భార‌త ఫుట్‌బాల్ స‌మాఖ్య త్రిస‌భ్య క‌మిటీ రద్దు

Publish Date:Aug 22, 2022

Advertisement

భార‌త్ ఫుట్‌బాల్ సమాఖ్య ఏఐఎఫ్ఎఫ్ పై ఫీఫా నిషేధం కొనసాగుతున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు కీల‌క చర్యకు ఉపక్రమించింది. ఏఐఎఫ్ఎఫ్ రోజువారీ కార్యకలాపాల పర్యవేక్షణకుగానూ ఈ ఏడాది మే నెలలో నియమించిన త్రిసభ్య పాలనా కమిటీని రద్దు చేసింది. నిషేధం ఎత్తివేతకు ఫీఫా సూచించిన కీలక ప్రమాణాలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నామని జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీం బెంచ్ తెలిపింది. ప్రస్తుత సెక్రటరీ జనరల్ సారధ్యంలోని పాలనా యంత్రాంగం ఏఐఎఫ్ఎఫ్ రోజువారీ కార్యకలాపాలను పర్యవేక్షిస్తుందని జస్టిస్ చంద్రచూడ్ చెప్పారు.

ఏ దేశంలోనైనా ఫుట్‌బాల్‌ కార్యక్రమాలను ఆయా సమాఖ్యలు స్వతంత్రంగా నిర్వహించుకోవాలని ఫీఫా కోరుకుంటుంది. ప్ర‌భుత్వాలు, కోర్టులు తృతీయ పక్షం జోక్యాన్ని అస్సలు ఫీఫా అంగీక‌రించ‌దు. కానీ ఫిఫా నిబంధనల గురించి స్పష్టంగా తెలిసినప్పటికీ భారత సమాఖ్య నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తూ వచ్చిం ది. 2020 డిసెంబరులోనే అధ్యక్ష ఎన్నికలు జ‌ర‌గ‌లేదు. అప్పటికే మూడు పర్యాయాలు అధ్యక్షునిగా ఉన్న ప్రఫుల్‌ పటేల్‌..  జాతీయ క్రీడాబిల్లు నిబంధన ప్రకారం ఇక  ఆ  పదవిలో కొనసాగేం దుకు ఎంత మాత్రం వీల్లేదని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.  

సమాఖ్య వ్యవహారాల  పర్యవేక్షణకు జస్టిస్‌ దవే నేతృత్వంలో సుప్రీం కోర్టు త్రిసభ్య కార్యనిర్వాహక కమిటీ (సీఓఏ)ని ఏర్పాటు చేసింది. ఈ పరిణా మాలను గమనిస్తున్న ఫీఫా కొంతకాలంగా  పరిస్థితులు మారకపోవడంతో వేటు వేసింది.

ఇదిలాఉండ‌గా,  ఈ నెల 28న జరగాల్సిన ఏఐఎఫ్ఎఫ్ ఎన్నికల తేదీని వారం రోజులు పొడిగిస్తున్న‌ట్టు సుప్రీం  తెలిపింది. ఓటర్ల  జాబితాలో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన 36 మంది సభ్యులు మాత్రమే ఉండాలని స్పష్టం చేసింది. కాగా విచారణ సందర్భంగా సీవోఏ తరపున న్యాయవాది గోపాల్ శంకర్‌నారాయణన్ హాజరయ్యారు. ఏఐఎఫ్ఎఫ్ మధ్యంతర ఆడిట్ రిపోర్టును అంద జేశారు. తుది నివేది క‌ను ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటుందని వెల్లడించింది. కాగా సుప్రీంకోర్ట్ జారీ చేసిన ఈ ఆదేశాలు ఏఐఎఫ్ఎఫ్‌పై ఫిఫా నిషేధం ఎత్తివేత దిశగా బాటలు వేయనుంది. ఫిఫా నిర్ణయంతో ఇప్పటికే జాతీయ జట్టుతో పాటు క్లబ్ జట్లపై ప్రతికూల ప్రభావం పడుతున్న విషయం తెలిసిందే.

By
en-us Political News

  
విపక్షాల నిరసనల నేపథ్యంలో   పోలీసులు ఢిల్లీలో విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేశారు.  పలు ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు వేలాది మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. ట్రాఫిక్ మళ్లింపులు కూడా చేపట్టారు. జంతర్ మంతర్, పార్లమెంట్ పరిసరాలు, ఎన్నికల సంఘం కార్యాలయం వైపు వెళ్లే మార్గాల్లో ప్రత్యేక నిఘా కొనసాగుతోంది. 
 ధనుష్‌ తన కొత్త రాజకీయ పార్టీ కోసం  తమిళగ ఎళుచ్చి కళగం అనే పేరును ఖరారు చేసినట్లు  ప్రచారం జరుగుతోంది. అలాగే.. ఈ పేరుతో ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయ్యిందని అంటున్నారు.
ఒక దశలో తన రిటైర్మెంట్ తరువాత టీడీపీలో చేరేందుకు కూడా తాను సిద్ధపడ్డాననీ, అవసరమైతే  ఎన్నికల బరిలో దిగడానికి కూడా రెడీ అయ్యాయనీ చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు, అ
బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ పాల్, ప్రముఖ దళిత నేత, మాజీ ఎంపీ విద్యాసాగర్ సోన్‌కర్, అలాగే అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించిన రాధాకాంత్ ఓఝా వంటి వారికి చోటు లభించింది.
ఆఫ్రికాలోని కాంగో నదిలో జరిగిన ఒక అత్యంత విషాదకరమైన పడవ ప్రమాదం యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది.
తెలంగాణ రాష్ట్రంలో అవినీతి అధికారులపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ఉక్కుపాదం మోపుతోంది.
ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అధిష్ఠానం అనూహ్య నిర్ణయం తీసుకుని అందరినీ విస్మయానికి గురిచేసింది.
వైద్యశాస్త్ర రంగంలో ప్రపంచవ్యాప్తంగా అత్యున్నతంగా భావించే నోబెల్ బహుమతి ప్రకటన వెలువడింది.
ఢిల్లీలోని ప్రముఖ ప్రాంతమైన జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎన్నికల సంఘం ప్రధానాధికారి (CEC) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా డిమాండ్
చేతిలో రూ.3 లక్షలు.. ఇప్పుడు రూ.100 కోట్ల బిజినెస్.!
కేబీఆర్ పార్క్ ఫ్లైఓవర్ ప్రణాళికల్లో కీలక మార్పులు.. .!
కొందరు దుండగులు ఏకంగా జ్యువెలరీ షాప్‌నే టార్గెట్‌ చేశారు.
తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్‌గా అద్వైత్ కుమార్ సింగ్ ఐఏఎస్ పూర్తి అదనపు బాధ్యతలు (FAC) స్వీకరించారు
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.