అమిత్ షా, జూనియర్ ఎన్టీఆర్ భేటీ కొత్త రాజకీయ సమీకరణాలకు సంకేతం?

Publish Date:Aug 22, 2022

Advertisement

అమిత్ షా తెలంగాణ పర్యటన  మునుగోడులో ఆయన ప్రసంగం కంటే.. ఆ సభకు , తరువాత ఆయన భేటీ అయిన వ్యక్తుల కారణంగానే ఎక్కువ ప్రాధాన్యత సంతరించుకుంది. ఏ వ్యూహం, ఏ ఎత్తుగడతో అమిత్ షా రాజకీయాలతో సంబంధం లేని ఆ ఇరువురు వ్యక్తులనూ కలుసుకున్నారన్న చర్చ ఉభయ తెలుగురాష్ట్రాలలోనూ జోరుగా సాగుతోంది.

మొత్తం మీద అమిత్ షా పర్యటన ప్రధాన ఉద్దేశం మునుగోడు సభ ద్వారా బీజేపీ సత్తాను చాటాలన్నదే అయినా.. ఆయన సభ  తరువాత కలుసుకున్న వ్యక్తుల కారణంగా మునుగోడు కంటే బీజేపీ ఆ తరువాత జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపైనే ప్రధానంగా దృష్టి సారించిందన్న సంగతి స్పష్టమైందని పరిశీలకులు అంటున్నారు.  అమిత్ షా ఈనాడు గ్రూప్ చైర్మన్ రామోజీరావుతో భేటీ అయ్యారు.

అనంతరం ప్రముఖ నటుడు జూనిరయ్ ఎన్టీఆర్ తో భేటీ అయ్యారు. ఈ రెండు భేటీలూ కూడా స్వయంగా అమిత్ షా చొరవతో జరిగిన భేటీలే కావడం గమనార్హం. ఈ రెండు భేటీలూ కూడా ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఎడతెగని చర్చలకు కారణమయ్యాయి. త్వరలో తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరగనుండటం, ఆ తరువాత సార్వత్రిక ఎన్నికల సమయం ముంచుకు వస్తుండడంతో ఈ భేటీలకు ఎనలేని రాజకీయ ప్రాధాన్యత ఎర్పడింది.

పరిశీలకులు మాత్రం తెలంగాణలో స్థిరపడిన సీమాంధ్రులను బీజేపీ వైపునకు ఆకర్షించే వ్యూహంలో భాగంగానే అమిత్ షా రామోజీరావు, ఎన్టీఆర్ లతో భేటీ అయ్యారని విశ్లేషిస్తున్నారు.  ఏపీకి రాష్ట్ర విభజన సందర్భంగా జరిగిన అన్యాయానికి కాంగ్రెస్ తో పాటుగా బీజేపీ కూడా కారణమేనన్న ఆగ్రహం ఆంధ్రప్రదేశ్ లోనే కాకుండా తెలంగాణలో స్థిరపడిన సీమాంధ్రులలో కూడా ఉందనీ, దానికి తగ్గించి వచ్చే ఎన్నికల నాటికి సీమాంధ్రులను తమకు అనుకూలంగా మార్చుకునే వ్యూహంలో భాగంగానే అమిత్ షా రామోజీ, ఎన్టీఆర్ లతో భేటీకి అత్యంత ప్రాధాన్యత ఇచ్చారని అంటున్నారు.

అందుకే సెటిలర్లను ప్రభావితం చేసేంతగా ప్రజలలో ఆకర్షణ ఉన్న రామోజీరావు, జూనియర్ ఎన్టీఆర్ లను అమిత్ షా కలిశారని పేర్కొంటున్నారు. రామోజీరావుతో భేటీ కారణంగా సీమాంధ్రుల ఆగ్రహం ఏదో మేరకు చల్లారుతుందని అమిత్ షా భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఇక జూనియర్ ఎన్టీఆర్ విషయానికి వస్తే ఆయన చాలా కాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. 2009 ఎన్నికలలో తెలుగుదేశం తరఫున ప్రచారం చేసిన తరువాత ఇప్పటి వరకూ రాజకీయాలకు దూరంగా పూర్తిగా సినిమాలపైనే దృష్టి కేంద్రీకరించారు.

