రాజ్యసభలో కనిపించని పెద్దలు

Publish Date:Apr 27, 2016

Advertisement

 

పార్లమెంటు వ్యవస్థలో రాజ్యసభకు ఒక ప్రత్యేకమైన గౌరవం ఉంది. వివిధ రాష్ట్రాల శాసనసభ్యుల అభిమతాలను, దేశంలోని మేధావుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకునే అవకాశం రాజ్యసభ వల్లే దక్కుతుంది. బహుశా అందుకేనేమో ఈ సభకు పెద్దల సభ అన్న పేరు కూడా వచ్చింది. కానీ ఈ పెద్దల సభను కొన్ని పార్టీలు, ఆ పార్టీల ద్వారా ఎన్నుకోబడిన కొందరు నేతలు దుర్వినియోగం చేసే తీరు చూస్తే బాధ కలుగక మానదు. వారి ప్రవర్తన కేవలం రాజ్యసభకే కాదు, ప్రజాస్వామ్యానికే అవమానంగా తోస్తుంది.

 

అధికారాల విషయంలో రాజ్యసభ లోక్‌సభకు ఏమాత్రం తీసిపోదు. ద్రవ్య బిల్లు మీద తప్ప మిగతా బిల్లుల మీద రాజ్యసభ తన అభ్యంతరాలను స్పష్టంగా తెలియచేసి, వాటిని తిరస్కరించవచ్చు. కీలక సమస్యల మీద చర్చలు జరపి, ప్రభుత్వానికి దిశానిర్దేశం చేయవచ్చు. ఇక సదుపాయాల విషయంలోనూ రాజ్యసభ సభ్యులకు ఏమాత్రం లోటు లేదు. ఒకో రాజ్యసభ సభ్యుని మీదా ప్రభుత్వం నెలకు 2.7 లక్షలకు పైగానే ఖర్చు చేస్తుందని ఓ అంచనా! దీన్ని మరింత పెంచాలన్న ప్రతిపాదనలు ప్రస్తుతం ఆర్థిక శాఖ వద్ద ఉన్నాయి. కానీ నిన్న రాజ్యసభలో రేగిన ఓ వివాదం సభ మీద ఉన్నా ఆరోపణలను మరోసారి వెలుగులోకి తెచ్చింది. ఇంతకీ నిన్న ఏం జరిగిందంటే...

 

రాజ్యసభ ఉపసభాపతి పీ.జే.కురియన్‌ మిథున్ చక్రవర్తికి సంబంధించిన ఒక ఉత్తరాన్ని చదివి వినిపించారు. తనకు ఆరోగ్యం బాగోలేని కారణంగా సభ ప్రస్తుత సమావేశాలకు హాజరు కాలేకపోతున్నానన్నది ఆ ఉత్తరంలోని సారాంశం. కానీ మిథున్‌ ప్రతి సమావేశానికీ ఇలాంటి ఉత్తరాన్ని ఒకదాన్ని పంపి చేతులు దులిపేసుకోవడమే ఆశ్చర్యం. నిజానికి మిథున్‌ చక్రవర్తి శుభ్రంగానే ఉన్నారని ప్రపంచం మొత్తానికీ తెలుసు. అటు బెంగాలీ టీవీ కార్యక్రమాలలోనూ, ఇటు బాలీవుడ్‌ సినిమా షూటింగులలోనూ మిథున్‌ నిరభ్యంతరంగా పాల్గొంటున్నారు. కానీ పాపం రాజ్యసభకు రావాలంటే ఆయనకు అనారోగ్యం వస్తోంది. గత రెండు సంవత్సరాలలో మిథున్ కేవలం మూడంటే మూడు రోజులు రాజ్యసభకు వచ్చారంటే, సభ పట్ల ఆయన నిర్లక్ష్యం ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు.

 

మిథున్ తీరుకు సహజంగానే తోటి సభ్యులకు ఒళ్లుమండిపోయింది. ఏళ్లతరబడి ఎన్నో త్యాగాలు చేసి, ప్రజల కోసం పోరాడి, లాఠీ దెబ్బలు సైతం చవిచూసి... కొందరు ఈ స్థాయికి వస్తారనీ, అలాంటి పదవిని ఇలా కించపరచడం సబబు కాదని జనతాదళ్‌కు చెందిన త్యాగీ విరుచుకుపడ్డారు. వివిధ రాజకీయ పార్టీలు తమ తరఫున ఎవరినన్నా రాజ్యసభకు పంపేటప్పుడు, వాళ్లు ఆ పదవికి ఎంతవరకు న్యాయం చేయగలుగుతారో ఆలోచించుకోవాలంటూ చురకలంటించారు. అనారోగ్య కారణాలతో మాటిమాటికీ సభకు గైర్హాజరు కావడం, తన సదుపాయాలను దుర్వినియోగం చేయడమే అంటూ సమాజ్‌వాదీ పార్టీకి చెందిన అగర్వాల్ కూడా మండిపడ్డారు. మిథున్‌ని రాజ్యసభకు ఎన్నుకొన్న తృణమూల్‌ కూడా అతణ్ని గట్టిగా సమర్థించలేకపోయింది.

