'స్థానిక' ఎన్నికలపై హైకోర్టు లో ప్రభుత్వం లంచ్ మోషన్ పిటీషన్.. 19 కి విచారణ వాయిదా

Publish Date:Mar 16, 2020

Advertisement

 

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు వెంటనే జరపాలని ప్రభుత్వం వేసిన లంచ్ మోషన్ పిటిషన్ ను హై కోర్టు ధర్మాసనం సోమవారం విచారించింది. ప్రభుత్వం తో  సంప్రదింపులు జరపకుండా ఈసీ ఏకపక్షంగా నిర్ణయం తీసుకుందన్న పిటిషనర్ తరపు న్యాయవాది. రాష్ట్రంలో ఒక్క కేసు కూడా నమోదు అవలేదని, దేశ వ్యాప్తంగా 100 కేసులు మాత్రమే నమోద య్యాయని చెప్పిన పిటిషనర్ తరపు న్యాయవాది. గవర్నర్ ను కలిసి వాయిదా కారణాలు వివరించిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్.ఇదే విషయానికి సంబంధించిన పిటిషన్ సుప్రీంకోర్టు లో రేపు విచారణకు ఉన్న కారణంగా విచారణ వాయిదా. తదుపరి విచారణ ఈ నెల 19కి వాయిదా వేసిన హైకోర్టు.

ఇదిలా ఉండగా, స్థానిక ఎన్నికల వాయిదా అంశంపై అటు సచివాలయం లోనూ, ఇటు రాజకీయ పార్టీల్లోనూ  ఉత్కంఠ కొనసాగుతోంది. ఇదే విషయమై చర్చింటానికి ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయానికి  కార్యాలయం చేరుకున్న మాజీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమాకాంత్ రెడ్డి .కాసేపట్లో ఆయన  సీఎం జగన్ తో ప్రత్యేకంగా భేటీ కానున్నారు. ఇప్పటికే హైకోర్టు, సుప్రీంకోర్టులను ఆశ్రయించిన ప్రభుత్వం, వైసీపీ నేతలు, ఈ  రెండు రోజులూ చాలా కీలకమని భావిస్తున్నారు. ఇదిలా ఉండగా, రాష్ట్రం లో  రాజ్యాంగ సంస్ధలతో సై అంటే సై అంటున్న వైసీపీ సర్కారుకు ఇప్పుడో పదం విపరీతంగా చికాకు తెప్పిస్తోంది. అదే విచక్షణ. గతంలో ఏపీపీఎస్సీఛైర్మన్, మండలి ఛైర్మన్ విచక్షణాధికారాన్ని వాడి జగన్ సర్కార్ కు  చుక్కలు చూపిస్తే,  తాజాగా ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ సైతం విచక్షణ అధికారంతో ఎన్నికలను ఆరువారాల పాటు వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు.  దీంతో జగన్ సైతం తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.

తమకున్న అధికారాలను నిబంధనల మేరకు వినియోగించుకోలేని పరిస్ధితుల్లో ఉన్నప్పుడు రాజ్యాంగ పదవుల్లో ఉన్న వారు విచక్షణ అనే పదాన్ని వాడుతుంటారు. ఇదే కోవలో ఏపీలో వైసీపీ అధికారం చేపట్టిన తర్వాత ఏపీపీఎస్సీలో గ్రామ సచివాలయ ఉద్యోగుల పరీక్షల నేపథ్యంలో తొలిసారి విచక్షణ అనే పదం తెరపైకి వచ్చింది. అప్పట్లో గ్రామ సచివాలయ ఉద్యోగుల పరీక్ష పేపర్ లీకేజీ అయిందని ఆరోపణలు వచ్చినా ఏపీపీఎస్సీ ఛైర్మన్ గా ఉన్న ఉదయ్ భాస్కర్ తన విచక్షణ మేరకు ఈ వ్యవహారంతో తమకు సంబంధం లేదని తేల్చేశారు. ఈ విషయంలో ప్రభుత్వం మాత్రం అభాసుపాలైంది. ఆ తర్వాత ఆయన్ను తొలగించేందుకు ప్రయత్నించినా రాజ్యాంగ పదవి కాబట్టి అది సాధ్యంకాలేదు.

