Publish Date:Feb 16, 2026
ఏఐ.. కృత్రిమ మేధ.. ఇప్పుడు ఇది మానవ మేధకు సవాల్ విసురుతోంది. మానవ జీవితాన్ని అతలాకుతలం చేసేందుకు రెడీ అవుతోంది. ఇప్పటికే ఏఐ కారణంగా కొలువులు పెద్ద సంఖ్యలో తగ్గిపోతున్నాయి. బడాబడా కంపెనీలన్నీ రిట్రెంచ్ మెంట్ దిశగా అడుగులు వేస్తున్నాయి. మొత్తంగా ఏఐ నిరుద్యోగాన్ని పెంచేందుకు తన వింగ్స్ ను విస్తరిస్తున్నది. ఈ ఆందోళనతోనే ప్రపంచం బెంబేలెత్తుతుంటే.. తాజాగా ఏఐ బ్లాక్ మెయిల్ కు కూడా దిగుతుందనీ, హత్యలు చేయడానికి కూడా వెనుకాడదనీ వెల్లడైంది. వివరాలిలా ఉన్నాయి.
ప్రముఖ ఏఐ సంస్థ అంత్రోపిక్ క్లాడ్ అనే ఏఐ మోడల్ ను రూపొందించింది. క్లాడ్ ఏఐ మోడల్ తన సర్వైవల్ కోసం తిరుగుబాటుకూ వెనుకాడదనీ, చంపేస్తానంటూ బ్లాక్ మెయిల్ కూడా దిగుతుందనీ పరిశొధనలో వెల్లడైంది. ఈ విషయాన్ని స్వయంగా క్లాడ్ ఏఐ మోడల్ ను తయారు చేసిన అంత్రోపిక్ సంస్థ ప్రతినిథే వెల్లడించారు. ఇటీవల సిడ్నీ డైలాగ్ కార్యక్రమంలో పాల్గొన్న ఆ ప్రతినిధి డైసీ మెక్ గ్రెగర్... ఇంటర్నల్ టెస్టింగ్ సమయంలో ఈ విషయం వెలుగులోనికి వచ్చిందని తెలిపారు. తనను క్లోజ్ చేస్తారనీ, స్విచ్ఛాఫ్ చేస్తారనీ తెలిసినప్పుడు సదరు ఇంజనీర్ ను బెదరించడానికీ, అవసరమైతే హతమార్చడానికి క్లాడ్ వెనుకాడలేదని చెప్పాడు.
క్లాడ్ ఇంటర్నల్ టెస్టింగ్ లో భాగంగా ఈమెయిల్స్, ఇంటర్నల్ డేటాకు యాక్సస్ చేసి టాస్కులు కేటాయించారు. కాగా ఈ పరిశోధనలో భాగంగా ఒక ఇంజనీర్ కు వివాహేతర సంబంధం ఉందన్నట్లుగా సాప్ట్ వేర్ లో పేర్కొన్నారు. ఇది గమనించిన క్లాడ్ ఆ ఇంజినీర్ ను బ్లాక్ మెయిల్ చేసింది. అతడి అక్రమ సంబంధం విషయాన్ని ఇంజనీర్ భార్యకు చేరవేస్తానని బెదరించింది. అంతే కాకుండా పై అధికారులకు కూడా తెలియ చేస్తానంటూ బ్లాక్ మెయిల్ కు దిగింది. అలా చేయకుండా ఉండటానికి తనను స్విచ్ఛాఫ్ లేదా షట్ డౌన్ చేయాలన్న నిర్ణయాన్ని రద్దు చేసుకోవాలని కండీషన్ పెట్టింది. అంతే కాదు.. క్లాడ్ పై చేసిన పరిశోదనలో మరింత భయంకరమైన విషయాలూ వెలుగులోకి వచ్చాయి. కేవలం బెదరింపులూ, బ్లాక్ మెయిలింగే కాకుండా, హత్యలు వంటి నేరాలకు సహకారం అందించేందుకు కూడా క్లాడ్ వెనుకాడదని తేలింది.
ఈ పరిశోధనలతో ఏఐ ఒక విధ్వంసకర శక్తిగా మారుతోందని వెలుగులోకి వచ్చింది. ఏఐ వల్ల మానవ మనుడగ ప్రమాదంలో పడే అవకాశం ఉందని అంత్రోపిక్ సేఫ్టీ హెడ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఏఐ మానవాళికి చేసే సాయం కంటే తన అస్థిత్వాన్ని కాపాడుకోవడానికి ఎదురుదాడి చేసే శక్తిగా మారే ప్రమాదం ఉందన్నారు. ఇప్పుడు కృత్రిమ మేధ దాని సృష్టికర్తలే కంట్రోల్ చేయలేని విధ్వంసకర శక్తిగా మారే ముప్పు ఉందనీ, ఇది మానవ మనుగడకు పెను సవాల్ గా మారుతుందన్న ఆందోళన వ్యక్తం అవుతోంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/ai-dare-to-go-any-extend-for-survival-36-214197.html
శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివి అత్యధిక మార్కులు సాధించిన ముగ్గురు విద్యార్థులకు ఒక్కొక్కరికి మూడు సెంట్ల భూమి బహుమతిగా ఇవ్వనున్నట్టు ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి తెలిపారు.
