మన స్కాముల్లో మరో కలికితురాయి... అగస్టా!

Publish Date:Apr 28, 2016

Advertisement

 

ఏ దేశమైనా నూటికి నూరు శాతం అవినీతి రహితంగా ఉంటుందని ఆశించలేం. ఎంత కట్టుదిట్టమైన చట్టాలు ఉన్నా ఏదో ఒక మూల, ఎవరో ఒక అవినీతిపరుడు చేయి చాచి నిల్చొని ఉంటాడని మనకి తెలుసు. కానీ సాక్షాత్తూ దేశాన్ని కాపాడవలసి రక్షణశాఖ అధికారులే అవినీతిలో కూరుకుపోతే! లోకమంతా ఆ అవినీతి గురించి దుమ్మెత్తిపోస్తున్నా, మనం మాత్రం నిర్లిప్తంగా ఉండిపోతే!... అంతకంటే దౌర్భాగ్యం మరోటి ఉండదేమో. ఆ దౌర్భాగ్యానికి మరోపేరే అగస్టా కుంభకోణం.

 

ఇదీ నేపథ్యం!
2000 సంవత్సరం నాటికి మారుతున్న అవసరాల దృష్ట్యా, మన వైమానిక దళానికి కొత్తతరకం హెలికాప్టర్లు అవసరమయ్యాయి. దేశంలోని ప్రముఖుల పర్యటనలకే కాకుండా, సియాచిన్‌ వంటి ఎత్తైన ప్రాంతాల్లో బాధ్యతలు నిర్వహించేందుకు.... మరింత సమర్థవంతమైన హెలికాప్టర్లు కావల్సి వచ్చాయి. ఇందుకోసం 18,000 అడుగుల ఎత్తులో కూడా ఎగిరే హెలికాప్టర్ల కోసం వైమానిక దళం వెతుకులాట ప్రారంభించింది. 2004లో ఎస్.పీ.త్యాగి వైమానికదళ ముఖ్యునిగా పదవిని చేపట్టడంతో ఈ వెతుకులాట మరో మలుపు తిరిగింది. ఇటలీకి చెందిన అగస్టా సంస్థ రూపొందించిన హెలికాప్టర్లకు అనుగుణంగా త్యాగి నిబంధనలలో తగిన మార్పులు చేయడం మొదలుపెట్టారు. ఉదా॥ అగస్టా హెలికాప్టరు కేవలం 15,000 అడుగుల ఎత్తుకి మాత్రమే చేరుకోగలదు. కాబట్టి దీనికి అనుగుణంగా వైమానిక నిబంధనలను 18,000 అడుగుల నుంచి 15,000 అడుగులకి మార్చిపారేశారు త్యాగి. అలాగే వైమానిక దళం హెలికాప్టర్లలో ఎలాంటి సౌకర్యాలని ఆశిస్తోందో ఎప్పటికప్పుడు ఆగస్టాకు త్యాగి చేరవేశారనే ఆరోపణలూ ఉన్నాయి. త్యాగి చేసిన సాయానికి అగస్టా నుంచి ఆయనకు కనీసం 75 కోట్లు ముట్టి ఉంటాయని సాక్షాత్తూ ఇటలీ న్యాయస్థానమే స్పష్టం చేసింది.

 

అందరి చేతులూ తడిపారు
ఆగస్టా వెస్టల్యాండ్‌ సంస్థ రూపొందించిన AW-101 అనే హెలికాప్టర్లను మన దేశానికి అంటగట్టేందుకు ఇక దళారులు రంగంలోకి దిగారు. వీరు మొదటి త్యాగిని వశపరుచుకున్నట్లు ఎలాగూ ఆరోపణలు ఉన్నాయి. ఆ తరువాత దేశంలో కీలక నిర్ణయాలను తీసుకునే అధినేతలని కూడా వారు చేరుకున్నట్లు సమాచారం. నకిలీ సంస్థలు, నకిలీ ఒప్పందాలు... ఇలా రకరకాల మార్గాల ద్వారా అగస్టా నుంచి భారతీయ నాయకులకు 300 కోట్లకు పైగా లంచాలు అందాయన్నది కుంభకోణంలోని ప్రధాన ఆరోపణ. ఒకానొక దశలో అప్పటి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వై.ఎస్‌.ఆర్‌ అల్లుడైన బ్రదర్‌ అనిల్‌ కుమార్ పేరు కూడా ఈ కుంభకోణంతో పాటు వినిపించింది. బహుశా అగస్టా హెలికాప్టర్లకు సంబంధించిన వేలకోట్ల ఒప్పందం పూర్తయిపోయి ఉంటే ఈ సమాచారం అంతా సద్దుమణిగిపోయేదేమో! కానీ అన్ని దేశాలూ మనలా నిర్లిప్తంగా ఉండవు కదా! 2013లో అగస్టాల్యాండ్‌ ముఖ్యాధికారితో పాటు మరో దళారికి ఇటలీ ప్రభుత్వం అరెస్టు చేసింది. హెలికాప్టర్ల ఒప్పందం కోసం భారతీయ నేతలకు, అధికారులకు ఇబ్బడిముబ్బడిగా లంచాలు అందించారన్నది వీరి మీద మోపబడిన అభియోగం. కేవలం అభియోగం మోపడమే కాదు. వారిద్దరికీ కారాగార శిక్షను కూడా విధించి పారేసింది.

