ఏపీ గ్రోత్ రేట్@10.5%

Publish Date:Dec 6, 2025

Advertisement

ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ గణనీయంగా పుంజుకుంటోంది.  ఈ ఏడాది ఏపీ వృద్ధి రేటు జాతీయ సగటు కంటే ఎక్కువగా ఉంది. వైసీపీ హయాంలో ఏపీ ప్రగతి తిరోగమనంలో సాగిన సంగతి తెలిసిందే.  అయితే తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టిన తరువాత  దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల జాబితాలో ఏపీ అగ్రపీఠిన నిలుస్తోంది. 2025-26  ఆర్థిక సంవత్సరం తొలి మేమూడు నెలల్లోనే రాష్ట్ర వృద్ధి10.5 శాతంగా ఉంది.   దేశవ్యాప్తంగా సగటు వృద్ధి 8.8 శాతం ఉంటే, ఒక్క అంధ్రప్రదేశ్ మాత్రం జాతీయ సగటును మించిన వృద్ధి రేటు సాధించింది.

ఈ వేగం ఇలాగే సాగితే  ఈ ఏడాది మొత్తం రాష్ట్ర ఆదాయం సుమారు 18 లక్షల 65 వేల కోట్ల రూపాయలకు చేరుకునే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ఏపీ అభివృద్ధిలో సింహ భాగం వ్యవసాయానిదే అని చెప్పాలి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో వ్యవసాయ ఉత్పత్తులు 9.6 శాతం పెరిగి 81 వేల 496 కోట్ల రూపాయలకు చేరాయి. గత ఏడాది ఈ వృద్ధి 36 శాతంగా ఉంది. అలాగే సేవల రంగం 8.5 శాతం, పరిశ్రమలు 23 శాతం  పెరిగాయి. ఈ మూడు రంగాలూ ఒకేసారి బలపడటం వల్లనే  ఆర్థిక వ్యవస్థ పునాది గట్టిపడిందని చెప్పాలి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వర్ణాంధ్ర విజన్ 2047    ప్రకారం 2047 నాటికి రాష్ట్ర ఆదాయం 2.4 లక్షల కోట్ల డాలర్లకు , తలసరి ఆదాయం 35 లక్షల రూపాయలు చేరాలి. ఆ దీర్ఘకాలిక లక్ష్యం దిశగా తొలి అడుగు పడిందనే తాజా గణాంకాలు సూచిస్తున్నాయి.  పథకాల అమలులో వేగం,  అధికారుల చొరవ, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల వెల్లువ అన్నీ కూడా ఏపీ ప్రగతికి, పురోగతికి, ఆర్థిక పరిపుష్టికి దోహదం చేస్తున్నాయని చెప్పాలి.  

 సముద్ర ఆహార ఎగుమతుల్లో దేశంలోనే ఆంధ్రాకు 38 శాతం వాటా ఉంది, దాదాపు 7.74 బిలియన్ డాలర్ల విలువైన ఎగుమతులు జరిగాయి. విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 28 వేల 409 మెగావాట్లకు చేరింది. రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లను తగ్గించడం, బ్యాంకుల్లో డబ్బు లభ్యత పెంచడం వల్ల ప్రజలలో కొనుగోలు శక్తి పెరిగింది. జగన్ హయాంలో కుదేలైన ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ చంద్రబాబు హయాంలో ఇప్పుడు కోలుకుని వేగంగా ముందుకు సాగుతోంది. 

