ఓటర్ కార్డులో సునీత భర్త పేరు వేరే ఉంది...బండి సంజయ్ షాకింగ్ కామెంట్స్
Publish Date:Nov 9, 2025
Advertisement
బీజేపీ అంటేనే హిందువు... హిందువు అంటేనే బీజేపీ అని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. జూబ్లిహిల్స్ ఎన్నికల్లో పాదయాత్ర చేసిన అనంతరం బండి సంజయ్ మాట్లాడుతు 20 శాతం ముస్లింల ప్రయోజనాల కోసమే కాంగ్రెస్, బీఆర్ఎస్లు పనిచేస్తున్నాయని తెలిపారు. హిందువుల ఓట్లు అవసరం లేదన్నట్లుగా సీఎం రేవంత్రెడ్డి మ మాట్లాడుతున్నారంటే ఏమనాలి అని బండి సంజయ్ ప్రశ్నించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎన్నడూ డ్రగ్స్ తీసుకోలేదని కుటుంబ సమేతంగా భాగ్యలక్ష్మీ అమ్మవారి వద్ద తడిబట్టలతో ప్రమాణం చేసే దమ్ముందా అని ప్రశ్నించారు. అయ్య పేరు చెప్పి గెలిచిన బతుకు కేటీఆర్ ది.... అయ్య లేకుంటే ఆయనను కుక్కలు కూడా దేకవ్ అని కేంద్ర మంత్రి విమర్శించారు. 2014కు ముందే తెలంగాణ కోసం, హిందుత్వం కోసం పోరాడితే 60 కేసులు పెట్టారు. 7సార్లు జైలుకు పోయి వచ్చిన... నీకు నాతో పోలికా? అని అన్నారు. మాగంటి గోపీనాథ్ జూన్ 8న చనిపోయారని చెప్పారు...అదేనెల 25న గోపీనాథ్ తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇదిగో ఆధారాలు... కంప్లయింట్ కాపీ పంపిస్తున్నా విచారణ చేసి చర్యలు తీసుకోవాలని సంజయ్ తెలిపారు. గోపీనాథ్ కొడుకును ఇండియాకు రాకుండా మాజీ మంత్రి పువ్వాడ అజయ్ బెదిరించిన మాట వాస్తవని ప్రశ్నించారు కేంద్రమంత్రి. వాటికి సంబంధించిన ఆడియో క్లిప్పింగ్ ను గోపీనాథ్ కుటుంబ సభ్యులు చూపించారని తెలిపారు. మాగంటి సునీత తప్పుడు ఆధారాలు చూపించి ఫ్యామిలీ సర్టిఫికేట్ తెచ్చుకుందని ఆయన తెలిపారు. విచారణలో ఆమె తప్పుడు సమాచారమిచ్చినట్లు తేలడంతో ప్రభుత్వం ఫ్యామిలీ సర్టిఫికేట్ ను రద్దు చేసిందని బండి సంజయ్ అన్నారు. ఒక ఓటర్ కార్డులో సునీత భర్త పేరు సునీత మనోహర్ అని ఉందని..ఇంకో ఓటర్ కార్డులో సునీత భర్త పేరు మాగంటి గోపీనాథ్ అని ఉందని సంజయ్ ఆరోపించారు. ఇదిగో ఆ ఓటర్ కార్డులను మీకు పంపిస్తున్నా...విచారణ జరపించాలని రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. 2023 ఎన్నికల అఫిడవిట్ లో మాగంటి సునీతకు చదువుకోలేదని రాసిచ్చారని..2025లో ఎన్నికల అఫిడవిట్ లో టెన్త్ వరకు చదువుకున్నారని రాసిచ్చారని ఆయన తెలిపారు వీటిపై సమగ్ర విచారణ చేపట్టాలని తెలిపారు. గోపీనాథ్ ఆస్తులపై సునీతతో కలిసి కేటీఆర్ కుట్ర చేస్తున్నారని సంజయ్ ఆరోపించారు. కన్నతల్లిని కూడా గోపీనాథ్ ను చూడనీయకుండా ఏఐజీ ఆసుపత్రి యాజమాన్యంతో నోటీసులిప్పించారని ఆయన అన్నారు. గోపీనాథ్ పై బీఆర్ఎస్ కు ప్రేమ లేనేలేదు...గోపీనాథ్ ఆస్తులను కాజేసేందుకు బీఆర్ఎస్ కుట్ర చేస్తోందని కేంద్రమంత్రి విమర్శించారు. గోపీనాథ్ సుప్తచేతనావస్థలో ఏఐజీ ఆసుపత్రిలో ఉంటే ఆయన తల్లిని రానీయ్యలే....కానీ అదే ఆసుపత్రిలో 9వ ఫ్లోర్ లో కేటీఆర్, ఆయన సతీమణి తిష్టవేసి ఆస్తులను కాజేసే కుట్రకు తెరదీసింది నిజం కాదాని బండి సంజయ్ అన్నారు. బీజేపీకి ఓటేసి దీపక్ రెడ్డిని గెలిపిస్తే...కేంద్రంతో మాట్లాడి జూబ్లిహిల్స్ అభివృద్ధి కోసం నిధులు తీసుకొస్తాని బండి సంజయ్ తెలిపారు.
http://www.teluguone.com/news/content/bandi-sanjay-39-209229.html





