లోకేశ్‌కు జ‌గ‌న్ భ‌య‌ప‌డుతున్నారా? అరెస్ట్ అందుకేనా..?

Publish Date:Aug 16, 2021

Advertisement

నారా లోకేశ్ అరెస్ట్‌. ఇదే ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్‌. టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి అరెస్ట్ కావ‌డం ఇదే తొలిసారి. ఆయ‌న రాజ‌కీయ ప్ర‌స్థానంలో ఆ ఘ‌ట్టం కూడా ముగిసింది. ఓట‌మి నారా వారి తన‌యుడిని రాటుదేల్చిన‌ట్టుంది. అనుభ‌వం యువ‌నేత‌ను మ‌రింత ప‌దును పెట్టిన‌ట్టుంది. ఇటీవ‌ల కాలంలో అన్నింటా ఆయ‌నే. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షంగా బాధ్య‌తంతా లోకేశే త‌న భుజాల‌పై మోస్తున్నారు. తండ్రి డైరెక్ష‌న్‌లో ప్ర‌భుత్వంపై అలుపెర‌గ‌ని దండ‌యాత్ర చేస్తున్నారు. ప్ర‌తినిత్యం ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై అవిశ్రాంత పోరాటం చేస్తున్నారు. ప్ర‌జ‌ల కోసం.. ప్రజ‌ల చెంత‌.. ప్ర‌జాక్షేత్రంలో.. రాకెట్‌లా దూసుకుపోతున్నారు.  

తాజాగా, గుంటూరులో ర‌మ్య మృత‌దేహానికి నివాళులు అర్పించి.. బాధిత కుటుంబాన్ని పరామ‌ర్శించారు నారా లోకేశ్‌. అంతే. పోలీసులు పోలోమంటూ దిగిపోయారు. లోకేశ్‌ను అదుపులోకి తీసుకొని అక్క‌డి నుంచి త‌ర‌లివ‌చ్చారు. కార‌ణం.. లోకేశ్ రాకవ‌ల్ల బాధితురాలి ఇంటికి జ‌నం పోటెత్తారు. ఆ కుటుంబానికి మ‌ద్ద‌తుగా క్ష‌ణాల్లో వేలాది మంది త‌ర‌లివ‌చ్చారు. ఆడ‌పిల్ల‌కి భ‌ద్ర‌త క‌ల్పించ‌లేని ప్రభుత్వ చేత‌గానిత‌నంపై ఆగ్ర‌హం వెల్లువెత్తింది. పెద్ద స్థాయి నేత వ‌స్తే.. ఆ ప్ర‌భావం.. ఆ ఫ‌లితం ఇలానే ఉంటుంది. ఇష్యూకి ఇంపార్టెన్స్ పెరుగుతుంది. ప్ర‌జ‌ల్లో అటెన్ష‌న్ క్రియేట్ అవుతుంది. ప్ర‌భుత్వంపై ఎక్క‌డ‌లేని ప్రెజ‌ర్ వ‌స్తుంది. నారా లోకేశ్ గుంటూరు రాక‌తో అదే జ‌రిగింది. పే..ద్ద లీడ‌ర్ల వ‌ల్ల‌నే ఇలాంటి ప‌రిణామాలు సాధ్యం. అందుకే, స‌ర్కారు ఉలిక్కిప‌డింది. వెంట‌నే ఖాకీల‌ను రంగంలోకి దింపి లోకేశ్‌ను అరెస్ట్ చేసి అక్క‌డి నుంచి దూరంగా తీసుకెళ్లిపోయారు. అంటే.. దీని అర్థం.. నారా లోకేశ్‌కు స‌ర్కారు భ‌య‌ప‌డిన‌ట్టేగా..? యువ‌నేత‌ను చూసి పాల‌కుల‌కు వ‌ణుకు పుట్టిన‌ట్టేగా..?