By
en-us Political News

  
ప్రభుత్వ ఆస్పత్రులలో నెలకు 15 లక్షల జీతం ఇస్తామన్నా ఎందుకు చేరడం లేదు? అన్న విషయాలను ప్రస్తావించారు. ఇది కేవలం ఆస్పత్రులకు సంబంధించిన వ్యవహారం మాత్రమే కాదు.. మొత్తంగా రాష్ట్రంలో ఆరోగ్య భద్రతకు సంబంధించిన అంశంగా విశ్లేషించారు.
ఈసీ తమ పార్టీకి ఈల గుర్తు కేటాయించడం పట్ల విజయ్ అభిమానులు, టీవీకే కార్యకర్తలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తమ నాయకుడు విజయ్ నటించిన సక్సెస్ ఫుల్ మూవీ విజల్ ను ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ, టీవీకేకు విజిల్ గుర్తు సక్సెస్ కు సంకేతంగా అభివర్ణిస్తున్నారు.
అలాగే భారీగా అవినీతి చోటు చేసుకుందన్న ఆరోపణలపైనా ఈడీ విజయసాయిని సుదీర్ఘంగా విచారించింది. అదే విధంగా మద్యం కుంభకోణం ద్వారా అక్రమంగా వచ్చిన నగదును విదేశాలకు తరలించిన అంశం, హవాలా మార్గాల వినియోగం, షెల్ కంపెనీల ఏర్పాటు ద్వారా మనీ లాండరింగ్ జరిగిందా అనే కోణంలో ఈడీ దర్యాప్తు చేస్తోంది.
2019 ఎన్నికలకు ముందు జగన్ ప్రజా సంకల్పయాత్ర పేరిట దాదాపు 16 నెలల పాటు పాదయాత్ర చేసిన సంగతి తెలిసిందే. ఆ పాదయాత్ర కారణంగానే అప్పటి ఎన్నికలలో వైసీపీ విజయం సాధించి అధికారంలోకి వచ్చింది.
ఉద్యోగులు విధులకు గైర్హాజరైతే వేతనాలు నిలిపివేస్తారు.. మరి ఎమ్మెల్యేల విషయంలో ఆ విధానాన్ని ఎందుకు అమలు చేయరని జనం ప్రశ్నిస్తున్నారన్నారు.
ఈ నేపథ్యంలో, రాజధానిగా అమరావతి ఎంపిక ప్రక్రియ, నిర్మాణ కార్యక్రమాలపై వివరాలను కూడా కేంద్రానికి నోట్‌ ద్వారా రాష్ట్ర ప్రభఉత్వం అందజేసింది. ఈ విషయమై, కేంద్రం ఇప్పటికే అన్ని మంత్రిత్వ శాఖల నుంచి అభిప్రాయాలు సేకరించడమే కాకుండా, నీతి ఆయోగ్‌ అభిప్రాయాన్ని కూడా కోరినట్లు సమాచారం.
హరీష్ రావును విచారించిన అధికారులు, 2018 అసెంబ్లీ ఎన్నికల అనంతరం కొన్ని నెలల పాటు ఆయన ఫోన్ నిఘాలో ఉన్నట్టు తెలిపారు. ఈ విషయాన్ని పోలీసులు చెప్పగానే హరీష్ రావ్ షాక్‌కు గురైనట్లు సమాచారం.
చదువుకుంటేనేగా గ్రామాల్లో వికాసం అంటూ ఉండేది. చదువు చెప్పేవారే ఉంటే పిల్లలు గేదెలెనకా, మేకలేకనా పరిగెత్తాల్సిన ఖర్మేంటి? కాస్తంత గ్రామాభివృద్ధి, విద్యారంగంలో రావాల్సిన మార్పుల గురించి ఏకరవుపెడుతున్నవారంతా గొంతుపోవడం, అనారోగ్యం పాలవడం తప్ప ఒరుగుతున్నది దాదాపు శూన్యమన్న అభిప్రాయాలే ఎక్కువ వినపడుతున్నాయి.
విచారణలో భాగంగా హరీష్ రావుతో పాటు ఈటల రాజేందర్ ఫోన్లు ట్యాప్ అయినట్లుగా ఆధారాలను సిట్ బృందం హరీష్ ముందు ఉంచి ప్రశ్నించినట్లు తెలుస్తోంది. అయితే అవన్నీ ఫేక్ అని హరీష్ రావు వాదించినట్లు తెలుస్తోంది.
సరే అసలు తాను కవిత పార్టీకి వ్యూహకర్తగా పని చేయనున్నానంటూ వస్తున్న వార్తలు శుద్ధ అబద్ధాలని ప్రశాంత్ కిశోర్ కొట్టి పారేశారనుకోండి అది వేరు సంగతి. ఇటీవ‌ల క‌విత‌- ప్ర‌శాంత్ కిషోర్ మధ్య రెండు సమావేశాలు జరిగాయనీ, కవిత త‌న పొలిటిక‌ల్ స్ట్రాట‌జిస్టుగా ఆయ‌న్ను నియ‌మించుకునే అవ‌కాశం క‌నిపిస్తోంద‌న్న వార్తలు మాత్రం జోరుగా వినిపిస్తున్నాయి. దీంతో ప్రశాంత్ కిశోర్ ఖండించినప్పటికీ చర్చ మాత్రం ఆగడం లేదు.
ఇప్పుడు బీఆర్ఎస్ వ‌ర్సెస్ కాంగ్రెస్ ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలో ఒక వార్ న‌డుస్తోంది. త‌మ‌కున్న మీడియా ప‌లుకుబ‌డి ద్వారా... న్యూస్ ట్యాపింగ్ జ‌రుగుతోందంటూ ఓ ప్రచారాన్ని మొదలెట్టింది కారు పార్టీ. ఈ విష‌యంలో బీఆర్ఎస్ ఎక్కువ‌గా ఇరుక్కోకుండా ఈ ప‌థ‌క ర‌చ‌న చేసిన‌ట్టు క‌నిపిస్తోంది. ఇదే అంశంలో ఇక్క‌డి నుంచి జ‌గ‌న్ మద్దతు కూడా కారు పార్టీకి ఉన్నట్లు సమాచారం.
ముఖ్యంగా నిజామాబాద్ మునిసిపల్ బరిలో స్పష్టమైన ప్రభావం చూపే దిశగా అధిక సంఖ్యలో వార్డు సభ్యులను బరిలోకి దింపాలని నిర్ణయించారు. సోమవారం హైదరాబాద్ లోని తన నివాసంలో తెలంగాణ జాగృతి కీలక నేతలతో జరిగిన ప్రత్యేక సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
దేశంలోని అన్ని శాసన సభలలో గవర్నర్ ప్రసంగానికి ముందు జాతీయ గీతాలాపన చేయడం సంప్రదాయంగా కొనసాగుతోందనీ, కానీ స్టాలిన్ సర్కారు మాత్రం ఆ సంప్రదాయాన్ని బ్రేక్ చేసిందనీ, దీనికి నిరసనగా గవర్నర్ ఆర్.ఎన్.రవి అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసినట్లు లోక్ భవన్ పేర్కొంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.