ఏపీ శాసనసభ ఆమోదించిన మూడు రాజధానుల బిల్లులను శాసనమండలిలో ఎలా అడ్డుకోవాలో విపక్ష టీడీపీకి తట్టలేదు. దీంతో తొలుత రూల్ 71 ప్రకారం అసాధారణంగా చర్చను కోరిన టీడీపీ, అది కాస్తా వర్కవుట్ కాకపోవడంతో ఛైర్మన్ గా ఉన్న తమ పార్టీ ఎమ్మెల్సీ షరీఫ్ కు విచక్షణాధికారాన్ని వాడాల్సిందిగా సలహా ఇచ్చింది. దీంతో ఆయన కీలకమైన రెండు బిల్లులను ఆమోదించకుండా, అటు తిరస్కరించకుండా విచక్షణాధికారం మేరకు సెలక్ట్ కమిటీకి పంపాలని సంచలన నిర్ణయం తీసుకున్నారు. దీంతో రెండోసారి విచక్షణాధికారంతో జగన్ కు ఎదురుదెబ్బ తగిలినట్లయింది. ఏపీలో కరోనా వైరస్ ప్రభావంతో స్ధానిక ఎన్నికల పోరును ఆరువారాల పాటు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించిన ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్.. తన విచక్షణ అధికారం మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. దీంతో విచక్షణ అనే పదం ప్రజల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారిపోయింది. రాజ్యాంగం ప్రకారం, బిజినెస్ రూల్స్ ప్రకారం వ్యవహరించలేని సందర్భాల్లో ఈ విచక్షణ అనే పదాన్ని ఆయా సంస్ధల అధిపతులుగా ఉన్నవారు తెరపైకి తీసుకొస్తున్నారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తమ విధులు నిర్వర్తించేందుకు బిజినెస్ రూల్స్ ఉన్నప్పుడు ఈ విచక్షణాధికారం ఎందుకు వాడాల్సి వస్తోందన్న చర్చ ఇప్పుడు సాగుతోంది. ఏ మూడు అంశాల మీద, ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి, రాష్ట్ర పూర్వ ఎన్నికల కమిషనర్ రమాకాంత్ రెడ్డి తో జరిగే భేటీ లో విస్తృతంగా చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

By
en-us Political News

  
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.
ఆ పార్టీ ప్రధాన ఆరోపణ ఏంటంటే.. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ అనుకూల సిబ్బందితో అర్హులైన వైసీపీ మద్దతుదారుల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని. గతంలో అంటే.. 2014 నుండి 2019 మధ్య కాలంలో కూడా ఇలాగే పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్చారని, ఇప్పుడు తమ పార్టీకి అండగా నిలిచే ఓటర్లను లక్ష్యంగా చేసుకుని జాబితా నుండి తొలగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తున్నది.
పైకి వైసీపీతోనూ, జగన్ కోటరీతోనూ విసిగిపోయానని, అందుకే బయటకు వచ్చేశాననీ విజయసాయి చెబుతున్నా.. ఆయన మాటలూ చేతలూ అన్ని జగన్ కు ప్రయోజనం చేకూర్చడానికే అన్నట్లుగా ఉంటాయి. ఉంటున్నాయి.
విశాఖపట్నం పరిపాలన రాజధాని అన్న జగన్ విధానాన్ని ధర్మాన బలంగా ప్రజలలోకి తీసుకువెళ్లడానికి శతధా ప్రయత్నించారు. ఉత్తరాంధ్ర సెంటిమెంట్‌ను రగిలిస్తూ, గ్రామగ్రామాన సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. అదేమీ ఫలించలేదని 2024 ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి.
వైసీపీ కోసం ఎంతగానో పరితపించిన ముద్రగడ.. కాపు రిజర్వేషన్ కోసం, కాపుల కోసం పోరాటం చేసి సంపాదించుకున్న ప్రాముఖ్యతనూ, ప్రతిష్టనూ..జగన్ కోసం ఔను కేవలం జగన్ కోసం వదులుకున్నారు. అటువంటి ముద్రగడ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే…జగన్ ఆయనను కనీసం పరామర్శించను కూడా పరామర్శించలేదు.
ఎన్నికల్లో ఘోర పరాజయంతో కేవలం 11 సీట్లకు పరిమితమైన తర్వాత, సరికొత్తగా మావిగన్ రాగం అందుకున్నారని విమర్శించారు.
పైపెచ్చు.. జిల్లాకు చెందిన పలువురు ముఖ్య నాయకులు జగన్ పాల్గొన్న కార్యక్రమాలకు ముఖం చాటేశారు. కొందరైతే తూతూమంతరంగా అలా వచ్చి, ఇలా వెళ్లిపోయారు.
ఆలా కిందపడిపోయిన పోలీసులు  ఆ తరువాత కల్వకుంట్ల కవితతో దురుసుగా వ్యవహరించిన తీరు పట్ల సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది.  కవితను పోలీసులు  పోలీస్ వాహనంలోకి దురుసుగా నెట్టేయడం సరికాదన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతున్నది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఎల్లప్పుడూ అత్యంత ఆసక్తికరమైన సంక్లిష్టమైన మలుపులకు వేదికగా నిలుస్తుంది.
ఉప్పల్‌లో ఈ రోజు తెలంగాణ ఉద్యమకారులు, మహిళల రక్తం చిందిందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు, ఉద్యమకారులపై పోలీసులు విచక్షణారహితంగా లాఠీఛార్జ్ చేశారని ఆరోపించారు.
ఈ అరెస్టు పై బీఆర్ఎస్‌ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. హరీష్ రావు అరెస్టు సందర్భంగా పోలీసులకు, బీఆర్ఎస్ శ్రేణులకు మధ్య తోపులాట జరిగింది. గురుకులాల్లో అవినీతి, రాష్ట్ర అప్పులపై గన్ పార్క్ వద్ద బహిరంగ చర్చకు సిద్ధమని మంత్రులు పొన్నం ప్రభాకర్‌, అడ్లూరి లక్ష్మణ్‌, అజారుద్దీన్‌.. బీఆర్‌ఎస్‌ నేతలు హరీశ్‌రావు, కేటీఆర్‌లకు సవాల్‌ విసిరారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.