Publish Date:Feb 10, 2026
సినీ నిర్మాత బండ్ల గణేష్ చేపట్టిన విజయ సంకల్ప పాదయాత్ర తిరుపతికి చేరింది. ఆయనకు స్థానిక ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం అలిపిరి పాదాల మండపం వద్ద కొబ్బరికాయలు కొట్టి మొక్కు చెల్లించుకున్నారు. ఆ తర్వాత కాలినడకన తిరుమలకు బయలుదేరారు. జనవరి 19న షాద్ నగర్ లోని తన నివాసం నుంచి నుంచి పాదయాత్ర ప్రారంభించిన బండ్ల గణేష్.. 23 రోజుల్లో 520 కిలోమీటర్లు నడిచివచ్చారు. శ్రీవారి ఆశీస్సులతో తన యాత్ర విజయవంతమైందని ఆయన తెలిపారు.
రేపు (బుధవారం) స్వామివారిని దర్శించుకోనున్నట్లు తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అరెస్టయి రాజమండ్రి జైల్లో ఉన్న ప్రస్తుత సీఎం చంద్రబాబు క్షేమంగా విడుదల కావాలని బండ్ల గణేష్ తిరుమల శ్రీవారిని కోరుకున్నారు. ఆయన కోరిక మేరకు చంద్రబాబు జైలు నుంచి విడుదల కావడమే కాకుండా, మళ్లీ ముఖ్యమంత్రి కూడా అయ్యారు.
దీంతో, ఆయన శ్రీవారికి తన మొక్కు చెల్లించుకున్నారు. తన కోరిక నెరవేరడంతో శ్రీవేంకటేశ్వర స్వామికి మొక్కులు చెల్లించుకున్నానని చెప్పారు. ఇప్పుడు తనకు ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. 23 రోజుల పాటు 520 కిలోమీటర్ల మేర సాగిన బండ్ల గణేష్ పాదయాత్ర విజయవంతం అయింది. మరోవైపు తిరుమలలోని క్యాంప్ కార్యాలయంలో బండ్ల గణేష్‌ని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడును సత్కరించారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/bandla-ganesh-36-213811.html
హైదరాబాద్ పాతబస్తీలో జరిగిన ఘటన ఉద్రిక్తతకు దారి తీసింది.
ఆంధ్రప్రదేశ్‌లో నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు సాధించిన ఘటన వెలుగులోకి రావడంతో విద్యుత్ శాఖలో కలకలం రేగింది.
అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ కుటుంబం లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ సంచలన ఆరోపణలు చేసింది.
ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు.. ఇంజనీరింగ్ విద్యార్థుల భవిష్యత్తుపై నీలి నీడలు- ఇదీ ప్రస్తుతం ఏపీ అంతటా ఉన్న ఇంజినీరింగ్ స్టూడెంట్స్ నోటి వెంట వినిపిస్తోన్న మాట.
యుద్దం ముంగిపునకు ఇరాన్‌పై వత్తిడి తెచ్చేలా అమెరికా పలు షరతులు విధిస్తూ డెడ్ లైన్ విధించింది.
అమరావతికి తాము కట్టుబడి లేమంటూ బొత్స చేసిన వ్యాఖ్యల వెనక సారమేంటి? అయితే వైసీపీ తిరిగి మూడు రాజధానులకే కట్టుబడి ఉన్నట్టా?
ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన పాకిస్థాన్ ప్రజలపై మోయలేని భారం పడుతోంది.
పశ్చిమాసియాలో నెలకొన్న తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల కారణంగా అంతర్జాతీయ మార్కెట్ లో చమురు ధరలు విపరీతంగా పెరగడంతో శ్రీలంకకు మళ్లీ ఆర్థిక కష్టాలు చుట్టుముడుతున్నాయి.
రఘురామకృష్ణం రాజుపై రాజద్రోహం కేసు ఎవరు పెట్టమన్నదెవరు? రాతపూర్వకంగా ఆదేశాలు ఉన్నాయా? ఉంటే ఎవరిచ్చారు? సాక్ష్యాలు ఫేకా అన్న విషయం పరిశీలించారా?
ఉద్రిక్తతలు కొనసాగుతున్నప్పటికీ, హోర్ముజ్ జలసంధి గుండా భారత్ స్థిరమైన సముద్ర రవాణాను కొనసాగించింది. అమెరికా-ఇజ్రాయెల్ ఇరాన్‌పై జరిపిన దాడులు పూర్తిస్థాయి యుద్ధానికి దారితీసిన ఫిబ్రవరి 28 నుండి, భారత నౌకలకు చెందిన కనీసం ఎనిమిది నౌకలు ఈ కీలకమైన జలసంధి గుండా ప్రయాణించాయి.
తాజా నిబంధనల ప్రకారం, వాహనదారులు టోల్ రుసుమును ఫాస్టాగ్ లేదా యూపీఐ ద్వారా మాత్రమే చెల్లించాలి. ఒకవేళ వాహనానికి ఫాస్టాగ్ లేకపోతే, యూపీఐ ద్వారా సాధారణ రుసుము కంటే 1.25 రెట్లు అధికంగా చెల్లించాల్సి వస్తుంది.
చరిత్రలో అమెరికాకు తగిలిన అతిపెద్ద మిలిటరీ సెట్ బ్యాక్ ను గుర్తు చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. చరిత్ర పునరావృతమవుతుంది అని పేర్కొంటూ.. 1980లో అమెరికా ఎదుర్కొన్న ఘోర పరాజయాన్ని ఆ పోస్టులో ఇరాన్ పేర్కొంది.
ఇటీవల ఇరాన్ ప్రభుత్వం దాదాపు 18 అమెరికన్ కంపెనీలను ఉగ్రవాద సంస్థలుగా పేర్కొంటూ విడుదల చేసిన జాబితాలో డెల్‌తో పాటు మెటా, టెస్లా, బోయింగ్, ఇంటెల్ వంటి దిగ్గజ సంస్థలు ఉన్నాయి. ఈ సంస్థలు అమెరికా, ఇజ్రాయెల్‌కు గూఢచారి సంస్థలుగా వ్యవహరిస్తున్నాయని, ఇరాన్ నాయకులపై దాడులకు సహకరిస్తున్నాయని ఐఆర్‌జీసీ ఆరోపించింది.