ఎవరీ సుబ్రమణ్య స్వామి?

Publish Date:Apr 29, 2016

Advertisement

 

సుబ్రమణ్య స్వామి పేరు దేశానికి కొత్తేమీ కాదు. కాంగ్రెస్‌కు అసలే కాదు. నెహ్రూ కుటుంబం అంటేనే మండిపడిపోయే ఈ మాటల మాంత్రికుడిని మోదీ ఏరికోరి రాజ్యసభకు పంపారన్న విశ్లేషణలు వినవచ్చాయి. అందుకు అనుగుణంగానే సభలో ప్రమాణస్వీకారం చేసిన మరుసటి రోజు నుంచే స్వామి కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టడం మొదలుపెట్టారు. అసలు ఇంతకీ ఈ సుబ్రమణ్య స్వామి ఎవరు? ఆయన నేపథ్యం ఏమిటి? నెహ్రూ కుటుంబం మీద ఆయనకు ఎందుకంత కక్ష? లాంటి ప్రశ్నలకు లభించే జవాబులు చాలా ఆసక్తికరంగా ఉంటాయి!

 

సుబ్రమణ్య స్వామి దూకుడు చూసి ఆయన ఇంకా 50 ఏళ్ల వయస్కుడే అనిపిస్తుంది. కానీ ఆయన వయసు 76! చెన్నైలోని ఓ తమిళ బ్రాహ్మణుల ఇంట స్వామి పుట్టారు. తండ్రి ఇండియన్‌ స్టాటిస్టికల్‌ సర్వీస్‌లో ఉన్నతాధికారి కావడంతో వాళ్ల ఇంటికి తరచూ నేతల రాకపోకలు ఉండేవి. దాంతో స్వామికి చిన్నప్పటి నుంచే రాజకీయాల మీద కొంతమేరకు అవగాహన ఉంది. చదువుకి ఎక్కువ ప్రాధాన్యతని ఇచ్చే నేపథ్యం ఉండటంతో దిల్లీ, కోల్‌కతాల్లో ఉన్నత చదువులను పూర్తిచేసి ఆర్థికశాస్త్రంలో పీ.హెచ్‌.డీ కోసం ప్రఖ్యాత హార్వర్డు విశ్వవిద్యాలయానికి చేరుకున్నారు. పీ.హెచ్‌.డీ పట్టాను సాధించాక, అదే విశ్వవిద్యాలయంలో ప్రొఫెసరుగా పనిచేయడం మొదలుపెట్టారు. అక్కడే ఆయన జీవితం సాగిపోయి ఉంటే ఏమయ్యేదో కానీ... భారతదేశానికి వస్తే మంచి ఉద్యోగాలు ఇస్తామంటూ ఇక్కడి నుంచి ప్రతిపాదనలు వెళ్లడం మొదలయ్యాయి. ఆ ఉద్యోగాలను స్వీకరించేందుకు భారతదేశానికి తిరిగివచ్చిన స్వామికి అప్పటి ప్రధాని ఇందిరతో మనస్పర్థలు మొదలయ్యాయి.

 

సుబ్రమణ్య స్వామి స్వాచ్ఛా విపణికి (ఓపెన్‌ మార్కెట్‌) అనుకూలం. ఇందిరాగాంధీ అందుకు విరుద్ధమైన సమాజవాదాన్ని (సోషలిజం) నమ్మేవారు. దాంతో స్వామి అభిప్రాయాలు ఇందిరకు గిట్టేవి కాదు. అందుకే దిల్లీలోని ఐఐటీలో స్వామి ప్రొఫెసరుగా పనిచేస్తున్న సమయంలో, ఆయనను బలవంతంగా ఆ స్థానం నుంచి తొలగించింది ఆనాటి ప్రభుత్వం. తరువాత కాలంలో స్వామి సుప్రీం కోర్టుని ఆశ్రయించి తిరిగి తన స్థానాన్ని దక్కించుకున్నా, ఇందిర మీద ఆయన కోపం మాత్రం తగ్గలేదు. ఇందిరతో స్వామికి ఉన్న వైరాన్ని గమనించిన జనసంఘ్‌ (ఒకప్పటి బీజేపీ) ఆయనను రాజ్యసభకు పంపింది. ఇక ఎమర్జెన్సీ కాలంనాటికి ఇందిర విధానాలను వ్యతిరేకిస్తూ జనతాపార్టీని స్థాపించి, బలపరచడంలో స్వామి కీలక పాత్రను పోషించారు. జనతా పార్టీ తరువాత కాలంలో బలహీనపడుతూ వచ్చినా 2013 వరకూ కూడా తన భుజస్కాందాల మీద దాన్ని మోశారు. జనతా పార్టీ నానాటికీ క్షీణించిపోతోందని గ్రహించిన స్వామి, 2013లో ఆ పార్టీని బీజేపీలో విలీనం చేశారు.

