news/content/case-against-retired-ips-officer-ak-khans-son-36-224871.html





