అరటి ధరలకు రెక్కలు - రైతులు ఫుల్ హ్యాపీ

Publish Date:Feb 20, 2026

Advertisement

అరటి ధరలకు అమాంతం రెక్కలొచ్చాయి. పాతాళానికి పడిపోయిన అరటి ధరలు ఇప్పుడు ఆకాశాన్నంటుతున్నాయి. క్వింటా ధర రూ.25 వేలకు చేరడంతో అన్నదాతలు ఫుల్ హ్యాపీగా ఉన్నారు.  అరటి సాగు ఎక్కువగా ఉంటే అనంతపురం జిల్లాలో 7,250 ఎకరాల్లో అరటి సాగుచేస్తున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. పంట బాగా పండితే జిల్లా వ్యాప్తంగా 1,88,500 టన్నులు దిగుబడి వచ్చే అవకాశం ఉంది.

ధరలు ఇలాగే కొనసాగితే జిల్లా రైతులకు రూ.377 కోట్ల ఆదాయం వచ్చే అవకాశం ఉంది. అరటి క్వింటా ధర నెలన్నర క్రితం వరకు రూ.2 వేలు పలికింది. దీంతో అరటి రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఆ ధరకు విక్రయిస్తే పంట కోత కూలీల ఖర్చులు కూడా రావని రైతులను గెలలను చెట్లపైనే వదిలేశారు. ఇంకొందరు వాటిని కోసి పశువులకు మేతగా వేశారు. ఇలా పెట్టుబడులు మొత్తంగా కోల్పోయి జిల్లాలో కోట్ల రూపాయల నష్టాలను మూటగట్టుకున్నారు.

అప్పట్లో అరటి రైతు కష్టాలపై తీవ్ర చర్చ సాగింది. పాతాళానికి పడిపోయిన అరటి ధరలు చిన్నగా పెరుగుతూ వచ్చాయి. ఇతర రాష్ట్రాలు, దేశాల్లో అరటికి డిమాండ్‌ పెరగడంతో రోజురోజుకీ ధరలు పెరుగుతున్నాయి. ప్రస్తుతం టన్ను రూ.25 వేల వరకు పలుకుతోంది. ఎకరానికి రూ.లక్ష వరకు పెట్టుబడులు పెడుతున్నారు. సాగు ఖర్చులు పోను రూ.లక్షల   ఆదాయం వచ్చే అవకాశం ఉందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో పండే అరటిని ఢిల్లీ, కోల్‌కతా, కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నారు.

