ఔను నేనే చంపేశాను.. సుబ్రహ్మణ్యం హత్యపై ఎమ్మెల్సీ అనంత బాబు

Publish Date:May 23, 2022

Advertisement

ఔను సుబ్రహ్మణ్యం ను నేనే హత్య చేశాను అని వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు అంగీకరించారు. ఈ విషయాన్ని పోలీసులే స్వయంగా వెల్లడించారు. ఎమ్మెల్సీ అనంతబాబును అరెస్టు చేయాలని ఓ పక్క మృతుడు సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులు, విపక్షాలూ ఆందోళన చేస్తుంటే.. పోలీసులు ఎమ్మెల్సీ అరెస్టును చూపకపోయినప్పటికీ, ఆయన తమ అదుపులోనే ఉన్నారనీ, విచారణ జరుపుతున్నామనీ లీకులు ఇస్తున్నారు. అలాగే తన మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యంను తానే హత్య చేసినట్లు ఎమ్మెల్సీ అనంతబాబు అంగీకరించినట్లు కూడా కాకినాడ పోలీసులు వెల్లడించారు. ఈ హత్యలో మరెవరికీ ప్రమేయం లేదనీ, తాను ఒక్కడినే హత్య చేశాననీ కూడా అనంతబాబు తమ ఎదుట అంగీకరించారని పోలీసులు మీడియాకు చెప్పారు.

వ్యక్తిగత విషయాలలో మితిమీరి జోక్యం చేసుకున్నందునే సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసినట్లు అనంతబాబు తమ విచారణలో అంగీకరించినట్లు పోలీసులు చెబుతున్నారు. 
అయితే మొదటి నుంచీ సుబ్రహ్మణ్యం హత్య కేసులో మొదటి నుంచీ పోలీసుల తీరు అనుమానాస్పదంగానే ఉంది. ఎలాగైనా ఈ కేసు నుంచి అనంత బాబును బయటపడేయాలన్నట్లుగా పోలీసుల తీరు బాగుంది. సుబ్రహ్మణ్యం మృతదేహాన్ని తన కారులోనే హతుడి నివాసం వద్దకు తీసుకువచ్చినా, ఎమ్మెల్యేపై పోలీసులు కేసు నమోదు చేయలేదు. కేవలం అనుమానాస్పద మృతి కిందే కేసు నమోదు చేశారు. బాధిత కుటుంబం, విపక్షాలూ పట్టుబట్టినా, నిలదీసినా పోస్టుమార్టం నివేదిక వచ్చే వరకూ తాము ఎవరిపైనా కేసులు నమోదు చేయమని భీష్మించారు. చివరకు పోస్టుమార్టంలో సుబ్రహ్మణ్యంది హత్యే నని తేలడంతో అనుమానాస్పద మృతి కేసును హత్య కేసుగా మార్చారు. పరారీలో ఉన్న అనంత బాబు కోసం గాలిస్తున్నామన్నారు. 

 అయితే సుబ్రహ్మణ్యం హత్య ఘటన అనంతరం కూడా ఎమ్మెల్సీ అనంతబాబు  బహిరంగంగా తిరిగారు. పోస్టుమార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత అధికారికంగా అనుమానాస్పద మృతి కేసును హత్య కేసుగా మార్చిన తర్వాతనే  ఆయన ఆజ్ఞాతంలోకి వెళ్లారు. ఆయన నేరుగా వెళ్లి సజ్జల రామకృష్ణారెడ్డితో సమావేశమయ్యారన్న ఆరోపణలు వినవస్తున్నాయి. తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూడా ఇదే ఆరోపణ చేశారు. సజ్జలతో మంతనాల తరువాతే అనంత బాబు నేరుగా పోలీసుల వద్దకు వచ్చి లొంగిపోయినట్లు అనుమానస్తున్నారు.  

అరెస్టు చూపితే వెంటనే అనంత బాబును జైలుకు పంపాల్సి వస్తుందన్న ఉద్దేశంతోనే పోలీసులు ఆయన అరెస్టును చూపడం లేదని పరిశీలకులు అంటున్నారు. సాయంత్రం కోర్టు సమయం అయిపోయే వరకూ ఆయన అరెస్టు చూపకుండా ఉంటూ, ఆయన బెయిల్ ప్రయత్నాలకు పోలీసు అధికారులు ఇతోధికంగా సహకరిస్తున్నారన్న అనుమానాలూ వినవస్తున్నాయి.   
మొత్తం మీద అనంతబాబు వ్యవహారం రాజకీయంగా వైఎస్ఆర్‌సీపీ అరాచకాలపై ఏపీ వ్యాప్తంగా చర్చ జరిగేలా చేసింది.

పోలీసుల విశ్వసనీయతపైనా ప్రజల్లో ఇప్పటి వరకూ ఉన్న అనుమానాలు, కేవలం అనుమానాలు కావనీ, అవి వాస్తవాలనీ సుబ్రహ్మణ్యం హత్య కేసులో కాకినాడ పోలీసుల తీరు తేల్చేసింది.   వైసీపీ నేతలయితే హత్యలు చేసినా ఎవరూ పట్టించుకోరన్న విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఎమ్మెల్సీ అయినా సరే ఉపేక్షించదు అన్న బిల్డప్ ఇవ్వడం కోసమే,  ఎమ్మెల్సీని అరెస్ట్ చేసినట్లు చూపించాలన్న ప్రభుత్వ ఆదేశాల మేరకు పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. లేకుంటే  ఇప్పటి వరకూ ఆయనను ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నట్లుగా చెబుతూ  వస్తున్న పోలీసులు ఇప్పుడు హాత్తుగా అనంత బాబును పోలీస్ కార్యాలయంలోనే విచారిస్తున్నామంటూ బయట పెట్టరు. 

