Publish Date:Mar 12, 2026
అమెరికా లెక్క తప్పింది. ఇరాన్ ను రోజుల వ్యవధిలో వీలైతే గంటల వ్యవధిలో మట్టికరిపించి ఆధిపత్యం చెలాయిద్దామనుకున్న అగ్రరాజ్యనానికి ఇరాన్ చుక్కలు చూపిస్తున్నది. ఇరాన్ లక్ష్యంగా అమెరికా చేపట్టిేన ఆపరేషన్ ఎపిక్ ప్యూరీలో ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. యుద్ధవిమానాలకు గాలిలోనే ఇంధనం పింపే కేసీ-135 ట్యాంకర్ విమానం ఇరాక్ లో కుప్పకూలింది. ఈ ఘటనలో విమానంలో ఉన్న సిబ్బంది గల్లంతయ్యారు.
వారంతా మరణించి ఉంటారని భావిస్తున్నారు. అయితే ఇది కేవలం ప్రమాదవశాత్తూ జరిగిన సంఘటన అని అమెరికా చెబుతోంది. రెండు ఇంధన విమానాలు వెళ్లగా, వాటిలో ఒకటి సాంకేతిక కారణాలతో కూలిపోయిందనీ, రెండో విమానం సురక్షితంగా బేస్‌కు తిరిగి వచ్చిందని తెలిపిన అమెరికా ఇది శత్రుదాడి కాదనీ కేవలం ప్రమాదం మాత్రమేననీ గట్టిగా చెప్పుకుంటోంది.
ఇరాక్‌లోని ఎడారి ప్రాంతంలో విమాన శకలాలను గుర్తించేందుకు డ్రోన్లు, హెలికాప్టర్లను మోహరించారు. సిబ్బంది ఆచూకీ తెలియరాలేదు. గత నెల చివరి వారం నుంచి కొనసాగుతున్న ఈ యుద్ధం కారణంగా మిడిల్ ఈస్ట్ లో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న సంగతి తెలిసిందే.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/americs-flight-collapsed-in-irak-36-215396.html
తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు వినియోగిస్తున్న ఆహార పదార్థాల్లో పెరుగు తున్న కల్తీ కారణంగా క్యాన్సర్‌తో పాటు అనేక దీర్ఘకాలిక ఆరోగ్య సమ స్యలు పెరుగుతున్నాయని ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది.
వీకెండ్ వేళ మద్యం మత్తులో వాహనాలు నడిపే వారిపై సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కొరడా ఝళిపిస్తున్నారు.
ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చాల్సిన ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు నడిరోడ్డుపై మొరాయిస్తే ఆ పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల అనంతరం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో, రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి.
కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని లక్ష్మీ (కన్నేపల్లి) పంప్ హౌస్ వేదికగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.
రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు.
మునుగోడు ఎమ్మెల్యే కొమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
ఇటీవల కాలంలో సోషల్ మీడియా వేదికగా సామాన్య ప్రజల సమస్యలపై నాయకులు స్పందించే తీరు మారుతోంది.
ఆధునిక రాజకీయాల్లో ఎలక్షన్ స్ట్రాటజిస్ట్‌లు (ఎన్నికల వ్యూహకర్తలు), పొలిటికల్ మేనేజ్‌మెంట్ కంపెనీల హవా నడుస్తోంది.
సినీ నటుడు ప్రకాష్ రాజ్‌పై పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని బీజేపీ సీనియర్ నాయకుడు ఎస్. విష్ణువర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు.
తెలియని వయసులో ప్రేమ.. భర్త వేధింపులు..!
పూణెకు చెందిన వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ హత్యతో తీవ్ర విషాదంలో ఉన్న ఆ కుటుంబాన్ని మరో దుఃఖం వెంటాడింది.
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టైన డీఎస్పీ భీమ్ రెడ్డి వ్యవహారంలో దర్యాప్తు వేగం పెంచిన ఏసీబీకి కీలక ఆధారాలు లభించాయి.