కే.యూ, టీ.యూల‌కూ తాకిన బాస‌ర ఐఐఐటీ సెగ!

Publish Date:Jun 21, 2022

Advertisement

హ‌మ్మ‌య్య స‌మ‌స్య ప‌రిష్కార‌మ‌యి బాస‌ర ఐఐఐటి విద్యార్ధులు ఆనందంలో మున‌క‌లేస్తున్నారు. ఎండా వాన‌ల‌కు, రాత్రిప‌గ‌లు అన‌క‌, అధికారుల బెదిరింపులు, హెచ్చ‌రిక‌ల‌కు వెర‌వ‌క సాగించిన  ఆందోళ‌న స‌త్ఫలితాన్నే ఇచ్చింది. మొత్తానికి ప్ర‌భుత్వం కొండదిగి వ‌చ్చి విద్యార్ధులు కోరిన డిమాండ్ల‌ను అంగీక రించింది. రెగ్యులర్‌ వైస్‌ చాన్స్‌లర్‌ నియామకం సహా వసతి గృహాల్లో సమస్యల పరిష్కారం, ఇతర మౌలిక, విద్యాపర మైన వసతులు, సౌకర్యాల కల్పనకు ఏడు రోజుల పాటు నిరసన చేపట్టిన నిర్మల్‌ జిల్లా బాసర ట్రిపుల్‌ ఐటీ విద్యార్థులు.. చివరకు అనుకున్నది దక్కించుకున్నారు. వారి డిమాండ్లన్నిటినీ  నెల రోజుల్లోగా  తీర్చేందు కు ప్రభుత్వం అంగీకారం తెలిపింది. ఈ మేరకు సోమవారం అర్ధరాత్రి అధికారులు ప్రకటిం చారు.  కాగా, విద్యార్థులు లేవెనెత్తిన అంశాలపై విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, బాసర ట్రిపుల్‌ ఐటీ ఇన్‌చార్జి వీసీ రాహుల్‌ బొజ్జా, విద్యాశాఖ ఉన్నతాధికారులు సోమవారం మధ్యాహ్నం  హైదరా బాద్‌లో చర్చించారు.  ఈ సందర్భంగానే రెగ్యులర్‌ వీసీ నియామకానికి ముగ్గురు సభ్యులతో సెర్చ్‌ కమిటీ ఏర్పాటు సహా విద్యార్థుల డిమాండ్ల అంగీకారానికి మొగ్గుచూపింది.
మంత్రి స‌బిత‌, రాహుల్‌ బొజ్జా, విద్యా శాఖ కార్యదర్శి వాకాటి కరుణ,  నిర్మల్‌ కలెక్టర్‌ ముషారఫ్‌ అలీ ఫారూ ఖీ, ట్రిపుల్‌ ఐటీ డైరెక్టర్‌ సతీశ్‌ కుమార్‌ బాసర కు రాత్రి వెళ్లి  11 గంటలకు విద్యార్థి నాయకులతో చర్చల కు ఉపక్రమించారు.  అయితే విద్యార్ధి నాయ‌కులు మంత్రిని ప్ర‌భుత్వ అంగీకారాన్ని రాత‌పూర్వ‌కంగా ఇవ్వాల‌ని కోరారు. అందుకు రాత‌పూర్వ‌కంగా ఎందుకు మంత్రిగా  చెబుతున్నానుక‌దా అని మంత్రి స‌బిత  సున్నితం గా వారి విన‌తిని  తిర‌స్క‌రించారు. విద్యార్థులు మంత్రి చెప్పినదానికి అంగీకరించినట్లు తెలిసింది. ప్రభు త్వం నుంచి డిమాండ్ల పరిష్కా రానికి అంగీకారం రావడంతో విద్యార్థులు నిరసనను విరమిస్తు న్నట్లు అధి కారులతో కలిసి వెల్లడించారు. చర్చలు సఫలం అయినట్లు ట్రిపుల్‌ ఐటీ డైరెక్టర్‌ సతీశ్‌ కుమార్‌ మీడియాకు తెలిపారు.

ఇదిలా వుండ‌గా మ‌రోవైపు హ‌నుమ‌కొండ‌లోని కాక‌తీయ విశ్వ‌విద్యాల‌యం (కేయూ), నిజామాబాద్ డిచ్‌ప‌ల్లి లోని తెలంగాణా విశ్వ‌విద్యాల‌యం(టీయూ) లో విద్యార్ధులు త‌మ స‌మ‌స్య‌ల ప‌రిష్క‌రించాల‌ని ఆందోళ‌న కు దిగారు. కేయూలో  విద్యా సంవత్సరం ప్రారంభమైనా వసతి గృహాలను తెరవకపోవడం, మరమ్మతుల ను నిర్లక్ష్యంగా చేపడుతుండడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల సమావేశాన్ని అడ్డుకుని రిజి స్ట్రార్‌ చాంబర్‌ను ధ్వంసం చేశారు. భౌతిక తరగతులు నిర్వహించకుండా ఆన్‌లైన్‌ తరగతుల పేరుతో తాత్సారం చేయడం పట్ల సోమవారం తొలుత వర్సిటీ పరిపాలన భవనం ఎదుట విద్యార్థులు ఆందోళన చేశారు.

