ఈనెల 16న ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం

Publish Date:Dec 10, 2014

Advertisement

 

ఈనెల 18 నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ శీతాకాల సమావేశాలు మొదలవబోతున్నందున దానికి రెండు రోజుల ముందుగా అంటే ఈనెల 16న ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం నిర్వహించబోతున్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయం నిన్న ప్రకటించింది. ప్రభుత్వం ఇప్పటికే పంట రుణాల మాఫీ కార్యక్రమం మొదలుపెట్టింది కనుక ఆ అంశంపై ఇంతకాలం నానా రభస చేస్తూ దానిని అసెంబ్లీలో కూడా లేవనెత్తి ప్రభుత్వాన్ని ఇరుకున పెడదామనుకొన్న ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైకాపాకు ఇప్పుడు ఆ అవకాశం లేకుండా పోయింది. అయితే రాజధాని భూముల విషయం, సింగపూర్ సంస్థలతో ప్రభుత్వం చేసుకొన్న ఒప్పందంపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీయవచ్చును. రాజధాని భూముల సేకరణలో నేటికీ కొన్ని ఇబ్బందులున్నందున, దానినే అవకాశంగా మలుచుకొని వైకాపా ప్రభుత్వంపై విమర్శలు గుప్పించే ప్రయత్నం చేయవచ్చును.

 

సింగపూర్ సంస్థలతో చేసుకొన్న ఒప్పందం గురించి ఇప్పటికే ఆ పార్టీ రభస చేయడం గమనిస్తే, దానిపై వివాదం సృష్టించి ప్రజలలో లేనిపోని అనుమానాలు సృష్టించి అప్పుడు అసెంబ్లీలో కూడా ఆ అంశంపై రభస చేయాలని వైకాపా ఆలోచన కావచ్చును. అయితే పంట రుణాల మాఫీపై ఆ పార్టీ రభస చేస్తున్నప్పుడు కూడా దానిని చూసి చూడనట్లు ఊరుకొని చివరి నిమిషంలో రుణమాఫీ కార్యక్రమాన్ని ప్రకటించి ఆపార్టీ గాలి తీసేసినట్లే, బహుశః ఈ విషయంలో కూడా చంద్రబాబు తన వ్యూహం సిద్దం చేసుకొని ఉండవచ్చును. అందుకే ప్రభుత్వం అంత నిబ్బరంగా ఉన్నట్లు కనిపిస్తోంది. ఏమయినప్పటికీ ప్రభుత్వం విద్యుత్, పంట రుణాల మాఫీ, పెన్షన్లు, రాజధాని నిర్మాణం వంటి అన్ని అంశాలలో చురుకుగా ముందుకు అడుగులు వేస్తోంది కనుక ఈసారి కూడా అసెంబ్లీలో ప్రతిపక్షంపై దానిదే పైచెయ్యి కావచ్చును.

