కత్తెర గాటు లేని ‘అమరావతి ఫైల్స్’ మీకోసం!

Publish Date:Sep 3, 2024

Advertisement

ఐదేళ్ళ జగన్ అరాచక పాలనలో అన్యాయానికి గురైన అమరావతి రైతుల ఆవేదనకు అద్దం పట్టేలా భాను దర్శకత్వంలో ‘తెలుగువన్’ అధినేత కంఠంనేని రవిశంకర్ ‘అమరావతి ఫైల్స్’ చిత్రాన్ని నిర్మించారు.  సినిమా నిర్మాణమంటేనే కత్తిమీద సాములాంటిది. అలాంటిది అప్పటి అధికార పార్టీకి వ్యతిరేకంగా, అధికార పార్టీ దుర్మార్గ విధానాలకు వ్యతిరేకంగా ఒక సినిమాని నిర్మించాలంటే ఎంత కష్టమైన విషయమో ఊహించవచ్చు. ‘అమరావతి ఫైల్స్’ సినిమా నిర్మాణానికి జగన్ ప్రభుత్వం మొదటి నుంచీ ఎన్నో ఇబ్బందులు క్రియేట్ చేసింది.   జగన్ సైకో ప్రభుత్వం అమరావతి రైతులను ఎన్ని ఇబ్బందులు పెట్టిందో ‘అమరావతి ఫైల్స్’ సినిమా నిర్మాణం విషయంలో కూడా అన్ని ఇబ్బందులు పెట్టింది. ఈ సినిమా నిర్మాణాన్ని ఆపించడానికి ఎన్నో అనైతిక దారుల్లో ప్రయత్నించింది. అయినప్పటికీ నిర్మాత కంఠంనేని రవిశంకర్ ఏ దశలోనూ వెనుకడుగు వేయకుండా సినిమా నిర్మాణాన్ని ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి పూర్తి చేశారు. అమరావతి ప్రాంత రైతుల అంతరాత్మను ఆవిష్కరించే విధంగా అద్భుతంగా రూపొందిన ‘అమరావతి ఫైల్స్’ చిత్రానికి సెన్సార్ సమయంలోనూ, విడుదల సమయంలోనూ జగన్ ప్రభుత్వం సమస్యలు సృష్టించింది. అనేక కతెర గాటులకు చిత్రాన్ని గురిచేసింది. టైటిల్ విషయంలో కూడా అభ్యంతరం లేవనెత్తింది. అమరావతి రాజధాని ప్రాంత రైతుల గుండె చప్పుడుగా రూపొందిన ఈ చిత్రానికి ‘అమరావతి ఫైల్స్’ అనే టైటిల్ వుండకూదంటూ సైకో జగన్ ప్రభుత్వం పట్టుబట్టింది. ఈ విషయంలో కంఠంనేని రవిశంకర్ ఎంతో పోరాటం చేశారు. అయితే రాజుకంటే మూర్ఖుడు చాలా బలవంతుడు అంటారు. అప్పట్లో రాజు కూడా సాక్షాత్తూ మూర్ఖుడే. దాంతో ఈ సినిమా టైటిల్‌కి ‘రాజధాని ఫైల్స్’గా మార్చక తప్పలేదు. 

ఇక విడుదల సమయంలో కూడా జగన్ చేసిన కుట్రలు అన్నీ ఇన్నీ కావు. ఈ సినిమాకి మంచి థియేటర్లు దొరక్కుండా చేశారు. ఒక దశలో విడుదల ఆపడానికి కూడా ప్రయత్నించారు. అయితే, నిర్మాత కంఠంనేని రవిశంకర్ మడమతిప్పని పోరాటం చేసి విడుదల చేశారు. ‘రాజధాని ఫైల్స్’ సినిమా విడుదలయ్యాక సంతృప్తికరమైన ప్రేక్షకాదరణను ఈ సినిమా సొంతం చేసుకుంది. కమర్షికల్ లెక్కల సంగతి అలా వుంచితే, ఒక అద్భుతమైన చిత్రాన్ని నిర్మించారని, అమరావతి రైతుల ఆవేదనను సరైన సమయంలో సరైన రీతిలో ఆవిష్కరించారనే అభినందనలు భారీ స్థాయిలో అందాయి. నిర్మాత కంఠంనేని రవిశంకర్ ఈ సినిమాని మట్టి మీద అభిమానంతో నిర్మించారే తప్ప, మనీ ఆశించి కాదు. ‘రాజధాని ఫైల్స్’ కోసం తాను ఖర్చుపెట్టిన డబ్బుని నేలతల్లి కోసం ఖర్చు పెట్టినట్టుగా ఆయన భావించారు. థియేటర్ల ద్వారా ప్రజలకు చేరువైన ‘రాజధాని ఫైల్స్’ ఆ తర్వాత యూట్యూబ్ మాధ్యమం ద్వారా ప్రతి తెలుగు గడపనూ పలకరించింది. ప్రతి తెలుగువాడి చేతితో కరచాలనం చేసింది. 

