తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో మరోసారి విభజన సెంటిమెంట్, ఆత్మగౌరవం అంశాలు తెరపైకి వచ్చాయి. తెలంగాణలో  జనసేన రాజకీయ ప్రణాళికలపై బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు  కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. వేలమంది బలిదానాలతో ఏర్పడిన తెలంగాణలో ప్రాంతీయ ఆకాంక్షలను, ఉద్యమాలను జనసేన గౌరవించాలని కేటీఆర్  పవన్ కు హితవు పలికారు. అయితే, ఈ వ్యాఖ్యలపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ నడుస్తోంది.   కేటీఆర్ సంధించిన ప్రశ్నలనే తిరిగి కల్వకుంట్ల కుటుంబానికి గురిపెడుతూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తెలంగాణ ఉద్యమ సమయంలో వేల మంది ప్రాణాలర్పించారని చెబుతున్న బీఆర్ఎస్ నాయకత్వం, అధికారంలోకి వచ్చాక కేవలం 500 మంది అమరవీరుల కుటుంబాలను మాత్రమే ఎందుకు ఆదుకుంది, మిగిలిన వారిని ఎందుకు విస్మరించిందన్న  ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. ఆ అమరవీరుల బలిదానాల ఫలాలు ఎవరు అనుభవించారో, ఎవరు వేల లక్షల కోట్ల ఆస్తులు కూడబెట్టుకున్నారో ప్రజలకు తెలుసంటూ జనసేన  మద్దతు దారులు ఎదురు దాడికి  దిగుతున్నారు. తమకు పదవులు, అధికార భాగ్యం కల్పించిన అమరజీవుల కుటుంబాలనే సరిగ్గా పట్టించుకోని కల్వకుంట్ల కుటుంబం..  ఇప్పుడు తెలంగాణలో జనసేన పార్టీ ప్రజల ఆకాంక్షలను గౌరవించాలని చెప్పడం విడ్డూరంగా ఉందంటున్నారు. గతంలో తెలంగాణ ఏర్పాటు సమయంలోనే ఆంధ్రాలో కూడా విభజనను వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగాయి. కానీ నాడు ఆ ఉద్యమాలను దొంగ ఉద్యమాలని కేసీఆర్, కేటీఆర్ ఎగతాళి చేశారనీ, ఇప్పుడు మాత్రం తెలంగాణ ఉద్యమాల గురించి ఎవరైనా మాట్లాడితే తమ ఆత్మగౌరవం దెబ్బ తింటోందంటూ ఎదురుదాడి చేయడం ఏమిటనీ నిలదీస్తున్నారు. కేసీఆర్ సెలైన్లు పెట్టుకుని చేసిన 10 రోజుల దీక్ష గురించే అంతలా గొప్పలు చెప్పుకునే బీఆర్ఎస్ నేతలు..  పొట్టి శ్రీరాములు  ప్రాణాలు కోల్పోయే వరకు చేసిన ఆమరణ నిరాహార దీక్షను చులకనగా మాట్లాడటం  అహంభావానికి నిలువెత్తు నిదర్శనంగా తూర్పారపడుతున్నారు.   ఈ వివాదం నేపథ్యంలో పవన్ కళ్యాణ్ చేసిన ఒక వ్యాఖ్య ఇప్పుడు   ప్రాధాన్యత సంతరించుకుంది. తెలంగాణలో తెలంగాణ సెంటిమెంట్ అనేది చాలా బలంగా ఉందనీ..  కానీ రాష్ట్ర విభజనతో తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రాలో మాత్రం అలాంటి సెంటిమెంటు ఏదీ లేదని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. అక్కడ జై ఆంధ్రా అనే వాళ్ళు కూడా కరువయ్యారని.. మూడు రాజధానులు అంటున్నా, ఇంకేం అంటున్నా అభ్యంతరం చెప్పేవారు ఎవరూ లేరని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే ఆంధ్రా వాళ్లంటే తెలంగాణ నాయకులకు ఇంత చులకన భావం ఏర్పడిందని పవన్ విశ్లేషించారు. గతంలో కేసీఆర్ ఏపీలో బీఆర్ఎస్ పార్టీని విస్తరించేందుకు ప్రయత్నించినప్పుడు, వైజాగ్ స్టీల్ ప్లాంట్ పేరుతో రాజకీయాలు చేసినప్పుడు ఆంధ్రా ప్రజలు పెద్దగా అభ్యంతరం చెప్పకపోవడమే ఇందుకు నిదర్శనంగా ఆయన పేర్కొన్నారు. గతంలో చంద్రబాబు నాయుడుని దెబ్బతీసేందుకు తెరచాటు రాజకీయాలు జరిగినప్పుడు కూడా  ఊరుకున్నారనీ పవన్ అన్నారు. ఈ డైలాగ్ వార్ తో ఏపీ, తెలంగాణలో మళ్లీ విభజన సెంటిమెంట్, ఆత్మగౌరవం వంటి అంశాలు తెరపైకి వచ్చాయి. 
 ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో సరిగ్గా రెండేళ్ళ క్రితం ఒక సరికొత్త అధ్యాయం మొదలైంది. 2024 జూన్ 4వ తేదీన విడుదలైన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు యావత్ రాష్ట్రాన్నివిస్మయపరిచాయి. 2019 ఎన్నికల్లో 151 సీట్లతో ప్రభంజనం సృష్టించిన వైసీపీ, ఐదేళ్లలోనే తీవ్ర ప్రజావ్యతిరేకత మూటగట్టుకుని ఘోరంగా పరాజయం పాలైంది. 2024 ఎన్నికలలో  వైనాట్ 175 అంటూ బీరాలు పలికిన జగన్.. తీరా ఎన్నికల ఫలితాలు వచ్చే సరికి కేవలం 11 స్థానాలతో సరిపెట్టుకోవలసి వచ్చింది.  ఐదేళ్ల పాటు రాష్ట్రంలో అధికారాన్ని చెలాయించిన ఆయనకు, ఆయన పార్టీకీ కనీసం విపక్ష హోదా కూడా ఇవ్వడానికి జనం నిరాకరించారు. ఇంతటి ఘోర పరాభవాన్ని మూటగట్టుకున్న తరువాత కూడా జగన్ లో కానీ, వైసీపీలో కానీ ఇప్పటికీ ఇసుమంతైనా మార్పు రాలేదు. ఇప్పటికీ..  క్షేత్రస్థాయి వాస్తవాలను, 2024 ఎన్నికలలో ప్రజలు తమను తిరస్కరించడం వెనుక ఉన్న కారణాలను అంగీకరించేందుకు కానీ, గుర్తించేందుకు కానీ వైసీపీ అధినేత జగన్, ఆయన పార్టీ సిద్ధంగా లేరు. అదే ఇప్పటికీ రాష్ట్రంలో జగన్ పట్ల, వైసీపీ పట్ల ప్రజా వ్యతిరేకత ఇసుమంతైనా తగ్గకపోవడానికి కారణంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ప్రజలు కేవలం నెలవారీ సంక్షేమ పథకాల లబ్ధిని మాత్రమే ఆశించరనీ, వాటితో పాటు సుస్థిరఅభివృద్ధి, ఉపాధి, ఆర్థిక స్వావలంబన, ప్రశాంతమైన జీవన వాతావరణం కూడా  కోరుకుంటారనే కనీస సత్యాన్ని ఇప్పటికీ వైసీపీ గుర్తించడం లేదని అంటున్నారు.  ప్రజల నిజమైన ఆకాంక్షలను పక్కనబెట్టి, కేవలం పార్టీ రాజకీయ,  ఆర్థిక ప్రయోజనాలకే   ప్రాధాన్యత ఇచ్చిన జగన్ గత ఎన్నికలలో పరాజయం పాలయ్యారు.   అప్పట్లో ఆయన రాజధాని అమరావతి నిర్ణయాన్ని వ్యతిరేకించి మూడు రాజధానులంటూ ఆడిన మూడుముక్కలాట కారణంగా ఆయన పార్టీ రాష్ట్రంలోని మూడు ప్రాంతాలలోనూ కుదేలౌంది. అంతటి ఘోర పరాజయం తరువాత రెండేళ్లయినా జగన్ లో కానీ, ఆయన పార్టీలో కానీ ఇసుమంతైనా మార్పు రాలేదనడానికి జగన్ తాజాగా ప్రస్తావించిన ‘మావిగన్’ ప్రతిపాదనే నిదర్శనమంటున్నారు.  
గత ఎన్నికల ఫలితాలను గుర్తుచేసుకుంటూ, జూన్ 4, 2024న ఆంధ్రప్రదేశ్ ప్రజలు అపూర్వమైన తీర్పునిచ్చారని సీఎం పేర్కొన్నారు. రాష్ట్రాన్ని విధ్వంసకర మార్గం నుంచి అభివృద్ధి, వికాసం వైపు నడిపించాలనే బలమైన సంకల్పంతోనే ప్రజలు కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టారని ఆయన పేర్కొన్నారు.  రాష్ట్రంలో వైసీపీ పాలన అంతమై రెండేళ్లు గడిచిన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు   సోషల్ మీడియా వేదికగా భావోద్వేగ పోస్ట్ పెట్టారు. రాష్ట్ర చరిత్రలో  జూన్ 4ని చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే రోజుగా  అభివర్ణించారు.  గత ఎన్నికల ఫలితాలను గుర్తుచేసుకుంటూ, జూన్ 4, 2024న ఆంధ్రప్రదేశ్ ప్రజలు అపూర్వమైన తీర్పునిచ్చారని సీఎం పేర్కొన్నారు. ప్రభుత్వ ప్రాధాన్యతలను వివరిస్తూ చంద్రబాబు నాయుడు తన ట్వీట్‌లో  గత రెండేళ్లుగా అంటే తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత రాష్ట్ర అభివృద్ధి, అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం నిరంతరం శ్రమిస్తోందని పేర్కొన్నారు.   రాష్ట్రాన్ని హెల్దీ , వెల్దీ),  హ్యాపీగా  మార్చడమే తమ ప్రభుత్వ ప్రధాన సంకల్పమని చంద్రబాబు ఆ పోస్టులో పేర్కొన్నారు.  ప్రజలు గర్వపడేలా   పాలన సాగిస్తున్నామన్న చంద్రబాబు..  రాష్ట్ర పునర్నిర్మాణంలో ప్రజల భాగస్వామ్యం, వారి నమ్మకమే తమకు కొండంత బలమనీ, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే రాబోయే రోజుల్లోనూ పాలన సాగుతుందని  పునరుద్ఘాటించారు.  