అటువంటి ఎన్టీఆర్ ను ప్రత్యేకంగా ఆహ్వానించి మరీ అమిత్ షా డిన్నర్ సమావేశంలో బేటీ కావడం సర్వత్రా ఆసక్తి కలిగించింది. అమిత్ షా ఆయనను బీజేపీలో చేరాల్సిందిగా ఆహ్వానించారని వార్తలు వచ్చినా అవేవీ ధృవపడలేదు. అంతే కాకుండా  తెలుగుదేశం పార్టీ తరఫున గతంలో ఎన్టీఆర్ ప్రచారం చేయటం..  ఎన్టీఆర్ కుటుంబానికి చెందిన వ్యక్తి గా తన ప్రాణం ఉన్నంత వరకూ టీడీపీలోనే ఉంటానని ఎన్టీఆర్ గతంలోనే  చెప్పిన నేపథ్యంలో.. ఆయన బీజేపీలో చేరే ఛాన్సులు ఇసుమంతైనా లేవని అంటున్నారు.  అలాగే కనీసం తెలుగుదేశం తెలంగాణ సారథ్య బాధ్యతలు తీసుకుంటే.. ఏపీలో తెలుగుదేశం పార్టీకి బీజేపీ సహకారం ఇస్తుందనీ, తెలంగాణలో బీజేపీకి తెలుగుదేశం మద్దతు ఇస్తుందని అమిత్ షా ఎన్టీఆర్ కు ప్రతిపాదించినట్లు కూడా వార్తలు వెలువడ్డాయి. అయితే అధికారికంగా ఈ వార్తలను అటు తెలుగుదేశం కానీ, ఇటు బీజేపీ కానీ దృవీకరించలేదు. కానీ మొత్తం మీద ఎన్టీఆర్ తో అమిత్ షా భేటీ కచ్చితంగా తెలుగు రాష్ట్రాలలో రానున్న రోజులలో రాజకీయ సమీకరణాలలో మార్పును సూచిస్తోందని మాత్రం పరిశీలకులు గట్టిగా చెబుతున్నారు.  

By
en-us Political News

  
ఒక దశలో తన రిటైర్మెంట్ తరువాత టీడీపీలో చేరేందుకు కూడా తాను సిద్ధపడ్డాననీ, అవసరమైతే  ఎన్నికల బరిలో దిగడానికి కూడా రెడీ అయ్యాయనీ చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు, అ
బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ పాల్, ప్రముఖ దళిత నేత, మాజీ ఎంపీ విద్యాసాగర్ సోన్‌కర్, అలాగే అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించిన రాధాకాంత్ ఓఝా వంటి వారికి చోటు లభించింది.
ఆఫ్రికాలోని కాంగో నదిలో జరిగిన ఒక అత్యంత విషాదకరమైన పడవ ప్రమాదం యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది.
తెలంగాణ రాష్ట్రంలో అవినీతి అధికారులపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ఉక్కుపాదం మోపుతోంది.
ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అధిష్ఠానం అనూహ్య నిర్ణయం తీసుకుని అందరినీ విస్మయానికి గురిచేసింది.
వైద్యశాస్త్ర రంగంలో ప్రపంచవ్యాప్తంగా అత్యున్నతంగా భావించే నోబెల్ బహుమతి ప్రకటన వెలువడింది.
ఢిల్లీలోని ప్రముఖ ప్రాంతమైన జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎన్నికల సంఘం ప్రధానాధికారి (CEC) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా డిమాండ్
చేతిలో రూ.3 లక్షలు.. ఇప్పుడు రూ.100 కోట్ల బిజినెస్.!
కేబీఆర్ పార్క్ ఫ్లైఓవర్ ప్రణాళికల్లో కీలక మార్పులు.. .!
కొందరు దుండగులు ఏకంగా జ్యువెలరీ షాప్‌నే టార్గెట్‌ చేశారు.
తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్‌గా అద్వైత్ కుమార్ సింగ్ ఐఏఎస్ పూర్తి అదనపు బాధ్యతలు (FAC) స్వీకరించారు
మియాపూర్ మెడికో సృజన హత్య కేసులో పోలీసుల దర్యాప్తు కొద్దికొద్దిగా కొలిక్కి వస్తోంది.
సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారం కోసం టీఆర్ఎస్, హెచ్ఎంఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళనలో కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.