ఏఐకి ప్ర‌త్యేక మంత్రిత్వ శాఖ అవ‌స‌రం : సీఎం రేవంత్ రెడ్డి

Publish Date:Feb 20, 2026

Advertisement

 

ప్రస్తుతం యావత్ ప్రపంచాన్ని ప్రభావితం చేస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగంలో భారత్ ముందంజలో నిలవాలంటే కేంద్ర ప్రభుత్వంలో ప్రత్యేక ఏఐ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఏఐ వినియోగం, నియంత్రణ, చట్టపరమైన మార్గదర్శకాలు, జాతీయ భద్రత వంటి అంశాలను సమగ్రంగా నిర్వహించేందుకు ప్రత్యేక వ్యవస్థ అవసరమని ఆయన స్పష్టం చేశారు.

ఢిల్లీలో నిర్వహించిన ఏఐ సమ్మిట్‌లో ప్రసంగించిన సీఎం... మానవ చరిత్రలో అగ్ని, చక్రం, వ్యవసాయం, విద్యుత్, ఇంటర్నెట్ వంటి ఆవిష్కరణలు ప్రపంచాన్ని ఎలా మార్చాయో గుర్తుచేశారు. ఏఐ కూడా అలాంటి విప్లవాత్మక సాంకేతికతేనని, ఇది కేవలం ఇంకొక టెక్నాలజీ కాదని, మానవ పరిణామ క్రమంలో అత్యంత శక్తివంతమైన మలుపని అభివర్ణించారు. మునుపటి యంత్రాల మాదిరిగా కాకుండా ఏఐ స్వయంగా నేర్చుకోగలదని, విశ్లేషించగలదని, నిర్ణయాలు తీసుకోగలదని పేర్కొన్నారు. 

రోబోటిక్స్‌తో కలిసినప్పుడు యంత్రాలు మానసిక మేధస్సుతో పాటు శారీరక సామర్థ్యాన్ని కూడా పొందుతున్నాయని అన్నారు.ప్రపంచ ఏఐ పోటీ ఇప్పటికే ప్రారంభమైందని, కొన్ని దేశాలు, కంపెనీలు ముందంజలో ఉన్నాయని సీఎం చెప్పారు. గత పారిశ్రామిక విప్లవాల సమయంలో జరిగిన అవకాశ నష్టాలను గుర్తు చేస్తూ, ఈసారి భారత్ అలాంటి తప్పిదం చేయకూడదని హెచ్చరించారు. సేవలు, సాఫ్ట్‌వేర్ రంగాల్లో విజయం సాధించిన భారత్, ప్రపంచ స్థాయి కోర్ టెక్నాలజీ ఉత్పత్తుల్లో కూడా నాయకత్వం వహించాలని పిలుపునిచ్చారు.

దేశానికి తక్షణ జాతీయ ఏఐ రోడ్‌మ్యాప్ అవసరమని ఆయన నొక్కిచెప్పారు. ఏఐ అభివృద్ధి ప్రతి దశలో — సెమీకండక్టర్ చిప్ తయారీ, జీపీయూ సామర్థ్యాలు, డేటా సెంటర్లు, గ్రీన్ ఎనర్జీ వినియోగం, ఏఐ ప్లాట్‌ఫారమ్‌లు, అప్లికేషన్లు — భారత్ స్పష్టమైన వ్యూహంతో ముందుకు సాగాలని సూచించారు. ప్రపంచవ్యాప్తంగా ఏఐ పరిణామాలను నిశితంగా పర్యవేక్షించేందుకు కేంద్రం–రాష్ట్రాల సమన్వయంతో జాతీయ “ఏఐ వార్ రూమ్” ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. కేంద్రం అనుమతిస్తే హైదరాబాద్‌లో అలాంటి వార్ రూమ్ నిర్వహించేందుకు తెలంగాణ సిద్ధంగా ఉందని తెలిపారు. ప్రపంచ స్థాయి పరిశోధనలకు ఊతమిచ్చే ఏఐ యూనివర్సిటీని దేశంలో స్థాపించాలని  సూచించారు.

ఏఐ విస్తరణ నేపథ్యంలో ఉపాధిపై ఉద్భవిస్తున్న ఆందోళనలను ప్రస్తావిస్తూ, కొన్ని రంగాల్లో ఉద్యోగ నష్టాలు సంభవించవచ్చని అన్నారు. అయితే సరైన రీ-స్కిల్లింగ్, అప్-స్కిల్లింగ్ చర్యల ద్వారా ఏఐ వల్ల సృష్టించబడే కొత్త అవకాశాలు మరింత విస్తృతంగా ఉంటాయని అభిప్రాయపడ్డారు. యువతను ఏఐ-ఆధారిత భవిష్యత్తుకు సిద్ధం చేయాలని పిలుపునిచ్చారు. స్టార్టప్‌లకు మద్దతు కల్పించేందుకు జాతీయ ఏఐ నిధి ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. 