ALSO ON TELUGUONE N E W S
కోలీవుడ్ నటుడు, విలక్షణ దర్శకుడు రాధాకృష్ణన్ పార్థిబన్ తాజాగా తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. సినిమా రంగం నుంచి రాజకీయాల్లోకి అడుగుపెట్టి, సరికొత్త చరిత్ర సృష్టించిన విజయ్‌కు ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. అయితే, ఈ భేటీ ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ఒక పెద్ద చర్చకు దారితీసింది. గతంలో విజయ్, త్రిషల గురించి పార్థిబన్ చేసిన కొన్ని వ్యాఖ్యలను నెటిజన్లు ఇప్పుడు మళ్లీ తెరపైకి తెస్తున్నారు. ఈ భేటీలో పార్థిబన్‌తో పాటు మరో సీనియర్ నటుడు ఎంఎస్ భాస్కర్ కూడా పాల్గొన్నారు. సీఎం విజయ్‌కు పుష్పగుచ్ఛం అందించిన పార్థిబన్, ఆయనకు ఒక ప్రత్యేకమైన ఫోటో ఫ్రేమ్‌ను బహుమతిగా ఇచ్చారు. ఒక వైపు చిన్న మోడల్ సింహాసనాన్ని అమర్చి, చక్రవర్తి గెటప్‌లో ఉన్న విజయ్ ఫోటోతో కూడిన ఈ ఫ్రేమ్ అందరినీ ఆకట్టుకుంటోంది. దీనిపై తమిళంలో ఒక కవితాత్మకమైన సందేశాన్ని కూడా పార్థిబన్ రాసుకొచ్చారు. చందనపు ఛాయలతో కూడిన ప్రశాంతమైన పాలనను విజయ్ అందిస్తారంటూ అందులో కొనియాడారు. ఈ ఫోటోలు నెట్టింట వైరల్ కావడంతో, నెటిజన్లు గత ఎన్నికల సమయం నాటి విషయాలను గుర్తు చేస్తున్నారు. అప్పట్లో విజయ్, త్రిషల డేటింగ్ రూమర్స్ కోలీవుడ్‌ను షేక్ చేశాయి. చెన్నైలో జరిగిన ఒక పెళ్లి వేడుకకు వీరిద్దరూ కలిసి హాజరు కావడంతో రకరకాల ప్రచారాలు జరిగాయి. ఆ సమయంలో పార్థిబన్ స్పందిస్తూ.. త్రిషను కొన్నాళ్ల పాటు బయటకు రానివ్వకుండా ఇంట్లోనే ఉంచితే మంచిదంటూ కాస్త ఘాటుగా, వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. అది అప్పట్లో పెద్ద దుమారమే రేపింది. నాడు అంతలా విమర్శించిన పార్థిబన్, నేడు విజయ్ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించగానే స్వయంగా వెళ్లి కలవడంపై సోషల్ మీడియాలో భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. "అప్పట్లో అలా మాట్లాడి.. ఇప్పట్లో ఇలా గిఫ్టులు ఇస్తున్నారా?" అంటూ కొందరు నెటిజన్లు ట్రోల్ చేస్తుండగా, రాజకీయాలు వేరు, వ్యక్తిగత సంబంధాలు వేరని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. సినిమాల్లో తిరుగులేని రికార్డులు సృష్టించిన విజయ్, ఇప్పుడు రాజకీయాల్లోనూ ముఖ్యమంత్రిగా సరికొత్త ప్రస్థానాన్ని ప్రారంభించారు. 'లియో' వంటి బ్లాక్‌బస్టర్ చిత్రంలో విజయ్, త్రిషల జోడీని ప్రేక్షకులు ఎంతగానో ఆదరించారు. సినిమా పరంగా వీరిద్దరి కెమిస్ట్రీకి మంచి మార్కులు పడినా, వ్యక్తిగత విషయాలపై వచ్చిన రూమర్స్ మాత్రం ఇప్పటికీ ఏదో ఒక రూపంలో చర్చకు వస్తూనే ఉన్నాయి. ప్రస్తుతానికి పార్థిబన్, సీఎం విజయ్ లీడర్‌షిప్‌ను అభినందిస్తూ చేసిన ఈ భేటీ కోలీవుడ్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా నిలిచింది.
మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ నటించిన మోస్ట్ అవేటెడ్ మూవీ 'పెద్ది' ఎట్టకేలకు థియేటర్లలోకి వచ్చేసింది. దాదాపు ఏడాది కాలంగా ఈ సినిమా కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న మెగా అభిమానుల నిరీక్షణకు తెరపడింది. నిన్న రాత్రి నుంచే ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున ప్రీమియర్ షోలు పడటంతో థియేటర్ల వద్ద పండగ వాతావరణం నెలకొంది. థియేటర్ల లోపల, బయట రామ్ చరణ్ ఫ్యాన్స్ హంగామా అంతా ఇంతా కాదు. ఇలాంటి సమయంలో థియేటర్ లోపల జరిగిన ఒక ఆసక్తికర సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. సాధారణంగా పెద్ద హీరోల సినిమాలు రిలీజ్ అయితే అబ్బాయిలు థియేటర్లలో పేపర్లు చల్లడం, స్క్రీన్ల ముందుకు వెళ్లి డ్యాన్సులు వేయడం కామన్. కానీ, 'పెద్ది' సినిమా ప్రదర్శితమవుతున్న ఒక థియేటర్ లో ఒక లేడీ ఫ్యాన్ చేసిన రచ్చ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. సినిమాలో వచ్చే 'రైరై రారా' అనే హై-ఎనర్జీ సాంగ్‌కు థియేటర్ స్క్రీన్ ముందే ఆ లేడీ ఫ్యాన్ ఊరమాస్ లెవెల్లో స్టెప్పులేసింది. స్క్రీన్‌పై రామ్ చరణ్ ఏ రేంజ్ గ్రేస్‌తో అయితే డ్యాన్స్ చేశాడో, దానికి ఏమాత్రం తగ్గకుండా ఆ అమ్మాయి థియేటర్ లోపల దుమ్మురేపింది. అంతమంది చూస్తున్నారనే మొహమాటం లేకుండా, తన అభిమాన హీరో సినిమా చూస్తున్న ఆనందంలో ఆమె చేసిన డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అక్కడున్న వారందరినీ ఆశ్చర్యపరిచింది. ప్రస్తుతం ఈ లేడీ ఫ్యాన్ డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు "అభిమానం అంటే ఇది" అంటూ క్రేజీ కామెంట్లు పెడుతున్నారు. ఒక అమ్మాయి అయి ఉండి, అంతమంది జనం మధ్య అలా స్క్రీన్ ముందు మాస్ స్టెప్పులు వేయడం నిజంగా గ్రేట్ అంటూ నెటిజన్లు ఆమె ఎనర్జీని మెచ్చుకుంటున్నారు. ప్రీమియర్ షోల నుంచే ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తుండటంతో మెగా క్యాంప్‌లో జోష్ కనిపిస్తోంది. రామ్ చరణ్ ఊరమాస్ లుక్, దేవి శ్రీ ప్రసాద్ ఇచ్చిన అదిరిపోయే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, పాటలు సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయని టాక్ వినిపిస్తోంది. మొదటి రోజే రికార్డు స్థాయి వసూళ్లు సాధించే దిశగా 'పెద్ది' దూసుకుపోతోంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.
    ధురంధర్(Dhurandhar)రెండు భాగాలు సాధించిన ఘనవిజయం తెలిసిందే. ఈ రోజు నుంచి పార్ట్ 2 జియో హాట్ స్టార్ వేదికగా స్ట్రీమింగ్ అవుతుంది. రీసెంట్ గా  రిలయన్స్ ఇండస్ట్రీస్, జియో అధినేత ముకేశ్ అంబానీ తన షేర్ హోల్డర్లకి  రాసిన వార్షిక నివేదిక లేఖలో ధురంధర్  రికార్డులని  త్యేకంగా ప్రస్తావించడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.  ముకేశ్ అంబానీ తన లేఖలో  జియో స్టూడియోస్ కేవలం 350 కోట్ల సంయుక్త బడ్జెట్‌తో నిర్మించిన 'ధురంధర్', 'ధురంధర్: ది రివెంజ్' చిత్రాలు ప్రపంచవ్యాప్తంగా ఏకంగా  3,100 కోట్లకు పైగా వసూలు చేసి సరికొత్త చరిత్ర సృష్టించాయి. ఒకే ఒక్క ఫ్రాంచైజీతో భారతదేశం మొత్తం థియేట్రికల్ ఆదాయంలో దాదాపు 40 శాతం వాటాను సొంతం చేసుకున్నాం. స్త్రీ 2',  'ధురంధర్', ధురంధర్ పార్ట్ 2 తో వరుసగా మూడు సంవత్సరాలు అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాలని  అందించిన ఏకైక నిర్మాణ సంస్థగా జియో స్టూడియోస్ నిలిచింది. . ఈ ఘనత సంస్థ అగ్రెసివ్ మార్కెటింగ్ వ్యూహాలకి, తిరుగులేని కంటెంట్ మేనేజ్‌మెంట్‌కి  నిదర్శనమని ఆయన వ్యాఖ్యానించారు. Also read: Arjun Sarja: అర్జున్ చిన్నకుమార్తె అంజనా ప్రేమ పెళ్లి!.. వరుడు ఎవరో తెలిస్తే షాక్ అవుతారు ట్రేడ్ వెబ్‌సైట్ శాక్‌నిల్క్  గణాంకాల ప్రకారం.. కేవలం ఈ సిరీస్‌లోని రెండో భాగం 'ధురంధర్: ది రివెంజ్' మాత్రమే ప్రపంచవ్యాప్తంగా  1,812.96 కోట్ల భారీ వసూళ్లను సాధించింది. దీనితో ఆమిర్ ఖాన్ నటించిన 'దంగల్' తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన రెండవ భారతీయ చిత్రంగా  చరిత్ర పుటల్లోకెక్కింది.   
