రాయలసీమ ఖ్యాతిని చాటిన ధీశాలి
Publish Date:May 22, 2023
Advertisement
కేతు విశ్వనాథ రెడ్డి (1939 జూలై 10 - 2023 మే 22) ప్రసిద్ధ సాహితీవేత్త, విద్యావేత్త. ఈయన ప్రధానంగా కథారచయితగా ప్రసిద్ధులు. కేతు విశ్వనాథ రెడ్డి కథలు అనే కథా సంపుటిలకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందారు. రాయల సీమకు చెందిన కేతు విశ్వనాథ్ రెడ్డి సోమవారం తెల్లవారు జామున ఒంగోలు పట్టణంలో పరమ పదించారు. రాయలసీమ కల్చర్, యాసను తన నవలలు, కథలు, నవలా సంపుటిల ద్వారా ప్రపంచానికి చాటిన వ్యక్తి కేతు విశ్వనాథ్ రెడ్డి. ఆయన వయసు 84. తన కూతురు ఇంట్లో ఉన్న సమయంలో అకస్మాత్తుగా అనారోగ్యం వాటిల్లి చనిపోయారు.
తెలుగు భాష, సాహిత్యానికి ఆయన విశేష సేవలందించారు. అధ్యాపకుడిగా జీవితాన్ని ప్రారంభించిన కేతు విశ్వనాథ్ రెడ్డి వైఎస్ ఆర్ జిల్లాలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విశ్వ విద్యాలయ డైరెక్టర్ గా పదవీ విరమణ చేశారు. ఆయన హైదరాబాద్, కడప, తిరుపతి ఇతర అనేక ప్రాంతాల్లో టీచర్ గా చేసిన అనుభవం ఉంది.
ఈయన తొలి కథ అనాదివాళ్ళు 1963లో సవ్యసాచిలో ప్రచురితమైంది. కొడవటిగంటి సాహిత్య సంకలనాలకు సంపాదకత్వం వహించారు. విశాలాంధ్ర తెలుగు కథ సంపాదక మండలికి అధ్యక్షుడుగా ఉన్నారు. కొన్నేళ్ళు అరసం (అభ్యుదయ రచయితల సంఘం) అధ్యక్షుడుగా ఉన్నారు. ఈయన రాసిన సాహితీవ్యాసాలు "దృష్టి" అనే పేరుతో పుస్తక రూపంలో వచ్చాయి. ఆధునిక తెలుగు కథారచయితల్లో టార్చ్ బేరర్స్ అనదగ్గ ప్రసిద్ధుల గురించి ఈయన రాసిన మరో పుస్తకం దీపధారులు. ప్రస్తుతం "ఈభూమి" పత్రికకు సంపాదకుడుగా పనిచేస్తున్నారు. జప్తు, ఇచ్ఛాగ్ని, కేతు విశ్వనాథరెడ్డి కథలు (1998-2003) కథా సంపుటులు కూడా వెలువరించారు. ఈయన కథలు అనేకం హిందీ, కన్నడం, మలయాళం, బెంగాలీ, మరాఠీ, ఆంగ్లం, రష్యన్ భాష ల్లోకి అనువాదితమయ్యాయి. వేర్లు, బోధి ఈయన రాసిన నవలలు. వేర్లు రిజర్వేషన్లకు సంబంధించి క్రీమీ లేయర్ మీద వెలువడిన మొట్టమొదటి నవల. విశ్వనాధరెడ్డి, పోలు సత్యనారాయణ ఇద్దరూ కలసి చదువుకథలు[1] అనే కథల సంపుటిని సంకలనం చేశారు.
http://www.teluguone.com/news/content/ketu-vishwanath-reddy-is-no-more-25-155728.html





