కుప్పం నుంచి రాష్ట్రాభివృద్ధికి కొత్త దిశ : సీఎం చంద్రబాబు

Publish Date:Jul 5, 2026

Advertisement

 

రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. కుప్పం నియోజకవర్గానికి గతంలో ఎన్నడూ రాని స్థాయిలో పారిశ్రామిక ప్రాజెక్టులు వస్తున్నాయని పేర్కొన్నారు. కుప్పం నియోజకవర్గంలో రోడ్లు, కమ్యూనికేషన్ సహా అన్ని రంగాల్లో కనెక్టివిటీని పెంచుతున్నామని చెప్పారు. త్వరలో ప్రజలు అభివృద్ధి చెందిన కుప్పాన్ని చూడబోతున్నారని, రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గాన్ని ఇదే తరహాలో తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని వెల్లడించారు.

అభివృద్ధి వికేంద్రీకరణ విధానంలో అన్ని ప్రాంతాలు సమానంగా ప్రగతి సాధించేలా ప్రణాళికలు రూపొందించామని సీఎం తెలిపారు. రాష్ట్రంలో క్వాంటం టెక్నాలజీ, సెమీకండక్టర్ల రంగాల్లో పెట్టుబడులు తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు. డిసెంబరు నాటికి అమరావతిలో క్వాంటం కంప్యూటింగ్ సెంటర్ కార్యకలాపాలు ప్రారంభమవుతాయని వెల్లడించారు.

ఇంధన రంగంలో సౌర, పవన విద్యుత్ ఉత్పత్తితో పాటు అత్యాధునిక విద్యుత్ సరఫరా విధానాలను అందుబాటులోకి తీసుకువస్తామని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రముఖ ఉక్కు సంస్థలు ఆర్సెలార్ మిట్టల్, జేఎస్‌డబ్ల్యూ తమ ప్రాజెక్టులను ఏర్పాటు చేస్తున్నాయని తెలిపారు. పరిశ్రమల అభివృద్ధితో పాటు పచ్చదనానికి కూడా సమాన ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న భూసమస్యలకు పరిష్కారం చూపుతున్నామని పేర్కొన్నారు.

సంక్షేమం, అభివృద్ధితో కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుంటే కొందరు అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్నారని విమర్శించారు. గత పాలకులు కంపెనీలకు భూములు ఇచ్చి వివాదాల్లోకి నెట్టారని, కొందరి వ్యక్తిగత ప్రయోజనాల కోసం విలువైన భూములు, ఖనిజ సంపద వినియోగం నిలిచిపోయిందని ఆరోపించారు.

ఓబుళాపురం, ఆన్‌రాక్ ప్రాజెక్టులు కూడా ఇలాంటి పరిస్థితుల వల్ల ఇబ్బందులు ఎదుర్కొన్నాయని అన్నారు. కంపెనీలను తరిమేయడం, పరిశ్రమలను రాష్ట్రం నుంచి వెళ్లిపోయేలా చేయడమే వైసీపీ నాయకుల విధానమని విమర్శించారు. కూటమి ప్రభుత్వం తీసుకువచ్చిన ప్రతి ప్రాజెక్టును తామే తెచ్చామని ప్రతిపక్షాలు చెప్పుకుంటున్నాయని, వాస్తవాలు లేకపోయినా అసత్య ప్రచారం కొనసాగిస్తున్నారని వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వం ఏజెన్సీ ప్రాంతాలను గంజాయి సాగుకు కేంద్రంగా మార్చిందని ఆరోపించారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం కూడా "డ్రగ్ ఫ్రీ ఇండియా" ప్రచార కార్యక్రమాన్ని చేపట్టిందని గుర్తుచేశారు.

తిరుమల ప్రసాదం కల్తీ చేసి భక్తుల మనోభావాలను దెబ్బతీసిన వ్యక్తులు ఇప్పుడు నీతులు చెబుతున్నారని విమర్శించారు. ప్రభుత్వంపై దుష్ప్రచారం చేసేందుకు కొందరు రాజకీయ నేతలు సామాజిక మాధ్యమాలకు నిధులు సమకూరుస్తున్నారని ఆరోపించారు. తనపై, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌పై విమర్శలు చేయించేందుకు కొన్ని సోషల్ మీడియా వేదికలకు ఫండింగ్ ఇస్తున్నారని అన్నారు.

హింస, బూతులు, ఫ్యాక్షన్ రాజకీయాలను ప్రోత్సహించడమే ప్రతిపక్షాల విధానమని విమర్శించిన సీఎం, హంద్రీ-నీవా కాలువ ద్వారా కుప్పం వరకు నీటిని తీసుకువచ్చామని, త్వరలో గాలేరు-నగరి ప్రాజెక్టును కూడా పూర్తి చేస్తామని తెలిపారు.

By
en-us Political News

  
తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు వినియోగిస్తున్న ఆహార పదార్థాల్లో పెరుగు తున్న కల్తీ కారణంగా క్యాన్సర్‌తో పాటు అనేక దీర్ఘకాలిక ఆరోగ్య సమ స్యలు పెరుగుతున్నాయని ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది.
వీకెండ్ వేళ మద్యం మత్తులో వాహనాలు నడిపే వారిపై సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కొరడా ఝళిపిస్తున్నారు.
ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చాల్సిన ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు నడిరోడ్డుపై మొరాయిస్తే ఆ పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల అనంతరం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో, రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి.
కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని లక్ష్మీ (కన్నేపల్లి) పంప్ హౌస్ వేదికగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.
మునుగోడు ఎమ్మెల్యే కొమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
ఇటీవల కాలంలో సోషల్ మీడియా వేదికగా సామాన్య ప్రజల సమస్యలపై నాయకులు స్పందించే తీరు మారుతోంది.
ఆధునిక రాజకీయాల్లో ఎలక్షన్ స్ట్రాటజిస్ట్‌లు (ఎన్నికల వ్యూహకర్తలు), పొలిటికల్ మేనేజ్‌మెంట్ కంపెనీల హవా నడుస్తోంది.
సినీ నటుడు ప్రకాష్ రాజ్‌పై పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని బీజేపీ సీనియర్ నాయకుడు ఎస్. విష్ణువర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు.
తెలియని వయసులో ప్రేమ.. భర్త వేధింపులు..!
పూణెకు చెందిన వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ హత్యతో తీవ్ర విషాదంలో ఉన్న ఆ కుటుంబాన్ని మరో దుఃఖం వెంటాడింది.
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టైన డీఎస్పీ భీమ్ రెడ్డి వ్యవహారంలో దర్యాప్తు వేగం పెంచిన ఏసీబీకి కీలక ఆధారాలు లభించాయి.
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా వేడి పెరిగింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.