Nushrratt Bharuccha has finally addressed the viral controversy surrounding an Instagram story she allegedly posted during celebrations of Royal Challengers Bengaluru’s IPL victory. The issue began after a screen recording circulated widely online, with several users claiming that an unusual background sound in the clip was inappropriate. The video quickly sparked speculation across social media, with many questioning whether the clip had actually originated from the actress’ official account. Responding to the chatter, Nushrratt reportedly clarified that the audio being discussed had nothing to do with her. According to her explanation, the sound in question came from her pet cat, dismissing the claims and online assumptions surrounding the clip. She also pointed to supporting context to back her version and shut down the speculation. The controversy gained momentum largely because it surfaced during the frenzy surrounding RCB’s title celebrations, leading many users to react before verifying the source of the recording. Multiple reports and fact-check discussions later noted that there was no independently verified evidence proving that the viral version originated directly from the actress’s verified account. As conversations continued online, the incident once again highlighted how quickly edited clips, screen recordings, and assumptions can snowball into a full-blown social media debate — especially when celebrities and major sporting moments collide.   Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
టాలీవుడ్, బాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితమైన ఫిట్‌నెస్ ఫ్రీక్ రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh) జిమ్‌లో తనకు ఎదురైన ఒక భయానక ప్రమాదం గురించి సంచలన నిజాలను పంచుకుంది. నిరంతరం వర్కవుట్లు చేస్తూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ స్టార్ హీరోయిన్, ఇటీవల ఒక టాక్ షోలో తన భర్త జాకీ భగ్నానీతో కలిసి పాల్గొని తన జీవితాన్ని మార్చేసిన ఆ చీకటి రోజులను గుర్తుచేసుకుంది. ఒక చిన్న నిర్లక్ష్యం కారణంగా తను ఎంతటి నరకాన్ని అనుభవించిందో, అది తనను శారీరకంగానే కాకుండా మానసికంగా ఎంతలా కుంగదీసిందో వివరిస్తూ రకుల్ ఎమోషనల్ అయింది. ట్రైనర్లు ఏం చెప్పినా వినవద్దని, జిమ్‌లో చేసే డెడ్‌లిఫ్ట్ అనేది కేవలం 'ఈగో లిఫ్ట్' మాత్రమేనని, అది అత్యంత ప్రమాదకరమైన వ్యాయామమని రకుల్ ఇండస్ట్రీ వర్గాలకు మరియు ఫిట్‌నెస్ ప్రియులకు హెచ్చరికలు జారీ చేసింది. ఈ ప్రమాదం కొంతకాలం క్రితం రకుల్ ప్రీత్ సింగ్ జిమ్‌లో భారీ వర్కవుట్ చేస్తున్న సమయంలో జరిగింది. ఎలాంటి సేఫ్టీ బెల్ట్ ధరించకుండా రకుల్ ఏకంగా 80 కేజీల బరువైన డెడ్‌లిఫ్ట్ ఎత్తడానికి ప్రయత్నించింది. సాధారణంగా ఎప్పుడూ బెల్ట్ పెట్టుకునే అలవాటు ఉన్న రకుల్, ఆ ఒక్కరోజు మాత్రం అనుకోకుండా ఆ నియమాన్ని దాటవేసింది. బరువు ఎత్తిన వెంటనే ఆమె వెన్నుముక భాగంలో తీవ్రమైన ఇబ్బంది తలెత్తింది. ఆ బరువు ఒత్తిడికి రకుల్ వెన్నుముకలోని L4, L5 మరియు S1 నరాలు పూర్తిగా జామ్ అయిపోయాయి. దీనివల్ల ఆమె బ్లడ్ ప్రెజర్ ఒక్కసారిగా పడిపోయింది. ఆ సమయంలో తీవ్రమైన నొప్పి ఉన్నప్పటికీ, తన ప్రొఫెషనల్ కమిట్‌మెంట్‌ను గౌరవిస్తూ 'దే దే ప్యార్ దే 2' సినిమా షూటింగ్‌లో పాల్గొంది. వరుసగా రెండు రోజుల పాటు కేవలం కండరాల నొప్పులు తగ్గించే మెడిసిన్ వేసుకుంటూ రకుల్ షూటింగ్ పూర్తి చేయడం విశేషం. ఆ తర్వాత ఆమె పరిస్థితి అత్యంత దారుణంగా తయారైంది. నొప్పి తీవ్రత తట్టుకోలేక ఇంజక్షన్లు, మందులు వాడాల్సి వచ్చింది. వైద్యులు ఆమెను పరీక్షించి 'స్లిప్ డిస్క్' అయినట్లు నిర్ధారించి, కదలకుండా పూర్తి బెడ్ రెస్ట్ తీసుకోవాలని సూచించారు. అలా ఆ ఒక్క తప్పు రకుల్‌ను ఏకంగా 40 రోజుల పాటు మంచానికే పరిమితం చేసింది. దాదాపు 50 శాతం షూటింగ్ పూర్తయిన ఆ సినిమా కోసం రకుల్ ఎంతో కష్టపడాల్సి వచ్చింది. ఆ 40 రోజులు తాను ఒక కూరగాయలా మారిపోయానని, అసలు మళ్లీ జీవితంలో నిలబడతానా లేదా నడుస్తానా అనే భయం తనను వెంటాడిందని రకుల్ ఎమోషనల్ అయింది.  ఆ సమయంలో మూడు నెలల పాటు సినిమా షూటింగ్‌కు బ్రేక్ ఇవ్వాల్సి వచ్చింది. తిరిగి షూటింగ్‌కు వచ్చినప్పుడు కూడా ఆమె కనీసం కుర్చీలో సరిగ్గా కూర్చోలేకపోయేది. దాంతో సినిమాలోని సగం సీన్లను కేవలం ఫిజియోథెరపీ బెడ్‌పైనే చిత్రీకరించారని, అయితే స్క్రీన్‌పై చూసే ప్రేక్షకులకు అది అస్సలు తెలియకుండా జాగ్రత్త పడ్డారని రకుల్ వెల్లడించింది.  ఈ శారీరక నరకం కంటే మానసిక వేదన తనను మరింత ఎక్కువగా కుంగదీసిందని, హఠాత్తుగా ఏ పని చేసుకోలేని స్థితికి వెళ్లడం ఎంతో భయాన్ని కలిగించిందని పేర్కొంది. ఈ కష్టకాలంలో తన భర్త జాకీ భగ్నానీ తనకు అందించిన సపోర్ట్ వల్లే తాను కోలుకోగలిగానని, పూర్తిగా కోలుకోవడానికి దాదాపు ఒక సంవత్సరం పట్టిందని రకుల్ ప్రీత్ సింగ్ ఆ భయానక క్షణాలను పంచుకుంది.  
సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ ద్వారా విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న సెలబ్రిటీలు ఒక్కోసారి అనూహ్య వివాదాల్లో చిక్కుకుంటూ ఉంటారు. తాజాగా 'నందుస్ వరల్డ్' (Nandu's World) ఫేమ్, ప్రముఖ యూట్యూబర్ రామా నందన కుటుంబం ఇలాంటి ఒక తీవ్రమైన లీగల్ ఇష్యూలో ఇరుక్కుంది. యూకే వీసా రెన్యూవల్ చేయిస్తామంటూ లక్షలాది రూపాయలు వసూలు చేసి మోసానికి పాల్పడ్డారనే ఆరోపణలు ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారాయి. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌లో రామా నందన, ఆమె భర్త జాగర్లమూడి మధుకర్, అలాగే ఆయన తండ్రిపై చీటింగ్ కేసు నమోదైంది. మామిళ్లపల్లి శివక్రాంతి కుమార్ అనే బాధితుడు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. వీరు నిర్వహిస్తున్న 'డెస్టినీ కన్సల్టెన్సీ' ద్వారా ఈ మోసం జరిగినట్లు తెలుస్తోంది. సదరు బాధితుడి యూకే వీసా గడువు ముగిసిపోతుండటంతో, దానిని సులభంగా రెన్యూవల్ చేయిస్తామని నమ్మించి నందు ఫ్యామిలీ ఏకంగా రూ. 15 లక్షలు తీసుకున్నట్లు సమాచారం. అయితే నెలలు గడుస్తున్నా పని పూర్తి కాకపోగా, ఇచ్చిన డబ్బును కూడా తిరిగి ఇవ్వకుండా కాలయాపన చేయడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. తమకున్న యూట్యూబ్ పాపులారిటీని చూసే నమ్మి డబ్బులు ఇచ్చానని ఆయన వాపోతున్నాడు. ఒకప్పటి నటి అయిన రామా నందన, ఆ తర్వాత సోషల్ మీడియా వైపు అడుగులు వేసి తన ఫ్యామిలీ వ్లాగ్స్, రీల్స్ ద్వారా తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్‌లో ఈమెకు భారీగా ఫాలోయింగ్ ఉంది. ఈ పాపులారిటీ వల్లే వీరికి కొన్ని వెబ్ సిరీస్ లు, సినిమాల్లో కూడా అవకాశాలు దక్కాయి. ప్రస్తుతం ఈ వ్యవహారం టాలీవుడ్ ఇండస్ట్రీ సర్కిల్స్‌తో పాటు సోషల్ మీడియాలోనూ విపరీతమైన చర్చకు దారితీసింది. అంతేకాకుండా, యూకే ఉద్యోగాలు, వీసాల పేరుతో మరికొందరి దగ్గర కూడా వీరు రూ. 15 లక్షల నుండి రూ. 25 లక్షల వరకు వసూలు చేశారంటూ కొన్ని వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అయితే ఈ ఆరోపణలపై నందు ఫ్యామిలీ స్పందిస్తూ, తమపై కావాలనే కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని ఖండిస్తున్నట్లు సమాచారం. బాధితుడి ఫిర్యాదు మేరకు ఇబ్రహీంపట్నం పోలీసులు సెక్షన్ 515/2025 కింద కేసు నమోదు చేసి దర్యాప్తును వేగవంతం చేశారు. మరి ఈ వివాదం ఎలాంటి మలుపులు తిరుగుతుందో, ఈ యూట్యూబ్ స్టార్ జంట ఈ లీగల్ ఇష్యూ నుండి ఎలా బయటపడుతుందో చూడాలి.
తెలుగు చలనచిత్ర పరిశ్రమ గర్వించదగ్గ అద్భుత స్వరాల ప్రవాహం, గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం 80వ జయంతి సందర్భంగా తెలుగు లోకం ఆయనను ఘనంగా స్మరించుకుంటోంది. ఈ మైల్‌స్టోన్ బర్త్‌డే వేళ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎస్పీబీని గుర్తుచేసుకుంటూ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా అత్యంత భావోద్వేగ భరితమైన పోస్ట్ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తన నివాళిలో.. "ఆయన మధురమైన గొంతు కోట్ల మంది హృదయాలను గెలుచుకుంది. సంగీత ప్రపంచానికి ఆయనో అభిషేకం లాంటివారు. ఈ విశ్వంలో తెలుగు భాష ఉన్నంత కాలం ఆయన జీవించే ఉంటారు" అంటూ బాలుపై ప్రశంసల జల్లు కురిపించారు. బాలు భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన పాడిన వేలాది అజరామర గీతాలు నిరంతరం శ్రోతల గుండెల్లో మారుమోగుతూనే ఉంటాయని సీఎం పేర్కొన్నారు. నెల్లూరు మట్టి నుంచి పుట్టి విశ్వవ్యాప్తంగా తెలుగు కీర్తిని చాటిన బాలు.. తన సుదీర్ఘ సినీ ప్రస్థానంలో తెలుగు, తమిళం, కన్నడ, హిందీ సహా ఏకంగా 16 భాషల్లో 40 వేలకు పైగా పాటలు పాడి గిన్నిస్ రికార్డు సృష్టించారు. శంకరాభరణం, సాగrangeసంగమం, స్వాతిముత్యం వంటి ఎన్నో క్లాసిక్ చిత్రాలకు ఆయన పాడిన పాటలు తెలుగు సంస్కృతికి ఐకాన్లుగా నిలిచిపోయాయి. కేవలం సినిమా పాటలే కాకుండా భక్తి గీతాలు, శాస్త్రీయ సంగీతంలోనూ తనదైన ముద్ర వేశారు. కేవలం గాయకుడిగానే కాకుండా నటుడిగా, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా, సంగీత దర్శకుడిగా బహుముఖ ప్రజ్ఞ చాటిన పద్మవిభూషణ్ ఎస్పీబీ.. కమల్ హాసన్, రజనీకాంత్, చిరంజీవి వంటి స్టార్ హీరోలకు తన గొంతుతో ప్రాణం పోశారు. ప్రేమ, విరహం, దేశభక్తి, హాస్యం, చివరికి మరణం.. ఇలా మనిషి జీవితంలోని ప్రతి నవరసాన్ని శ్రోతలకు అనుభూతి చెందేలా పాడటం కేవలం బాలు గారికే సాధ్యమైంది. బాలు 80వ జయంతిని పురస్కరించుకుని ఆయన అభిమానులు, సంగీతకారులు దేశవ్యాప్తంగా వినూత్న కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో 'SPB – ఎయిటీ టు ఎటర్నిటీ' (SPB – Eighty to Eternity) పేరుతో ప్రత్యేక డిజిటల్ క్యాంపెయిన్ రన్ చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆయన పాడిన కొన్ని అరుదైన, మధురమైన గీతాలను ప్రతిరోజూ విడుదల చేస్తూ ట్రెండ్ చేస్తున్నారు. సినిమా ఇండస్ట్రీతో పాటు అటు చెన్నైలోని ప్రతిష్ఠాత్మక 'ది మ్యూజిక్ అకాడమీ' వేదికగా కూడా బాలుకు ఘన నివాళులర్పించేందుకు భారీ సంగీత విభావరి కార్యక్రమాలు ప్లాన్ చేశారు. తరాలు మారినా ఎస్పీబీ స్వర మాధుర్యం ఇప్పటికీ ఎవర్గ్రీన్ అని, ఆయన స్థానాన్ని భర్తీ చేయడం ఎవరికీ సాధ్యం కాదని ఇండస్ట్రీ వర్గాలు, నెటిజన్లు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు. ఈ ఏడాది బాలు జయంతి వేడుకలు డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ మొదలుకొని రియాలిటీ షోల వరకు సరికొత్త రూపంలో అలరించనున్నాయి. రానున్న రోజుల్లో ఆయన జ్ఞాపకార్థం మరిన్ని సంగీత కచేరీలు, స్పెషల్ ఆల్బమ్స్ యూట్యూబ్ వేదికగా విడుదల కాబోతుండటంతో బాలు అభిమానులు ఈ వేడుకల్లో భాగస్వామ్యం అవుతున్నారు.
Veteran producer and former Central Board of Film Certification (CBFC) chairman Pahlaj Nihalani passed away at the age of 76 on Thursday following health-related complications. His demise marks the end of a long and influential association with Hindi cinema spanning several decades. Nihalani made his mark as a producer during the commercial cinema boom of the 1980s and 1990s, backing several successful films and becoming a well-known figure in the industry. Over the years, he remained active across production and distribution while maintaining a strong presence in film circles. Apart from filmmaking, Nihalani gained nationwide attention during his tenure as CBFC chairman between 2015 and 2017. His term often made headlines due to his strict certification decisions and sparked frequent debates around censorship and creative freedom in Indian cinema. According to reports, he had been undergoing treatment for health complications in Mumbai. Industry colleagues and well-wishers have begun paying tribute to the veteran filmmaker and remembering his contribution to Indian cinema.   Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ (Kichcha Sudeep) కుటుంబం నుంచి మరో కొత్త వారసుడు వెండితెరకు పరిచయం అవుతున్నాడు. సుదీప్ మేనల్లుడు సంచిత్ సంజీవ్ (Sanchith Sanjeev) హీరోగా ఎంట్రీ ఇస్తున్న కన్నడ క్రైమ్ డ్రామా 'మ్యాంగో పచ్చా' (Mango Pachcha) జూన్ 5, 2026 న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. ఈ సినిమా విడుదల కంటే ముందే ఇండస్ట్రీ వర్గాల్లో మరియు మీడియా సర్కిల్స్‌లో విపరీతమైన బజ్‌ను క్రియేట్ చేస్తోంది.  ఇటీవల బెంగళూరులోని కిచ్చా సుదీప్ నివాసంలో మీడియా కోసం ప్రత్యేకంగా ఒక ప్రైవేట్ స్క్రీనింగ్‌ను ఏర్పాటు చేశారు. ఈ స్పెషల్ షోను వీక్షించిన మీడియా వారు సోషల్ మీడియా వేదికగా సినిమాపై తన తొలి స్పందనను పంచుకున్నారు. వారు ఇచ్చిన పాజిటివ్ రివ్యూ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో సినిమాపై అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఈ చిత్రంలో సంచిత్ సంజీవ్ నటనకు అద్భుతమైన మార్కులు పడ్డాయి. సంచిత్ కేవలం ఒక స్టార్ హీరో బ్యాక్‌గ్రౌండ్‌తో మాత్రమే కాకుండా, పూర్తి స్థాయి శిక్షణతో ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్నాడని ప్రశంసిస్తున్నారు. సంచిత్ ప్రఖ్యాత న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీలో యాక్టింగ్ మరియు ఫిల్మ్ మేకింగ్‌ కోర్సులు పూర్తి చేశాడు. అంతేకాదు గతంలో సుదీప్ బ్లాక్‌బస్టర్ హిట్ చిత్రం ‘మాణిక్య’కు అసిస్టెంట్ డైరెక్టర్‌గా తెరవెనుక పనిచేసి ఇండస్ట్రీపై మంచి అవగాహన పెంచుకున్నాడు. సినిమాలో సంచిత్ డైలాగ్ డెలివరీ, బాడీ లాంగ్వేజ్ మరియు స్క్రీన్ ప్రెజెన్స్ చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాయని అంటున్నారు. కొన్ని యాక్షన్ సీక్వెన్స్ మరియు ఎమోషనల్ సీన్స్‌లో సంచిత్ నటన, బాడీ లాంగ్వేజ్ కిచ్చా సుదీప్ కెరీర్ ప్రారంభ రోజుల్లోని నటనను మరియు మేనమామ మ్యానరిజమ్స్‌ను గుర్తుచేస్తుందని చెబుతుండటం విశేషం. ఈ సినిమా కథాంశం విషయానికి వస్తే, 2001 నుండి 2011 మధ్య కాలంలో మైసూర్ అండర్‌వరల్డ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగుతుంది. ఒక సాధారణ యువకుడు మైసూర్ నేర సామ్రాజ్యంలో అత్యంత ప్రమాదకరమైన, అందరూ భయపడే 'మ్యాంగో పచ్చా'గా ఎలా రూపాంతరం చెందాడనే గ్రిప్పింగ్ పీరియడ్ డ్రామాగా దర్శకుడు వివేక దీనిని తెరకెక్కించారు.  ఆ రోజుల్లోని మైసూర్ వాతావరణాన్ని రీక్రియేట్ చేయడానికి మేకర్స్ పడిన కష్టం తెరపై స్పష్టంగా కనిపిస్తోందని విమర్శకులు అభినందిస్తున్నారు. ముఖ్యంగా ఆ కాలం నాటి కాస్ట్యూమ్స్, పాతకాలపు వాహనాలు మరియు లొకేషన్లు ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. ఈ సినిమాలో కాజల్ కుందర్, ప్రశాంత్ హిరేమఠ్, మయూర్ పటేల్, జై, ఉగ్రమ్ మంజు కీలక పాత్రలు పోషించారు. చరణ్ రాజ్ అందించిన సంగీతం, శేఖర్ చంద్ర, స్వామిల సినిమాటోగ్రఫీ సినిమాను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లాయని తొలి రివ్యూ ద్వారా తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్ వెనుక కిచ్చా సుదీప్ సపోర్ట్ పూర్తిగా ఉంది. ఆయన కేవలం సినిమా డెవలప్‌మెంట్‌లో సలహాలు ఇవ్వడమే కాకుండా, ఈ చిత్రానికి వాయిస్ ఓవర్ కూడా అందించారు.   
  యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా(Arjun Sarja)చిన్న కుమార్తె అంజనా సర్జా(Anjana sarja)ఈ ఏడాది అక్టోబర్‌లో వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నట్లు ప్రచారం జరుగుతోంది.  న్యూయార్క్‌లోని ప్రతిష్టాత్మక విద్యాసంస్థ పార్సన్స్ స్కూల్ ఆఫ్ డిజైన్‌లో చదువుకున్న అంజనా ప్రస్తుతం ఫ్యాషన్ డిజైనర్‌గా, వ్యాపారవేత్తగా మంచి గుర్తింపు సంపాదించారు. ఆమె స్థాపించిన ‘SARJAA’ బ్రాండ్ పర్యావరణహిత లగ్జరీ హ్యాండ్‌బ్యాగ్స్ తయారీలో ప్రత్యేక గుర్తింపు పొందింది. పండ్ల వ్యర్థాలు, యాపిల్, పైనాపిల్, కాక్టస్ వంటి సహజ పదార్థాలతో రూపొందించే ఈ బ్యాగ్స్ అంతర్జాతీయ మార్కెట్లో ఆదరణ పొందుతున్నాయి. అంజనా  ఓ అమెరికన్ యువకుడితో ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది. విదేశాల్లో చదువుకునే సమయంలో ప్రారంభమైన ఈ పరిచయం ప్రేమగా మారి, కాలక్రమేణా మరింత బలపడింది. గత ఏడాది ఇటలీలోని అందమైన పర్యాటక ప్రాంతం లేక్ కోమోలో కుటుంబ సభ్యుల సమక్షంలో వీరి నిశ్చితార్థం జరిగినట్లు సమాచారం. ఈ వేడుకని  అత్యంత ప్రైవేట్‌గా నిర్వహించినట్లు వార్తలు సైతం వచ్చాయి. ఈ మేరకు అక్టోబర్ నెలలో వివాహం చేసుకోనున్నారని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే పెళ్లి ఏర్పాట్లు కూడా ప్రారంభమైనట్లు కొన్ని కథనాలు పేర్కొంటున్నాయి. అయితే  ఈ విషయంపై అర్జున్ కుటుంబ సభ్యుల నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. అర్జున్ తన పెద్ద కుమార్తె ఐశ్వర్య ని హీరోయిన్ గా పరిచయం చేస్తు 'సీతాపయనం' అనే మూవీని తెరకెక్కించిన విషయం తెలిసిందే.  Also read: vijay deverakonda: గండికోటలో విజయ్ దేవరకొండ.. హై ఓల్టేజ్ యాక్షన్ రచ్చ  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
భారతదేశంలో వివాహానికి ముందు జాతకాల పొంతనను చూస్తారు. మరీ ముఖ్యంగా పెద్దలు కుదుర్చే పెళ్లిలో జాతకాల ప్రాముఖ్యత చాలా ఎక్కువగా ఉంటుంది.  జాతకాలు సరిపోతే..  గ్రహాలు , నక్షత్రాల అనుకూలంగా ఉంటే వైవాహిక బంధం ఎంతో బలంగా,  భార్యాభర్తలు ఎంతో సంతోషంగా ఉంటారని కూడా పేర్కొంటారు.  అయితే కేవలం జాతకాల ఆధారంగా జీవిత భాగస్వామిని ఎంచుకోవడం సరిపోదని రిలేషన్షిప్ నిపుణులు అంటున్నారు. బలమైన , సంతోషకరమైన సంబంధం కావాలంటే..  ఆలోచనలు, విలువలు, ప్రవర్తన , భవిష్యత్తు గురించి సరైన ప్రణాళిక, అవగాహన అన్నీ కూడా పొంతన కుదరడం జాతకాల కంటే ముఖ్యమైన విషయం. ఇందకోసం వివాహానికి మందు జాతకాల పొంతన కుదిరిందా లేదా అనే విషయం కంటే ఇటీవల వివాహానికి ముందు  కొన్ని ప్రశ్నలు అడగడం ద్వారా భాగస్వామిని ఎంచుకోవడం మంచిదని, ఇలా చేయడం వల్ల జీవితం ఎంతో బాగుటుందని అంటున్నారు. ఇంతకీ వైవాహిక బంధంలోకి వెళ్ళేముందు కాబోయే భాగస్వామిని అడగవలసిన ప్రశ్నలు ఏంటో తెలుసుకుంటే.. సంతోషకరమైన జీవితం అంటే.. పెళ్లికి ముందు తెలుసుకోవలసిన  ముఖ్యమైన విషయం ఏమిటంటే..  సంతోషకరమైన జీవితం అంటే ఏమిటో అర్థం చేసుకోవడం. కొందరు వృత్తికి, విజయానికి ప్రాధాన్యత ఇస్తే, మరికొందరు కుటుంబానికి, స్థిరమైన జీవితానికి విలువ ఇస్తారు. ఇద్దరికీ జీవితంపై వేర్వేరు అంచనాలు ఉంటే, అది భవిష్యత్తులో విభేదాలకు దారితీయవచ్చు. అందువల్ల, ఇద్దరి కలలు , ప్రాధాన్యతల గురించి ఓపెన్ గా  చర్చించుకోవడం ముఖ్యం. ప్రేమ అంటే అర్థం.. ఒక సంబంధానికి పునాది ఇద్దరు భాగస్వాముల ప్రేమ ఎలా ఉంటుంది అనే విషయం పైన ఆధారపడి ఉంటుంది. బాల్యం, కుటుంబ నేపథ్యం , గత అనుభవాలు తరచుగా మనం ప్రేమను చూసే విధానాన్ని  తీర్చిదిద్దుతాయి. భార్యాభర్తల మధ్య సంబంధంలో గౌరవం, నమ్మకం , ఒకరితో ఒకరు మాట్లాడే తీరు.. వీటన్నింటి గురించి భాగస్వామికి  ఎలాంటి అభిప్రాయం ఉందో అర్థం చేసుకోవడం ముఖ్యం. వివాహం తర్వాత భార్యాభర్తల మధ్య ప్రేమ అనేది చాలా విషయాలలో ముడి పడి ఉంటుంది. అంచనాలు.. కుటుంబానికి సంబంధించిన అంచనాల గురించి కూడా స్పష్టంగా చర్చించుకోవాలి. వివాహం తర్వాత కుటుంబ పాత్ర, తల్లిదండ్రులతో కలిసి జీవించాలా లేక విడిగా జీవించాలా, పిల్లల గురించి  అభిప్రాయాలు, నిర్ణయాలు ఏమిటి, ముఖ్యమైన విషయాలు, నిర్ణయాలలో  కుటుంబ సభ్యుల ప్రమేయం ఎంతవరకు ఉండాలి వంటి విషయాలపై ముందుగానే స్పష్టత ఉండటం మంచిది. ఎందుకంటే భవిష్యత్తులో తలెత్తే అనేక గొడవలను ఈ స్పష్టత నివారిస్తుంది. బంధం నిర్వహణ.. ప్రతి సంబంధంలోనూ అభిప్రాయ భేదాలు రావడం సహజం, కానీ వాటిని ఎలా పరిష్కరిస్తారనేదే అత్యంత ముఖ్యం. పెళ్లికి ముందు కోపం, ఒత్తిడి లేదా అభిప్రాయ భేదాల వంటివి ఎదురైనప్పుడు   భాగస్వామి ఎలా స్పందిస్తారో అర్థం చేసుకోవడం ముఖ్యం. వారు మాట్లాడటం  ద్వారా సమస్యలను పరిష్కరించుకుంటారా లేదా వాటిని తప్పించుకుంటారా అనేది సంబంధం ఎంత బలంగా ఉంటుంది అనే విషయంలో  కీలక పాత్ర పోషిస్తుంది. అలవాట్లు, ప్రవర్తన.. పైన చెప్పుకున్న విషయాలే కాకుండా  రోజువారీ అలవాట్లు , ప్రవర్తనను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. ఆర్థిక నిర్వహణ, బాధ్యతలను నిర్వర్తించడం, ఒత్తిడి గా ఉన్నప్పుడు దాన్ని నియంత్రించుకోవడం,  పరస్పర ప్రవర్తన వంటి చిన్న విషయాలు  సంబంధాన్ని ఎన్నేళ్లు గడిచినా ఎంతో సంతోషంగా ఉంచగలవు.  ఈ అలవాట్లు వివాహం తర్వాత అకస్మాత్తుగా మారవు, కానీ ఎక్కువగా బాగా స్పష్టంగా కనిపిస్తాయి. పైన చెప్పుకున్న విషయాలను పెళ్లికి ముందు భాగస్వాములు ఇద్దరూ మాట్లాడుకోవడం వల్ల పెళ్లి తర్వాత అబిప్రాయ బేధాలు లేదా మనస్పర్థలు రాకుండా ఉండేందుకు సహాయపడతాయి.   జీవితంలో ఒక్కసారి ముడిపడే బంధాన్ని జీవితాంతం పదిలంగా ఉంచుకోవచ్చు.                                         *రూపశ్రీ.