 

నిజానికి ఈ సమస్య కేవలం మిథున్ చక్రవర్తిది మాత్రమే కాదు. ఇలాంటి చక్రవర్తులెందరో రాజ్యాంగం అందించిన సుఖాలను అనుభవిస్తేనే, తమ మీద ఎన్నో ఆకాంక్షలు పెట్టుకున్న సాధారణ ప్రజలను వెక్కిరిస్తున్నారు. అందుకు తొలుత బాధ్యత వహించాల్సింది సదరు రాజకీయ పార్టీలు. ఒక నేతను రాజ్యసభకు పంపితే అతను ప్రజల పక్షాన గొంతు వినిపించగలుగుతాడా లేదా అన్న విషయాన్ని చాలా పార్టీలు గమనిస్తున్నట్లే కనిపించదు. పైగా అలాంటి ఆరోపణలు వచ్చినా కూడా చూసీచూడనట్లు మళ్లీ అదే మనిషిని రాజ్యసభకు పంపిన సందర్భాలు కోకొల్లలు. అసంతృప్తితో రగిలేవారు, పారిశ్రామికవేత్తలు, వృద్ధతరం నేతలు, పలుకుబడి ఉన్నావారు, ఎన్నికలలో గెలుపొందలేనివారు... ఇలా రాజ్యసభకు ఎన్నుకునేందుకు రకరకాల వ్యక్తులను వివిధ పార్టీలు పరిశీలిస్తుంటాయి.

 

ఇక రాష్ట్రపతి నేరుగా నామినేట్‌ చేసే సభ్యులది కూడా ఇదే పరిస్థితి. వివిధ రంగాలలో ప్రతిభావంతులైన 12 మందిని కేంద్ర ప్రభుత్వ సలహా మేరకు రాష్ట్రపతి రాజ్యసభకు పంపుతారు. ఈ 12 మంది విషయంలో కూడా అధికారంలో ఉన్న పార్టీలు తమ రాజకీయాలను ప్రదర్శిస్తూ ఉంటాయి. కేవలం ప్రతిభావంతుడనే కాకుండా, తమకు అనుకూలంగా ఉన్నవారికే అవి ప్రాధాన్యతను ఇస్తూ ఉంటాయి. అదీ కాకుంటే ఏదో ఒక మతాన్నో, ఒక ప్రాంతాన్నో బుజ్జగించేందుకు ప్రయత్నిస్తూ ఉంటాయి. సభలో కూడా వారు తమకు అనుకూలంగా ప్రవర్తించాలని ఆశిస్తూ ఉంటాయి. అంతేకానీ వాళ్లు ప్రజల గొంతుకను బలంగా వినిపించగలరా, చర్చల్లో నిష్పక్షమైన వాదనను వినిపించగలరా అని ఆలోచించవు. అందుకనే అలా నామినేట్ అయిన సభ్యులు కూడా తరచూ విమర్శల పాలవుతూ ఉంటారు. రేఖ, సచిన్‌ టెండూల్కర్‌, లతా మంగేష్కర్‌ వంటి వ్యక్తులు సమాజానికి వన్నె తెచ్చారేమో కానీ... రాజ్యసభ పరువు మాత్రం తీశారన్నది కొందరి వాదన.

 

సభకు హాజరు కాకపోవడం; హాజరైనా ప్రశ్నలు వేయడం కానీ, చర్చల్లో నోరు మెదపడం కానీ చేయకపోవడం నిజంగా ఆ పదవికే అవమానకరం. అంత మాత్రాన రాజ్యసభ సభ్యులందరూ ఇలాగే ఉన్నారని ఆవేదన చెందనక్కర్లేదు. అరుణ్‌ జైట్లీ, వెంకయ్య నాయుడు, గులాం నబీ ఆజాద్‌, సీతారాం ఏచూరి వంటి ఉద్దండులెందరో ఇప్పటికీ రాజ్యసభకు వన్నె తెస్తూనే ఉన్నారు. అదే సమయంలో మిథున్ చక్రవర్తి మొదలు విజయ్‌ మాల్యా వరకు రాజ్యసభ పరువు తీసేందుకు వెనుకాడనివారూ ఉన్నారు. అందుకే మిథున్‌ చక్రవర్తి మీద నిన్న జరిగిన చర్చ సందర్భంగా... రాజ్యసభకు సభ్యులను ఎన్నుకొనేటప్పుడు, వివిధ పార్టీలు తమకంటూ ఓ ప్రవర్తనా నియమావళిని ఏర్పరుచుకోవాలని సభ్యులు సూచించారు. తాము సభకు ఎన్నుకొనే మనిషి సమర్థుడేనా? అతను సభకు తరచూ హాజరు కాగలడా? హజరై ప్రజల గొంతుని వినిపించగలడా?... వంటి అంశాలను సదరు నియమావళి ద్వారా పరిశీలించాలని ఆశించారు. మరి ఆ సూచన పార్టీల చెవికెక్కుతుందో లేదో వేచి చూడాల్సిందే!

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.