ఏపీ మద్యం కుంభకోణం.. కేసు తీవ్రత తేటతెల్లం చేసిన సుప్రీం వ్యాఖ్యలు!

Publish Date:Feb 10, 2026

Advertisement

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసు ఎంత తీవ్రమైనదో, ఆ కేసులో ఎంత బలం ఉందో దేశ సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యలు తేటతెల్లం చేస్తున్నాయి. ఈ కేసులో బెయిలు కోసం దరఖాస్తు చేసుకున్న ఏ1 రాజ్ కేశిరెడ్డి బెయిల్ పిటిషన్ ను కొట్టివేస్తూ.. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రకాంత్ నేతృత్వంలోని త్రిసభ్య దేవస్థానం చేసిన వ్యాఖ్యలు ఈ కేసులోని సీరియస్ నెస్ ను కళ్లకు కట్టాయి. అసలు రాజ్ కేశిరెడ్డి బెయిల్ పిటిషన్ విచారణ ప్రారంభం కాగానే.. సుప్రీం ధర్మాసనం ఈ పిటిషన్ లో తాము జోక్యం చేసుకోవడానికి ఏం లేదని కుండబద్దలు కొట్టింది. విచారణ జరపడానికే సుముఖత వ్యక్తం చేయలేదు.  

రాష్ట్ర ఖజానాకు వేల కోట్ల రూపాయల గండి కొట్టిన ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణంలో ప్రధాన సూత్రధారిగా రాజ్ కేసిరెడ్డిని సుప్రీంకోర్టు అభివర్ణించింది. జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఈ కేసు తీవ్రతను పరిగణనలోకి తీసుకుని, బెయిల్ ఇచ్చేందుకు ససేమిరా అంది. పిటిషన్‌లో జోక్యం చేసుకోవడానికి  ఆస్కారం లేదని తేల్చి చెప్పడం ద్వారా.. ఈ కేసులో సాక్ష్యాధారాలు ఎంత బలంగా ఉన్నాయో కోర్టు పరోక్షంగా వెల్లడించింది.  ఆర్థిక నేరాలలో నిందితులకు ఊరటనివ్వడం సరైనది కాదని కోర్టు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దర్యాప్తు సంస్థలకు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చాయి. మద్యం కుంభకోణంలో రాజ్ కేసీరెడ్డి కేవలం ఒక ముసుగు మాత్రమేనని, దీని వెనుక అసలు కథానాయకుడు ఉన్నారన్నది తేల్చే దిశగా దర్యాప్తు జోరందుకోనుందని దేశ సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యల తరువాత పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. 

పారదర్శకతను పక్కనపెట్టి, డిజిటల్ చెల్లింపులను కాదని, కేవలం నగదు రూపంలోనే మద్యం విక్రయాలు జరిపించి వేల కోట్ల రూపాయలను దారి మళ్లించిన ఈ వ్యవస్థ వెనుక పెద్దల హస్తం ఉందని మొదటి నుండి ఆరోపణలు వస్తున్నాయి.  ఇప్పుడు సుప్రీంకోర్టు రాజ్ కేసీరెడ్డిని ప్రధాన సూత్రధారి గా పేర్కొనడంతో, ఇక దర్యాప్తు సంస్థలు  ఈ కుంభకోణంలో   చక్రం తిప్పిన   బాస్ వైపు మళ్లే అవకాశాలు మెండుగా ఉన్నాయంటున్నారు. మద్యం సరఫరా , డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్‌లో జరిగిన భారీ అవకత వకలపై విచారణ సంస్థలు ఇప్పటికే   సాక్ష్యాధారాలను సేకరించాయి.

సుప్రీంకోర్టు వ్యాఖ్యలు ఈ దర్యాప్తుకు మరింత చట్టబద్ధమైన బలాన్ని చేకూర్చాయి. ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి గండి కొట్టడమే కాకుండా, కల్తీ మద్యం ద్వారా ప్రజల ప్రాణాలతో ఆడుకున్న ఈ వ్యవస్థపై మరింత లోతైన విచారణ ఆవశ్యకతను సుప్రీం కోర్టు తన వ్యాఖ్యల ద్వారా ఎత్తి చూపిందని భావిస్తున్నారు. 