వివాహం ప్రతి ఒక్కరి జీవితంలో చాలా కీలకం. వివాహ వయస్సు కాలక్రమేణా పెరుగుతోంది. చదువు పూర్తయిన తర్వాత అబ్బాయి అయినా  అమ్మాయి అయినా  కెరీర్‌లో స్థిరపడిన సెటిల్ అయిన తర్వాత  మాత్రమే వివాహం చేసుకోవాలనుకుంటారు. అబ్బాయిలు ఆలస్యంగా వివాహం చేసుకోవడం పెద్దగా సమస్య కాదు, కానీ పెద్ద వయసులో అమ్మాయిలకు మంచి సంబందాలు రావడం లేదన్నది ఒప్పుకోవాల్సిన నిజం.  అమ్మాయిలకు వివాహానికి సరైన వయస్సు ఏమిటి అనే  విషయంపై సరైన స్పష్టత ఎక్కడా లేదు. అబ్బాయిల మాదిరిగానే అమ్మాయిలు కూడా మొదట తమ కెరీర్‌ను నిర్మించుకోవాలని, ఆ తర్వాత వివాహం చేసుకోవాలని కోరుకుంటున్నారు. కానీ 30ఏళ్ల  తర్వాత ఆడపిల్లల తల్లిదండ్రులకు పెద్ద సవాల్ ఎదురవుతోంది. దీనిగురించి రెలేషన్షపి నిపుణులు చెబుతున్న విషయాలు ఏంటో తెలుసుకుంటే.. కెరీర్ అడ్డంకి.. గతంలో ఆడపిల్లల చదువు, కెరీర్ కు ఇంత ప్రాముఖ్యత లేదు.  టెంత్,  ఇంటర్,  డిగ్ర లాంటివి పూర్తవ్వగానే ఆడపిల్లలకు పెళ్ళి చేసేవారు. పెళ్లి తర్వాత మహిళలు కూడా ఇంటిని,  భర్త,  పిల్లలు, అత్తమామలను చూసుకుంటూ ఉండే వారు. కానీ నేటికాలంలో అలా లేదు.. తల్లిదండ్రులు ఆడపిల్లలను కూడా కొడుకులతో సమానంగా చదివిస్తున్నారు. ఆడపిల్లలు తమ కెరీర్ ను అద్బుతంగా మలుచుకోవడంలో సపోర్ట్ చేస్తున్నారు. దీని వల్ల ఆడపిల్లలు కూడా తమ కెరీర్ ను బిల్డ్ చేసుకుని సెటిల్ కావడానికి సమయం పడుతోంది.  అది కాస్తా 30 ఏళ్ల వరకు వివాహానికి దూరం ఉండేలా చేస్తోంది. ఇదే తల్లిదండ్రులకు పెద్ద సవాల్ గా మారుతోంది.  ఆర్థిక స్వాతంత్ర్యం సంపాదించిన కూతురికి పెళ్లి చేయడం చాలా కష్టతరంగా మారింది. అబ్బాయిలకు కాస్త బెటర్.. అమ్మాయిల మాదిరిగానే పెద్ద వయసు అబ్బాయిలకు  కూడా వివాహం చేసుకోవడంలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. అయితే అబ్బాయి బాగా సంపాదిస్తే చిన్న వయసు అమ్మాయిల నుండి సంబంధాలు వస్తుంటాయి.  తల్లిదండ్రులు  తమ కూతురికి  ఆర్థిక భద్రత కల్పించే వ్యక్తికి ఇచ్చి వివాహం చేయాలని అనుకుంటారు. అయితే అమ్మాయిల విషయంలో అలా కాదు. ఒక అమ్మాయి ఎంత సంపాదించినా, ఆమె పెద్దది అయితే మంచి జత దొరకడం కష్టంగా ఉంటుంది. అబ్బాయిలు ఆశించడమే పెద్ద సమస్య.. కాలం ఎంత మారినా అది మగవారి ఆలోచనలు మార్చలేకపోతోంది.  మగవాళ్లకు తమ భార్యల పట్ల ఉన్న అవగాహన పెద్దగా మారలేదు. చాలా మంది మగవాళ్లు ఎక్కువగా ఆశిస్తున్నారనే మాట చాలా నిజం.  భార్య అటు ఉద్యోగం చేసి సంపాదించాలి,  అలాగే ఇటు ఇంటికి రాగానే ఇంటి పనులు అన్నీ ఆమె చేసి భర్తకు సేవలు చేస్తూ పిల్లలను కూడా చూసుకోవాలని కోరుకుంటారు.  చాలా సార్లు తమ తల్లితో భార్యను పోలుస్తారు,  వస్త్రధారణ నుండి అమ్మాయి పరిచయాల వరకు, స్నేహితులు, వ్యక్తిగత స్పేస్ వంటి విషయాలలో కూడా ఆబ్బాయిలు అమ్మాయిలను చికాకు పెడతారు. ఇలాంటివి అమ్మాయిలకు చాలా ఇబ్బంది కలిగిస్తాయి.  ఇవి కాస్తా వైవాహిక జీవితంలో అడ్డంకులకు కారణం అవుతున్నాయి. అమ్మాయిల వయసు పెరిగితే ఇదే సమస్య.. 30ఏళ్ళ తర్వాత అమ్మాయిలకు వివాహం విషయంలో ఎదురయ్యే అతి పెద్ద సమస్య అమ్మాయి సంతానోత్పత్తి ఆమె వయస్సుతో ముడి పడి  ఉంటుంది. వయస్సు పెరిగే కొద్దీ అమ్మాయి సంతానోత్పత్తి తగ్గుతుంది. అమ్మాయి పెద్దదైతే ఆ జంట పిల్లల కోసం ముందుగానే ప్రణాళిక వేసుకోవాలి. ఇది వైవాహిక జీవితాన్ని సరిగ్గా ఆస్వాదించకుండా చేస్తుంది. నేటి కాలంలో అమ్మాయిలు ఆర్థిక విషయం నుండి చాలా వరకు స్వతంత్రత కలిగి ఉన్నారు.  తన సొంత ఆలోచన ఉంటుంది. ఆమె తన భర్త లేదా కుటుంబం చెప్పే ప్రతిదానితో ఏకీభవించలేదు. ఆమె తన సొంత ఆలోచనకు కూడా ప్రాధాన్యత ఇస్తుంది. ఇదే భార్యభర్తల మధ్య సమస్యలు సృష్టిస్తోంది. సరైన వయసు.. మేజర్ అయితే చాలు అమ్మాయిలు, అబ్బాయిలు వివాహానికి అర్హత పొందుతారు. కానీ వివాహానికి  సరైన వయసు అనేది వ్యక్తిగతంగా ఉంటుంది.  అమ్మాయిలు కెరీర్ ను సీరియస్ గా తీసుకోవడం వివాహానికి ఇబ్బంది కలిగించే విషయమే అయినప్పటికీ చాలా మంది మహిళలు తమ కెరీర్ ను తొందరగా సెటిల్ చేసుకుని సరైన జోడి వెతుక్కుని హాయిగా సెటిల్ అవుతున్నారు.  అంటే.. వివాహం విషయంలో అబ్బాయిల  ఆలోచన కూడా ముఖ్యం.  వారు కూడా మారితేనే భార్యాభర్తల వైవాహిక జీవితం బాగుంటుంది.                           *రూపశ్రీ.  
