ప్రత్యూష మృతిపై సుప్రీం తీర్పు నేడు

Publish Date:Feb 16, 2026

Advertisement

ఇరవై నాలుగేళ్ల  కిందట పెను సచలనం   సృష్టించిన సినీ నటి ప్రత్యూష మృతి కేసులో  దేశ సర్వోన్నత న్యాయస్థానం వెలువరించనున్న తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొని ఉంది. ప్రత్యూష మృతి కేసులో సుప్రీం కోర్టు మంగళవారం (ఫిబ్రవరి 17) తుది తీర్పు వెలువరించనుంది. 
కేసు వివరాల్లోకి వెడితే.. భువనగిరికి చెందిన ప్రత్యూష్ పిన్న వయస్సులోనే చిత్రపరిశ్రమలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. వర్థమాన నటిగా వరుస అవకాశాలను అందిపుచ్చుకుంటూ స్టార్ స్టేటస్ కు చేరుకున్నారు. మోహన్ బాబు హీరోగా నటించిన రాయుడు సినిమాతో తెరంగేట్రం చేసిన ప్రత్యూషకు ఆ సినిమాలో నటనకు మంచి గుర్తింపు వచ్చింది. తొలి సినిమాతోనే అశేష ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొంది. ఈ గుర్తింపుతో వరుసగా తెలుగు, తమిళ సినిమాలలో వరుస అవకాశాలను అందిపుచ్చుకుంది.  

ఈ నేపథ్యంలోనే ఆమె మరణించారు.  2002 ఫిబ్రవరి 24న తన 20 ఏళ్ల వయస్సులో ప్రత్యూష మృతి అప్పట్లో సంచలనం సృష్టించింది. విషం తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి.  ప్రత్యూష, ఆమె స్నేహితుడు గుడిపల్లి సిద్ధార్థరెడ్డిలు 2002 ఫిబ్రవరి 23న  విషం తాగి ఆత్మహత్యాయత్నం చేసి ఆసుపత్రి పాలయ్యారు. ప్రత్యూష చికిత్స పొందుతూ ఫిబ్రవరి 24న మరణించింది. ఆమె స్నేహితుడు సిద్ధార్థ కోలుకుని మార్చి 9న సిద్ధార్థ డిశ్చార్చి అయ్యాడు. 

అయితే ప్రత్యూష మృతి పట్ల అప్పట్లో పపలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. ప్రత్యూషది ఆత్మహత్య కాదనీ, ఆమె హత్యకు గురైందనీ ఆరోపణలు వెల్లువెత్తాయి. ప్రత్యూషది హత్యేనని ఆరోపిస్తూ ఆమె తల్లి సరోజినీదేవి న్యాయ పోరాటానికి దిగారు. ఈ కేసులో దర్యాప్తు జరిపిన సీబీఐ.. ప్రత్యూషది ఆత్మహత్యేనని తేల్చింది. అయితే ప్రత్యూష స్నేహితుడు  సిద్ధార్థపై  ఆత్మహత్యకు ప్రేరేపించడం, సెక్షన్  ఆత్మహత్యకు యత్నించడం తదితర కేసులు నమోదు చేసి చార్జిషీట్ దాఖలు చేసింది.   ఈ కేసులో సిద్ధార్థకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి.. ఐదేళ్ల కఠిన కారాగార శిక్షతోపాటు, రూ.5 వేల జరిమాన విధిస్తూ 2004లో తీర్పు వెలువరించారు. అయితే ఈ తీర్పును సవాల్ చేస్తూ సిద్ధార్థ్ హైకోర్టును ఆశ్రయంచగా, కింది కోర్టు విధించిన ఐదేళ్ల జైలు శిక్షను రెండేళ్లకు తగ్గిస్తూ హైకోర్టు 2011లో తీర్పు వెలువరించింది. ఈ తీర్పును సవాల్ చూస్తూ సిద్ధార్థ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. అలాగే ప్రత్యూష తల్లి కూడా హైకోర్టు తీర్పును సుప్రీంలో సవాల్ చేశారు.  

నిందితుడికి విధించిన శిక్షను పెంచాలంటూ ప్రత్యూష తల్లి, హైకోర్టు విధించిన శిక్షను పూర్తిగా రద్దు చేయాలంటూ సిద్ధార్థ.. వేర్వేరుగా పిటిషన్లు ధాఖలు చేశారు. ఈ పిటిషన్లను విచారించిన జస్టిస్‌ రాజేష్ బిందల్, జస్టిస్‌ మన్మోహన్‌లతో కూడిన సుప్రీం  ధర్మాసనం గత ఏడాది  నవంబర్ లో తీర్పు  రిజర్వ్‌ చేసింది.  ఇప్పుడు ఆ రిజర్వ్ చేసిన తీర్పును మంగళవారం (ఫిబ్రవరి 17) వెలువరించనుంది.  