నారా లోకేశ్ దూకుడు మామూలుగా లేదు. కరోనా కాలంలో ప‌ది, ఇంట‌ర్ ప‌రీక్ష‌లు వ‌ద్దే వ‌ద్దంటూ ఆయ‌న చేసిన పోరాటం అంతా ఇంతా కాదు. లాక్‌డౌన్ ఉన్నా.. త‌న వెనుక జ‌న‌స‌మూహం లేక‌పోయినా.. జూమ్ మీటింగుల‌తోనే స‌ర్కారుపై తీవ్ర ఒత్తిడి పెంచారు. నిత్యం విద్యార్థులు, త‌ల్లిదండ్రుల‌తో మాట్లాడుతూ.. వారికి మ‌ద్ద‌తు తెలుపుతూ.. ప్ర‌భుత్వం ప‌రీక్ష‌లు ర‌ద్దు చేసి దిగొచ్చేదాకా ప‌ట్టువ‌ద‌ల‌నే లేదు లోకేశ్‌. మామూలుగా వేరే వారైతే ఏ రెండు-మూడు రోజులో నినాదాలు చేసి వ‌దిలేసేవారే. కానీ, లోకేశ్ అలాకాదు.. దాదాపు రెండు నెల‌ల పాటు విక్ర‌మార్కుడిలా ప‌రీక్ష‌ల ర‌ద్దు కోసం గొంతెత్తి నిన‌దించారు. నిజ‌మైన లీడ‌ర్ అనిపించుకున్నారు. జూమ్‌లాంటి ఆన్‌లైన్ వేదిక‌ల‌ను ఇంత‌లా ఉప‌యోగించుకొని.. ప్ర‌జ‌ల ప‌క్షాన పోరాటం చేసిన ఏకైక నాయ‌కుడు బ‌హుషా లోకేశ్ ఒక్క‌రేనేమో...!

ఇక నారా లోకేశ్ అస‌లైన నాయ‌క‌త్వ ల‌క్ష‌ణాలు తిరుప‌తి ఎంపీ ఉప ఎన్నిక‌ల ప్ర‌చారం స‌మ‌యంలోనే బ‌య‌ట‌ప‌డ్డాయి. టీడీపీ అభ్య‌ర్థిగా ప‌న‌బాక ల‌క్ష్మి పేరు ప్ర‌క‌టించ‌గానే.. ప్రచార బాధ్య‌త‌ల‌న్నీ ఆయ‌నే మీదేసుకున్నారు. వారాల త‌ర‌బ‌డి తిరుప‌తి నియోజ‌క‌వ‌ర్గంలోనే మ‌కాం వేసి.. ఊరూరా, వాడ‌వాడ‌లా ప‌ర్య‌టించారు. రోడ్‌షోలు, పాద‌యాత్ర‌లు, స‌భ‌లు, స‌మావేశాలు, ప‌బ్లిక్‌తో సెల్ఫీలు, జ‌నాల‌తో మాటామంతి.. అలుపెర‌గ‌కుండా, విసుగుచెంద‌కుండా.. ప్ర‌చారాన్ని హోరెత్తించారు. కేడ‌ర్‌లో ఉత్సాహం నింపారు. తిరుప‌తిలో నారా లోకేశ్ నిర్వ‌హించిన ప్ర‌తీ ర్యాలీకి జ‌నం పోటెత్తారు. ఆయ‌న ప్ర‌సంగాలు సైతం ఆలోచింప‌జేసేవిగా సాగాయి. పంచ్‌ల‌తో ఈల‌లు వేయించాయి.. కేక‌లు పెట్టించాయి. గ‌తంలో ప్ర‌తిప‌క్ష నేత‌గా జ‌గ‌న్ ర్యాలీలు అలానే సాగేవ‌ని జ‌నం చ‌ర్చించుకున్నారు. జ‌గ‌న్‌లానే లోకేశ్ సైతం ప‌దునైన విమ‌ర్శ‌ల‌తో ఆయ‌న ప్ర‌సంగాలు వాడి-వేడిగా ఉండేవ‌ని మాట్లాడుకున్నారు. ఆనాడు జ‌గ‌న్ నాయ‌క‌త్వంలో వైసీపీ శ్రేణులు విజ‌య‌తీరాల వైపు న‌డిచిన‌ట్టు.. ఇప్పుడు మ‌ళ్లీ లోకేశ్ లీడ‌ర్‌షిప్‌లో టీడీపీ కొత్త ఉత్సాహంతో ముందుకు క‌దులుతోంద‌ని అంటున్నారు. 

