అంబటి రాంబాబుకు బెయిల్.. కానీ జైల్లోనే.. ఎందుకంటే?
Publish Date:Feb 10, 2026
Advertisement
వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబుకు బెయిలు లభించింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబుపై అసభ్య, అనుచిత పదాలతో దూషించిన కేసులో అరెస్టైన అంబటి రాంబాబుకు సోమవారం (ఫిబ్రవరి 9) బెయిలు లభించింది. అంబటిని పోలీసు కస్టడీకి అప్పగించాలన్న పిటిషన్ ను గుంటూరు స్పెషల్ మొబైల్ కోర్టు తోసిపుచ్చింది. ఇక పోతే మరో కేసులో అంబటి రాంబాబుకు కోర్టు ఈ నెల 22 వరకూ రిమాండ్ విధించింది. పీపీపీ మోడల్ లో మెడికల్ కాలేజీల నిర్వహించాలన్న ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా గతంలో అంబటి రాంబాబు చేపట్టిన ర్యాలీ సందర్భంగా ఆయన పోలీసుల విధులకు ఆటంకం కలిగించారంటూ నమోదైన కేసులో అంబటి రాంబాబుకు కోర్టు రెండు వారాల రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు ఆయనను గుంటూరు నుంచి రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించారు.
http://www.teluguone.com/news/content/bail-to-ambati-rambabu-36-213793.html