భార్యాభర్తల బంధం ఈ ప్రపంచంలో చాలా విభిన్నమైనది,  ఎంతో విశిష్టమైనది. భార్యాభర్తల బంధం నేటికాలంలో చాలా సున్నితంగా మారిపోయింది. ఏ విషయానికి ఎప్పుడు ఎలా గొడవలు వచ్చి, బంధం విచ్చిన్నమవుతుందో చెప్పలేం.  ఇలాంటి పరిస్థితిలో అతిగా మాట్లాడం లేదా ఎక్కువ మాట్లాడటం కూడా భార్యాభర్తల బంధాన్ని విచ్చిన్నం చేస్తుందని అంటున్నారు రెలేషన్షిప్ నిపుణులు. జరిగే ప్రతి విషయాన్ని తమ భాగస్వామితో పంచుకోవడం, ప్రతి విషయాన్ని చర్చించడం, అన్ని విషయాలు తమకు తెలిసి జరగాలి అనుకోవడం, ప్రతి చిన్న విషయం గురించి మాట్లాడటం.. ఇలా ప్రతిదీ భాగస్వామితో మాట్లాడం వల్ల భార్యాభర్తల బంధం విచ్చిన్నం అవుతుంది అంటున్నారు. దీని గురించి మరింత వివరంగా తెలుసుకుంటే.. ఇది తెలుసుకోవాలి.. ఒక సంబంధాన్ని బలపరచడంలో  ముఖ్యమైనది ఎక్కువ మాట్లాడటం కాదు.. ఏదైనా మాట్లాడినప్పుడు ఆ మాటలలో నిజాయితీ,  మాట్లాడే విషయం పట్ల అవగాహన,  దాని ప్రాముఖ్యత చాలా ముఖ్యమైనవి.  ఏదో ఒకటి మాట్లాడాలి అని  కబుర్లు చెప్పుకోవడంలో బంధం బలపడటం అనేది జరగదు. ఇద్దరి ఆలోచనలు, ప్రవర్తనలు, ఇద్దరూ ఏదైనా విషయం గురించి మాట్లాడటం.. ఇలాంటి సందర్బాలు చాలా కొన్నే ఉన్నా అది బంధాన్ని బలపరుస్తుంది.  ఏదో ఒకటి మాట్లాడాలనే కారణంతో అవసరం లేని విషయాలు మాట్లాడుతూ ఉంటే.. భాగస్వామి విసుగు చెంది  ఇలా కబుర్లు చెప్పడం అనే మంచి సమయానికి దూరం అయ్యే అవకాశం ఉంటుంది. సమయం ముఖ్యమే..  భార్యాభర్తలు రోజులో కొంత సమయం గడపడం చాలా కీలకమని నిపుణులే చెబుతున్నారు. ఇద్దరు కలిసి కొంత సమయం గడిపినప్పుడు, వారి మధ్య ఒకరి పట్ల ఒకరికి ఆసక్తి, సాన్నిహిత్యం పెరుగుతుంది. ఎప్పుడూ ఒకరితో మరొకరు అప్యాయత, అనురాగం,  ఇద్దరి మధ్య బంధం బలపడే  అవకాశం ఉంటుంది. చిన్న విషయాలు ఎందుకు మాట్లాడకూడదు.. కొందరు భాగస్వాములు చిన్న చిన్న విషయాలను కూడా చెబుతూ ఉంటారు. ఏ విషయాన్ని దాచుకోవడం లేదని, తాము బంధంలో ఎంతో నిజాయితీగా ఉంటున్నామని కూడా అంటుంటారు. కానీ ఇది చాలా పొరపాటు.  ప్రాముఖ్యత లేని విషయాల గురించి మాట్లాడటం వల్ల ఇద్దరి మధ్య ఆసక్తి తగ్గి, అపార్థాలు పెరిగే అవకాశం ఉంటుంది. అందుకే ఇద్దరు కలిసి గడిపే సమయం నాణ్యంగా మార్చుకోవాలి. అంచనాలకు పోవద్దు.. టీవి, సినిమా, సీరియల్, చుట్టూ ఉండే కొందరు వ్యక్తులు భార్యాభర్తల బందాలలో కొన్ని సంఘటనలు, సందర్భాలు చాలా సంతోషంగా, ఎంతో అపురూపంగా గడుపుతూ ఉంటారు.  ఇలాంటి బంధాలను చూసి తాము అలా ఉండాలని అనుకుంటారు చాలామంది. కానీ ఇలాంటి అంచనాలు పెట్టుకోవడం వల్ల చాలా అసంతృప్తి ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇది కాస్తా భాగస్వామి విషయంలో ఒకరంటే ఒకరి పట్ల ఇష్టం,  ఆసక్తి తగ్గి,  చిరాకు, కోపం పెరిగేలా చేస్తుంది. మనిషిని బట్టే.. కొందరు ఎక్కువ మాట్లాడేవారు ఉంటారు. మరికొందరు తక్కువ మాట్లాడేవారు ఉంటారు. కాబట్టి మనిషిని బట్టి ముందుకెళ్లాలి.  బాగా మాట్లాడేవారితో ఏం మాట్లాడినా సరదాగా తీసుకుంటారు. కానీ ఎక్కువ మాట్లాడని వ్యక్తులు చిన్న చిన్న విషయాలకు చాలా చిరాగ్గా ఫీలవుతారు.  కాబట్టి మనిషిని బట్టి సాగితేనే బంధాలు బాగుంటాయి.                                    *రూపశ్రీ.
భారతీయులకు టీ, కాఫీ ఒక పెద్ద ఎమోషన్. గతంలో కంటే ప్రస్తుతకాలంలో  టీ తాగేవారి సంఖ్య చాలా పెరిగింది.  ఏదైనా పని చురుగ్గా చేయాలంటే చాలామంది మొదటగా టీ తాగుతారు.  ఇక పని మధ్యలో కూడా టీ తాగుతూ ఉత్సాహం తెచ్చుకుంటారు.  కొందరు బెడ్ టీని ఇష్టపడితే, మరికొందరు రోజంతా చాలా కప్పులు తాగుతారు.  వయసుకు తగ్గట్టు ఎంత టీ తాగాలి? దీని గురించి చాలామందికి తెలియదు.  అధికంగా టీ తాగడం వల్ల క్రమంగా శరీరంపై ప్రతికూల ప్రభావాలు పడతాయి. టీ ఆరోగ్య ప్రయోజనాలు.. టీలోని కెఫీన్ , ఇతర సమ్మేళనాలు శరీరానికి శక్తిని అందిస్తాయి, అయితే టీని  అధికంగా తీసుకున్నప్పుడు హానికరంగా కూడా మారుతుందని వైద్యులు అంటున్నారు. కేటెచిన్స్ అనే యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండటం వల్ల, ఇటీవలి కాలంలో గ్రీన్ టీ ఒక ఆరోగ్యకరమైన పానీయంగా మారింది. చాలామంది పాలతో కాఫీలు, టీలు మానేసి గ్రీన్ టీ ఇష్టపడుతున్నారు.  ఈ సమ్మేళనాలకు, గుండె జబ్బులు, టైప్ 2 డయాబెటిస్ , కొన్ని రకాల క్యాన్సర్ల ప్రమాదాన్ని తగ్గించడంతో సంబంధం ఉందని పరిశోధనలు చెబుతున్నాయి. పరిశోధనల ప్రకారం  గ్రీన్ టీ జీవక్రియను పెంచి, కొవ్వును కరిగించడంలో కూడా సహాయపడుతుంది. క్రమం తప్పకుండా గ్రీన్ టీ తాగే వ్యక్తులు  బరువు   విషయంలో పర్పెక్ట్ గా,  మొత్తం ఆరోగ్యం విషయంలో ఎంతో నిలకడగా   ఉంటారని పరిశోధనలో తేలింది.  రోజులో ఎంత టీ తాగాలి? ఎంత పరిమాణంలో టీ తాగడం సరైనది అనే విషయం చాలామందిని గందరగోళానికి గురిచేస్తుంది.  నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఇది వయస్సు, ఆరోగ్య పరిస్థితి , జీవనశైలిపై ఆధారపడి ఉంటుంది. సాధారణంగా టీనేజర్లు , యువకులు రోజుకు 1 నుండి 2 కప్పుల కంటే ఎక్కువ కెఫిన్ ఉన్న టీ తాగకూడదు. ఆరోగ్యంగా ఉన్న పెద్దలు 3 నుండి 5 కప్పుల గ్రీన్ టీ ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. ఆరోగ్య ప్రయోజనాల కోసం ఈ పరిమాణం మంచిదని  చెబుతున్నారు.  అంతకంటే ఎక్కువ తాగడం ఆరోగ్యానికి మంచిది కాదు. టీ ఎక్కువగా తాగితే.. ఎక్కువగా టీ తాగడం హానికరం అని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అధికంగా కెఫిన్ తీసుకోవడం వల్ల చంచలత్వం, నిద్రలేమి, తలనొప్పి, కడుపు నొప్పి , ఆందోళన వంటి సమస్యలు పెరగవచ్చు. గర్భిణీ స్త్రీలు ముఖ్యంగా వారు తీసుకునే కెఫిన్ పరిమాణంపై శ్రద్ధ వహించాలని చెబుతున్నారు. పరిశోధనల ప్రకారం, గర్భధారణ సమయంలో అధిక కెఫిన్ ప్రమాదాన్ని పెంచుతుంది. రోజుకు 300 మిల్లీగ్రాముల కంటే ఎక్కువ కెఫిన్ తీసుకోవడం మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. టీ లవర్స్ ఇవి గుర్తుంచుకోవాలి.. టీ తాగే సమయం కూడా ముఖ్యమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఖాళీ కడుపుతో ఎక్కువగా టీ తాగడం వల్ల ఎసిడిటీ, జీర్ణ సమస్యలు వస్తాయి. భోజనం చేసిన వెంటనే టీ తాగడం వల్ల శరీరంలో ఐరన్ శోషణ తగ్గుతుంది. వైద్యుల ప్రకారం, టీని పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదు, కానీ దాని పరిమాణం, సమయం విషయంలో జాగ్రత్తగా ఉండటం చాలా ముఖ్యం.                                 *రూపశ్రీ.