By
en-us Political News

  
గుజరాత్ రాజధాని కోసం లక్షల కోట్లు ఖర్చు చేసిన కేంద్రం, ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో 12 ఏళ్లు ఎందుకు తాత్సారం చేసిందంటూ కేంద్రాన్ని నిలదీశారు. అమరావతి బిల్లు ఆమోదం పొందడం అనేది.. ప్రభుత్వ విజయం కాదు, ఐదేళ్ల పాటు రోడ్లపై పోరాడిన అమరావతి రైతులు, మహిళలు సాధించిన విజయంగా అభివర్ణించారు రేణుకా చౌదరి. సభలో అడ్డంకులు కలిగించిన ఇతర ఎంపీలపై తనదైన శైలిలో పంచ్ డైలాగులు విసురుతూ, తెలుగు వారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ వీధుల్లో తాకట్టు పెట్టకండి అని గర్జించారు.
జగన్ రెడ్డి హేతురహిత రాజధాని ప్రతిపాదనపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అమరావతికి పార్లమెంట్ చట్టబద్ధత కల్పిస్తూ నిర్ణయాలు తీసుకుంటున్న వేళ.. జగన్ రాష్ట్ర అసెంబ్లీలో ఆ చట్టాన్ని సవరించవచ్చంటూ కొత్త రాగం అందుకోవడాన్ని ఆయన అవగాహనా రాహిత్యానికి నిలువెత్తు నిదర్శనంగా పరిశీలకులు అభివర్ణిస్తున్నారు.
అమరావతి విషయంలో సిఎం చంద్రబాబు నాయుడు చాలా తప్పులు చేశారనీ, అవినీతికి పాల్పడుతున్నాననీ గత రెండు రోజులుగా వైసీపీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలకు జగన్ ఈ ప్రెస్ మీట్ లో వంత పాడారు. ఓ పక్క అమరావతికి వ్యతిరేకం కాదంటూనే వైసీపీ నేతలతో శ్రీకాకుళంలో సభ ఏర్పాటు చేయించారు.
2026 బడ్జెట్ ప్రతిపాదనల ప్రకారం, కొత్త పన్ను విధానంలో రూ.7 లక్షల వరకు ఆదాయం ఉన్నవారికి ఎలాంటి పన్ను ఉండదు. సెక్షన్ 87A కింద రిబేట్ కలిపి.. వీరికి వెస‌లుబాటు ఉంటుంది. స్టాండ‌ర్డ్ డిడ‌క్ష‌న్ విష‌యానికి వ‌స్తే.. జీత‌భ‌త్యాలు పొందేవారికి ఇచ్చే స్టాండ‌ర్డ్ డిడ‌క్ష‌న్ ప్ర‌యోజ‌నాలు ఈ కొత్త విధానంలో కూడా కొన‌సాగుతాయి.
సుమారు వెయ్యి కోట్ల సామ్రాజ్యాన్ని ఆయ‌న త‌న కుమారుడు గౌత‌మ్ సింఘానియాకు రాసిచ్చాక‌.. ప‌డ్డ పాట్లు వ‌ర్ణ‌నాతీతంగా వ‌ర్ణించారు ముఖ్య‌మంత్రి.
నారా లోకేశ్ రేపోమాపో పూర్తిస్థాయిలో చంద్రబాబునాయుడి రోల్ పోషించే పరిస్థితి లేకపోయినా, యువనేత భవిష్యత్తుపై నిర్ణయం తీసుకోవడానికి గ్రౌండ్ ప్రిపేర్ అయినట్లు తెలుస్తోంది. లోకేశ్ రాజకీయ భవిష్యత్తుపై నిర్ణయించడానికి నారా, నందమూరి కుటుంబాలతో చంద్రబాబు అతిత్వరలో సమావేశం కానున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.
స్మ‌గ్ల‌ర్ వీర‌ప్ప‌న్ కూతురు విద్యారాణి తండ్రి అంత సంపాదిస్తే చందాలేసుకుని మ‌రీ చ‌ట్ట‌స‌భ‌ల‌కు వెళ్లాల్సిన దుస్థితి ఏంటి?
అమరావతికి, అక్కడి ప్రజలకు వైసీపీ ఎన్నడూ వ్యతిరేకం కాదంటూ మాట్లాడారు. గతంలో తాము వ్యతిరేకించినది చంద్రబాబు నాయుడు చూపించిన గ్రాఫిక్స్ రాజధానే అంటూ సన్నాయినొక్కులు నొక్కారు. అప్పట్లో చంద్రబాబు చేసిన ఊహాజనిత సృష్టినే తాము వ్యతిరేకించామనీ, గ్రాఫిక్స్ అమరావతిపైనే అప్పటి తమ అభ్యంతరాలనీ చెప్పుకొచ్చారు.
మడమ తిప్పను, మాట తప్పను, విశ్వసనీయతకు నిలువెత్తు రూపం అంటూ గతంలో పదేపదే చెప్పుకున్న జగన్ ఇప్పుడు.. నిత్యం అసత్యాలను వల్లెవేస్తూ.. విశ్వసనీయతను పూర్తిగా కోల్పోయారంటున్నారు.
గ‌త ఎన్నిక‌ల్లో అప్పటి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌వితను అరెస్టు చేయ‌కుంటే ఈ రెండు పార్టీల మ‌ధ్య లోపాయికారీ ఒప్పందం ఉన్న‌ట్టేనని జ‌నం అనుకుంటారని అన్నారు బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వ‌ర‌రెడ్డి. ఈ కామెంట్ ఎంత‌గా ప‌ని చేసిందంటే రేసులో సెకండ్ ప్లేస్ లో ఉన్న‌.. బీజేపీని థ‌ర్డ్ ప్లేస్ లో ప‌డేసింది. చావుతప్పి క‌న్ను లొట్ట‌బోయిన‌ట్టు.. బొటాబొటిగా 8 మంది ఎమ్మెల్యేల‌తో స‌రిపెట్టుకుంది బీజేపీ.
పెరిగిన జనాభాకు అనుగుణంగా అసెంబ్లీ, లోక్ సభ స్థానాలను పెంచాలన్న డిమాండ్, ప్రతిపాదనా చాలా కాలంగా ఉంది. అంతే కాకుండా నియోజ‌క‌వ‌ర్గం ఎంత చిన్న‌గా ఉంటే.. ప్ర‌జా ప్ర‌తినిధులు ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను అంత వేగంగా ప‌రిష్క‌రించ‌గ‌లుగుతారు. ఇక ప్రస్తత నియోజకవర్గాల పెంపు ప్రతిపాదన దాదాపు 30శాతం ఉంది. ఇది భారీ మార్పు అనే చెప్పాలి. అలాగే ఇందు కోసం రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుంది. ఆ రాజ్యాంగ సవరణ బిల్లు ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లోనే ప్రవేశపెట్టాలని కేంద్రం నిర్ణయించింది.
ప్రధాన ప్రతిపక్షం అయ్యుండీ ఎన్నికల సన్నాహాల విషయంలో ఇంత నిర్లప్తంగా, నిరాసక్తంగా వ్యవహరించడంతో పార్టీ క్యాడర్ లో అయోమయం నెలకొంది. ఎన్నికలంటేనే స్టార్ క్యాంపెయినర్ల పర్యటనలు, అగ్రనేతల ప్రసంగాలతో నానా హడావుడీ చేసే కాంగ్రెస్ లో ప్రస్తుతం నమ్మశక్యంకాని నిశ్శబ్ధం తాండవిస్తోంది.
బడి పిల్లలను శోభనం పెళ్లి కొడుకులతో పోలుస్తూ ప్రవచన కర్త గరికపాటి చేసిన వ్యాఖ్యలపై తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.