బీటెక్ విద్యార్థి యవన్ హత్య కేసులో 10 మంది నిందితులు అరెస్ట్

Publish Date:May 11, 2026

Advertisement

 

హైదరాబాద్ నగరంలో సంచలనం సృష్టించిన బీటెక్ విద్యార్థి బొమ్మన యవన్ అలియాస్ అఖిల్ (21) హత్య కేసును చిలకలగూడ పోలీసులు విజయవంతంగా ఛేదించారు. పాత కక్షలు, ప్రేమ వ్యవహారం నేపథ్యంలో పక్కా పథకం ప్రకారం ఈ దారుణానికి పాల్పడిన 10 మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. బీటెక్ చదువుతున్న యవన్ అనే యువకుడు చిలకలగూడకు చెందిన  చంద్రిక చాలా కాలంగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకు న్నారు.  ఈ విషయాన్ని యువతి కుటుంబ సభ్యులు అంగీకరించ లేదు.

అదే సమయంలో చంద్రికను వివాహం చేసుకోవాలని భావించిన సాయి కిరణ్ (A1) యవన్‌పై తీవ్ర ద్వేషం పెంచుకున్నాడు. హత్యకు 4–5 రోజుల ముందే మేడిబావిలో సమావేశమై యవన్‌ను హతమార్చేందుకు కుట్ర పన్నారు. చేశారు. ఈ నేపథ్యంలోనే పథకం ప్రకారం యవన్ ను చిలకలు కూడా ప్రాంతానికి వచ్చే విధంగా చేశారు...చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని మేడిబావి, ఇందిరా నగర్ కాలనీలో మే 7 రాత్రి సుమారు 9:45 గంటల సమయంలో యవన్ తన స్నేహితులతో కలిసి ఫోన్‌లో క్రికెట్ చూస్తున్న సమయంలో అక్కడికి పదిమంది నిందితులు వచ్చారు.

యవన్‌పై ఒక్కసారిగా నిందితులు మారణాయుధాలతో మెడ మరియు శరీరంలోని కీలక భాగాలపైవిచక్షణారహితంగా దాడి చేశారు. అతడు మృతి చెందినట్టు నిర్ధారించుకున్న తర్వాత అక్కడి నుంచి పరారయ్యారు. యవన్ స్నేహితులు వెంటనే అతన్ని స్థానిక హాస్పిటల్ కి తరలించారు. కానీ అప్పటికే మృతి చెందినట్లుగా వైద్యులు నిర్ధారించారు మృతుడి తండ్రి శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. 

ఈ కేసులో రౌడీ షీటర్ అల్లబోయిన సాయి కిరణ్ (27), రాజం పరమేష్ కుమార్ యాదవ్ (19), రాజం వంశీ కృష్ణ (19),రాజం మనీష్ (21),శ్రీగిరి రాహుల్ (22),కుచుల శివ నందన్ యాదవ్ (20),రాజం నరసింహ యాదవ్ (50),రాజం శ్రీశైలం యాదవ్ (48), రాజం మల్లేష్ యాదవ్ (48), బాలుడు (మైనర్) మొత్తం పది మందిని అరెస్టు చేసి వారి వద్ద నుంచి హత్యకు ఉపయో గించిన కత్తి,రక్తపు మరకలు ఉన్న దుస్తులు,నేరానికి వాడిన ఎలక్ట్రిక్ స్కూటర్,సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని సికింద్రాబాద్ జోన్ డీసీపీ రక్షిత కృష్ణమూర్తి వెల్లడించారు.

చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే వారిపై కఠిన చర్యలు తప్పవు..సోషల్ మీడియా ద్వారా రెచ్చగొట్టే సందేశాలు పంపేవారిపై నిఘా పెంచాం‌.నిందితులకు కోర్టు ద్వారా కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటాం“పౌరుల భద్రత విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడము. శాంతిభద్రతలకు భంగం కలిగించే వారిపై ఉక్కుపాదం మోపుతాం” అని డీసీపీ రక్షిత కృష్ణమూర్తి స్పష్టం వ్యక్తం చేశారు.

By
en-us Political News

  
మంత్రి నారా లోకేష్ రాయలసీమ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారు. ముఖ్యంగా అనంతపురం జిల్లా పుట్టపర్తిలో ఒక భారీ ప్రాజెక్టును పట్టాలెక్కించేందుకు ఆయన సిద్ధమయ్యారు.
దేశవ్యాప్తంగా లక్షలాది మంది వైద్య విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న నీట్-యూజీ పరీక్షా పత్రం లీకేజీ వ్యవహారం ఇప్పుడు కీలక మలుపు తిరిగింది.
తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది.
హైదరాబాద్ నగరాన్ని 2023లో కుదిపేసిన సనత్‌నగర్ మైనర్ బాలుడి హత్య కేసులో కూకట్‌పల్లి కోర్టు సంచలన తీర్పు వెలువరించింది.
బండి సంజయ్ తన కుమారుడు భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసు నేపథ్యంలో కీలక వ్యాఖ్యలు చేశారు.
హైదరాబాద్ నగరంలోని గోషామహల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన భారీ ఇళ్ల దొంగతనం కేసును పోలీసులు కేవలం 24 గంటల్లోనే ఛేదించారు.
బీజేపీ నేత బండి సంజయ్ కుమార్ కుమారుడు బండి సాయి భగీరథ్‌కు పోలీసులు నోటీసులు జారీ చేశారు.
దేశ ఆర్ధిక భద్రత విషయంలో కాలం మారుతున్నా కేంద్ర నిర్ణయాలు ఒకేలా ఉంటుండటం విశేషం.
అస్సాం ముఖ్యమంత్రిగా హిమంత బిశ్వ శర్మ వరుసగా రెండోసారి ప్రమాణస్వీకారం చేశారు.
తెలంగాణలో సొంతింటి లేని వారికి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు.
నటుడిగా కోట్లాది అభిమానులను సంపాదించిన విజయ్‌, ఇప్పుడు ముఖ్యమంత్రిగా కుర్చీలో కూర్చున్న తర్వాత అదే క్రేజ్‌ రాజకీయాల్లో కూడా స్పష్టంగా కనిపిస్తోంది.
రైల్ రోకో కేసులో తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) చీఫ్ కల్వకుంట్ల కవితకు కోర్టు సమన్లు జారీ చేసింది.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న వైద్య విద్యా ప్రవేశ పరీక్ష నీట్-యూజీ పేపర్ లీకేజీ వ్యవహారంపై లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.