దేశవ్యాప్తంగా ఏఐ ఆవిష్కరణలకు కేంద్రంగా నిలిచే “ఏఐ స్టార్టప్ విలేజ్”ను తెలంగాణలో ఏర్పాటు చేయడానికి రాష్ట్రం సిద్ధంగా ఉందని ప్రకటించారు. ఏఐ రంగంలో విధానాలు, చట్టాలు, నైతిక ప్రమాణాలకు మార్గనిర్దేశం చేసే అత్యున్నత సంస్థగా ఇండియా ఏఐ కౌన్సిల్ ఏర్పాటు చేయాలని ప్రధానమంత్రిని కోరారు. ఏఐ అభివృద్ధి సామాజిక న్యాయం, పేదరిక నిర్మూలన, ప్రజా సేవల మెరుగుదల, జాతీయ భద్రతకు తోడ్పడేలా ఉండాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. బాధ్యతాయుతమైన, సమ్మిళిత, భవిష్యత్ దృష్టితో కూడిన ఏఐ వ్యవస్థను నిర్మించేందుకు ప్రపంచ నిపుణులు, సంస్థలు కలిసి పనిచేయాలని ఆయన కోరారు. ఈ మార్పు యుగంలో భారత్ నాయకత్వం వహించాల్సిన సమయం ఇదేనని ఆయన స్పష్టం చేశారు.
 

