అత్యాచార* ఎప్పుడు, ఎక్కడ జరిగిందో కూడా హోంమంత్రికి తెలీదా?

Publish Date:Apr 23, 2022

Advertisement

విజ‌య‌వాడ ప్ర‌భుత్వాసుప‌త్రి అత్యాచార ఘ‌ట‌న యావ‌త్ తెలుగుజాతిని క‌లిచివేస్తే.. హోంమంత్రి తానేటి వ‌నిత మాత్రం ఎలాంటి ప్రాధ‌మిక స‌మాచారం లేకుండా మీడియా ముందుకు వ‌చ్చి అడ్డంగా బుక్క‌య్యారు. మీడియా మైక్‌లు ఆన్‌లో లేవ‌నుకున్నారో ఏమో.. అత్యాచారం ఎక్క‌డ జ‌రిగింది? ఎప్పుడు జ‌రిగింది? ఇవాళ డేట్ ఎంత‌? ఎప్పుడు అరెస్ట్ చేశారు? అంటూ అధికారుల‌ను స‌మాచారం అడిగి తెలుసుకోవ‌డం.. అదికాస్తా రికార్డు కావ‌డం.. ఆ వీడియో ఫుల్ వైర‌ల్ కావ‌డంతో ప్ర‌భుత్వ ప‌రువంతా పోయింది. హోంమంత్రిగా ఉండికూడా.. అంత ఘోరం జ‌రిగితే కూడా.. క‌నీస స‌మాచారం లేకుండా ఎలా ఉంటారు? ఆమె హోంమంత్రిగా ఎలా ప‌నికి వ‌స్తారు? అంటూ సోష‌ల్ మీడియాలో తెగ కామెంట్లు, ట్రోల్స్ న‌డుస్తున్నాయి. టీడీపీ అధినేత చంద్ర‌బాబు సైతం వ‌నీత తీరును తీవ్రంగా త‌ప్పుబ‌ట్టారు. రాష్ట్రంలో జ‌రుగుతున్న అత్యాచారాల‌పై నిల‌దీస్తూ సీఎం జ‌గ‌న్‌కు మూడు పేజీల లేఖ రాశారు. ఆ లేఖ‌ య‌థాత‌థంగా......

"రాష్ట్రంలో ప్రతిరోజూ ఏదో ఒకచోట మహిళలపై దాడులు, అత్యాచార ఘటనలు జరగడం ఎంతో బాధిస్తోంది.  ప్రభుత్వ ఉదాసీనత వల్లే అభం శుభం తెలియని చిన్నారులు నుంచి వృద్ధుల వరకూ కిరాతకుల ఆగడాలకు బలవుతున్నారు. రాష్ట్రంలో విద్యార్థినులు,యువతులపై లైంగిక వేధింపులు, అత్యాచారాలు, హత్యలు పెరుగుతుండటం దురదృష్టకరం. రాష్ట్రంలో  బడికి వెళ్లే బాలికలకు, కాలేజీలకు వెళ్లే యువతులకు, మార్కెట్‌ కు వెళ్లే మహిళలకు, ఉద్యోగాలు చేసుకునే ఆడబిడ్డలకు రక్షణ లేదు.

విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో మానసిక వికలాంగురాలిపై అత్యాచార ఘటన నన్నెంతో కలిచివేసింది. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా విఫలమయ్యాయని చెప్పడానికి ఈ ఘటన ప్రత్యక్ష సాక్ష్యం. నిత్యం రోగులతో రద్దీగా ఉండే ప్రభుత్వాస్పత్రిలోని ఒక రూమ్‌ లో దివ్యాంగురాలికి  30 గంటలపాటు ముగ్గురు మృగాళ్లు మద్యం తాగి నరకం చూపించడం రాష్ట్రంలో మహిళలకు రక్షణ ఎలా ఉందో అర్ధమవుతోంది. తల్లిదండ్రుల ఎదుటే బిడ్డపై అత్యాచారానికి పాల్పడ్డారంటే... ఏం చేసినా ప్రభుత్వం శిక్షించదనే ధైర్యంతోనే  కిరాతకులు రెచ్చిపోతున్నారు. కూతురు కనిపించడంలేదని స్వయంగా పోలీస్‌ స్టేషన్‌ కు వెళ్లి బాధితురాలి తల్లిదండ్రలు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడం అమానుషం. మహిళా భద్రతను వదిలేసి అధికార పార్టీ సేవలో పోలీసులు తరించడం దేనికి సంకేతం?  

