తాండూరు పోలీస్ స్టేషన్ నుండి నిందితుడు పరార్

Publish Date:May 14, 2026

Advertisement

 

వికారాబాద్ జిల్లా తాండూరులో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. కిడ్నాప్ కేసులో అరెస్టైన ఓ నిందితుడు పోలీస్ స్టేషన్ నుంచే పోలీసుల కళ్లుగప్పి పరారైనట్లు అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ముజఫర్‌నగర్‌కు చెందిన అజీమ్ (ఆసిఫ్ అలియాస్ అజిమ్) తాండూరులోని ఓ సెలూన్‌లో పని చేస్తున్నాడు. అదే ప్రాంతంలో నివసిస్తున్న 17 ఏళ్ల మైనర్ బాలికను ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పి ఢిల్లీకి తీసుకెళ్లేందుకు ప్రయత్నించినట్లు ఆరోపణలు ఉన్నాయి. 

ఈ ఘటనపై బాలిక కుటుంబ సభ్యులు తాండూరు పోలీసులను ఆశ్రయించడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు హైదరాబాద్‌లో నిందితుడిని అరెస్టు చేసి తాండూరుకు తీసుకువచ్చి రిమాండ్ ప్రక్రియ కొనసాగిస్తున్న సమయంలో, అనూహ్యంగా నిందితుడు పోలీస్ స్టేషన్ నుంచే పరారైనట్లు సమాచారం... ఐదు రోజులుగా సీక్రెట్ గా ఉంచిన ఈ ఘటన ఇప్పుడు బయటకు రావడంతో హాట్ టాపిక్ గా మారిపోయింది. 

ఈ ఘటన పలు అనుమా నాలకు దారితీస్తోంది. ఇప్పటికే పోలీసులు నిందితుడి ఆచూకీ కోసం ప్రత్యేక పోలీస్ బృందాన్ని ఉత్తరప్రదేశ్ ముజఫర్‌నగర్ ప్రాంతానికి పంపినట్లు తెలుస్తోంది. అంతర్రాష్ట్ర స్థాయిలో గాలింపు చర్యలు కొనసాగు తున్నాయి. ఈ ఘటనలో విధి నిర్వహణలో నిర్లక్ష్యం ఆరోపణలతో ఇద్దరు పోలీస్ సిబ్బందిపై వేటు పడే అవకాశం ఉంది..పోలీసులు మాత్రం అధికారికంగా ఇంకా పూర్తి వివరాలు వెల్లడించలేదు. ఈ ఘటన తాండూరు పట్టణంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది

By
en-us Political News

  
బండి భగీరథపై నమోదైన పోక్సో కేసులో పోలీసులు దర్యాప్తును మరింత వేగవంతం చేశారు.
నేటి ఆధునిక కాలంలో పెళ్లి అనేది నూరేళ్ల పంట అనుకుంటారు.
తనకు భద్రత కల్పించాలని తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్‌ను ప్రొఫెసర్ నాగేశ్వర్‌ కలిశారు.
హైదరాబాద్ మహానగరంలో మంగళవారం మధ్యాహ్నం ఒక ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.
మావోయిస్టు ఉద్యమానికి భారీ ఎదురుదెబ్బ తగిలిందని డీజీపీ సీవీ ఆనంద్ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తు వేగం పెంచింది.
తెలంగాణ రాష్ట్రంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు మరోసారి తమ ప్రతాపం చూపించారు.
ఇటీవల కాలంలో సమాజంలో పెళ్లిళ్లు ఎంత వేగంగా జరుగుతున్నాయో, అంతే వేగంగా చిన్న చిన్న కారణాలకే విడాకుల దాకా వెళ్తున్నాయి.
తెలంగాణలోని జగిత్యాల జిల్లాలో ఒక సాదాసీదా ఆర్టీసీ బస్సు డ్రైవర్ అన్న మాటలు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టిస్తున్నాయి
ఐపీఎల్ 2026 సీజన్ అత్యంత ఉత్కంఠభరితమైన ముగింపు దశకు చేరుకుంది.
ఆంధ్రప్రదేశ్‌లోని తాడిపత్రిచెందిన నాగరాజు అనే వ్యక్తి ఆ ఫోన్ చేశాడు. నిరంజన్ అనే తన కుమారుడు కర్నూలులోని జయరాజ్ స్టీల్స్‌లో సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్నాడు. అతను తీవ్ర మానసిక ఒత్తిడికి గురై కాచిగూడ రైల్వే స్టేషన్ రైలు పట్టాలపై ఆత్మహత్యకు ప్రయత్నిస్తున్నాడని, ఆ విషయం తెలియజేస్తూ.. తనకు వీడియో పంపాడని తెలిపారు.
ప్రజాస్వామ్య వ్యవస్థలో సరికొత్త జవాబుదారీతనానికి నాంది పలుకుతూ ఆయన నన్ను ప్రశ్నించండి అనే వినూత్న కార్యక్రమానికి నాంది పలికారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్క పౌరుడికీ, ముఖ్యంగా యువతకు తమ నాయకుడిని నేరుగా నిలదీసే హక్కును కల్పించారు. ప్రజాప్రతినిధికి ఓటేసి గెలిపించిన ప్రజలకు తమ సమస్యలపై, నియోజకవర్గ ప్రగతిపై ప్రశ్నించే పూర్తి హక్కు ఉందని ఆయన ఈ సందర్భంగా ప్రకటించారు.
డిసెంబర్‌లోనే కిషన్‌సింగ్ అలియాస్ పప్పుకు సుపారీ అప్పగించినట్లు అనుమానిస్తున్న పోలీసులు… ఈ హత్యను ప్రమాదంలా చూపించేందుకు ప్రత్యేక ప్లాన్ సిద్ధం చేసినట్లు చెబుతున్నారు. ఇందుకోసం ఈ ముఠా కారు స్టంట్స్‌లో దీటైన అభిజిత్‌ను రంగంలోకి దింపారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.