By
en-us Political News

  
కరీంనగర్ పీఎంజే జ్యువలరీ షాప్ లో దోపిడీ చేసిన కేసులో మరో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది.
కరీంనగర్ జిల్లాలో రాజకీయ ఉద్రిక్తతలు తారస్థాయికి చేరుకున్నాయి.
చిత్తూరు జిల్లా పలమనేరు పరిధిలోని కౌండిన్య ఎలిఫెంట్ శాంక్చువరీలో ఉన్న కుంకీ ఏనుగులకు.. ఈ ప్రత్యేక గుర్తింపు కార్డులు జారీ చేయాలని నిర్ణయించింది. మనుషులకు ఉండే ఆధార్ తరహాలోనే ఈ కార్డులను రూపొందించనుంది
మోదీ తన ఎక్స్ ఖాతా డీపీగా ఆపరేషన్ సిందూర్ ఫోటోను పెట్టుకొని సైన్యానికి గౌరవం ప్రకటించారు. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం ఈ మెరుపు దాడిని చేపట్టిన సంగతి తెలిసిందే.
​చెన్నూరుకు చెందిన యోగేంద్ర కుమార్ వర్మ, హేమశ్రీ చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. కాలక్రమేణా ఆ స్నేహం ప్రేమగా మారింది. వారి మధ్య ఉన్న అనుబంధం ఎంతో బలమైనది. అయితే.. గత కొద్దిరోజులుగా వీరిద్దరి మధ్య చిన్నపాటి వివాదాలు తలెత్తినట్లు సమాచారం.
కుటుంబ సభ్యులతో మాట్లాడిన అల్లు అరవింద్, ప్రమాదం వల్ల వారికి కలిగిన బాధను పంచుకుంటూ ధైర్యం చెప్పారు. బాలుడి చికిత్సకు అవసరమైన సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. అదే సమయంలో శ్రీతేజ్ సోదరి చదువుల బాధ్యతను తాను తీసుకుంటానని అల్లు అరవింద్ ప్రకటించారు.
బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమష్టిగా రాణించిన ఆరెంజ్ ఆర్మీ.. పంజాబ్‌పై 33 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ కోల్పోయి తొలుత బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 235 పరుగుల భారీ స్కోరు చేసింది. ఆరంభం నుంచే సన్ రైజర్స్ బ్యాటర్లు పంజాబ్ బౌలర్లపై విరుచుకుపడి సిక్సర్లు, ఫోర్లతో పరుగుల వర్షం కురిపించారు.
నార్త్ 24 పరగణాల జిల్లాలోని మధ్యమ్‌గ్రామ్‌లో బుధవారం రాత్రి ఆయనను గుర్తు తెలియని వ్యక్తులు అతి సమీపం నుంచి కాల్చి హత్య చేశారు. దోహరియా ప్రాంతంలోకి ఆయన కారును వెంబడించి వచ్చిన దుండగులు చంద్రనాథ్ రథ్‌పై నాలుగు రౌండ్లు కాల్పులు జరిపారు.
హైద‌రాబాద్ మెట్రో ఫేజ్‌-IIకు ఆమోదం తెల‌పాల‌ని కేంద్ర ప‌ట్ట‌ణ వ్య‌వ‌హారాల శాఖ మంత్రి మ‌నోహ‌ర్‌లాల్ ఖ‌ట్ట‌ర్‌కు ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి విజ్ఞ‌ప్తి చేశారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డిపై వరంగల్ సభలో అనుచిత వ్యాఖ్యలు చేసిన కేటీఆర్ తక్షణం క్షమాపణలు చెప్పాలని మంత్రి సీతక్క డిమాండ్ చేశారు.
రిటైర్డ్ డీజీపీ బి. శివధర్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర భద్రతా సలహాదారుగా బాధ్యతలు స్వీకరించారు.
తన పర్యటనల సమయంలో ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా చూడాలని ముఖ్యమంత్రి ఆదేశాలు
వరంగల్ జిల్లాలో నిర్వహించిన రైతు సంగ్రామ సదస్సు వేదికగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.