ఈ కేసులో రాజ్ కేసీరెడ్డి బెయిల్ నిరాకరణ అనేది కేవలం ఆరంభం మాత్రమేనని, అసలు దోషులు బయటకు వచ్చే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని న్యాయ నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా, ఈ నిర్ణయం కుంభకోణంతో సంబంధం ఉన్న ఇతర నిందితులపై కూడా తీవ్ర ప్రభావం చూపనుంది. కింగ్‌పిన్‌కే బెయిల్ దక్కని పరిస్థితుల్లో, మిగిలిన పాత్రధారులు కూడా కటకటాల వెనక్కి వెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది. 

By
en-us Political News

  
జాబిల్లి యాత్రలో ఐఫోన్ల సందడి.. అంతరిక్షంలో ఆపిల్ స్మార్ట్‌ఫోన్ల ప్రయోగం సక్సెస్!
అస్సాం ముఖ్యమంత్రి హిమాంత బిస్వా శర్మ భార్యపై కాంగ్రెస్ నేత పవన్ ఖేరా చేసిన వివాదాస్పద వ్యాఖ్యల
రేణుక, మంద కృష్ణ ఇద్దరూ ఫైర్ బ్రాండ్లు కులం మెచ్చిన సామాజిక వీరులు
సోషల్ మీడియా వేదికలో అభ్యంతరకరంగా, దూషణాత్మకంగా వ్యాఖ్యలు పోస్టు చేసిన వ్యక్తిని సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు.
హైదరాబాద్ నగరంలో బుధవారం సాయంత్రం జలవిహార్ వద్ద ఉన్న నీటి సరఫరా ఆర్వో ప్లాంట్‌లో అకస్మాత్తుగా పేలుడు సంభవించింది.
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఉద్యోగులకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభవార్త అందించింది.
మాములుగా ద‌క్షిణాదిలో అత్యంత సంప‌న్న పొలిటీషియ‌న్ల‌లో విజ‌య్ కూడా ఒక‌రు.
20వ శతాబ్దం మధ్య నుంచి 21వ శతాబ్దం వరకు ప్రపంచ రాజకీయాల్లో ఒక నిరంతర ప్రభావశక్తిగా నిలిచింది అమెరికా.
ఇప్పుడు అమరావతికి చట్టబద్ధత విషయంలో కూడా ఫిల్మ్ ఇండస్ట్రీ మౌనంగానే ఉండిపోయి ప్రేక్షకపాత్ర పోషిస్తున్నది. ఎందుకంటే.. అమరావతిని రాజధానిగా జగన్ వ్యతిరేకిస్తున్నారు కనుక. సపోజ్ ఫర్ సపోజ్ రేపు ఆయన అధికారంలోకి వస్తే అమరావతికి మద్దతుగా మాట్లాడిన వారిపై ప్రతీకార చర్యలకు దిగుతారన్న భయమే అందుకు కారణంగా కనిపిస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కేరళ నుంచి కర్ణాటకకు వచ్చి ట్రెక్కింగ్ చేస్తూ తప్పిపోయిన జీఎస్ శరణ్య మిస్టరీలో నిజమెంత?
కృత్రిమ మేధ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన ఓపెన్ ఏఐ సంస్థ ఇప్పుడు ఉద్యోగ విధానాల్లోనూ సంచలన మార్పులకు తెరలేపుతోంది.
ఆర్‌ఆర్ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీకి సంబంధించి ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ఏపీలో వివిధ ప్రాంతాల్లో ఆర్ధిక కార్యకలాపాలకు ఊతమిచ్చేలా జాతీయ, రాష్ట్ర రహదారుల నిర్మాణం జరగాలని సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.