రాష్ట్రంలో ప్రతిరోజూ ఏదో ఒక ప్రాంతంలో మహిళలపై దురాగతాలు గుండెను పిండేస్తున్నాయి. విజయవాడలో బాధితురాలిని మేము పరామర్శించాకే ప్రభుత్వంలో చలనం వచ్చింది. ప్రజాగ్రహం చూసి భయపడి ఆదరాబాదరగా హోంమంత్రి, మహిళా కమిషన్‌ చైర్‌ పర్సన్‌ ఘటనాస్థలానికి వచ్చారు. అత్యాచారం ఎప్పుడు జరిగిందో ఎక్కడ జరిగిందో కూడా హోంమంత్రికి తెలియకపోవడం బాధ్యతారాహిత్యాన్ని తెలియజేస్తోంది. బాధితులకు అండగా నిలబడి న్యాయం చేయమని కోరితే తమ బాధ్యతను మరిచి మాపై ఎదురుదాడి చేస్తున్నారు. 

రాష్ట్రంలో అసాంఘిక శక్తులు పెచ్చుమీరిపోతున్నాయి. గంజాయి, డ్రగ్స్‌ , మద్యం వంటి మాదక ద్రవ్యాలు రాష్ట్రంలో విచ్చలవిడిగా వినియోగించడం వల్లే ఇలాంటి నేరాలు నిత్యకృత్యమయ్యాయి. ప్రభుత్వ అసమర్థ చర్యలతో రాష్ట్రం  రావణ కాష్టంలా మారింది. ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు, పాలనా వైఫల్యం నేరస్థులకు మద్దతుగా నిలుస్తున్నట్టున్నాయి. జాతీయ క్రైమ్‌ బ్యూరో నివేదిక ప్రకారం దేశవ్యాప్తంగా మహిళలపై జరిగే నేరాల్లో 3వ వంతు రాష్ట్రంలోనే జరుగుతుండటం అవమానకరం. మహిళలపై జరుగుతున్న భౌతిక దాడులు, మానవ అక్రమ రవాణా, లైంగిక వేధింపు ఘటనల్లో ఏపీ దేశంలోనే అగ్రస్థానంలో ఉండటం గర్హనీయం.  

దిశా చట్టం ఆర్భాటపు ప్రచారానికే పరిమితమైంది. దిశా చట్టం ప్రకారం 21 రోజుల్లో నిందితులకు శిక్ష వేస్తామని మీరు చేసిన వాగ్దానం ఏమైంది?  రాష్ట్రంలో  దిశా చట్టం అమల్లో ఉందా? ఎన్ని కేసులను నమోదు చేశారు? ఎంతమందిని శిక్షించారు?అనే ప్రశ్నలకు నేటికీ మీ నుంచి సమాధానం లేదు. మహిళలపై నేరాలకు సంబంధించి ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేస్తామన్నారు. నేటికీ ఆ దిశగా చర్యల్లేవు. 
మహిళలకు రక్షణ కల్పించలేని మీకు పాలన చేసే అర్హత ఎక్కడుంది? అధికార వైసీపీ నేతలే కాలకేయుల అవతారమెత్తి ఆడవారిపై దాడులకు తెగబడుతున్నారు. గుంటూరు జిల్లాలో చిన్నారిపై అధికార  పార్టీ నేతలు భూ శంకర్‌, ఆప్కాబ్‌ చైర్మన్‌ కొండూరు అనిల్‌ బాబు అఘాయిత్యానికి పాల్పడి వ్యభిచార గృహానికి అమ్మేశారు. వీరితోపాటు ఈ ఘటనతో ప్రమేయమున్న 70 మందిపై నేటికీ ఎందుకు చర్యలు తీసుకోలేదు?  ముఖ్యమంత్రి ఇంటి పక్కనే సీతానగరంలో యువతిని గ్యాంగ్‌ రేప్‌ చేస్తే నిందితుడు వెంకటరెడ్డిని నేటికీ పట్టుకోలేదు. స్వాతంత్య్ర దినోత్సవం రోజున రాజధాని ప్రాంతం పెదకాకానిలో దళిత విద్యార్థిని రమ్యను పట్టపగలు నడిరోడ్డుపై నరికి చంపితే నిందితుడికి నేటికీ శిక్ష పడలేదు. పులివెందులలో నాగమ్మ, అనంతపురంలో స్నేహలత, నరసరావుపేటలో అనూష, రాజమండ్రిలో మైనర్‌ మీద గ్యాంగ్‌ రేప్‌ ...ఇలాంటి ఘటనలు నిత్యకృత్యమైనా ఎందుకు చేష్టలుడిగి చూస్తున్నారు? నెల్లూరులో విదేశీ యువతిపై అత్యాచార యత్నం అంతర్జాతీయస్థాయిలో రాష్ట్ర పరువు పోయింది.   