 

స్వామికి ఉన్న రాజకీయ అనుభవం అపారమైనప్పటికీ, ఆయనను తల్చుకోగానే కేసులే గుర్తుకువస్తాయి. స్వామి వేసిన కేసుల వల్ల ప్రభుత్వాలు కూలిపోవడం, ఎన్నికలలో ఎందుకూ పనికిరాకుండా పోవడం కొత్తేమీ కాదు. ఎక్కడెక్కడి అధికారిక పత్రాలనో వెలికితీసి అధినేతలను ఇరుకున పెట్టడమూ స్వామికి వెన్నతో పెట్టిన విద్య. కర్ణాటకలో రామకృష్ణ హెగ్డే ముఖ్యమంత్రిగా ఉండగా, ఆయన ప్రభుత్వం ఫోన్‌ ట్యాపింగ్‌కు పాల్పడుతోందంటూ అప్పట్లో స్వామి కొన్ని పత్రాలను విడుదల చేశారు. దాంతో 1988లో హెగ్డే తన ముఖ్యమంత్రి పదవికి రాజినామా చేయాల్సి వచ్చింది. ఇక తమిళనాట సింహస్వప్నమైన జయలలిత అక్రమాస్తుల కేసులో ముఖ్యమంత్రి పదవిని పోగొట్టుకోవడమే కాకుండా, నాలుగేళ్లపాటు జైళ్లో మగ్గడానికీ స్వామి వేసిన కేసులే కారణం. 2010లో 2G స్కాం వెలికిరావడానికి కూడా స్వామి పెట్టిన కేసులే కారణం. ఈ కేసులో అప్పటి టెలికాం ముఖ్యమంత్రి ఎ.రాజా, కరుణానిధి గారాల కూతురు కనిమొళిలను జైలుకి పంపేదాకా స్వామి నిద్రపోలేదు. 2G స్కాం పుణ్యమా అని కేంద్రంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం, తమిళనాట డీఎంకే ప్రభుత్వాలు తరువాత జరిగిన ఎన్నికలలో ఘోర పరాజయం పాలయ్యాయి.

 

మిగతా నేతలతో స్వామి వైరం ఒక ఎత్తైతే, ఆయన నెహ్రూ కుటుంబాన్ని వెంటాడే తీరు మరో ఎత్తు! ఒక పక్క సోనియా గాంధి ఇటలీ పౌరసత్వం, రాహుల్‌ గాంధి బ్రిటిష్‌ పౌరసత్వం వంటి విషయాల మీద వారికి కంటి మీద కునుకు లేకుండా చేస్తూ ఉంటారు. మరో పక్క నేషనల్‌ హెరాల్డ్‌ వంటి కుంభకోణాలను వెలికితీసి, సోనియాను కోర్టు బోనులో నిలబెట్టేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. చట్టపరంగా సోనీయా, రాహుల్‌ల మీద ఆయన దూకుడు ఒక తీరైతే... వారి మీద వ్యక్తిగతంగా తీవ్రమైన విమర్శలు చేయడం మరో తీరు. సోనియా గాంధి పుట్టుక దగ్గర్నుంచీ రాహుల్‌ గాంధి వివాహేతర సంబంధాల వరకూ ఆయన చేయని ఆరోపణ అంటూ లేదు. ఒకోసారి, తిరిగి చెప్పుకోవడానికి కూడా వీల్లేని స్థాయిలో ఆయన ఆరోపణలు ఉంటాయి. అలాంటి ఆరోపణలన్నింటినీ కలిపి ఏకంగా ‘Do you know your Sonia’ పేరిట ఏకంగా ఓ పత్రాన్నే రూపొందించారు. అసలు సోనియా భారత ప్రధాని కాకుండా అడ్డుకున్నది తానేనని కూడా స్వామి చెబుతారు. ఆఖరి నిమిషంలో ఆమె పౌరసత్వం గురించిన వివాదాన్ని అప్పటి రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం దగ్గర ప్రస్తావించాననీ, దాంతో ఆమె కన్నీళ్ల పర్యంతమై ఆ పదవిని వదులుకోవలసి వచ్చిందని అంటారు.

