ఇంటిదొంగను పట్టించిన సిసికెమేరా

Publish Date:Jul 16, 2012

Advertisement

ఓ ఇంటిదొంగను సిసికెమేరా పట్టిచ్చింది. దీంతో విశాఖ సెంట్రల్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియాకు రూ.కోటి 48లక్షల 99వేలు రికవరీ అయింది. అలానే బ్యాంకులోనే పని చేస్తున్న ఉద్యోగి దఫదఫాలుగా చేసిన దొంగతనమూ బయటపడిరది. గత నెల 29వ తేదీన బ్యాంకులో కోటి 48లక్షల 99వేల రూపాయలు గల్లంతైందని బ్యాంకు అధికారులు తెలుసుకున్నారు. తెలుసుకున్న వెంటనే ఈ విషయాన్ని పోలీసులకు చేరవేశారు. దీంతో పోలీస్‌కమిషనర్‌ పూర్ణచంద్రరావు రంగంలోకి దిగారు.   పోలీసులు ఉద్యోగుల ద్వారా ముందస్తుగా వివరణలు తీసుకున్నారు. ఆ తరువాత ఎలా గల్లంతయిందని అధికారులను ప్రశ్నించారు. లాకులు యథాతథంగా ఉన్నా ఆ డబ్బు తగ్గిపోయిందని వారు వివరించారు.

 

 

 
దీంతో పోలీసులు బ్యాంకులోని సిబ్బందే ఈ పని చేసి ఉంటారని గుర్తించారు. బ్యాంకులో సిసికెమేరాల పనితీరును పరిశీలిస్తామని బ్యాంకు అధికారుల అనుమతిని తీసుకున్న పోలీసులు సిసికెమేరాఫుటేజీ టేపును పూర్తిగా పరిశీలించారు. విచారణలో భాగంగా పరిశీలిస్తుంటే ఒక ఉద్యోగి అనుమానాస్పందంగా పలుమార్లు వెళుతున్న తీరు బయటపడిరది. సిసికెమేరా ఫుటేజీలో ఒకసారి అతను దొంగతనం చేసినది రికార్డు కూడా అయింది. దీంతో పోలీసులు చొరవ చూపి ఆ బ్యాంకు ఉద్యోగి అభయానంద్‌పాశ్వాస్‌ను విచారించారు. అతనే దొంగతనం చేశాడని నిర్ధారణ అయింది. పలుదఫాలుగా ఈ దొంగతనం జరిగిందని ఆ డబ్బును కూడా వేరే ఉరులో ఉన్న తన మిత్రుడి ఇంట్లో దాచానని పాశ్వాస్‌ ఒప్పుకున్నాడు. వేగంగా రికవరీ చేసి ఈ మిష్టరీ చేధించినందుకు బ్యాంకు సిబ్బంది పోలీసులను అభినందించారు.
 

By
en-us Political News

  
భవనం పైకప్పు సమీపంగా వెళ్తున్న హైటెన్షన్ విద్యుత్ తీగలు తగలడంతో నాలుగో తరగతి చదువుతున్న రెబికా అనే 11 ఏళ్ల బాలిక అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఆమెను కాపాడటానికి ప్రయత్నించిన నందిని అనే విద్యార్థిని తీవ్రంగా గాయపడింది.
అక్వాన్ ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఇప్పటికే ఆ ప్రభావంతో రాష్ట్రంలో వాతావరణంలో మార్పులు కనిపిస్తున్నాయి. ఇక పోతే ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాలతో పాటు పలు ప్రాంతాల్లో దీని ప్రభావం తీవ్రంగా ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. 
సాయంత్రాలు ఒకింత సేదదీరుదామని పార్కులకు వెడదామనుకునే మధ్య తరగతి వేతన జీవులు, కష్ట జీవులకు ఇక పార్కులలో ప్రవేశం భారంగా మారనుంది. జీహెచ్ఎంసీ పరిధిలోని పార్కులలో ప్రవేశ రుసుము ఇక దాదాపు రెట్టింపు కానుంది.
రాష్ట్రంలో ఆన్‌లైన్ ఫార్మసీ వేదికల ద్వారా జరుగుతున్న మందుల విక్రయాలపై తెలంగాణ స్టాండర్డ్స్ అథారిటీ ఫర్ ఫుడ్ అండ్ ఎసెన్షియల్ డ్రగ్స్ (టీజీ సేఫ్)  దాడులు నిర్వహించారు.  ఔషధ విక్రయాలకు సంబంధించిన చట్టపరమైన నిబంధనలను  ఉల్లంఘించినట్లు తేలడంతో, ఆన్‌లైన్ డెలివరీ ప్లాట్‌ఫామ్‌లతో భాగస్వామ్యం కలిగి ఉన్న మొత్తం 23 మెడికల్ షాపుల లైసెన్సులను అధికారులు సస్పెండ్ చేశారు. 
ప్రభుత్వ ఉద్యోగం.. అందులోనూ కీలకమైన టౌన్ ప్లానింగ్ అధికారి బాధ్యతలు.
హైదరాబాద్‌లోని జేఎన్‌టీయూ యూనివర్సిటీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
క్రీడా రంగానికి పెద్దపీట వేస్తూ రాష్ట్రంలో నిర్వహిస్తున్న ఖేలో ఇండియా క్రీడలు యువతలో ఉత్సాహాన్ని నింపుతాయని ప్రధాని రేవంత్ తో అన్నట్లు సమాచారం. ప్రధాని మోదీతో జరిగిన ఈ సమావేశం రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా  ప్రాధాన్యత సంతరించుకుంది.
అలాగే మాజీ సీబీఐ డైరెక్టర్ ఎం. నాగేశ్వరరావు, సజ్జనార్‌పై  బహిరంగంగా పలు ఆరోపణలు, తీవ్ర వ్యాఖ్యలు చేశారనీ,   పోలీసు యూనిఫాం వెనుక దాక్కున్న నేరస్థుడిగా ఆయన సజ్జనార్ ను అభివర్ణించారనీ తన లేఖలో పేర్కొన్న రాజాసింగ్, అటువంటి ఆరోపణలను ఎదుర్కొంటున్న సజ్జనార్ పై చర్యలు తీసుకోకుండా కేవలం బదలీతో సరిపెట్టడమేంటని నిలదీశారు.
అక్వాన్ ప్రభావం ప్రధానంగా తెలంగాణలోని తూర్పు దక్షిణ జిల్లాలపై అధికంగా ఉంటుంది. ఈ నెల 20 నుంచి 22 వరకూ అక్వాన్ ప్రభావంతో తెలంగాణలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో ప్రభుత్వం అలర్ట్ అయ్యింది.  
ఐదు తులాల బంగారం ఆశ.. రెండున్నర తులాల గొలుసు స్వాహా.!
తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చే పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
భారత రాజకీయాల్లో దేశంలోనే అత్యంత సంపన్నుల ఎదుగుదలపై, ముఖ్యంగా పారిశ్రామిక దిగ్గజం గౌతమ్ అదానీ అసాధారణ ప్రగతిపై లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం మరో భారీ సంక్షేమ కానుకను అందించేందుకు సిద్ధమైంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.