చెప్తే వినడు.. గిల్లితే ఏడుస్తాడు

Publish Date:Mar 16, 2020

Advertisement

ఏపీ ముఖ్యమంత్రి జగన్ అనుభవ, అవగాహనా రాహిత్యంతో మాట్లాడుతున్నారని ప్రతిపక్షాలు చేసే విమర్శ..నిన్నటివరకూ జనాలు ఆ విమర్శలను రాజకీయ విమర్శలు గానే చూసారు. కానీ నిన్న జగన్ ఒకే ఒక్క ప్రెస్ మీట్ పెట్టి అవి విమర్శలు కాదు..నిజాలు అని నిరూపించారని కొందరు వైసీపీ నాయకులే అనుకుంటున్నారు..

ఎన్నికల అధికారులు నిర్వర్తించే విధులు ఏమిటి? వారికి ఉండే అధికారాలు ఏమిటి? అనే విషయాలు తెలుసుకుని మసలుకుంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి  జగన్ కి నేటి పరిస్థితి తలెత్తి ఉండేది కాదు. 151 సీట్లు వచ్చిన ముఖ్యమంత్రి ఇక ఎందుకు అని ప్రశ్నించడం ఆయన అపరిపక్వతకు నిదర్శనంగా నిలుస్తోంది.

70 స్థానాలలో 67 స్థానాలు వచ్చినప్పుడు కూడా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అక్కడి లెఫ్టెనెంట్ గవర్నర్ ను కాదని ఏం చేయలేకపోయారు. లెఫ్టెనెంట్ గవర్నర్ కేంద్రం నియమించిన వ్యక్తి, నేను 67 స్థానాలు వచ్చిన ముఖ్యమంత్రిని అని మొత్తుకున్నా ఎవరూ వినలేదు. వినరు కూడా. విన్నా ఫలితం లేదు. రాజ్యాంగం ప్రకారం సంక్రమించిన హక్కులను ఎవరూ ఏమీ చేయలేరు. 151 స్థానాలు వచ్చినంత మాత్రాన ఎన్నికల కమిషనర్ లేకుండా స్థానిక సంస్థల ఎన్నికలను జగన్ నేరుగా నిర్వహించలేరు కదా? స్థానిక సంస్థల ఎన్నికలు రాష్ట్ర ముఖ్యమంత్రి పరిధిలో ఉండే అంశం కాదు.
ఎన్నికల సంఘం ఆదేశాలను ఎన్నికల విధుల్లో ఉండే అధికారులు అందరూ పాటించాల్సిందే. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నప్పుడు 151 స్థానాలు వచ్చిన ముఖ్యమంత్రి అయినా 175కు 175 స్థానాలు వచ్చిన ముఖ్యమంత్రి అయినా పరిపాలనాయంత్రాంగంపై అజమాయిషీ చేయలేడు. ఎన్నికల కమిషనర్ ను నియమించేదే రాష్ట్ర ప్రభుత్వం.

అసలు ఇలా ఎన్నికల కమిషనర్ ను రాష్ట్ర ప్రభుత్వం నియమించడమే తగదని, ఇలా రాష్ట్ర ప్రభుత్వం నియమించిన అధికారి నిష్పక్ష పాతంగా ఉండడని అందువల్ల ఎన్నికల కమిషనర్లను నేరుగా కేంద్ర ప్రభుత్వం నియమించాలని లేదా కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాటు అయిన విధంగా రాష్ట్రంలో ఎన్నికల యంత్రాంగం ఉండాలనే డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది.

73,74 రాజ్యాంగ సవరణ జరిగినప్పుడు దీనిపై విస్తృతంగా చర్చ జరిగింది. ఆ తర్వాత అందరూ మర్చిపోయారు. అది వేరే విషయం. ఎన్నికల కమిషనర్ ను చంద్రబాబు పెట్టాడు అనడం అత్యంత దారుణం. చంద్రబాబు పెట్టినా సూరిబాబు పెట్టినా అప్పటి ముఖ్యమంత్రి హోదాలో నియామకం జరిగింది కాబట్టి అతనికి చట్ట ప్రకారం ఉన్న అధికారాలన్నీ దఖలు పడతాయి.ఇది బేసిక్ రూల్.