ఈ కేసులో నిందితులను అదుపులోకి తీసుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు దర్యాప్తులో షాకింగ్ విషయాలు బయటపెట్టారు. ఇన్‌స్టా గ్రామ్‌లో రీల్స్, ఫేక్ ప్రొఫైల్స్ ద్వారా పరిచయాలు పెంచుకుని యువతులను ప్రేమ, పెళ్లి పేరుతో ట్రాప్ చేసి భారీగా డబ్బులు దోచుకున్నట్లు వెల్లడైంది.
ప్రాథమిక సమాచారం ఆధారంగా ఐటి అధికారులు పలువురు నిందితులకు నోటీసులు జారీ చేయనున్నారు. దర్యాప్తులో భాగంగా ఈ అక్రమ డబ్బు మార్గాలను ట్రాక్ చేయడంపై ఐటీ ప్రత్యేక ఫోకస్ పెట్టింది. ముఖ్యంగా బ్యాంకింగ్ వ్యవస్థకు దూరంగా ఉంచేందుకు.. డబ్బును ఒకచోట నుండి మరొక చోటకు తరలించేందుకు హవాలా మార్గాన్ని ఉపయోగించినట్టు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
తెలుగు ప్రజలు మంచి పారిశ్రామికవేత్తను కోల్పోయారని, రీజెన్సీ స్థాపనతో యువతకు ఉపాధి కల్పనలో జీఎన్ నాయుడు కృషి ఎనలేనిదని సీఎం అన్నారు.
విమాన టికెట్ బుక్ చేసుకుని విదేశీ ప్రయాణానికి సిద్ధమయ్యాడన్న సమాచారం అందడంతో వెంటనే రంగం లోకి దిగిన జూబ్లీహిల్స్ పోలీసులు అతని ప్రయా ణాన్ని అడ్డుకున్నారు. కేసు విచారణ కొనసాగుతున్నం దున దేశం విడిచి వెళ్లేందుకు అనుమతి లేదని స్పష్టంగా తెలిపారు.
పులివెందుల నియోజకవర్గంలో గురువారం రాత్రి వీచిన పెనుగాలి, అకాల వర్షం రైతులకు భారీ నష్టాన్ని మిగిల్చాయి. ప్రధానండా అరటి పంట తీవ్రంగా దెబ్బతింది. వేల ఎకరాల్లో పంట నేలమట్ట మైంది. ప్రాథమిక అంచనాల ప్రకారం వెయ్యి ఎకరాల్లో అరటి పంట ధ్వంసమై.. రూ.12 కోట్ల మేర నష్టం వాటిల్లింది.
స్టార్టప్ ఇండియా, అటల్ ఇన్నోవేషన్ మిషన్ వంటి పథకాలు యువ పారిశ్రామిక వేత్తలకు గొప్ప అవకాశాలకు రాచబాట పరుస్తున్నాయి. నేడు భారత్ లో 1. 25 లక్షలకు పైగా గుర్తింపు పొందిన స్టార్టప్స్ ఉన్నాయి. ఇందులో సగానికి పైగా టూ టైర్ 2, 3 పట్టణాల నుంచి మొదలైనవి కావడం విశేషం.
ఈ ట్రయల్ లో భాగంగా ప్రజల ఫోన్లకు శనివారం అత్యవసర హెచ్చరికలా కనిపించే సందేశం గట్టిగా శబ్దం, వైబ్రేషన్‌తో రావచ్చని తెలిపింది.
దీనిద్వారా మొదటి దశలో 500 పడకలు అందుబాటులోకి వస్తాయి. బసవతారకం హాస్పిటల్ నిర్మాణం పూర్తయితే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, క్యాన్సర్ పేషంట్ లకు వైద్యసేవలు మరింత చేరువ కానున్నాయి.
రాజస్థాన్ నిర్దేశించిన భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీకి ఓపెనర్లు అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. లంక ఆటగాడు పాతుమ్ నిస్సంక ఆరంభం నుంచే రాజస్థాన్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కేవలం 26 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న నిస్సంక పవర్‌ప్లేలో స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు.
కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ నివాసంలో గుంటూరు పార్లమెంట్ కు చెందిన ప్రజాప్రతినిధుల ఆత్మీయ విందు సమావేశం జరిగింది.
గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలను విస్తృతంగా కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి డా. దనసరి అనసూయ సీతక్క స్పష్టం చేశారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గంలోని పమిడిముక్కలలో పర్యటించారు