అమరావతి రాజధాని విషయంలో జగన్ ఎంత దుర్మార్గంగా వ్యవహరించాడో ఈ సినిమా ప్రజల ముందుకు చాలా ప్రభావవంతంగా తీసుకెళ్ళింది. 2024లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మట్టికొట్టుకుపోవడానికి దోహదం చేసిన అనేక అంశాలలో ‘రాజధాని ఫైల్స్’ సినిమా కలిగించిన ప్రభావం కూడా ఒకటి అనే ప్రశంసలు అందాయి. ఆ విధంగా ఎంతో శ్రమించిన నిర్మించిన ఈ సినిమా ప్రయోజనం నెరవేరినట్టు అయింది. మట్టిమనుషులను అవమానించిన జగన్ నోట మట్టి కొట్టడానికి నిర్మాత కంఠంనేని రవిశంకర్ చేసిన కృషి ఫలించింది.

ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో జగన్ రాక్షస పాలన లేదు. ఇంతకాలం అంధకారంలో వున్న రాజధాని అమరావతి ఇప్పుడు మళ్ళీ రెక్కలు విప్పుతోంది. అంతర్జాతీయ స్థాయికి ఎగరడానికి, ఎదగడానికి సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో బలవంతంగా పేరు మార్పిడికి, కత్తెర గాటుకి గురైన ‘అమరావతి ఫైల్స్’ చిత్రం కూడా మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈసారి ‘రాజధాని ఫైల్స్’ అని కాకుండా ‘అమరావతి ఫైల్స్’ పేరుతో తెలుగు ప్రజల ముందు సగర్వంగా, సగౌరవంగా నిలబడింది. కత్తెర గాటుకి గురికాని ‘అమరావతి ఫైల్స్’ పూర్తి నిడివి చిత్రం ‘తెలుగువన్’ యూట్యూబ్ ఛానల్లో ప్రేక్షకులకు అందుబాటులో వుంది. అమరావతి రైతులు చేసిన పోరాటాన్ని చరిత్రలో నిలిపేలా చేసి, చరిత్ర సృష్టించిన ‘అమరావతి ఫైల్స్’ మీ అభినందనలు అందుకోవడానికి యూట్యూబ్‌లో ఎదురుచూస్తోంది.

 