ఎన్టీరామారావు ముఖ్యమంత్రి అయిన కొత్తలో అసెంబ్లీ స్పీకర్ గా జీ నారాయణ రావు ఉండేవారు. ఆయన చెప్పినట్లు ఎన్టీరామారావు సభలో నడుచుకోవాల్సి వచ్చేది. ఇది ఆయనకు చాలా ఇబ్బందిగా ఉండేది. నా పార్టీ గుర్తు మీద నేను ఎమ్మెల్యేగా గెలిపించిన వ్యక్తిని నేను స్పీకర్ గా చేస్తే ఆయన చెప్పింది నేను వినాలా నేను చెప్పింది ఆయన వినాలా అని ఎన్టీరామారావు ప్రశ్నించారు.

స్పీకర్ గా ఎంపిక చేసే వరకే మీ నిర్ణయం ఆ తర్వాత ఆయన చెప్పినట్లే అసెంబ్లీ నడుస్తుంది అని అధికారులు వివరించి చెప్పారు. అలానా అంటూ ఎన్టీరామారావు ఆ నాటి నుంచి అసెంబ్లీ లో స్పీకర్ చెప్పినట్లే నడుచుకున్నారు. ప్రజాస్వామ్యంలో ఇవన్నీ తప్పదు.

కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారిగా టీ ఎన్ శేషన్ ఉండేవారు. ఆయన ఎన్నికల నిర్వహణలో ఎన్నోసంస్కరణలు తీసుకువచ్చారు. చట్టంలో ఉన్న అన్ని లొసుగులను సవరించారు. చట్టంలో ఉన్న అన్ని ప్రొవిజన్స్ ను వాడుకున్నారు. ఎన్నికలను క్రమబద్ధీకరించారు. ఆయన ధాటిని అప్పటికే అధికార పార్టీలు తట్టుకోలేకపోయేవి.

తిరుగులేని అధికారాలు ఉండే శేషన్ ను ఎలా వదిలించుకోవాలో ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించే పెద్ద పెద్ద వారికి కూడా అర్ధం కాలేదు. అప్పటిలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండేది. కాంగ్రెస్ పెద్దలు తీవ్రంగా ఆలోచించారు. చివరకు పరిష్కారం కనుగొన్నారు. దాన్ని ప్రజాస్వామ్యయుతంగా అమలు చేశారు. శేషన్ ‘‘నిరంకుశత్వం’’ తగ్గించారు. ఎలాగంటే.. చట్ట సవరణ చేసి కేంద్ర ఎన్నికల సంఘానికి ముగ్గుర్ని నియమించారు. అందులో ఒకరు ప్రధాన ఎన్నికల కమిషనర్ గా ఉంటారు. అయితే నిర్ణయాలు మాత్రం మెజారిటీ ప్రకారం తీసుకోవాలి. దాంతో మిగిలిన ఇద్దరూ శేషన్ దూకుడుకు అడ్డుగా నిలిచారు. ప్రజాస్వామ్య యుతంగా  కాంగ్రెస్ ఆడిన గేమ్ పారింది.

లక్షలకు లక్షలు జీతాలు ఇచ్చి సలహాదారులను పెట్టుకోవడం కాదు. తలఊపే అధికారులను చుట్టూ ఉంచుకోవడం కాదు. ప్రజాస్వామ్య బద్ధంగా ఏం చేయాలో తెలుసుకోవాలి. తెలియకపోతే తెలివితేటలు ఉన్న సలహాదారులను పెట్టుకోవాలి. వారు చెప్పింది వినాలి.