భవనంలోకి దూసుకుకెళ్లేందుకు యత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. అధికారులతో మాట్లాడి సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అయితే, రిజిస్ట్రార్‌, ఇతర అధికారుల నుంచి వసతి గృహాలను తెరిచే విషయంలో స్పందన రాకపోవడంతో ఆగ్రహానికి గుర య్యారు. పోలీసులను చేధించుకుని పరిపాలన భవనం పై అంతస్తులో ఉన్న రిజిస్ట్రార్‌ చాంబర్‌లోకి దూసుకెళ్లారు.

కేయూలో  విద్యా సంవత్సరం ప్రారంభమైనా వసతి గృహాలను తెరవకపోవడం, మరమ్మ తులను నిర్లక్ష్యంగా చేపడు తుండడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల సమావేశాన్ని అడ్డుకు ని రిజిస్ట్రార్‌ చాంబర్‌ను ధ్వంసం చేశారు. భౌతిక తరగతులు నిర్వహించకుండా ఆన్‌లైన్‌ తరగతుల పేరుతో తాత్సారం చేయడం పట్ల సోమవారం తొలుత వర్సిటీ పరిపాలన భవనం ఎదుట విద్యార్థులు ఆందోళన చేశారు. భవనంలోకి దూసుకుకెళ్లేందుకు యత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. అధికా రులతో మాట్లాడి సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అయితే, రిజిస్ట్రార్‌, ఇతర అధికారుల నుంచి వసతి గృహాలను తెరిచే విషయంలో స్పందన రాకపోవడంతో ఆగ్రహానికి గురయ్యారు. పోలీసు లను చేధించుకుని పరిపాలన భవనం పై అంతస్తులో ఉన్న రిజిస్ట్రార్‌ చాంబర్‌లోకి దూసుకెళ్లారు.
విద్యార్థులు రిజిస్ట్రార్‌ చాంబర్‌ను ధ్వంసం చేశారు. పోలీసులు అడ్డుకుంటున్నా ఫర్నీచర్‌, ఇతర వస్తువు లను పగులగొట్టారు. రిజిస్ట్రార్‌, ఇతర అధికారులు వారిస్తున్నా వినలేదు. వసతి గృహాలను తెరవాలంటూ అక్కడే కూర్చొని వాదనకు దిగారు. హామీ ఇస్తేనే వెళ్తామని మొండికేశారు. దీంతో కొద్దిసేపు అధికారులు, విద్యార్థుల మధ్య వాగ్వాదం జరిగింది. చివరకు పోలీసుల జోక్యంతో శాంతించారు. రెండు రోజుల్లో వసతి గృహాలు తెరవకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరిస్తూ విద్యార్థులు ఆందోళనను తాత్కాలి కంగా విరమించారు.

అవసరమైతే బాసర ట్రిపుల్‌ ఐటీ విద్యార్థుల తరహాలో తామూ వర్సిటీలో నిరసనలు చేపడతామని తేల్చి చెప్పారు. దీంతో వీసీ రవీందర్‌, రిజిస్ట్రార్‌ శివశంకర్‌లు.. విద్యార్థులు, విద్యార్థి సంఘాల నాయకులతో చర్చలు జరిపారు. వారంలోగా సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. విద్యార్థులు మాత్రం తక్షణ పరిష్కారం కోరారు. ఈ నేపథ్యంలో వీసీ.. ప్రిన్సిపాల్‌ హారతి, వర్సిటీలోని వివిధ విభాగాల అధికారులతో సమావేశమయ్యారు. రెండు రోజుల్లో సమస్యలు పరిష్కరించాలని ఆదేశాలివ్వడంతో విద్యార్థులు శాంతిం చారు.

