సీఎస్కేపై అభిషేక్ శర్మ సరికొత్త రికార్డు
Publish Date:Apr 19, 2026
Advertisement
ఐపీఎల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ అభిషేక్ శర్మ అద్భుతమైన ఇన్నింగ్స్‌తో మరో రికార్డును బ్రేక్ చేశాడు. శనివారం చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసి అరుదైన ఘనతను చేరుకున్నాడు. గతంలో తను నెలకొల్పిన రికార్డును సమం చేశాడు. రెండు సార్లు ఆ ఘనత సాధించిన బ్యాటర్‌గా నిలిచాడు. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు తరఫున వేగవంతమైన హాఫ్ సెంచరీ (15 బంతుల్లో) చేసిన అభిషేక్.. గతంలో తాను నెలకొల్పిన రికార్డును తాజాగా తనే సమం చేశాడు. ఇది ఐపీఎల్ చరిత్రలోనే మూడో వేగవంతమైన అర్ధశతకం కూడా కావడం విశేషం. అభిషేక్ కంటే ముందు యశస్వి జైస్వాల్ (13 బంతుల్లో), కేఎల్ రాహుల్ (14 బంతుల్లో), ప్యాట్ కమిన్స్ (14 బంతుల్లో), రొమారియో షెపర్డ్ (14 బంతుల్లో) వేగవంతమైన హాఫ్ సెంచరీలు చేసిన ఆటగాళ్లుగా ఉన్నారు. అభిషేక్ శర్మ తాజా ఐపీఎల్ సీజన్లో ఇప్పటివరకు పెద్దగా రాణించలేకపోయాడు . అయితే తాజా ఇన్నింగ్స్‌తో సూపర్ ఫామ్‌లోకి వచ్చాడు. అభిషేక్ ఇన్నింగ్స్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు మంచి ఆరంభం లభించింది. మ్యాచ్‌పై పూర్తి ఆధిపత్యం సాధించేందుకు ఇది కీలకంగా మారింది. పది పరుగుల తేడాతో సీఎస్కేపై గెలుపొందింది.
http://www.teluguone.com/news/content/abhishek-sharmas-new-record-36-217739.html





