అంతా అవినాష్ స్వయం కృతం!
Publish Date:May 22, 2023
Advertisement
వైయస్ వివేకా హత్య కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి.. తన తల్లీ శ్రీలక్ష్మీకి తీవ్ర అనారోగ్యమంటూ... మే 19వ తేదీన కర్నూలులోని విశ్వభారతి ఆసుపత్రిలో చేర్పించారు. అయితే అదే ఆసుపత్రిలో తల్లితో పాటే వైయస్ అవినాష్ రెడ్డి కూడా ఉండడంతో.. సదరు ఆసుపత్రి చుట్టు రాజకీయం వేడిక్కెంది. ఇక మే 22వ తేదీ.. తమ విచారణకు హాజరుకావాలంటూ సీబీఐ నోటీసులు జారీ చేసినా... ప్రస్తుతం తన తల్లీ తీవ్ర అనారోగ్యం దృష్ట్యా ... ప్రస్తుతం తాను విచారణకు రాలేనని.. కొద్ది రోజుల తర్వాత హాజరవుతానంటూ సీబీఐకి ఆయన సందేశం పంపించడం.. అందుకు సీబీఐ ససేమీరా అనడమే కాదు.. ఎట్టి పరిస్థితుల్లోనూ మే 22వ తేదీ అంటే సోమవారం విచారణకు హాజరుకావాలని స్పష్టం చేసింది. కానీ ఈ హత్య కేసులో వైయస్ అవినాష్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరు పట్ల సందేహం వ్యక్తం చేస్తున్న సీబీఐ.. సోమవారం తెల్లవారుజామున.. కర్నూలు జిల్లా ఎస్పీని కలిసి.. వైయస్ అవినాష్ రెడ్డి లొంగిపోయేలా చూడమని కోరింది. అయితే శాంతి భద్రతల పరిస్థితి అదుపుచేయలేమంటూ ఎస్పీ చేతులెత్తేయడంతో కేంద్ర బలగాలను రంగంలోకి దింపాలని నిర్ణయించుకుంది. ఇంకోవైపు.. విశ్వభారతి ఆసుపత్రి వద్దే కాదు.. ఆ పరిసర ప్రాంతాలంతా వైసీపీ శ్రేణులతో నిండిపోయింది. ఇంకాచెప్పాలంటే... ఆ పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు వారి వారి వర్గాలు ఇప్పటికే అక్కడ భారీగా మోహరించి ఉన్నారు. ఆదివారం రాత్రి ఆ ఆస్పత్రి సమీపంలో ఉన్న మీడియా ప్రతినిధుల అవినాష్ రెడ్డి అనుచరులు దాడి చేశారు. అలాగే మే 19వ తేదీన హైదరాబాద్‌లోని తన నివాసం నుంచి బయలుదేరిన అవినాష్ రెడ్డి.. ఆ తర్వాత సీబీఐ కార్యాలయానికి కాకుండా.. పులివెందులకు పయనమయ్యారు. దీంతో ఆయన వాహనాలను అనుసరించిన కొన్ని మీడియా ఛానెళ్ల వాహనాలతో పాటు జర్నలిస్ట్‌లపై అవినాష్ రెడ్డి అనుచరులు దాడి చేసిన విషయం విదితమే. ఇక ఇప్పటికే సీబీఐ అరెస్ట్ చేసిన.. గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డితోపాటు అవినాష్ రెడ్డి తండ్రి వైయస్ భాస్కరరెడ్డిలను విచారించి.. కీలక విషయాలను రాబట్టిన సీబీఐ ఆ క్రమంలో అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసేందుకు రంగం సిద్దం చేసుకోవడాన్ని గమనించిన అవినాష్ రెడ్డి.. ఆంధ్రప్రదేశ్ సరిహద్దులు దాటితే.. ప్రమాదంలో పడే అవకాశాలు నూటికి నూరు శాతం ఉన్నాయనే భావనతో విశ్వభారతి ఆసుపత్రిలో తల్లిని చేర్చారనిన్న చర్చ సాగుతోంది. అదీకాక.. వైయస్ వివేక దారుణ హత్యను గుండెపోటుగా చిత్రీకరించిన నాటి నుంచి అవినాష్ రెడ్డి తల్లి గుండెపోటు వరకు వరుస సంఘటనలలో అవినాష్ పాత్రపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయంటే అందుకు కారణం ఈ అన్ని సందర్భాలలోనూ అవినాష్ వ్యవహరించిన తీరే కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
http://www.teluguone.com/news/content/avinash-shelter-in-viswa-bharati-25-155731.html