By
en-us Political News

  
దేశ చరిత్రలో ప్రధానిగా ఎన్నికైన ఏకైక మహిళ ఇందిరాగాంధీ. దాదాపు 16 ఏళ్ల సుదీర్ఘకాలం భారతదేశ ప్రధానిగా కొనసాగిన ఏకైక వనిత ఇందిరాగాంధీ. ఉక్కుమహిళగా పేరు తెచ్చుకున్న ఇందిరాగాంధీ తన హయాంలో తీసుకుని అమలు చేసిన నిర్ణయాలు ఓ సంచలనం.
వచ్చే ఎన్నికల్లో నాగబాబు శ్రీకాకుళం జిల్లాలోని ఎచ్చెర్ల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని కూడా పొలిటికల్ సర్కిల్స్ లో పుకార్లు షికారు చేస్తున్నాయి.
బుజ్జగింపు ప్రయత్నాలు ఫలించలేదు. ఇంత వరకూ వచ్చిన తరువాత పార్టీలో కొనసాగితే.. తన గౌరవానికి భంగం అని జీవన్ రెడ్డి తనను బుజ్జగించడానికి వచ్చిన నేతలతో అన్నట్లు సమాచారం. వాస్తవానికి గత కొంతకాలంగా పార్టీ అంతర్గత పరిణామాలపై తీవ్ర అసంతృప్తిగా ఉన్నజీవన్ రెడ్డి.. బీఆర్ఎస్ గూటికి చేరనున్నారని రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది.
రిజర్వుడు నియోజకవర్గాల నుంచి పార్టీ టికెట్ ఆశిస్తున్న అభ్యర్థులు 15వేల రూపాయలు, జనరల్ స్థానం నుంచి టికెట్ ఆశిస్తున్న వారు పాతిక వేల రూపాయలు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఇది నాన్ రిఫండబుల్. ఇలా ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకున్న వారికి నిర్దిష్ట తేదీ, నిర్దిష్ట సమయం కేటాయించి ఇంటర్వ్యూలకు పిలుస్తారు.
తెలుగువన్ వాస్తవ వేదిక తాజా సంచికలో వివేక హత్య కేసుపై విస్తృత చర్చ జరిగింది
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ కలిసి ఇటీవల ఒకే ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు.
చంద్రబాబు కూడా పలు సందర్భాలలో కొందరు మంత్రుల పనితీరు బాగా లేదనీ, వారు తమ తీరు మార్చుకోవాలని పలుమార్లు సూచించిన విషయం తెలసిందే. అయితే ఏ సందర్భంలోనూ కూడా ఆయన పని తీరు బాగా లేని మంత్రుల పేర్లు వెల్లడించలేదు. ఇక బాబు తనదైన శైలిలో ఎప్పటికప్పుడు మంత్రుల పని తీరును సమీక్షిస్తున్న సంగతి తెలిసిందే.
తనకు కాంగ్రెస్ తో ఉన్న అనుబంధానికి తెగతెంపులు చేసుకోవడం ఖాయమైపోయినట్లేనని పరిశీలకులు అంటున్నారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్‌లో చేరినప్పటి నుండి జీవన్ రెడ్డి కాంగ్రెస్ పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్న సంగతి తెలిసిందే.
పుట్టా మహూష్ ఇచ్చిన వివరణ ఆధారంగా ఆయనపై చర్యలు తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు. మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులోతెలుగుదేశం పార్టీ నాయకుడు, ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి, ఆయన సోదరుడు రితేష్ రెడ్డి సహా ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి విదితమే ఈ వ్యవహారంపై చంద్రబాబు సీరియస్ గా స్పందించి.. పుట్టా మహేష్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే పార్టీ హైకమాండ్ ఆయనకు షోకాజ్ నోటీసు జారీ చేసి ఐదు రోజుల్లోగా వివరణ ఇవ్వాని ఆదేశించింది.
ఆమె పోరాటం ప్రధానంగా తన తండ్రి కేసీఆర్, ప్రధాని మోడీ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిలపైనేనని విస్పష్ట సంకేతాలిచ్చేశాయి. డాడీ అంటే తన తండ్రి కేసీఆర్ అని, చిన్న మోదీ అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని పరోక్షంగా అయినా స్పష్టంగా చెప్పారు.
ఒకప్పుడు అంటే జగన్ అధికారంలో ఉన్న సమయంలో వైసీపీలో కీలక నేతగా, ఆ పార్టీ అధినేత జగన్ కు సన్నిహితుడిగా, ఆయన కుటుంబ బంధువుగా బాలినేని శ్రీనివాసరెడ్డి చక్రం తిప్పారు. అయితే గత ఎన్నికలకు ముందు నుంచే వైసీపీలో బాలినేని పరిస్థితి పొమ్మనలేక పొగపెట్టిన చందంగా మారింది.
తెలంగాణ చరిత్రలోనే గతంలో ఎన్నడూ లేని విధంగా మల్లు భట్టి విక్రమార్క బడ్జెట్ లో 13 వేల 679 కోట్ల రూపాయలు కేటాయించారు. ఇక పోతే మల్లు భట్టి విక్రమార్క మొత్తం 3 లక్షల24 వేల234 కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టారు.
టి.సి. రాజన్ 1967లో స్వతంత్ర పార్టీ తరపున పలమనేరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. రాజకీయాల్లో ఆయన తన సుదీర్ఘ సేవలతో ప్రత్యేక గుర్తింపు పొందారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.