By
en-us Political News

  
రాష్ట్రంలో వైసీపీ పాలన అంతమై రెండేళ్లు గడిచిన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోషల్ మీడియా వేదికగా భావోద్వేగ పోస్ట్ పెట్టారు. రాష్ట్ర చరిత్రలో జూన్ 4ని చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే రోజుగా అభివర్ణించారు.
భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు కోసం ప్రాణాలర్పించిన పొట్టి శ్రీరాములు వంటి మహనీయుడిని సైతం నేడు ఒకే ఒక్క కులానికి పరిమితం చేసే దుస్థితి మన రాష్ట్రంలో నెలకొందన్న పవన్ కల్యాణ్.. కులాల పేరుతో సమాజాన్ని విడదీసే ఈ దుర్మార్గపు రాజకీయాలకు ఎక్కడో ఒకచోట చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు. కులాల ఐక్యతే జనసేన పార్టీ మూల సిద్ధాంతమన్నారు.
గద్దర్ కుమార్తె వెన్నెల పవన్ కల్యాణ్ మాటలు తెలంగాణ అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని, తన తండ్రి గద్దర్ వారసత్వాన్ని అవమానించేలా ఉన్నాయని మండిపడ్డారు. ఈ మేరకు ఆమె సోషల్ మీడియా వేదికగా పవన్‌కు గట్టి కౌంటర్ ఇచ్చారు.
తమిళనాడు రాజకీయాలు ఎప్పుడూ ఆసక్తికరమైన మలుపులతో దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తుంటాయి.
పవన్ కళ్యాణ్‌పై తెలంగాణలోని కొన్ని రాజకీయ పార్టీల నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు.
చివరి గింజ ధాన్యం కొంటామన్న కాంగ్రెస్ సర్కార్  అప్పులు చేయడంలో రేవంత్ ప్రభుత్వం రికార్డులు సృష్టిస్తోందని విమర్శించిన కేటీఆర్..  రెండున్నరేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం  4 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసిందన్నారు.
లంగాణ ప్రజల దశాబ్దాల కల సాకారమైన రోజున ఇక్కడి సెంటిమెంట్‌ను దెబ్బతీసేలా మాట్లాడటం సరికాదన్నారు. గతంలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడినప్పుడు తాను 11 రోజుల పాటు అన్నం తినలేదని పవన్ కల్యాణే స్వయంగా చెప్పారనీ.. అలాంటి వ్యక్తి మళ్లీ ఇప్పుడు తెలంగాణకు తాను వ్యతిరేకం కాదంటూ ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తున్నారని కేటీఆర్ అన్నారు.
జగన్ ఎప్పుడెప్పుడు అధికారం నుంచి దిగిపోతారా అని దేవుళ్లకు పూజలు చేశారు, శాపనార్థాలు పెట్టారు. జగన్ అధికారంలో ఉంటే తమ అమరావతి కలలు ఎప్పటికీ ఫలించవని ఆవేదన చెందారు. అలాంటిది, ఇప్పుడు అదే అమరావతికి చెందిన రైతులు తాడేపల్లిలోని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాసానికి వెళ్లి, ఆయనతో సుదీర్ఘంగా భేటీ అయ్యారనే వార్త పొలిటికల్ సర్కిల్స్ నే కాకుండా సామాన్య ప్రజలను కూడా విస్మయానికి గురి చేసింది.
దశాబ్దాలుగా కోలీవుడ్ లో సంపాదించుకున్న తన స్టార్ డమ్ ను, ఫ్యాన్ ఫాలోయింగ్ ను ఓటు బ్యాంకుగా మార్చుకోవడంలో విజయ్ సఫలమయ్యారు. వీటన్నింటికీ తోడు తమిళనాట కరుణానిధి, జయలలిత వంటి దిగ్గజ నేతల మరణాల తర్వాత ఏర్పడిన రాజకీయ శూన్యం విజయ్ కు అనుకూలంగా మారింది.
ఈ విజయం కేవలం ఒక పదవి మాత్రమే కాదని, తన దశాబ్దాల కఠిన శ్రమకు, అంకితభావానికి దక్కిన అసలైన ఫలితమని ప్రకటించారు.
గతంలో మాతో పెట్టుకుంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిందని, ఇప్పుడు పెట్టుకుంటే మూతిపళ్ళు రాలుతాయని కవిత హెచ్చరించారు. అంతేకాకుండా, అక్కడ ఆంధ్రప్రదేశ్‌లో రాజధాని కట్టుకోవడం చేతకానివాళ్ళు, తెలంగాణ నవనిర్మాణం చేస్తారా అంటూ ఆమె ఎద్దేవా చేశారు.
అరవ శ్రీధర్‌పై ఓ మహిళా ప్రభుత్వ ఉద్యోగి లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన నేపథ్యంలో జనసేన నాయకత్వం దీనిపై త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.
పోలీసులు జనసేన సభకు నో చెప్పారు. వేలాది మంది అభిమానులు, వందలాది మంది ముఖ్య నాయకులు హాజరయ్యే ఇటువంటి కీలక సభకు చివరి నిమిషంలో పర్మిషన్ నిరాకరించడంపై జనసేన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.