లేకపోతే కులాలను తిట్టుకుంటూ, వ్యవస్థలను అస్థిర పరచుకుంటూ మనశ్శాంతి కోల్పోవాల్సి వస్తుంది. తొమ్మిది నెలల ముందే జాగ్రత్తలు తీసుకుని ఉంటే ఇప్పుడు ఇంత ఆక్రోశానికి లోను కావాల్సిన అవసరం ఉండేది కాదు. దాన్నే పరిపాలనా అనుభవం అంటారు.

By
en-us Political News

  
కోల్‌కతాలోని కాళీఘాట్‌లోని మమతా బెనర్జీ అధికారిక నివాసం వద్ద భారీగా పోలీసులు, కేంద్ర బలగాలను మోహరించడం ఈ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తోంది. మమత నివాసానికి వెళ్లే అన్ని ప్రధాన మార్గాలను పోలీసులు తమ అధీనంలోకి తీసుకుని, భారీ పోలీసు వాహనాలతో పూర్తిగా దిగ్బంధించారు.
అనంతపురం జిల్లాకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.
ఆ పార్టీ ప్రధాన ఆరోపణ ఏంటంటే.. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ అనుకూల సిబ్బందితో అర్హులైన వైసీపీ మద్దతుదారుల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని. గతంలో అంటే.. 2014 నుండి 2019 మధ్య కాలంలో కూడా ఇలాగే పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్చారని, ఇప్పుడు తమ పార్టీకి అండగా నిలిచే ఓటర్లను లక్ష్యంగా చేసుకుని జాబితా నుండి తొలగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తున్నది.
పైకి వైసీపీతోనూ, జగన్ కోటరీతోనూ విసిగిపోయానని, అందుకే బయటకు వచ్చేశాననీ విజయసాయి చెబుతున్నా.. ఆయన మాటలూ చేతలూ అన్ని జగన్ కు ప్రయోజనం చేకూర్చడానికే అన్నట్లుగా ఉంటాయి. ఉంటున్నాయి.
విశాఖపట్నం పరిపాలన రాజధాని అన్న జగన్ విధానాన్ని ధర్మాన బలంగా ప్రజలలోకి తీసుకువెళ్లడానికి శతధా ప్రయత్నించారు. ఉత్తరాంధ్ర సెంటిమెంట్‌ను రగిలిస్తూ, గ్రామగ్రామాన సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. అదేమీ ఫలించలేదని 2024 ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి.
వైసీపీ కోసం ఎంతగానో పరితపించిన ముద్రగడ.. కాపు రిజర్వేషన్ కోసం, కాపుల కోసం పోరాటం చేసి సంపాదించుకున్న ప్రాముఖ్యతనూ, ప్రతిష్టనూ..జగన్ కోసం ఔను కేవలం జగన్ కోసం వదులుకున్నారు. అటువంటి ముద్రగడ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే…జగన్ ఆయనను కనీసం పరామర్శించను కూడా పరామర్శించలేదు.
ఎన్నికల్లో ఘోర పరాజయంతో కేవలం 11 సీట్లకు పరిమితమైన తర్వాత, సరికొత్తగా మావిగన్ రాగం అందుకున్నారని విమర్శించారు.
పైపెచ్చు.. జిల్లాకు చెందిన పలువురు ముఖ్య నాయకులు జగన్ పాల్గొన్న కార్యక్రమాలకు ముఖం చాటేశారు. కొందరైతే తూతూమంతరంగా అలా వచ్చి, ఇలా వెళ్లిపోయారు.
ఆలా కిందపడిపోయిన పోలీసులు  ఆ తరువాత కల్వకుంట్ల కవితతో దురుసుగా వ్యవహరించిన తీరు పట్ల సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది.  కవితను పోలీసులు  పోలీస్ వాహనంలోకి దురుసుగా నెట్టేయడం సరికాదన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతున్నది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఎల్లప్పుడూ అత్యంత ఆసక్తికరమైన సంక్లిష్టమైన మలుపులకు వేదికగా నిలుస్తుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.