తిరుప‌తి ఉప ఎన్నిక‌లు అనే కాదు.. టీడీపీ నాయ‌కుల‌ను అక్ర‌మ కేసుల‌తో అరెస్ట్ చేసిన‌ప్పుడు.. టీడీపీ కార్య‌కర్త‌ల‌పై దాడులు, హ‌త్య‌లు జ‌రిగిన‌ప్పుడు.. ప్ర‌జ‌లకు స‌మ‌స్య ఎదురైన‌ప్పుడు.. ఇలా ఏ ఒక్క సంద‌ర్భానికీ ఏమాత్రం కాంప్ర‌మైజ్ కాకుండా.. ప్రాబ్ల‌మ్ ఉన్న‌చోట‌ల్లా వాలిపోతున్నారు నారా లోకేశ్‌. మొద‌టినుంచీ ఇంగ్లీష్‌మీడియం కావ‌డం, ఫారిన్‌లో చ‌దువుకొని రావ‌డంతో.. గ‌తంలో తెలుగు స‌రిగ్గా మాట్లాడ‌లేక‌.. ప‌ప్పు అనే విమ‌ర్శ ఎదుర్కొన్నారు. ఇప్పుడు బాడీతో పాటు బాడీలాంగ్వేజ్‌నూ మార్చేశారు. స్లిమ్ అండ్ షార్ప్‌గా క‌నిపిస్తున్నారు. ఆయ‌నలానే ఆయ‌న స్పీచుల్లోనూ ప‌స పెరిగింది. పప్పు కాస్తా నిప్పులా మారారు. తూటాల్లాంటి మాట‌లు, ప‌దునైన విమ‌ర్శ‌లు, ఘాటు వ్యాఖ్య‌ల‌తో ప్ర‌భుత్వ తుప్పు వ‌ద‌ల‌గొడుతున్నారు. ఇక లోకేశ్ చేసే ట్వీట్లు.. జ‌గ‌న్‌ను, విజ‌య‌సాయిని తూట్లు పొడుస్తుంటాయి. అందుకే, నారా లోకేశ్ అంటే స‌ర్కారు షేక్ అవుతోంది. గుంటూరు ర‌మ్య‌శ్రీ కుటుంబాన్ని ప‌రామ‌ర్శించ‌డానికి వెళితే.. ఆ ఒత్తిడి త‌ట్టుకోలేక పోలీసుల‌తో అరెస్ట్ చేయించింది. త‌న పొలిటిక‌ల్ కెరీర్‌లో తొలిసారి అరెస్టై.. తాను రాటుదేలిన నాయ‌కుడిన‌ని నిరూపించుకున్నారు నారా లోకేశ్‌. తాజా, అరెస్ట్‌తో లోకేశ్ ఇమేజ్ అమాంతం పెరిగిపోయింది. ప్ర‌భుత్వం లోకేశ్‌తో పెట్టుకొని మ‌రోసారి ప‌ప్పులో కాలేసింది. నిప్పుతో చెల‌గాట‌మాడుతోంది.