 

స్వామి రాజకీయాలు, కేసులే కాదు... ఆయనలోని హిందుత్వం గురించి కూడా చెప్పుకోక తప్పదు. తొలి నుంచి జనసంఘ నేతగా ఉన్న స్వామి అణువణువుగా హిందుత్వవాదాన్ని జీర్ణించుకున్న మనిషి. అందుకే ఇస్లాం మతం మీదా, ఇస్లాం తీవ్రవాదం మీదా ఆయన తరచూ విరుచుకుపడుతూ ఉంటారు. భారతదేశంలో ఉన్న ముస్లింలందరూ ఒకప్పుడు హిందువులే అనీ... ఆ విషయాన్ని వారు అంగీకరించాలని అంటారు. అయోధ్యలో వివాదాస్పద మసీదు స్థానంలో రామమందిరాన్ని నిర్మించాలంటూ సుప్రీం కోర్టులో ఆయన వేసిన కేసు ఇంకా నడుస్తోంది.

 

అలాగని స్వామి అన్ని విషయాల్లో కరుడుగట్టినట్లు ఉంటారని అనుకోవడానికి లేదు. తమిళ నాట ఎల్‌.టీ.టీ.ఈకి వ్యతిరేకంగా మాట్లాడే అతి కొద్ది మందిలో స్వామి ఒకరు. అలాగే తమిళ రాజకీయాలకు మూలమనదగిన ‘ఆర్య ద్రావిడ’ సిద్ధాంతాన్ని కూడా ఆయన తీవ్రంగా వ్యతిరేకిస్తుంటారు. అయితే తరచూ ఏదో ఒక సంచలన ప్రకటన చేయడం, ఎంత మాట పడితే అంతమాటను అనేయడంతో స్వామి తన విలువను తానే తగ్గించుకుంటూ ఉంటారు. అంతగా పరిశోధన చేసే మనిషి ఏమాత్రం తరచి చూసుకోకుండా చిత్రమైన మాటలను మాట్లాడటంతో ఆయన చిత్తశుద్ధి మీద అనుమానం కలుగక మానదు.

 

ఏది ఏమైనా దేశ రాజకీయాలను ఆసక్తికరమైన మలుపులు తిప్పడంలోనూ, తప్పు చేసిన వారిని మూడు చెరువులు నీరు తాగించడంలోనూ స్వామికి సాటెవ్వరూ లేరు. అందుకే మోదీ, అమిత్‌ షా ఇద్దరూ మరో వ్యక్తిని సంప్రదించకుండానే ఆయనను రాజ్యసభకు నామినేట్‌ చేశారని చెబుతారు. ఉత్తరాఖండ్‌, జేఎన్‌యూ వంటి సమస్యలలో ఇరకాటంలో ఉన్న ప్రభుత్వానికి స్వామి ఆసరా ఎంతైనా అవసరం! ఆశించినట్లుగానే స్వామి ప్రస్తుతం రాజ్యసభలో అగస్టా కేసును తిరగతోడుతూ కాంగ్రెస్‌ను ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. అదే రీతిలో స్వామి అధికార పార్టీ చేసే పొరపాట్లను కూడా వేలెత్తి చూపితే బాగుండు!

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.