By
en-us Political News

  
పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాజాగా తీసుకుంటున్న రాజకీయ నిర్ణయాలు పార్టీ శ్రేణులతో పాటు.. ఆయన పార్టీకే చెందిన సొంత సామాజిక వర్గ నేతలు కూడా తీవ్ర అసంతృప్తి అసహనం వ్యక్తం చేస్తున్నారు.
హైదరాబాద్‌లో బసవతారకం ఆస్పత్రి రజతోత్సవాలు
కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం కావేరి నదిపై నిర్మించ తలపెట్టిన మేకేదాటు డ్యామ్ ప్రతిపాదనను విజయ్ వ్యతిరేకించారు. తమిళనాడుకు వచ్చే నీటి ప్రవాహాన్ని నియంత్రించే ఏ ప్రాజెక్టునైనా సహించేది లేదని ఆయన శాసనసభ వేదికగా కుండబద్దలు కొట్టారు.
ఇప్పుడు బీజేపీ సమాజ్‌వాదీ పార్టీని నిట్టనిలువుగా చీల్చేందుకు. ఆ పార్టీ ఎంపీలకు గాలం వేస్తున్నట్లు రాజకీయవర్గాలలో జోరుగా చర్చ జరుగుతోంది. ఉత్తరప్రదేశ్ మంత్రి, బీజేపీ మిత్రపక్ష నేత అయిన ఓం ప్రకాష్ రాజ్‌భర్ తాజాగా చేసిన వ్యాఖ్యలతో ఏ క్షణంలోనైనా అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్ వారీ పార్టీ ఎంపీలు కమలం గూటికి చేరే అవకాశాలున్నాయన్న చర్చకు బలం చేకూరుతోంది.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పరిపాలనా నగరంగానే కాకుండా.. ప్రపంచస్థాయి పెట్టుబడులకు, అత్యాధునిక సాంకేతికతకు కేంద్రబిందువుగా మార్చేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు సాగుతున్నారు. గతంలో హైదరాబాద్ మహానగరాన్ని గ్లోబల్ ఐటీ హబ్‌గా తీర్చిదిద్దిన ఆయన ఇప్పుడు అమరావతిని అంతకు మించి.. అన్నట్లుగా ముందుకు తీసుకువెడుతున్నారు.
దేశంలో లోక్‌సభ సెగ్మెంట్ల డిలిమిటేషన్‌పై పీఎం ఆర్థిక సలహా మండలి కీలకమైన ప్రతిపాదనలు చేసింది.
2024 ఎన్నికలలో ఆయన వైసీపీ పార్టీ కేవలం 11 స్థానాలకే పరిమితమైనప్పటికీ.. ఆయన శైలిలో ఇసుమంతైనా మార్పు రాలేదు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం విజయవంతంగా రెండేళ్ల పరిపాలనను పూర్తి చేసుకున్న తరుణంలో.. జగన్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించేందుకు ఎంచుకున్న అంశాలు.. ఆయనను నవ్వుల పాలు చేసేవిగా ఉన్నాయని పరిశీలకులు సైతం విశ్లేషణలు చేస్తున్నారు.
జగన్ ను రానున్న రోజులలో న్యాయపరమైన చిక్కులు చుట్టుముట్టే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయని అంటున్నారు. ఆ చిక్కుల కారణంగా ఆయన రాజకీయంగా కూడా ఇబ్బందులు ఎదుర్కొనక తప్పదని అంటున్నారు. జగన్ హయాంలో జరిగిన కొన్ని కీలక అంశాలు ఇప్పుడు ఆయనకు అవరోధాలుగా మారే అవకాశాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయని చెబుతున్నారు. మరీ ముఖ్యంగా వైసీపీ హయాంలో జరిగినట్లుగా చెబుతున్న ఏపీ మద్యం కుంభకోణం కేసు ఆయన మెడకు చుట్టుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయంటున్నారు.
చంద్రబాబు నాయుడు నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ బాధ్యతల కాంచర్ల శ్రీకాంత్‌ను తొలగిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్దిరోజులకే కుప్పంలోని ద్వితీయ శ్రేణి నాయకులు, క్షేత్రస్థాయి కార్యకర్తల్లో శ్రీకాంత్ పనితీరుపై తీవ్ర అసంతృప్తి మొదలైంది. నియోజకవర్గంలోని సీనియర్ నేతలు పి.ఎస్. మునిరత్నం, డాక్టర్ సురేష్ బాబు, కాంచర్ల శ్రీకాంత్ ల మధ్య సమన్వయ లోపం ప్రస్ఫుటంగా బహిర్గతమైంది.
టీఎమ్ సీ తిరుగుబాటు పర్వం ఇప్పుడు జాతీయ స్థాయిలోనూ చోటు చేసుకుంది. ఒకవైపు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమిని ఎలా ఎదుర్కోవాలనే వ్యూహాలపై చర్చించేందుకు మమతా బెనర్జీ ఢిల్లీలో ఇండియా కూటమి సమావేశానికి హాజరయ్యారు. సరిగ్గా అదే సమయంలో ఆమె సొంత పార్టీకి చెందిన దాదాపు 20 మంది లోక్‌సభ ఎంపీలు తిరుగుబాటుకు రెడీ అవ్వడం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు అణ్ణామలైది. ఐపీఎస్ ఉద్యోగాన్ని వదిలిపెట్టి, ఆవేశంతో, ఆశయంతో రాజకీయాల్లోకి అడుగుపెట్టి రాష్ట్రంలో బీజేపీని ముందుకు నడిపించడంలో కీలక పాత్ర పోషించారు. కానీ పార్టీలో ఎదురైన అంతర్గత పరిణామాలు, మారుతున్న రాజకీయ సమీకరణాలతో ఆయన విసుగుచెందారు.
పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించిన కేవీపీ వైఎస్ ప్రతిష్ట మసకబార్చేలా మాట్లాడటం సరికాదనీ, పవన్ కళ్యాణ్ తాను చేసిన ఆరోపణలు నిజమని నిరూపిస్తే, ముఖ్యమంత్రి సహాయనిధికి తన సొంత సొమ్ము నుంచి 10 కోట్ల రూపాయలు విరాళంగా ఇస్తాననీ, నిరూపించలేకపోతే.. పవన్ కళ్యాణ్ ముక్కు నేలకు రాసి వైఎస్ కుటుంబానికి, ఆయన అభిమానులకు బహిరంగం క్షమాపణ చెప్పాలని సవాల్ విసిరారు చేశారు.
ఈ భేటీలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గతంలో తాను ప్రతిపాదించిన మూడు రాజధానుల కాన్సెప్ట్‌ను సమర్థిస్తూ, వచ్చే 2029 ఎన్నికల్లో తాము మళ్లీ అధికారంలోకి వస్తే రైతుల భూములను తిరిగి ఇచ్చేస్తామని ప్రకటించారు. అంటే.. 2029 తరువాత కూడా ఏపీ రాజధానిని మార్చే ఆలోచనలోనే జగన్ ఉన్నారని, ఉంటారని జగన్ తేటతెల్లం చేశారన్న మాట.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.