బలమైన రోగనిరోధక వ్యవస్థ అనేక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ముఖ్యంగా వైరస్‌లు, బ్యాక్టీరియా , ఇతర ఇన్ఫెక్షన్ల వల్ల కలిగే సమస్యలను చాలా వరకు నివారించవచ్చు. అయితే రోజురోజుకూ జీవనశైలి పేలవంగా మారడం, చెడు  ఆహారపు అలవాట్లు శరీర రోగనిరోధక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతాయి.. ఈ కారణంగానే పదే పదే   జలుబు, అలసట, ఇన్ఫెక్షన్లు , నీరసం వంటి సమస్యలు వేగంగా పెరుగుతున్నాయి. రోగనిరోధక శక్తిని బలోపేతం చేసుకోవడానికి చాలామంది  విటమిన్ సి , విటమిన్ డి అధికంగా ఉండే ఆహారాలు  తీసుకుంటూ ఉంటారు. ఇవి రెండూ రోగనిరోధక శక్తికి చాలా కీలకమైనవే. అయితే రోగనిరోధక శక్తిని బలంగా మార్చడానికి విటమిన్-సి, విటమిన్-డి.. ఈ రెండు విటమిన్లలో ఏది ముఖ్యమైనది?  వివరంగా తెలుసుకుంటే.. రోగనిరోధక శక్తి ఎందుకు అవసరం.. రోగనిరోధక వ్యవస్థ శరీరానికి రక్షణ కవచం వంటిది. ఇది శరీరంలోకి ప్రవేశించే వైరస్‌లు, బ్యాక్టీరియా , ఇతర హానికరమైన పదార్థాలను గుర్తించి, నిర్మూలిస్తుంది. శరీరానికి అవసరమైన పోషకాలు లోపిస్తే, రోగనిరోధక వ్యవస్థ బలహీనపడుతుంది. వైద్య నివేదికల ప్రకారం విటమిన్ సి శరీరానికి ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి సహాయపడుతుంది , యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. రోగనిరోధక కణాలను ఉత్తేజపరచడంలో , వాపును నియంత్రించడంలో విటమిన్ డి కీలక పాత్ర పోషిస్తుంది. విటమిన్ డి లోపం ఉన్నవారికి ఇన్ఫెక్షన్లు , శ్వాసకోశ వ్యాధులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. కేవలం సప్లిమెంట్లు తీసుకోవడం వల్ల మాత్రమే రోగనిరోధక శక్తి బలపడదని, సమతుల్య ఆహారం, తగినంత నిద్ర, వ్యాయామం, సరైన పోషకాహారం కూడా చాలా అవసరమని నిపుణులు చెబుతున్నారు. రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి విటమిన్ సి , డి రెండూ అవసరమని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఈ రెండింటికీ వేర్వేరు విధులు ఉన్నాయి, కాబట్టి వీటిలో దేని లోపమైనా ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందట. విటమిన్-సి.. విటమిన్ సి ఆరోగ్యానికి అత్యవసరం, ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుందని భావిస్తారు.   ఇది శరీరంలో నిల్వ ఉండని, నీటిలో కరిగే విటమిన్, కాబట్టి ఇది ప్రతిరోజూ అవసరం. విటమిన్ సి శరీరంలోని తెల్ల రక్త కణాల సామర్థ్యాన్ని పెంచడంలో సహాయపడుతుంది, దీనివల్ల శరీరం ఇన్ఫెక్షన్లతో మరింత మెరుగ్గా పోరాడగలుగుతుంది.  విటమిన్ సి ఒక సమర్థవంతమైన యాంటీఆక్సిడెంట్ కూడా, ఇది ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టాన్ని తగ్గిస్తుంది. తగినంత మోతాదులో విటమిన్ సి తీసుకోవడం వల్ల జలుబు కాలవ్యవధిని కొంత మేరకు తగ్గించవచ్చని అధ్యయనాలు కనుగొన్నాయి. విటమిన్-డి.. సూర్యరశ్మికి గురికావడం వల్ల విటమిన్ డి ఉత్పత్తి అవుతుంది. విటమిన్ డి ఎముకలకు మాత్రమే కాకుండా రోగనిరోధక శక్తికి కూడా అవసరం విటమిన్ డి శరీరంలోని టి-కణాలను , ఇతర రోగనిరోధక కణాలను ఉత్తేజపరచడంలో సహాయపడుతుంది.  ఈ కణాలు వైరస్‌లు , బ్యాక్టీరియాలతో పోరాడటంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. విటమిన్ డి వాపును నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది, తద్వారా శరీర రోగనిరోధక ప్రతిస్పందనను  బాలెన్స్ విటమిన్ డి లోపం ఉన్నవారికి శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు, ఫ్లూ , ఇతర అనారోగ్యాలు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఎక్కువ సమయం ఇంట్లో గడుపుతూ, తక్కువ సూర్యరశ్మిని పొందే వ్యక్తులలో ఈ లోపం సర్వసాధారణం. పోషకాలను ఎలా పొందాలి? శరీరానికి అవసరమైన విటమిన్ సి , డి అందాలంటే, సరైన ఆహారం , జీవనశైలిని పాటించడం చాలా ముఖ్యం.   సిట్రస్ పండ్లు విటమిన్ సి కి మంచి వనరులు. నారింజ, ఉసిరి, నిమ్మకాయలు, జామకాయలు, క్యాప్సికమ్ , స్ట్రాబెర్రీలలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. విటమిన్ డి కోసం, గుడ్డు పచ్చసొన, కొవ్వు ఎక్కువగా ఉండే చేపలు, పుట్టగొడుగులు , పాల ఉత్పత్తులను తినడం మంచిది.                             *రూపశ్రీ.
       ఉదయాన్నే నిద్రలేచి మంచం దిగగానే కాలి మడమలో సూదితో గుచ్చినట్లుగా తీవ్రమైన నొప్పి వస్తుంది కొందరికి.  ఇలా లేవగానే ఆ నొప్పితో కొన్ని అడుగులు వేయడమే చాలా కష్టంగా అనిపిస్తుంది. చాలామంది ఈ నొప్పిని సీరియస్ గా తీసుకోరు.  కొద్దిసేపు అలా నడవగానే అదే తగ్గిపోతుందిలే అని కాంప్రమైజ్ అయిపోతారు.  మరికొందరు దీన్ని కేవలం అలసట లేదా నీరసం అని కొట్టిపారేస్తుంటారు.  అయితే ఇలా చేయడం చాలా పెద్ద పొరపాటు. . ఇది  శరీరంలో ఒక నిర్దిష్ట వ్యాధికి తొలి సంకేతం కావచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు, దీనిని వైద్యపరంగా ప్లాంటార్ ఫాసైటిస్ అని పిలుస్తారు. ఈ వ్యాధి గురించి , దానిని నివారించడానికి ఎలాంటి జాగ్రత్తలు  తీసుకోవాలో తెలుసుకుంటే.. ఉదయం పూట చీలమండలు ఎందుకు నొప్పిస్తాయి? పాదం అరికాలి భాగం మడమ ఎముక నుండి కాలివేళ్ల వరకు ఉంటుంది. ఇది ప్లాంటార్ ఫాసియా అనే మందపాటి, బలమైన కణజాలపు పొరతో కప్పబడి ఉంటుంది. మనం నడిచేటప్పుడు లేదా పరిగెత్తేటప్పుడు ఈ పొర మన పాదాలను కుదుపుల నుండి కాపాడుతుంది. ఈ కండర పట్టీపై ఎక్కువ  ఒత్తిడి పడినప్పుడు, అది చిన్న చిన్న చిరుగులకు , వాపుకు కారణమవుతుంది. రాత్రిపూట మన పాదాలు విశ్రాంతిగా ఉన్నప్పుడు, ఈ కణజాలం సంకోచిస్తుంది. ఉదయం నిద్రలేచి నేలపై మొదటి అడుగు వేయగానే, సంకోచించిన ఈ కణజాలం అకస్మాత్తుగా మళ్లీ సాగి, తీవ్రమైన నొప్పిని కలుగజేస్తుంది. కారణాలు.. శరీరంలో పెరిగిన కొవ్వు మడమలపై నేరుగా అధికంగా ఒత్తిడిని కలుగజేస్తుంది.  చాలా పలుచగా ఉండే లేదా ఆర్చ్ సపోర్ట్ లేని చెప్పులు, బూట్లు ధరించడం వల్ల కూడా అరికాళ్ళు దెబ్బతింటాయి.  పనిలో భాగంగా  గంటల తరబడి చాలాసేపు నిలబడవలసి వస్తే.. అలాంటి వారు కూడా ఈ సమస్యను ఎదుర్కోవచ్చు.  శరీరంలో యూరిక్ యాసిడ్ పెరగడం, ఎముకలు బలహీనపడటం లేదా విటమిన్ డి లోపం కూడా మడమ నొప్పిని పెంచుతాయి. ఇంటి చిట్కాలు..  మడమకు రోజుకు రెండు నుండి మూడు సార్లు 15 నిమిషాల పాటు ఐస్ పెట్టాలి. దీనివల్ల వాపు తగ్గుతుంది. మంచం దిగే ముందు కాళ్లు ఉన్నట్టుండి చాపకుండా  కాళ్లను , కాలివేళ్లను ముందుకు వెనుకకు సాగదీయాలి. ఎల్లప్పుడూ మందపాటి కుషన్ ఉన్న సౌకర్యవంతమైన పాదరక్షలను ధరించాలి. ఇంట్లో కూడా చెప్పులు లేకుండా నడవడం మానుకోవాలి. నొప్పి కొన్ని రోజుల పాటు కొనసాగితే , నడవడంలో మరింత ఇబ్బంది ఉంటే వెంటనే ఎముకల వైద్యుడిని సంప్రదించాలి.                              *రూపశ్రీ.