బాధ్యత కలిగిన ముఖ్యమంత్రిగా మీ చర్యలు, మీ విధానాలు మహిళలపై నేరాలకు పాల్పడే దుర్మార్గులకు ప్రాణభయం కలిగించే విధంగా ఉండాలి. ఇకనైనా మహిళా భద్రత పట్ల బాధ్యతగా వ్యవహరించి, శాంతిభద్రతలు కాపాడండి. రాజకీయ ప్రయోజనాల కోసం పోలీస్‌ వ్యవస్థను వాడటం మాని శాంతిభద్రతల పర్యవేక్షణ కోసం ఉపయోగించండి. విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో అత్యాచారానికి గురైన బాధిత యువతి కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలబడాలి. కోటి రూపాయల ఆర్థిక సాయంతో పాటు, శాశ్వత నివాసం, జీవనోపాధి కల్పించాలి. ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసి ఈ కేసును వెంటనే పరిష్కరించి దోషులను కఠినంగా శిక్షించాలి". అంటూ సీఎం జగన్ కు లేఖ‌ రాశారు టీడీపీ జాతీయ అధ్య‌క్షులు చంద్ర‌బాబు నాయుడు. 

By
en-us Political News

  
ల్గొండ జిల్లా కొర్లపహాడ్‌ గ్రామంలో పోలింగ్ సందర్భంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తలు ఘర్షణకు దిగారు. పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ దాడుల్లో పలువురు గాయపడ్డారు.
ఉదయం ఏడుగంటలకు ప్రారంభమైన పోలింగ్, మధ్యాహ్నం ఒంటి గంట వరకూ జరుగుతుంది. ఇందు కోసం 37 వేల 552 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. తొలి విడతలో 56 లక్షల 19 వేల 430 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.
తన ఎన్నికల చిహ్నమైన కత్తెర గుర్తు జెండాను పట్టుకుని అల్లు అర్జున్ చేత ప్రచారం చేయిస్తున్నారు. ఆగండాగండి వాస్త
త్రిపురకుండ్రం ఆరు షణ్ముఖ క్షేత్రాల్లో తొలి క్షేత్రంగా భాసిల్లుతోంది. అయితే ఈ కొండ‌కు ద‌గ్గ‌ర్లో ఒక ద‌ర్గా ఉంటే.. ఆ ద‌ర్గాకి సమీపంలో ఒక రాతి స్తంభం ఉంటుంది. ఆ రాతి స్థంభంపై త‌మిళ కార్తీక దీపం పెట్ట‌డం అనాదిగా వ‌స్తోన్న ఆచారం.
ఈ నెల 11న మొదటి విడత పోలింగ్ జరగనున్న సంగతి తెలిసిందే. దీంతో తొలి విడతలో జరిగే పంచయతీల ఎన్నికల ప్రచార గడువు మంగళవారం సాయంత్రంతో ముగియనుంది.
బొత్స పక్కా రాజకీయ వారసత్వం మీద దృష్టి పెట్టారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా, వైసీపీ శాసన మండలి పక్షనేతగా వ్యవహరిస్తున్న బొత్స మారుతున్న రాజకీయ, పరిణామాల దృష్ట్యా ప్రత్యామ్నాయాలవైపు దృష్టి సారిస్తున్నార‌న్న ప్రచారం సాగుతోంది.
ఉమ్మడి అనంతపురం జిల్లాలో గుంతకల్ నియోజకవర్గం మిగతా నియోజకవర్గానికి పూర్తి భిన్నంగా ఉంటుంది.
అయితే ఆ ప్రశ్నకు ఇంత దూరం వచ్చి ఆ సన్నాసి గురించి ఎందుకు అంటూ లోకేష్ సమాధానం ఇచ్చారు.
వేశంతో కంటే ఎంతో ఆలోచనతో రాజకీయ సన్యాసం ప్రకటించి, వ్యవసాయమే తన వ్యాపకం అని ప్రకటించేశారు. అలా ప్రకటించిన సందర్భంలోనే పరిశీలకులు ఇది వ్యూహాత్మక పోలిటికల్ రిటైర్మెంట్ అంటూ విశ్లేషణలు చేశారు.
బీజేపి రాజ్యాంగంలో లౌకిక పదం తొలగిస్తామనడం దారుణమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు
మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత కాకాని గోవర్ధన్ రెడ్డికి మరో ఎదురుదెబ్బ తగిలింది.
ఏది ఏమైతేనేం తెలంగాణలో మద్యం అమ్మకాలు కొత్త రికార్డు సృష్టించాయి. విశేషమేంటంటే.. ఇంతటి చలిలోనూ కూడా బీర్ల అమ్మాకాలు కూడా జోరుగా సాగాయి.
తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టిన తరువాత దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల జాబితాలో ఏపీ అగ్రపీఠిన నిలుస్తోంది. 2025-26 ఆర్థిక సంవత్సరం తొలి మేమూడు నెలల్లోనే రాష్ట్ర వృద్ధి10.5 శాతంగా ఉంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.