By
en-us Political News

  
రాత్రి సమయం కావడం, బావిలో నీరు నిండుగా ఉండటంతో సహాయక చర్యలు చేపట్టడం కష్టంగా మారింది. సమాచారం పోలీస్ లు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. విపత్తు నిర్వహణ బృందాలు రెండు భారీ క్రేన్ల సహాయంతో అర్ధరాత్రి దాటిన తర్వాత కారును బావిలో నుంచి బయటకు తీశారు. అయితే అప్పటికే కారులో ఉన్న వారంతా మరణించారు.
మధ్యప్రాచ్యంలో శుక్రవారం ఒకేరోజు రెండు అమెరికా యుద్ధ విమానాలను ఇరాన్ కూల్చివేయడం అంతర్జాతీయం కలకలం రేపింది. ఇరాన్ యుద్ధ సామర్ధ్యంపై ప్రపంచ దేశాలు అబ్బురపడుతున్నాయి. అమెరికా అంచనాలు ఘోరంగా దెబ్బతిన్నాయని అంటున్నాయి. ఇక పోతే ఇరాన్ దూకుడుతో అగ్రరాజ్యం డిఫెన్స్ లో పడింది.
ఐఆర్జీసీ సమాచారం మేరకు నైరుతి ఇరాన్ లో అమెరికాకు చెందిన ఎఫ్-15ఈ స్ట్రైక్ ఈగల్ యుద్ధ విమానం ఇరాన్ గగతనలంలోకి ఇలా ప్రవేశించిందో లేదో.. అలా ఇరాన్ రక్షణ వ్యవస్థలు దానిని కూల్చివేశాయి. విమానం కూలిపోయే ముందే అందులోని ఇద్దరు సిబ్బంది ఎజెక్ట్ అయ్యారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలనూ, విమానం శకలాలకు సంబంధించిన దృశ్యాలను కూడా ఇరాన్ మీడియా ప్రసారం చేసింది.
ఏప్రిల్ మొదటి వారంలోనే ఎండల తీవ్రత విపరీతంగా పెరగడంతో జనం ఉక్కపోతతో, ఎండ వేడితో అల్లాడిపోతున్నారు. అసలే భానుడి ప్రతాపానికి విలవిల్లాడుతున్న ఏపీ జనాలకు వాతావరణ శాఖ మరో వార్నింగ్ ఇచ్చింది. నేటి నుంచి రోజుల పాటు రాష్ట్రంలో ఎండలు మరింత మండిపోతాయనీ, రాష్ట్ర వ్యాప్తంగా వడగాల్లులు విస్తాయనీ ప్రకటించింది.
ఈ విషయాన్ని మాటలతో కాకుండా చేతలతో చేసి చూపించింది. అమెరికా స్థావరాలు, జెట్లు లక్ష్యంగా దాడులను తీవ్రతరం చేసింది. గురువారం అమెరికా ఇరాన్ కు 48 గంటల కాల్పుల విరమణ శాంతి ప్రతిపాదనను పంపింది. ఆ ప్రతిపాదనకు సమాధానమా అన్నట్లు ఇరాన్ దాడులను తీవ్రతరం చేసింది.
ఢిల్లీతో సహా పంజాబ్‌లోని నోయిడా, ఛండీగఢ్‌, లూధియానాలో భూమి కంపించింది. అలాగే పూంచ్, శ్రీనగర్, ఉదమ్‌పూర్, జమ్ము కశ్మీర్‌లోనూ భూమి కంపించింది.
210 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ 5 వికెట్ల తేడాతో గెలుపు సొంతం చేసుకుంది. పంజాబ్ 18.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.
కరీంనగర్ రూరల్ మండలం జూబ్లీ నగర్ లో నివాసం ఉంటున్న గచ్చు శ్రీశైలం అనే వ్యక్తి కి భార్య, ఇద్దరు కవల కుమార్తెలు. కుటుంబ కలహాల నేపథ్యం లో తరచూ భార్యాభర్తల మధ్య వివాదాలు సాగుతున్నాయి. ఆ క్రమంలోనే శుక్రవారం కూడా భార్యాభర్తలిద్దరూ గొడవ పడ్డారు. ఆ క్రమంలో తీవ్ర ఆగ్రహానికి గురైన శ్రీశైలం.. ఐదేళ్ల వయసు ఉన్న తన ఇద్దరు కుమార్తెలకు గడ్డి మందు తాగించి బావిలో పడేశాడు.
రాజేంద్రనగర్ కంచన్ బాగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హఫీజ్ బాబా నగర్‌కు చెందిన మహ్మద్ రహ్మత్ షరీఫ్ అనే వ్యక్తి గత నెల 31న కంచన్బాగ్ పోలీస్ స్టేషన్ లో తమ ఇంట్లో బంగారం చోరీ అయ్యిందంటూ ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు మేరకు జనవరి 17న ఆయన భార్య, కుమార్తె బంగారు ఆభరణాలను బీరువాలో భద్రరిచారు. ఆ తరువాత గత నెల 29న ఓ ఫంక్షన్ కు వెళ్లేందుకు బంగారు ఆభరణాలు ధరించేందుకు బీరువాలోని నగల పెట్టె తెరిచి చూశారు.
పశ్చిమ బెంగాల్‌కు చెందిన ప్రశాంత్ బోస్, మావోయిస్టు ఉద్యమంలో అత్యంత ప్రభావమంతమైన నాయకులలో ఒకరు. కేంద్ర కమిటీ, పొలిట్‌బ్యూరోలో కీలక సభ్యుడిగా ఉండటంతో పాటు, ఆ సంస్థ యొక్క తూర్పు ప్రాంతీయ బ్యూరో కార్యదర్శిగా కూడా పనిచేశారు.ప్రశాంత్ కిషోర్ కిషన్ దాదా, మనీష్, బుద్ధ పేర్లతో కూడా గుర్తింపు పొందారు.
గృహ వినియోగానికి సంబంధించిన మొత్తం 3,699 ఎల్పీజీ సిలిండర్లు స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా వాణిజ్య వినియోగానికి సంబంధించి 70 చిన్న ఎల్పీజీ సిలిండర్లను కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడుల్లో స్వాధీనం చేసుకున్నసిలెండర్ల విలువ 1.10 కోట్లు రూపాయలుగా అధికారులు అంచనా వేశారు.
పంజాగుట్ట నుంచి జూబ్లీ హిల్స్ చెక్‌పోస్ట్ వైపు వెళ్లే వాహనాలను వన్‌వే మార్గంలో మాత్రమే అనుమతించనున్నారు. ఈ మార్గంలో ప్రయాణించే వాహనాలు కేబీఆర్ పార్క్, ఎన్‌టీఆర్ ట్రస్ట్ క్యాన్సర్ ఆస్పత్రి, టీఆర్ఎస్ భవన్, రోడ్ నెంబర్ 12, 45, 36 మార్గాల ద్వారా వెళ్లాల్సి ఉంటుంది. ఫిలింనగర్, రోడ్ నెంబర్ 45 ప్రాంతాల్లో ప్రస్తుతం అమల్లో ఉన్న కొన్ని ట్రాఫిక్ ఆంక్షలను సడలించే అవకాశముంది.
పార్టీలో పాల్గొన్న వారిలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ మహిళాఐఏఎస్ అధికారి కుమారుడికి డ్రగ్స్ టెస్ట్‌లో పాజిటివ్ వచ్చినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఈ విషయం బయటపడటంతో కేసు మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.