 

మరి మన దగ్గరో!
లంచం ఇచ్చినందుకే ఇటలీ కోర్టులు ఇంత దూకుడుగా వ్యవహరిస్తే మనం ఇంకెంత దూకుడుగా ఉండాలి. కానీ రక్షణ విషయంలో కూడా కక్కుర్తి పడి లంచం తీసుకున్న మన నేతల మీద ఈగ వాలే ప్రమాదం కూడా లేకుండా పోయింది. అగస్టా ల్యాండ్ కుంభకోణం బయటపడిన వెంటనే ఆ సంస్థతో ఒప్పందాలన్నీ రద్దు చేసేశాం అని అప్పడు అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ చెబుతోంది. కానీ ఆపాటికే 300 కోట్లకి పైగా సొమ్ములు చేతులు మారాయన్నది విస్పష్టం. పైగా దళారుల మాటలు, ఉత్తరాల ప్రకారం అప్పటి రక్షణ శాఖకు చెందిన అధికారులే కాదు... మంత్రులు, కార్యదర్శులు, సలహాదారులు... ఇలా అధికారంలో ఉన్న అంచెలన్నింటికీ లంచాలు ముట్టినట్లు తెలుస్తోంది. పైగా ఒకానొక ఉత్తరంలో సోనియా పేరు కూడా రావడం గమనార్హం! కానీ ఎప్పటిలాగే ఈ కేసులో విచారణ నత్తనడక నడుస్తోంది. కనీసం ప్రాథమిక అభియోగాలను సైతం స్పష్టంగా నమోదు చేయలేని నిస్సహాయత నెలకొని ఉంది.

 

అధికారపక్ష వ్యూహం!
అగస్టా విషయంలో అధికార పక్షం తీరు కూడా ఆశ్చర్యంగా ఉంది. అధికారంలోకి వచ్చి దాదాపు రెండేళ్లు కావస్తున్నా నిమ్మళంగా ఉన్న బీజేపీ అకస్మాత్తుగా ఇప్పుడు అగస్టా కుంభకోణాన్ని తలకెత్తుకుంది. జేఎన్‌యూ విశ్వవిద్యాలయం, ఉత్తరాఖండ్‌లో రాష్ట్రపతి పాలన, కరువు... వంటి సమస్యల సుడిగుండంలో ఉన్న బీజేపీకి అగస్టా కుంభకోణం ఓ సంజీవనిలా దొరికింది. సుబ్రమణ్య స్వామిని రాజ్యసభకు ఎన్నుకోవడం వెనుక కూడా అగస్టా వంటి కుంభకోణాలను తిరగతోడటమే లక్ష్యంగా కనిపిస్తోంది. ఇలాంటి విషయాలలో నిప్పుని నిర్భయంగా రాజేసే సుబ్రమణ్య స్వామి సహజంగానే నిన్న రాజ్యసభలో అగస్టా కుంభకోణాన్ని, అందుకు జోడింపుగా సోనియా పేరునీ ప్రస్తావించారు. దాంతో ఒక్కసారిగా కాంగ్రెస్‌ కుంపటిలా మారిపోయింది.

 

అసలు పని!
అగస్టా విషయంలో తన పేరుని ప్రస్తావించడం మీద సోనియా తీవ్రంగా విరుచుకుపడ్డారు. ప్రభుత్వం ఈ ఆరోపణలను నిరూపించాలంటూ సవాలు చేశారు. నిజంగా ప్రభుత్వం చేయాల్సిన పని కూడా ఇదే! లంచాలు ఇచ్చినందుకే ఇటలీలో కొందరు జైళ్లో కూర్చుంటే, ఆ లంచాలు ఎవరెవరికీ ఏ స్థాయిలో చేరాయో నిగ్గు తేల్చడం ప్రభుత్వ బాధ్యత. అలా కాకుండా ఎన్నికలప్పుడో, ప్రతివిమర్శలు చేయడానికో ఈ ఆరోపణలు వినియోగించుకోవాలనుకుంటే అంతకంటే దురదృష్టం మరోటి ఉండదు. ఇలాంటి కుంభకోణాల విషయంలో చూసీచూడనట్లు ఊరుకుంటే సాధారణ ప్రజల నమ్మకం ఎలాగూ సన్నగిల్లుతుంది... కానీ సాక్షాత్తూ రక్షణశాఖలోనే ఇలాంటి కుంభకోణాలు బయటపడుతుండే మన సైనికుల నైతిక స్థైర్యం ఏమైపోవాలి. దేశం లోపల మనం తిట్టుకున్నా కొట్టుకున్నా, మన స్వేచ్ఛ కోసం తమ ప్రాణాలను బలిపెట్టే వారి ధైర్యం ఏమైపోవాలి. అలనాటి బోఫోర్సులాగా ఇది కూడా నిదానంగా సద్దుమణిగిపోతుందిలే అని నిర్లిప్తంగా ఊరుకుండిపోవాలేమో!

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.