By
en-us Political News

  
రాఘవ్ చద్దా, ఆమ్ ఆద్మీ పార్టీ మధ్య తలెత్తిన అంతర్గత విభేదాలు ఇప్పుడు బహిరంగ యుద్ధంగా మారాయి.
న్ని ఎన్నికలలో విచిత్రాలు జరగవు. ప్రతిసారీ ఒకటే జరిగితే, దాన్ని విచిత్రం అనరు కదా? ఎన్నికలు జరిగి నిండా రెండేళ్లు కాకముందే నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి ఓటి పలుకు వినపడుతున్నది. కొందరు ప్రముఖులు పక్కదారులు చూస్తున్నారని, పక్క పార్టీతో బేరసారాలు జరుపుతున్నారని కూడా వినపడుతున్నది.
అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో.. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తన పంథాను మార్చుకోలేదనేది స్పష్టమవుతోంది. ఐదేళ్ల పాలనలో మూడు రాజధానుల మంత్రం జపించిన జగన్.. ఇప్పుడు మచిలీపట్నం-విజయవాడ-గుంటూరును కలిపి ఒక మెగా సిటీగా మార్చాలనే సరికొత్త ప్రతిపాదనను ముందుకు తెచ్చారు.
మూడు రాజధానుల అంశం గత ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయానికి ప్రధాన కారణాలలో ఒకటి అన్న విషయాన్ని విస్మరించి.. మళ్ళీ అదే తరహా ప్రత్యామ్నాయ వాదనలు వినిపించడం పట్ల రాజకీయవర్గాలలో విస్మయం వ్యక్తమౌతోంది. పార్టీ కేడర్ సైతం మావిగన్ ఏంటి అదేదో పంటకు పట్టే తెగుల్లా ఉందని నెత్తీ నోరూ బాదుకుంటోంది.
ఆ రోజు సభలో ఓ మంత్రి తనపై చెయ్యి చేసుకున్నారని పేర్కొన్నారు. మరో మంత్రి ఏకవచనంతో తిట్టిపోశారు, కులం పేరుతో దూషిస్తూ తన పుట్టుకను నిందించారన్నారు. శాసనమండలిలో తన సిబ్బందినీ దగ్గరికి రాకుండా వైసీపీ సభ్యులు అడ్డుపడ్డారని, తన చుట్టూ చేరి బెదిరింపులు, ప్రలోభాలతో రకరకాలుగా ఇబ్బంది పెట్టారన్నారు.
ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలకు 5 కోట్ల మంది ప్రజల తరఫున కృతజ్ణతలు తెలిపారు. దేశం మొత్తానిది ఒక దారైతే... తమదో దారి అన్నట్లు వైసీపీ వ్యవహరించిందని దుయ్యబట్టారు. రాష్ట్రం, దేశం నాశనమైనా పర్వాలేదు.. మాకు స్వార్థ రాజకీయమే ముఖ్యమన్నట్లుగా వైసీపీ వ్యవహరించిందని విమర్శించారు.
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో డ్రగ్స్ సంస్కృతి ఒక పెను సవాలుగా మారింది. ఇటీవలి కాలంలో రాజకీయ నాయకులు, ప్రముఖుల పేర్లు డ్రగ్స్ కేసుల్లో వినిపిస్తుండటం సమాజంలో తీవ్రసంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. వాస్తవ వేదిక చర్చలో డోలేంద్ర ప్రసాద్, కంఠంనేని రవిశంకర్ లు ఇది కేవలం శాంతిభద్రతల సమస్య మాత్రమే కాదనీ, సమాజ భవిష్యత్తుకు పెనుముప్పుగా పరిణమించిన ఒక సామాజిక రుగ్మత అని పేర్కొన్నారు.
ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలో విజయ్ రాష్ట్రంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఈ క్రమంలోనే జననాయగన్‌ సినీమా విడుదలపై నెలకొన్న అనిశ్చితిని ఆయన ప్రజల ముందు ఉంచారు. అలాగే.. కరూర్ ప్రాంతంలో చోటుచేసుకున్న విషాద ఘటనను ప్రస్తావిస్తూ.. అది యాధృచ్ఛికంగా జరిగింది కాదని, దాని వెనుక కూడా లోతైన కుట్ర దాగి ఉందన్న అనుమానాలున్నాయన్నారు.
నిజానికి తాను రాజ‌కీయ స‌న్యాసం చేసిన‌ట్టు చెబుతూనే ఉన్నా.. ఇప్ప‌టికీ ఆయ‌న‌ త‌న టీం ద్వారా అకౌంట్ స‌ర్వీసెస్ అందిస్తూనే ఉన్నారు. ఆపై జ‌గ‌న్ కి లోపాయికారిగా సహకరించేందుకే ఈ రాజీనామా డ్రామాల‌ని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. బేసిగ్గా విజ‌య‌సాయిరెడ్డి కామెంట్ చేయాల్సింది ఏదైనా ఉందంటే.. ఇటీవ‌ల జ‌గ‌న్ అర్ధంప‌ర్దం లేకుండా చేసిన మావిగ‌న్ అనే ప్ర‌తిపాద‌న‌ మీదే. కానీ రేణుక చౌద‌రి స‌భ‌లో లేవ‌నెత్తిన క‌మ్మ‌రావ‌తిని ప‌ట్టుకుని.. పోస్టులు పెట్ట‌డం స‌రికాద‌ంటున్నారు.
రాజ్యసభలో అమరావతి చట్టబద్ధత బిల్లుకు కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, టీఎంసీ, ఆప్, బీజేడీ, ఆర్జేడీ, బీఆర్ఎస్, జేడీ(యూ), శివసేన మద్దతు ఇచ్చాయి. రాజ్యసభలో అమరావతి చట్టబద్ధతపై జరిగిన చర్చలో 11 పార్టీలు పాల్గొన్నాయి.
గురువారం సాయంత్రం రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు జరుపుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పిలుపునిచ్చారు. ఇక 2015లో దేశంలోని వివిధ పుణ్యక్షేత్రాల నుంచి తెచ్చిన పవిత్ర జలాలు, మట్టిని ఉంచిన ఉద్దండరాయునిపాలెంలో పర్యటించి, రాజధాని సంకల్పంలో పాల్గొన్నారు.
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ ఈ బిల్లును రాజ్యసభలో సభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఏపీ రాజధాని విషయంలో ఉన్న చట్టపరమైన అస్పష్టతను తొలగించేందుకు ఈ సవరణ అత్యవసరమని పేర్కొన్నారు. బిల్లుపై జరిగిన చర్చ అనంతరం, సభాపతి సి.పి. రాధాకృష్ణన్ క్లాజ్ వారీగా ఓటింగ్‌ నిర్వహించగా సభ్యులు అనుకూలంగా ఓటు వేశారు. దీంతో అమరావతిని రాజధానిగా ఖరారు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయానికి రాజ్యసభ ఆమోదం లభించింది.
. తాము అమరావతిని వ్యతిరేకించడం లేదనీ, అయితే రాజధాని పేరుతో సాగుతున్న పరిణామాలు, ఆర్థిక భారాలనే ప్రశ్నిస్తున్నామన్నారు. రైతుల నుంచి భూములు సేకరించి ఇన్నాళ్లు గడుస్తున్నా ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగలేదని ఆయన విమర్శించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.