By
en-us Political News

  
సుప్రీంకోర్టు అంతర్గత విచారణ జరిపి, ఆయనపై ఉన్న అవినీతి ఆరోపణల్లో నిజ‌ముందని తేల్చింది. దీంతో ఆయనను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ 146 మంది ఎంపీలు లోక్‌సభలో సంతకాలు చేశారు. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఈ వ్యవహారంపై విచారణకు ముగ్గురు సభ్యుల కమిటీని కూడా నియమించారు.
వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూపుల ద్వారా కస్టమర్లను సంప్రదించి ఆర్డర్లు స్వీకరించేవారని పోలీసులు తెలిపారు. చెల్లింపులు ఫోన్ పే ద్వారా తీసుకుని, సరుకును రాపిడో, పోర్టల్ డెలివరీ సేవలతో పంపిణీ చేస్తున్నట్లు విచారణలో తేలింది.
టాస్ కోల్పోయి ముందుగా బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ సన్ రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 219 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఓపెనర్ అభిషేక్ శర్మ (28 బంతుల్లో 74) విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. అభిషేక్ ఇన్నింగ్స్ లో 5 ఫోర్లు, 8 భారీ సిక్సర్లు ఉన్నాయి. మరో ఓపెనర్ ట్రావిస్ హెడ్ 38 పరుగులు చేశాడు. ఇద్దరూ కలిసి తొలి వికెట్‌కు 120 పరుగులు జోడించారు.
ఇరాన్ నుండి పాకిస్థాన్ మీదుగా భారత్‌కు సహజ వాయువును అందించే లక్ష్యంతో ఈ ప్రాజెక్ట్‌ను ప్రతిపాదించారు. ఈ ప్రాజెక్టును పది బిలియన్ డాలర్ల వ్యయంతో 2,700 కిలోమీటర్ల పొడవుతో ఈ పైల్ లైన్ చేపట్టాలని భావించారు.
తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషల్లో తన మీడియా సంస్థ కార్యకలాపాలు సాగిస్తుందన్న విజయసాయి.. తన మీడియా ఏ రాజకీయ పార్టీకి కొమ్ముకాయదనీ, ప్రజల సమస్యలపైనే గళమెత్తుతుందనీ చెబుతున్నారాయన. రైతులు, మహిళలు, యువత, అణగారిన వర్గాల గొంతుకగా తన మీడియా సంస్థ నిజాన్ని నిర్భయంగా వెల్లడిస్తుందని చెప్పారు విజయసాయి.
అంతర్జాతీయ వాణిజ్య మార్గాల్లో నౌకల రాకపోకలకు ఆటంకాలు కలగడం పట్ల జైశంకర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సముద్ర జలాల్లో స్వేచ్ఛాయుత రవాణా అనేది ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు అత్యంత కీలకమన్న ఆయన.. దీనిని అడ్డుకోవడం మంచిది కాదన్నారు.
ముకుల్ ఈ స్థాయికి చేరడం వెనుక అతని తండ్రి దలీప్ చౌదరి అలుపెరుగని పోరాటం ఉంది. రాజస్థాన్‌లోని ఝున్‌ఝును జిల్లాకు చెందిన దలీప్, తన కొడుకును ఎలాగైనా క్రికెటర్‌గా చూడాలని పెళ్లికి ముందే నిశ్చయించుకున్నారు. ఇందుకోసం ఆయన ఎన్నో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నారు. తనకున్న ఒకే ఒక్క ఇంటిని కూడా అమ్మేసి ముకుల్‌ను శిక్షణలో చేర్పించారు.
తమ డబ్బు గురించి అడగడంతో ఒత్తిడి, బెదిరింపులు వచ్చాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆక్సిడెంట్ చేసి చంపిస్తాం అంటూ మంగ్లీ అనుచరులు బెదిరించారని సుబ్బారావు ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.
కెన్యా నుంచి వచ్చిన 24 మంది మహిళలు సాధారణ ప్రయాణికుల్లా విమానం దిగారు. కస్టమ్స్ తనిఖీలను తప్పించుకోవాలనే ఉద్దేశంతో బురఖాలు ధరించి బంగారాన్ని బ్యాగుల్లో దాచారు. అనుమానం రాకుండా నెమ్మదిగా బయటకు వెళ్లేందుకు ప్రయత్నించారు.
భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవానికి దేశ ప్రధాని నరేంద్ర మోడీని ఆహ్వానించి ఈ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఆయన చేతుల మీదుగా జరపాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఇందుకోసం ఇప్పటికే ప్రధానమంత్రి కార్యాలయానికి అధికారిక ఆహ్వానం పంపినట్లు సమాచారం.
యుద్ధం సృష్టించిన మానవ విషాదాన్ని ప్రపంచానికి చాటిచెప్పేలా ఇరాన్ ప్రతినిధి బృందం యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన చిన్నారులకు చెందిన రక్తసిక్తమైన స్కూల్ బ్యాగులు, బూట్లు, వారి ఛాయాచిత్రాలను తమ వెంట తీసుకువచ్చింది.
గడిచిన ఆర్థిక సంవత్సరంలో అంటే 2025 ఏప్రిల్ నుంచి 2026 మార్చి వరకు మొత్తం 13,95,43,231 లడ్డూలను భక్తులు కొనుగోలు చేశారు. అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఇది భారీ పెరుగుదల. 2024-25 కాలంలో 12,18,53,535 లడ్డూలు అమ్ముడవగా, కేవలం ఒక్క ఏడాది వ్యవధిలోనే అదనంగా సుమారు 1.76 కోట్ల లడ్డూల విక్రయాలు పెరగడం గమనార్హం.
సికింద్రాబాద్ నుండి విశాఖపట్నం వెళ్లే వందే భారత్ రైలు ఆక్యుపెన్సీ రేటు 100 శాతానికి పైగా నమోదవుతోంది. కొన్ని సందర్భాల్లో వెయిటింగ్ లిస్ట్ కూడా భారీగా ఉంటోంది. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో నడుస్తున్న ఇతర రైళ్లతో పోలిస్తే, సికిందరాబాద్, విశాఖ మార్గంలో నడిచే వందే భారత్ లో ప్రయాణానికే ప్రయాణీకులు మొగ్గు చూపుతున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.