అంబటి సహా 17 మంది వైసీపీ నేతలపై కేసు.!

Publish Date:Aug 12, 2026

Advertisement

గుంటూరు అరండల్ పేట పోలీసు స్టేషన్ లో వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కేసు నమోదైంది. ఆయనతో పాటు మాజీ ఎంపీ  మోదుగుల వేణుగోపాలరెడ్డి, గుంటూరు తూర్పు నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ నూరి ఫాతిమా సహా  17 మంది  నాయకులు, పలువురు వైసీపీ కార్యకర్తలపై పోలీసులు కేసు నమోదు చేశారు. 

ఈనెల 10వ తేదీన గుంటూరు  శంకరవిలాస్ సెంటర్ నుంచి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహం వరకు వైసీపీ  నాయకులు, కార్యకర్తలు  మెగా డీఎస్సీ నియామకాల నిర్వహణలో పారదర్శకత లోపించిందని, నిరుద్యోగ అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరిగిందని విమర్శిస్తూ చేపట్టిన ఈ ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. ఎలాంటి అనుమతి లేకుండా  ర్యాలీ నిర్వహించడం కూడదని స్పష్టం చేశారు. అంతే కాకుండా గుంటూరు నగరంలో సెక్షన్ 30 అమలులో ఉన్నందున ఎటువంటి ప్రదర్శనలకూ అనుమతి లేదని పేర్కొంటూ..   నిరసన కార్యక్రమాన్ని  నిలిపివేయాలని పోలీసులు స్పష్టం చేశారు.

అయితే వైసీపీ నేతలు పోలీసులతో వాగ్వాదానికి దిగి రోడ్డుపై బైఠాయించడంతో ట్రాఫిక్ స్తంభించిపోయింది,  దీంతో అరండల్ పేట పోలీసులు వీరిపై కేసు నమోదు చేశారు  ప్రజా రవాణాకు అడ్డంకులు సృష్టించడం, పోలీసుల అధికారిక ఆదేశాలను ఉల్లంఘించడం, అనుమతి లేకుండా నిరసనలు చేపట్టడం,  శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ప్రవర్తించడం వంటి నేరాల కింద ఈ కేసు నమోదు చేశారు.  

Ambati Rambabu, police Case Guntur, Modugula Venugopal Reddy, YSRCP Leaders, Mega DSC Protest,  Guntur Rally 

By
en-us Political News

  
వయోపరిమితి మరో 2 ఏళ్లు పెంపు..!
విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. ఇక ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ముందుగానే..!
స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 15న సాయంత్రం 6 గంట లకు రాజ్‌భవన్‌ (లోక్‌భవన్‌)లో తెలంగాణ గవర్నర్‌ ‘ఎట్ హోమ్‌’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.
BCI తీరుపై తీవ్ర అభ్యంతరం..!
హైదరాబాద్ పోలీస్‌లకు రెండు ప్రతిష్ఠాత్మక సేవా పతకాలు..!
స్వాతంత్ర్య దినోత్సవ శుభసందర్భాన్ని పురస్కరించుకుని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.
కమ్మటి నీటి బొట్టు కోసం నల్లమల అడవుల వైపు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూడటం ఆ ప్రాంత ప్రజలకు కొత్తేమీ కాదు.
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల నేపథ్యంలో గోల్కొండ కోట పరిసరాల్లో శనివారం ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేయనున్నారు
తిరుమల శ్రీవారి దర్శనం, సేవలు, వసతి బుకింగ్‌ల పేరుతో నకిలీ వెబ్‌సైట్లు, వాట్సాప్ ఖాతాలు, సోషల్ మీడియా పేజీల ద్వారా జరుగుతున్న మోసాల పట్ల భక్తులు అప్రమత్తంగా ఉండాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది.
ఎర్రకోట పరిసరాల్లో మల్టీ లేయర్ సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. పంద్రాగస్టు వేడుకల ముంగిన  ఈ ఈమెయిల్ బెదిరింపులు రావడంతో  భద్రత, నిఘా వ్యవస్థను మరింత కట్టుదిట్టం చేశారు.  ముందస్తు జాగ్రత్త చర్యగా అన్ని ప్రవేశ  నిష్క్రమణ మార్గాల్లో వాహనాలు, ప్రయాణీకుల తనిఖీలు చేపట్టారు.  
కేసీఆర్ ఉచితంగా ఇస్తే.. ఇందిరమ్మ ఇండ్లకు 6 లక్షలా..!
గతంలో ఎన్నడూ లేని విధంగా అంతర్జాతీయ మార్కెట్లో  ఇండియ్  ఉత్పత్తులకు డిమాండ్ పెరిగింది. దీంతో ఎగుమతులు   పుంజుకున్నాయి. కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం జూలై నెలలో ఇండియా  దాదాపు 44.24 బిలియన్ డాలర్లు అంటే ఇండియన్ కరెన్సీలో  4.22 లక్షల కోట్ల రూపాయల విలువైన వస్తువులను ఎగుమతి చేసింది.
గతంలో   ఒక కేసు విచారణ సందర్భంగా సీజేఐ చేసిన వ్యాఖ్యలకు నిరసినగా లా విద్యార్థులు వీసీకి ఈ లేఖ రాశారు. దీనిపై తీవ్రంగా మడిపడిన బీసీఐ..   నాల్సార్‌ విద్యార్థులను అడ్వకేట్లుగా నమోదు చేయవద్దంటూ రాష్ట్ర బార్ కౌన్సిల్స్‌కు ఆదేశాలు జారీ చేసింది.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.